మత్స్య మహా పురాణము
168 - నారాయణసాఖీ పద్మమునుండి బ్రహ్మ ఆవిర్భవించుట పృథివీ సృష్టి క్రమ వర్ణనము॥
[ఇంతవరకును గడచిన నూట అరువది ఏడవ ఆధ్యాయమున నారాయణుని సంకల్పమున అతనికాశ్రయమగు జలములయందు కలిగిన స్పందముచే క్రమముగ ఆకాశము ॥వాయువు-అగ్ని - జలము॥ నేడు నాలుగు భూతముల యుత్పత్తి మాత్రము చెప్పబడినది॥ పృథివీ భూతము కూడ ఉత్పన్నమయిననేకాని సృష్టి సమగ్ర రూపమున జరుగుటకు వీలులేదు॥ ఆ సృష్టి జరుపు స్రష్ట ( సృష్టికర్త) ఉత్పన్ను డు కావలయును॥ అందులకై భూమికగా నారాయణనాభి నుండి పద్మా విర్భావము కూడ గడచిన ఆధ్యాయమున చెప్పబడినది॥ ఈ అధ్యాయమున ఆ పద్మమునుండి బ్రహ్మ సృష్టికర్త) జనించుటయు ఆ పద్మపు పరిణామముగా ‘పద్మా' రూపమున పృథివి ఉత్పన్నమగుటయు చెప్పబడును॥ పాద్మకల్ప సృష్టి క్రమమనగా ఇదియే॥ కల్పమనగా ప్రక్రియ అని ఇట ఆర్థము॥ ఇట్లే ఆయా కల్పముల సృష్టి క్రమములని పురాణములందు చెప్పబడిన వాని విషయమును గూడ ఇదే విధమున నమన్వయము చేసికొనుచు విచారణ పూర్వకముగ చదువుకొనవలయును॥)
శ్రీమత్యుడు మనుపునకిట్లు చెప్పెనని సూతుడు ఋషులకీ విధముగా చెప్పసాగెను: తరువాత నారాయణుడు బహుయే జన విస్తర ముగల ఆ హిరణ్మయ పద్మమునందుండి సర్వతేజోమయుడును సర్వగుణమయుడును పృథివీ భూతపు లక్షణములు కలవాడును యోగతత్వము నెరిగిన వారిలో శ్రేష్ఠుడును మహావర్చశాలియును అన్ని వైపులకును ముఖ ములు కలవాడును సర్వలోక సృష్టికర్తయునగు బ్రహ్మను సృష్టించేను॥ నారాయణునుండి సముద్భవించిన - ఆ { లోగడ చెప్పిన పద్మము పృథివీ రూపమయినదని మహర్షులు చెప్పుచున్నారు॥ ఈ చెప్పిన పద్మము ఏది కలదో ఆమేయే రసాదేవి (రసరూపములగు జలమునుండి పరిణమిం చెను॥ కావున) పృథివి॥ విశాలమయినది కావున) అనియు చెప్పబడును॥ ఈ పద్మమునందలి సారముతో పరిణమించి గురువులు బరువులు కలవి) అగు పదార్థములు ఏవి ఉత్పన్నములయ్యెనో అవి దివ్య (మహా) పర్వతములయ్యెను; అవి: హిమవత్ మేరు॥ నీల-నిషధ-కైలాసముంజవల్-గంధమాదన-త్రికూట॥ మందరో॥ దర॥పింజర వింధ్యవత్ పర్వతములు॥ ఈ పర్వతములు దేవగణములకును సిద్ధులకును పుణ్యతీర్థములకును ఆశ్రయము లయి సర్వకామ (కోరికల) ఫలములను ఇచ్చుచున్నవి॥
