మత్స్య మహా పురాణము
171 - శ్రి విష్ణుమహిమాను వర్ణనము॥ తారకామయ యుద్ధ ప్రస్తావము॥
(శ్రీ మత్స్యమహా పురాణమున పేర్కొనబడిన పండ్రెండు దేవాసుర సంగ్రామము (కొట్లాట)లలో తార కామయ సంగ్రామము ఒకటి॥ ఈ సంగ్రామమునందు॥ తారుడు ( తార కుడు కాదు)॥ మయుడు కాలనేమి అను అసురులు ముఖ్యులు ఇందు పర్యవసానమున కాలనేమి శ్రీ మహా విష్ణుని చేతిలో మరణించెను॥
తారకాలనేమి॥మయనాములగు అసురులు ప్రధానులుగా ఉన్నది కావున ఈ సంగ్రామమునకు తార -కా (కాలనేమి)॥ మయము అను ప్రసిద్ధి వచ్చెను॥ ఇచట 'కా' అనునది; కాలనేమి శబ్దమునకు సంక్షిప్త రూపము (Shortened form)॥
తారకామయ నామక దేవదానవ సంగామ కథారంభము॥
శ్రీమత్యుడు మనువునకు ఇంకను ఇట్లు చేప్పేను: కృతాది యుగములందు విష్ణువును సర్వ వ్యాపకుడగుటచే విష్ణువు (వ్యాప్నోతి॥ ఇతి ) సర్వ దోషహరుడగుటచే హరి అడ్డు లేని జ్ఞాన ప్రవృత్తి కలవాడగుటచే వైకుంఠుడు (వి॥కుంఠా॥ అన్య' ఆ స్త్రీ జ్ఞానే): సుఖ భోగములను దగ్గరకు తెచ్చి ఇచ్చువాడు కావున కృష్ణుడు (కృషతి॥ ఇతి ! అని దేవతలును మానుష లును వ్యవహరింతురు॥ దీనికి హేతువులగు అతని మహిమ లక్షణములను తెలిపేదను; వినుము; ఈశ్వరుడగు ఆతని కర్మ ప్రవృత్తుల నడక సరిగ తెలిసి కొనుట సులభ సాధ్యము కాదు; అవి సంప్రతి) ఇప్పుడు జరుగుచున్న వి ఏవి కలవో॥ అవి అన్నియు ఉన్నవి ఉన్నట్లు తెలి పెదను; ప్రభుడు భగవానుడు అగు ఈతడు స్వయముగ అవ్యక్త రూపుడయియు లోక హితమునకై వ్య క్తములగు స్పష్ట రూపములగు) లింగములు (అవయవాడి లక్షణములు కలవాడగు చున్నాడు॥ ఇతడు నారాయణుడు - జీవులకు ఆశ్రయుడు; అనంత రూపుడు; ప్రభుడు - సర్వ జగత్కారణుడు తన యందే లయ మొనర్చుకొను వాడు॥ ఇతడే హరి సనాతనుడు॥(శాశ్వతుడు)॥ బ్రహ్మ-వాయువు సోముడు॥ధర్ముడు॥ శుక్రుడు బృహస్పతి ఇతడే; ఇతడు యుగ యుగమున ఆదితీకి పుత్రుడై ఇంద్రునకు తమ్ముడై' దేవతలకు శత్రువులగు దైత్యదానవర క్షస్సు లను వధించి తన ప్రసాదము (అనుగ్రహము) చూపును॥ వామనావతారమున సర్వ జగద్వ్యాపియైనందున అతని విష్ణుత్వము సార్థకమయ్యెను॥ ఈతడు ప్రభుడు (సమర్థుడు) కనుక పూర్వము ప్రధాన (మూల ప్రకృతి) రూపుడై బ్రహ్మను సృజిం చేను॥ పూర్వ పురుషు ( మొదటి తరపువాడై ప్రజా, పతులను సృజించెను॥ ఆందే మానవులను మహోత్తమములగు బ్రాహ్మణ వంశములను సృష్టించేను॥ - ఆ మహాత్ములనుండియే శాశ్వతమగు బ్రహ్మ (వేదము) ప్రవర్తిల్లెను॥ ఇది కీర్తనీయుడు పొగడదగినవాడు) అగు విష్ణుని కర్మాను॥ కీ ర్తనక్రమము; ఇత డాశ్చర్యభూతుడు: లోకములందు కీర్తింపబడుచున్న ఈతని కర్మ విశేషములను తెలి పెదను వినుము:
పూర్వము కృతయుగమున వృతవధానంతరము తారకామయమను దేవదానవ సంగ్రామము జరిగెను॥ అది త్రిలోక ప్రసిద్దము॥ దానియందు యుద్ధమున ఎవరికి గెలువరాని ఘోర దానవులు సర్వదేవ గణములను వారికి తోడగు యక్ష పన్నగ రాక్షసులనుకూడ చంపుచుండిరి॥ వారంతట తమ ఆయుధములు క్షీణించగా యుద్ధవిముఖులై రక్ష కుడు ప్రభుడునగు నారాయణ దేవుని తమ మనస్సుల ధ్యానించిరి॥
ఈ నడుమ కాలముననే చల్లారిన అంగారముల (బొగ్గులవంటి కాంతిగల మేఘములు అర చంద్ర గ్రహణము లతో కూడ ఆకసము కప్పుచు భయంకర విద్యుద్గణములతో కూడి భయంకర ధ్వనులు చేయుచు పరస్పరపు కూడికతో దెబ్బలు తినుచుండెను॥ స ప వాయువులు వీచేను॥ ప్రకాశించు నీటితోను పిడుగులతోను కూడిన మేఘములతోను వజము (పిడుగు)ల వేగముతోను వాయ్వగ్నులతోను క్రొత్తవి మహా ఘోరములునగు ఉత్పాతములతోను ఆక సము దహింప బడుచున్న దో అనునట్లయ్యెను॥ “వేలకొలది ఉల్కలునుగ్రహ(ఖండములును రాలుచుండెను॥ దీవ్యుల దివ్యవిమాన ములును పడుచు ఎగురుచునుండెను॥ - మహాయుగములు అన్ని యు॥ గడచిన కల్పాంతమున లోకములకు ఏ భయము కలుగునో అట్టిది క లిగించుచు అన్ని యు రూపరహిత ములు అగుచుండెను॥ సర్వమును తేజోర హితమయ్యేను॥ పది దిక్కులును చీకటుల గుంపులతో వ్యా ప్రములయి కాంతిహీనములయ్యెను॥ కాళి నల్లని మేఘముల ముసుగు కప్పుకొని రూపము దాల్చి లోకమున ప్రవేశించేను॥ ఆకాశమున రవి మరుగుపడగా ఘోరాంధకార మావరించగా అంతయు ప్రకాశరహిత మయ్యెను॥
ఇట్టి మబ్బుల గుంపులను చీక టులను తన భుజములతో ఎత్తివేసి ప్రభుడగు హరి తన నల్లని శరీరమును ॥ దర్శింపజేసెను॥ అది మేఘములవలె కాటుకవలె మెరయుచు అట్టి వెంట్రుకలు కలిగి నల్లని కొండ వలే నుండెను॥ ఐనను , ప్రకాశించు పీతాంబర మును కాచీన బంగారు సొమ్ములును దాల్చి పుష్టిగల నాలుగు భుజములు కిరీటముతో కప్పిన వెంట్రు కలు కలిగి పొగతో చీకటులతో రూపొందియు ప్రజ్వలించుచు అది ప్రళయాగ్ని వలె నుండెను॥ బంగారుతో ప్రకాశించు ఆయుధములతో వెలుగుచుండెను॥
దైత్యుల చేతిలో ఓడియున్న దేవతలకు శ్రీమన్నారాయణుడు దర్శన మిచ్చెను॥ అతడు చంద్ర సూర్య కిరణ ములతో మిగుల ప్రకాశించుచుండెను॥ ॥ ఉన్నతమగు పర్వత శిఖరమువలె నుండేను॥ నందక ఖడ్గముతో అతని కరము ఆనందకరమై యుండెను॥ కరము లనెడు సర్పముల నతడు ధరించెను॥ ఆచ్చాది శక్తులతో ఆశ్చర్యకరబలముతో భయం కరు డై శంఖచక్రగదల ధరించి యుండెను॥ ఓర్పు అనేడు మూల (పాతు) భాగము లక్ష్మి యనేడు వృక్షము శార్జధను వనేడు శిఖర ముకల విష్ణువ నేడు పర్వతము ఆది! దేవతలకు ఉదారములగు మంచి ఫలములను ఇచ్చుచు స్వర స్త్రీలు అనెడు ఆందమగు పల్లవములు కలిగి సర్వలోకముల వారికి ననుస్కార్యమయి సర్వప్రాణులకును మనోహరమయి నానా విమానములనెడు కొమ్ములు కలిగి మేఘ - జలములనెడు తేనెను స్రవించుచు జ్ఞానముచే కలిగిన ఆహంకారమను సారము కలిగి' (సారము = చెట్టునకుఉండు చేవ); పంచ మహాభూతములు ఆను మొలకలు కలిగి ఆయా విశేషములు ఆనేడు ఆకు లతో వ్యా ప్రమయి గ్రహములు, "నక్షత్రములు ఆను పూవులతో నిండి దైత్య॥ లోక మనెడు పెద్ద బోదే కలిగి మర్త్యలోకము, నందు ప్రకాశించుచు సముద్రపు హోరువంటి ధ్వని కలిగి , రసాతల (పాతాళ) - మనేడు॥ గొప్ప ఆశ్రయము॥ (పాదు) కలిగి నాగేంద్రులు ఆనేడు పార్శ్వములతో వ్యా ప్రమయి॥ పక్షులకును॥ జంతువులకును : ఆశ్రయమయి॥॥॥ వాటిచే ॥ సేవింపబడుచు మంచి నడువడి అర్థము (ధనము) అనేడు దివ్య - సువాసన తో " కూడియున్న సర్వలోక సముదాయమనేడు మహావృక్ష మది; (నారాయణుడు సర్వజగద్రూపుడని' భావము); ॥ ఆవ్య క్త తత్వము అను జలమును వ్యక్తమగు -- అహంకార త త్వమనేడు నురుగును॥॥మహాభూతములు అనేడు తరంగములును గ్రహములు నక్షత్రములు ఆనేడు బుడగలును కలిగి- విమానములను వాహనములతో వ్యా ప్తమయి' మేఘముల ఆడంబరముతో నిండి: ఆయా ప్రాణులనెడు మత్స్యములతో వ్యా ప్రమే॥ పర్వతము
నేడు శంఖముల రాసులు కలిగి త్రిగుణములతో నిర్మితములయిన విషయ భోగములనెడు సుడులు కలిగి సర్వలోకము లనేడు తిమింగిలములతో నిండి వీరులు అనేడు వృక్షములు తీగలు పొదలు సర్పములనేడు తిన్న ని నాచు ద్వాదశాదిత్యు
నేడు మహాద్వీపములు ఏకాదశ రుద్రులనెడు పట్టణములు అష్ట వసువులనేడు పర్వతములుకల త్రైలోక్యమనెడు మహా సముద్రమా నారాయణుడు; యుగసంధ్యా సంధ్యాంశములనెడు లేక్కలేనన్ని ఆలలు గరుడుడు అనేడు వాయువులు దైత్య " యక్ష గణములనేడు మొసళ్ళు రాక్షస గణమ నేడు చేపలు బ్రహ్మదేవుని సృష్టి మహాశ క్రియనేడు మహాబలము స్వరస్త్రీలను మహారత్న ములు శ్రీకీ ర్తి కాంతి లక్ష్మీ దేవులనెడు నదులు ఆయా కాలయోగములు మహాపర్వ సమయములు - సృష్టి ప్రళయములు అను వేగము -వీటి కూడిక యనెడు ఒడ్డు కలిగిన నారాయణ మహాసముద్రరూపుడు ఆ విష్ణువు॥ ॥॥
అతడు: దేవాదిదేవుడు; భక్తులకు వరములనిచ్చువాడు; భక్తవత్సలుడు; అనుగ్రహము చూపువాడు; దేవుడు (ప్రకాశించువాడు); ప్రశాంతి కలిగించువాడు; శుభకరుడు; పచ్చని గుర్రములను పూంచిన రథములతో కూడినదియు గరుడ ధ్వజ శోభితమును గ్రహ చంద్రర్కులతో అమర్చబడినదియు ॥ మందర పర్వతమను మేలయిన ఇరుసు॥ కలదియు
అనంత కిరణములు కలదియు వి సీర్ణమును మేరుపర్వతపు లోతులందు ఉన్న దియు నక్షత్రములు సూర్యుడు ననేడు చిత్రములగు వన్నె వన్నెల పూవులు కలదియు గ్రహములతో నక్షత్రములతో దట్టముగా నిండినదియు అగు పర మాకాశము నందు దివ్యలోక మయరథమునందు ఉన్న వాడు; భయము కలిగిన సందర్భములందు అభయమిచ్చు వాడు; ఇట్టినారాయణుడు దైత్య పరాజితులగు దేవతలకు దర్శనము నొసగేను॥ "
