మత్స్య మహా పురాణము

Table of Contents

285 - కనకకల్పలతికాదాన విథానము.

శ్రీమత్ప్యుడు మనువునకు ఇట్లు చెప్పెను: ఇపుడు ఇక మహాపాతక నాశనమగు మహాకల్పలతా మహాదాన విధానమును తెలి పెదను; పుణ్యకరమగు తిథినాడు బ్రాహ్మణులచే పుణ్యాహవాచనము జరిపించవలెను; ఋత్విక్ లును మండపమును సంభారములును భూషణములు ఆచ్చాదనములు మొదలగునవియు లోకపాలకొవాహనమును తులా పురుష దానమునందువ లేనే చేయవలయును; బంగారుతో పది కల్పలతలను చేయించవలయును; అవి శుభములు ను (చూడి నింపగు నవియు) నానా పుష్ప ఫలసహితములును నానావస్త్ర విభూషితములునయి ఉండవలయును; విద్యాధరగరుడ దంపతులును హారముల నా కల్పలతలనుండి తీసికొనగోరుచుండు సిద్దులును ఫలములను గ్రహింపగోరు పక్షులు కు లోక పాలురవటి దేవతా ప్రతిమలును వానిని ఉపశోభింప జేయుచుండవలయును; లవణము మీద బ్రాహ్మిని అనంతశక్తిని ఉంచవలెను;