మత్స్య మహా పురాణము

Table of Contents

213 - సావిత్రి సత్యవంతులు తమ యాశ్రమమున కేగుట.

మత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చేప్పెను: అనంతరము పతివ్రతయు ఉత్తమశ్రీయు ఆగు సావిత్రి సత్యవంతుడు మరణించిన చోటికి తానువచ్చిన త్రోవనే పోయెను; సుందరాంగియగు ఆమే సూర్యాస్తమయ సమయము నకు తన భర్తను చేరి అతని తలను తన తొడ పై నుంచుకొని కూర్చుండెను; ధర్మరాజు నుండి విడుదల పొందిన సత్యవంతుడును మెల్లమెల్లగా కన్నులు తెరవసాగేను; కదలసాగేను; మనురా జా! అనంతర మతడు ప్రాణములు మరల రాగా తన ప్రియురాలితో ఇట్లనెను: ఇంతకుమునుపు నన్ను పట్టిలాగు చుండిన ఆ పురుషుడెచ్చటికి పోయెను? శుభవగు వరారోహా! ఆ పురుషుడెవరో నీకు తెలియునా? మనోహరాంగీ! ఈ అడవిలో ని దించుచుండగనే పగలు గడచినది; నో మూలమున నీవు ఉపవాసముతో కృంగివయితివి; మనమీది బెంగతో మన తల్లిదండ్రులు దుఖించుచుందురు; వారిని త్వరగా చూడవలెనని యున్నది; త్వరగా పోదముపద; అన సావిత్రి ఇట్లనెను: ప్రభూ! మీ ఇష్టము ఎట్లో అట్లే చేయుదము; ఆదిత్యుడ స్తమించు వేళ కులోగానే ఆశ్రమమునకు పోవుదము; తల్లిదండ్రులును కన్నులు లేనివారుగదా! జరిగినదంతయు అక్కడనే . ఆ శమమునందే - చెప్పెదను: ఇంతమాత్రము చెప్పి ఆమె తన భర్తతో కూడి వెంటనే వేడ లేను; అతనితో కూడి యే ఆశ్రమమునకు చేరెను కూడ; ఆంతకు లోపలనే ఆ రాజు ద్యుమత్సేనుడును అతని భార్యయును కనులు వచ్చి యోభార్గవా! మనూ! తన అనుగు కొడుకును చిక్కియున్న కోడలును ఇంక ను రాలేదేయని పరితపించుచుండిరి; ఆచటి తపోధనులు వారిని ఓదార్చుచుండిరి; అంతలోనే తమ కోడలితో కూడివచ్చుచున్న కుమారుడు వారికి కనబడెను; ఉత్తమశ్రీ యగు సావిత్రి తన పతియగు సత్యవంతునితో కూడి రాజానందకరుడగు ద్యుమత్సేన రాజును ఆతని భార్యను నమస్కరించెను; సత్యవంతుడు తండ్రిచే కౌగిలించు కోనబడెను; ధర్మవిదుడుగు ఆ రాజకుమారుడు ఆ వనమందలి తపోధనులను అందరను నమన్కరించి ఆ రాత్రియంతయు ఆ ఋషులతోకూడ గడపెను.

తరువాత ఉత్తమ క్రియగు సావిత్రియు జరిగినదంతయు అచటి వారికి చెప్పెను; ఆ రాత్రియందే ఆమె ఉపవాసవ్రత సమాప్తిని కూడచే నెను; ఆ రాత్రి కడపటి జాము ముగియు, వేళకు ఆ ద్యుమత్సేనుని పరిజనమంతయు సైన్యమును వెంటగొని ఆ రాజును రాజ్యపాలనమునకై రమ్మని పిలువ వచ్చెను; ప్రకృతి (ప్రజా) జనమగుతమ్ము పొలించుమనియు వారు ద్యుమత్సేనుని ప్రార్ధించిరి; వారిట్లనిరి; రాజా! కన్నులులేని నీ రాజ్యమును ఎవడు ఆపహరిం చేనో ఆరాజును నీ మంత్రులు చంపివేసిరి; ఆ పురమునందు ఇపుడు నీవే రాజవు; అనగా విని ఆద్యుమత్సేనరాజు చతురంగ బలముతో పోయి మహాత్ముడగు ధర్మరాజు ననుగ్రహమున తన సకల రాజ్యమును పొందెను; ఉత్తమాంగనయగు సావిత్రియు నూరుగురు తమ్ములు కలదయ్యెను; పతివ్రతయు ఋజువరనయు వరారోహయునగు ఆ రాజ పుత్రి ఇట్లు తన పితృపక్షమును ప్రతిపక్షమును కూడ ఉద్దరిం చెను; మృత్యుపాశ వశ గతుడైన భర్తను విడిపించుకొనెను; కావున మానవులు పతివ్రతలను దేవతలనువలే పూజించవలెను; రాజా! వారి యనుగ్రహముననే ఈ జగత్రయమును నిలుపబడు చున్నది; ఈ లోకమందు వారేది పలికిన నది సత్యమే జరుగును! సకల కామ సిద్దియు కావలెనని కోరుకొనువారు సదా వారిని పూజించుచుండవలయును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున సావిత్య్రు పాఖ్యానమున సావిత్రీ సత్యవంతులు స్వాశ్రమమునకు మరలి పోవుటయను రెండు వందల పదు మూడవ అధ్యాయము.