ఇంద్రుడు మొదలగు దేవతలందరును దోసిలియొగ్గి జయశబ్ద పూర్వకముగా శరణ్యుడగు ఆనారాయణుని శరణు పొందిరి॥ దేవదేవుడగు శ్రీమహావిష్ణువు వారి మొర విని మహాయుద్ధమునందు దానవులను వధించ సంకల్పించేను॥ విష్ణు హకాశమునందు ఉత్తమరూపము ధరించి నిలువబడి ప్రతిజ్ఞారూపమగు ఈ వాక్యమును దేవతలందరతో పలి కెను: దేవ గణములారా! మీకు మేలగుత: శాంతి పొందియుండుడు॥ భయపడ కుడు; దానవులందరును నాచే ఓడిపోవుదురు; త్రైలోక్యమును మీరు ,మరల పొందుదురు; అనగా విని దేవతలు సత్యధర్మరూపుడగు విష్ణునివాక్యముతో సంతోషమందిరి॥ వారికి అమృతము త్రావినట్లయి వారు చాల తృప్తి నందిరి॥ అంతట మేఘములు పూలవాన కురీయించేను॥ హాయి గొలుపు గాలులు వీచేను॥ దశ దిశలును నిర్మలములయ్యేను॥ జ్యోతిస్సులు ( నక్షత్రములు) శుద్ధకాంతి గలవయి చంద్రుని ప్రదక్షిణించుచు సంచరించెను॥ గ్రహములు యుద్దములు జరుపుకొనలేదు॥ గ్రహ యుద్ధము జ్యోతిశ్చక్రము నందపుడపుడు జరుగుచుండును॥ ఆది లోకమునకు ఉపద్రవకారణము॥ } నదులు నిర్మలములయ్యెను॥ ( భూమ్యంతరిక్ష॥ ద్యులోకములందలి) మార్గములు ధూళి రహితములయ్యెను॥ వీథి త్రయమును ( ఆకాశ మునందలి నక్షత్ర చక్రమునందు గల ఐరావత వీథి వైశ్వానర వీథి జరద్దవవీథి ఆనునవి) నిర్మలమయ్యెను॥ *నదులు తమతమ ఒడ్డులకు సరిగా (పొంగక క్రుంగక) ప్రవహించేను॥ సముద్రములు కలోలమందకుండెను॥ మానవుల అంతఃకరణములయందు జ్ఞానేంద్రియ విషయక ప్రవృత్తులు శుభకరములయి ప్రవర్తిల్లెను॥ మహర్షులు శోక రహితులయి స్పష్టముగా వేదా ధ్యయనము చేయగలిగిరి॥ అగ్ని యజ్ఞములందు లోక శుభకరముగ ॥ హవిర్బాగమందుకొనెను॥ లోకములన్నియు ధర్మములందు ప్రవర్తిల్లుచు ముదిత మానసములయ్యెను॥ విష్ణువు తాను దేవశత్రువుల చంపుదునని ప్రతిజ్ఞ' సేయుటతో లోక ములిట్లు శాంతములయ్యెను॥ ॥
48లో 'త్రయో వీథయః' అనగా 128వ అధ్యాయమున తెలిపిన ఐరావత జరద్దవ॥వైశ్వానర ॥(వీథుల) నామ ములతో ప్రసిద్ధములయిన ఈ మూడు ‘పథములు' అని యర్థము॥
“సరితః యథార్థం ఊహు?॥” ,
సరిత్తులు (నదులు) తమ నామమందలి అర్థమునకు తగినట్లు ప్రవహించెను॥
'నృ॥గతౌ' అను ధాతువునుండి 'సరని' 'శనై : గచ్ఛంతి' 'నెమ్మదిగా పోవును॥ ' అను అర్థమున 'సరిత్ ' శబ్దము నిష్పన్నము॥ కావున విష్ణు పసాద సమయమున నదులు వేగమును ఎగుడు దిగుడులును లేక ప్రశాంతముగా నెమ్మదిగా ప్రవహించుచుండెను॥ అని అర్థము ॥ మ పు॥ 95 )
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున పద్మోద్భవ ప్రాదుర్భావ కథనమున తార మయ యుద్ధ ప్రస్తావమున శ్రీ విష్ణు మహిమాను వర్ణనమను నూట డెబ్బది ఒకటవ అధ్యాయము॥