ఈ పర్వతముల నడుమ నుండు దేశమునకు జంబూ ద్వీపమని వ్యవహారము; ఏ సంస్థానమునందు (అమరిక యందు) యజ్ఞ, సంబంధులగు వైదిక కర్మ ప్రక్రియలు ప్రవ రిల్లుచుండునో ఆదియే జంబూద్వీప సంస్థానము; ఆ పర్వ తములనుండి స్రవించు దివ్యామృత రస సమానమగు జలమంతయు దివ్యములగు వందలకొలది తీర్థములకు ఆధారము లగు నదులుగా పరిణమించినది॥ ఈ హరినాభి పద్మపు కేసరములు ఏవి ఆ పద్మపు అన్ని దేసలందు ఉండెనో అవియే ఈ లోకమందు ఆయా గైరిక ధాతువులకు స్థానములగు ఇతర పర్వతములని తెలియవలెను॥ ఆ పద్మమునకు ఆవ యవములగు అనేకములగు దళములే పర్వతములతో వ్యా ప్రములయి దుర్గమములగు మ్లేచ్చ దేశములని విక ల్పితము లయినవి వేరు వేరుగా విభజించబడి వ్యవస్థ చేయబడినవి॥) ఆ పద్మపు ఆడుగు భాగమునందలి (ముదుక) రేకులు ఏవి కలవో॥అవియే వారివారి వానమును అనుసరించి భాగ క్రమమున దైత్యులకు అసురులకు నాగులకు నివాసములగు దేశములయ్యెను॥ ఈ దైత్య దానవాదుల దేశములకు నడుమనున్న మహార్ణవ భాగము (నందలి ॥ దృఢభాగము)నకు రసాతలము) అని వ్యవహారము॥ మహాపాతక ములనాచరించిన జనులు సదా దీనియందు పడి మునుగుదురు॥ ఈ వద్మమునకు నడుమ ఏకార్ణవ జలమునందు తేలియున్న భూభాగమునకు 'మహి' అని వ్యవహార ము; ఈ 'మహి'కి నాలుగు దిక్కులందు నాలుగు మహా సాగరము లున్నవి
ఈ విధముగా నారాయణుని సంకల్పానుసారము పుష్కరము (జలము -పద్మము-అని రెండర్థములు పుష్కర శబ్దమునకు గలవు; ఇచట నారాయణాశయ జలములనుండియే ఆకోశాదీ జలాంత భూతములును జలములనుండి పద్మ మును పద్మమునుండి పృథివియు జనించేను కావున రెండర్థములును సరిపోవును॥) కావున ‘మహి'ని 'పుష్కర సంభవ' “పుష్కరమునుండి పుట్టినది' అందురు॥ కావున ఈ ప్రాదుర్భావమునకును సృష్టి క్రమమునకును) పుష్కర సృష్టి ‘పాద్మ కల్పక్రమము' అని వ్యవహారము వచ్చినది॥
ఈ హేతువు చేతనే ఈ విధమగు సృష్టితత్వము నెరిగిన ప్రాచీనులగు పర మర్పులు వేదములందు దర్శింపబడు ఆర్థ తత్వమును అనుసరించి 'పద్మవిధిని” (అబిష్ట కాచయనముతో ఆచరించబడు యజ్ఞ ప్రక్రియను విధించిరి॥ (కృష్ణ యజురారణ్యక ప్రథమ ప్రశ్న మును చూతురుగాక!)
ఈ విధముగా నారాయణ భగవానుడు పర్వతములు నదులు హ్రదములు మొదలగు వాని ధారణాక్రమము నిర్మించేను॥ సర్వ వ్యాపియు సాటిలేని ప్రభావము కలవాడును సూర్య తేజమువంటి తేజము కలవాడును వరుణునివలె నల్లని కొంతిగలవాడును తనకు తానయి యుండువాడును (పుష్కర శబ్దవాచ్యమగు జలములను-వానినుండి పృథివిని పద్మమును॥ నిర్మించి) పద్మమునకు నిధియై యున్న వాడును ఆగు నారాయణుడు క్షీరార్ణవమున శయనించి యుండును॥
ఇది శ్రీమత్స్య మహాపురాణమున పద్మోద్భవ (బ్రహ్మ) ప్రాదుర్భావ-పృథివ్యుత్పత్తి వర్ణనమను నూట అరువది ఎనిమిదవ అధ్యాయము॥
