మత్స్య మహా పురాణము

Table of Contents

276 - కల్పపాదప(వృక్ష)దాన కథనము

శ్రీ మత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఇపుడిక నీకు అను(మహా) త్తమమగు కల్పవృక్ష ప్రదాన మను మహాదానపు విధానమును వివరింతును; వినుము; అది మహాపాతక నాశన మగునది; పుణ్యకరమగు శుభదినమున తులాపురుష దానమందువలెనే ఋత్విజులను మండపమును సంభారములను సమకూర్చుకొనవలయును; నానా ఫల సమన్విత మగు బంగరు వృక్షమును ఆందు నానా పడి వస్తాభూషణములను యథాశక్తిగ పలత్రయమునకును వేయి పలములకును నడుమ తూకముగల బంగరుతో చేయించవలయును; మొత్తము తూకములో సగము తూకపు బంగరుతో వృక్షమును చేయించి దానినీ ప్రస్థ మాత్రము గుడము పై తెల్లని వస్త్రద్వయము పై నుంచి మిగిలిన నగములో కొంతతో బ్రహ్మ విష్ణురుద్ర భాస్కరులను వక్షవస్త్ర భూషణాదికమును వృక్షము క్రింద నుండునట్లు కామదేవుని ఆతని పత్నియగు రతిని చేయించవలేను; దీనికి తూర్పున మొత్తము తూకములో నాలుగవ వంతుతో సన్హాన(మను కల్పవృక్ష విశేషమును దక్షిణమున నేతి పై ఆదే నాల్గవ వంతు తూకముతో మందారమను కల్పవృక్ష విశేషమును లక్ష్మీతో కూడను పశ్చిమమున పారిజాత మనెడు కల్పవృక్ష విశేష మును జీరకమునందు సావిత్రితో కూడ అదే నాలుగవ వంతు తూకపు బంగరుతోను ఆడై నాలుగవ వంతు తూకపు బంగరుతో నూవుల పై కామధేనువుతో కూడ ఉత్తర దిశ యందు హరిచందనమను కల్పవృక్ష విశేషమును ఫలములతో కూడను చేయించవలేను; వట్టు వస్త్రములను చెరకు గడలను పూవులను పండ్లను ఎనిమిది హర్ల కలశములను పాదుకలను ఆసన ములను పాత్రలను దీవక ములను పాదరక్షలను ఛత్ర చామరాననములను ఫలపుష్పాద్యలంకృత వితానకమును (మేల్కట్టు - చాందినీని) అష్టాదశ విధ ధాన్యములను సమకూర్చుకొని అన్ని వైపులను ఉంచుకొనవలయును.

హోమమును ఆధివాననమును ముగిసిన తరువాత విప్ర పుంగవులచే స్నానము చేయించుకొనబడి యజమానుడు కల్పవృక్షాదిక మునకు ఆగ్ను లకు ఆవాహిత దేవతలకు విప్రులకు త్రిః ప్రదక్షిణము చేసి ఈ మంత్రము నుచ్చరించ వలయును;

“చింతి(సంకల్పి)తార్థప్రదాయియగు కల్పవృక్షమునకును విశ్వంభరుడును విశ్వమూ ర్తియునగు దేవునకును తన్మూర్తియగు కల్పవృక్షమునకు నీకును నమ నీవు విశ్వాత్ముడవును బ్రహ్మవు రుద్రుడవు దివాకరుడవు మూ ర్తమగు (రూపముగల) ఆమూర్త(రూపములేని)మగు తత్వములును పరమ బీజరూపుడవును కావున సనాతన రూపా! నన్ను రక్షిం చుము; అమృత సర్వస్వమును అవ్యయుడగు అనంతపురుషుడవును నీవే; సంతానము పారిజాతము మందారము హరిచంద నము ననేడు వృక్ష వి శేషములతో కూడిన నీవు మమ్ము సంసార సాగరమునుండి రక్షించుము.”

ఇట్లు ఆమంత్రించి కల్పవృక్షమును గురున కీయవలయును; నలుగురు ఋత్విజులకును సంతానాది వృక్ష చతుష్టయమును ఈయవలయును; స్వల్ప పరిమాణముతో చేయు నపుడు ఏకాగ్ని విధానముతో హోమము జరిపి ( ఇందు ఋత్విజు లెవరు నుండరు కనుక) అంతయును గురునకే అర్పించవలయును; విత్తశాత్యమును ధన ముండియులేనివాని వలె కొరత) చేయరాదు; ఇంతయయినదేయని యాశ్చర్యపడరాదు; ఈ విధానమున ఈ మహాదానము నర్పించినవాడు సర్వ పాప వినిర్ముక్తుడగును; అశ్వమేధఫలము నందును; అప్సరః సిద్ధ చారణ కింకర పరివృతుడై వారిచే అంతరిక్షమున స్తూయ మానుడై పుత్ర పౌత్ర ప్రపౌత్తులతో కూడి రవిప్రకాశవిమాన మారోహించి విష్ణులోకమున కేగును; తన గోత్రమునందు తన కాదరణీయులగు గడచిన గడువనున్న తరముల మనుజులను తరింపజేయును; స్వర్గమందు నూరు కల్పములుండును; తరువాత చక్రవర్తియే జనించును; నారాయణుని బలగముతో కూడి నారాయణ పరాయణుడై నారాయణ కథాసక్తుడై నారాయణపుర మేగును; ఈ సకల కల్పవృక్ష ప్రదాన ప్రక్రియ నెవరు పఠింతురో వినోదరో అల్పధనులై నందున దీని నాచ రించలేక స్మరించుచునైన నుందురో వారును ఆప్సరసలతో కూడి ఇంద్రలోక మేగి పాపవిముక్త దేహులై మన్వన్తర కాల ముండి సుఖింతురు.

ఇది శ్రీమత్స్య మహా పురాణమున షోడశ మహాదానాను కీర్తనమున కల్పపాదప ప్రదాన కథనమను రెండు వందల డెబ్బది ఆరవ అధ్యాయము.