మత్స్య మహా పురాణము

Table of Contents

164 -  యుగ పరిమాణాది కథనము

 పై ప్రశ్న ములక న్ని టికి సమాధానము చెప్పవలెననిన సృష్టి ప్రళయముల మును ప్రపంచ స్థితి ప్రవృత్తికిని ఆశ్రయమయి సర్వ పరిణామములకును పరిపాకములకును హేతువ యి యున్నది కాలము కావున కాల పరిమాణ విశే షములగు యుగముల పరిమాణాదికము చెప్పుబడుచున్నది॥]

శ్రీమత్యుడు మనువున కిట్లు చెప్పనారంభించెను: నాలుగువేల దివ్యవర్షములు కృతయుగము; నాలుగు వందల దీవ్యవరములు సంధ్యయు అంతయే నంధ్యాంశమును; ఈ యుగమున ధర్మము చతుష్పాదమయి అధర్మము పాదము (1) కంటె తక్కువగా నుండును॥ మానవులు స్వధర్మనిరతులగు నజ్జనులుగా నుందురు; విప్రులు విప్ర ధర్మపరులుగా క్షత్రి యులు క్షత్రియ ధర్మపరులుగా వైశ్యులు కృషిపరులుగా శూద్రులు సేవాపరులుగా ఉందురు॥ సత్యశౌచ ధర్మములు వృద్ధి సందును॥ సజ్జను లాచరించిన కర్మమునంద రు మెచ్చి ఆచరింతురు॥ ఎంత నీచక ర్ములగువారు కూడ తమ తమ కర్మలను ఎరిగి ఆచరించుటతో కృతయుగమున సర్వ ప్రాణుల నడువడులు నిట్లే యుండును॥

మూడువేల దివ్యవర్షములు త్రేతాయుగము; మూడు వందల దివ్య వర్గములు దాని సంధ్య; అంత యే దాని సంధ్యాంశము; మూడు పాదములతో ధర్మమును రెండు పాదములకు తక్కువగ అధర్మమును ఆ యుగమున ఉండును॥ శాస్త్రాధ్యయనము సత్యము బలము నిబ్బరము (సత్వము) క్షమ॥ధర్మము ఇవి విధింపబడియును ఆ యుగమున ఆయా వర్ణముల వారు పొని ఆచరణము సరిగా చేయరు॥ దానిచే జనులు దుర్బలు లగుదురు॥ ఇది త్రేతాయుగపు నడక॥

ఇక ద్వాపర యుగ ప్రవృత్తిని వినుము; దాని పరిమాణము రెండు వేల దివ్య వర్షములు; రెండు వందల దివ్య వర్షములు దాని సంధ్యా కాలము; ఆంతయే దాని సంధ్యాంశ ము; ఆ యుగమున మానవులు రజోగుణులయి అర్థము ధనము)నకు ప్రాధాన్యము నిత్తురు॥ అందరును మోసగాండ్రును క్షుద్రులు నగుదురు; రెండు పాదముల ధర్మ ముండ గా అధర్మము మూడు పాదములకు తక్కువగా నుండును॥ దీని చేత క్రమముగా కలియుగము నొటికి ధర్మము క్షయము నందును॥ ద్వాపర యుగము క్రమముగా గడచు కొలదిని బ్రాహ్మణ్యమునం దాస క్తి తగ్గును; వ్రతోపవాసాదికము విడువ బడును॥

కలియుగమన్నింటిలో క్రూరమయినది; దాని పరిమాణము ఒక వేయి దివ్య సంవత్సరములు; నూరు దివ్య సంవత్సరములు కలిసంధ్య॥ ఆంతయే దాని సంధ్యాంశమును॥ దీనియందు అధర్మము నాల్లుపొదములుండును; ధర్మము పొదముకంటే తక్కువగా నుండును; మానవులు కాముకులు తమోగుణులు నగుదురు; ఆతి సాత్వికుడు సాధు స్వభావుడు సత్యవచనుడు అరుదుగా నుండును॥ జనులు నాస్తికులును బ్రహ్మ భక్తులు (నేనే బ్రహ్మమ నై తినను దంభభక్తులు) నగుదురు అహం కారవంతులు ఎవరియందును స్నేహబంధనము లేనివారు నగుదురు; విప్రులందరును శూద్రుల ప్రవర్తనముతో నుందురు; ఆశ్రమ ధర్మము వ్యత్య స్తమగును; యుగాంత కాలము నాటికి వర్ణములు ఉన్న వా లేవాయను సందిగ్ధ స్థితికి వచ్చును॥ పండ్రెండువేల దివ్య వరములు ఒక చతుర్ (మహా) యుగము; వేయి చతుర్యుగములు బ్రహ్మ కొక పగలు; అది గడువగానే సర్వప్రాణుల శరీర నాశము చేయదలచి లోక సంహారము చేయు సంకల్పముతో మహా భూతాధిపతియగు నారాయణుడు బ్రహ్మాది సర్వదేవతలును దైత్య దానవ యక్షరాక్షస పక్షి గంధర్వాపరో భుజంగ పర్వత నదీ పశు ప్రభృతులును ఇంకను తిర్యగ్యోని గత సమస్త ప్రాణులును కృములును॥ మొదలగు వానినుండియు సమస్త జడ పదార్థములనుండియు (స్థూల-సూక్ష్మ) పంచభూతములను ఉపసంహరించి జగత్సంహారార్థము ఆతిహింస జరుపును॥ ఆ భగవానుడు తాను సూర్యుడై ప్రాణుల నేత్రములను వాయువే ప్రాణములను ఉపసంహరించి అగ్ని యే సర్వలోకము లను దహించి తరువాత భయంకర మేఘమయి వర్షించును॥

ఇది శ్రీమత్స్యమహాపురాణమున పద్మోద్భవ కథనమున చతుర్యుగ పరిమాణ వర్ణనమను నూట అరువది నాలుగవ అధ్యాయము॥