మత్స్య మహా పురాణము

Table of Contents

46 - యదువంశమున శూరవంశ వృత్తాంతము

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: వృష్టి కుమారులలో నొకడు •దేవ మీడ్వాన్ (దేవమీఢుష్). అతనికి ఐవ్వొకి ఇక్ష్వాకు రాజపుత్రి) యందు శూరుడను కుమారుడు కలిగెను. పురుషుడను రాజు కూతురగు జయందు శూరునకు పదిమంది కుమారులు కలిగిరి. వారు వసుదేవుడు దేవ భాగుడు దేవశ్రవసుడు అనాధృష్టి శిని నందుడు సృంజ యుడు శ్యాముడు సామీకుడు సంయూపుడు అనువారు. ఐదుమంది కుమార్తెలు. శ్రుతకీర్తి-పృథ - శ్రుతదేవి-శ్రుతశ్రవ. రాజాధిదేవి అను వారును శూరునకు కలిగిరి. వీరందరును వీరమాతలు. వీరిలో శ్రుతదేవికి కృతుడను భర్తవలన సుగ్రహు డును శ్రుతకీర్తికి కే కేయుని వలన సునీథుడను కుమారుడును రాజాధిదేవికి బరి షుని వలన ధర్మాత్ముడగు అరిమర్ధనుడును కలిగిరి. వృద్దుడగు శూరుడు తన మిత్రుడగు కుంతిభోజునకు వృథను కూతుగా నిచ్చెను. ఇందుచే వసుదేవుని చెల్లెలగు పృథకు కుంతి అను పేరు వచ్చెను. తండ్రి యనంతరము వసుదేవుడు పృథను (కుంతిని) పాండున కిచ్చి పెండ్లి చేసెను. పాండునకు ఆమెయందు తరువాత ధర్మదేవుని వలన యుధిష్ఠిరుడు వాయువు వలన భీముడు ఇంద్రుని వలన అర్జునుడు. రెండవ భార్య అగుమాద్రికి ఆశ్వినులవలన నకుల సహదేవులు కుమారులయిరి.

 పూరువంశ సంజాతయగు రోహిణియందు వసుదేవునకు రాముడు సారణుడు దుర్గముడు దమనుడు శుభుడు, పిండకుడు మహాహనుడు అను కుమారులును చిత్ర క్షేత్ర అను కుమార్తెలును కలిగిరి. దేవకియందు సుషేణుడు కీర్తి మాన్ ఉదాసీ భద్ర సేనుడు ఋషిదాసుడు భద్రుడు విదేహుడు అను కునూరులు కలిగిరి. వీరినందరను కంసుడు చం పెను. కృష్ణుడును అతని చెల్లెలు సుభద్రయు దేవకికి కలిగినవారే. శ్రీకృష్ణుడు వర్షాకాలమునందలి మొదటి అమా వాస్య నాడు (శ్రావణమాసమున) పుట్టెను.

(*ఇచట మూలములో దేవమీఢుషః అనుటకు మారుగా 'అద్బుత మీఢుషః' అని ఛందస్సున కనుకూలత కై ఋషులు వ్రాసిరి. కాని ముద్రిత ప్రతులలో ఇది శూర శబ్దమునకు వి శేషణముగా ఆద్భుత మీడుషమ్ అని యున్నది.)

ఇంకను వసుదేవునకు తామయందు సహదేవుడు దేవర క్షితయందు ఉపాసంగధరుడును ఒక కుమా రేయు. కలిగిరి. ఈ కన్యను కంసుడు చం పెను. ఉపదేవియందు విజయుడు రోచమానుడు వర్ధమానుడు దేవలుడు ఉపదేవి యందు అవగా హుడు నందకుడు వనవిహారమున తాను కూడిన వైశ్య జాతీయయగు శ్రద్దాదేవియందు కౌశికుడు గవేష ణుడు అనువారును మరియొక భార్య (పేరు ఈయలేదు యందు ముండుడు కపిలుడు అనువారును జరుడు సౌభద్రుడు భవుడు అను నిషాదులును దేవ భాగయందు దేవశ్రవసుడని ప్రసిద్ధుడైన నుహా పండితుడగు ఉద్ధవుడును కలిగిరి. యశస్విని యగు ఐడ్వాకి అను నామెను అనాధృష్టి అను వానివలన శత్రుఘ్నుడు కలిగెను. అతని కుమారుడు శ్రాద్ధుడు. (ఇది ఇచ్చట అప్రస్తుతము.)

 శ్రీకృష్ణుడు అనపత్యుడగు గండూషుడను వానికి తన కుమారుడును బలవీర్య సంపన్నుడునగు సుచంద్రుడను దాని నిచ్చెను. శ్రీకృష్ణునకు జాంబవతియందు చారుదేష్ణుడు సాంబుడు అను కుమారులు కలిగిరి. నందనుడను వానికి తంత్రిపాలుడు తండ్రి అనువారు కుమారులు.

 శమీకునకు మహాబలవిక్రమ సంపన్నులగు వీర జుడు ధనువు శ్యాముడు సృంజయుడు అను నలుగురు కుమా రులు కలిగిరి. వీరిలో శ్యామునకు సంతతి కలుగలేదు. సృంజయుడు వానప్రస్థు డయ్యెను. అతడు భోజుడుగా - లోక సుఖానుభవమున ఉండుట కసహ్యపడి ఇట్లు రాజర్షి యయ్యెను.

శ్రీకృష్ణ భగవానుని జన్మాభ్యుదయమును అనుదినము కీర్తించువాడును వినువాడును. సర్వపాపములనుండి వీము కుడగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున శూరవంశాను వర్ణనమను నలువది ఆరవ అధ్యాయము.