మత్స్య మహా పురాణము

Table of Contents

94 - శివ చతుర్దశీవ్రత

            నారదు డీశ్వరునిట్లడిగేను: భగవన్; భూతభవ్య-ప్రభూ! ఇంతవరకును మీరు చెప్పిన వానివంటిదే భుక్తి ముక్తి ఫలముల నీయగలిగినది ఇంక నునే దైన వ్రతమున్న చో దానిని నాకు తెలుపుము. అనగా ఈశ్వరుడతనితోనిట్లు చెప్పనారం భించెను. నారద: ఇడుగో! ఈతడు వాజ్మయమంతయు కడము చదివి దాని తత్వము నెరిగినవాడు. పురాణములు వేద ములు అను రెండు విధములగు వాజ్మయ విస్తారము నేరుగుటలోను తపశ్చర్యలోను నాతో సమానుడు. ఇతడు వృషభ రూపములో కనబడుచున్న ధర్మమేకానీ వేరుకాదు. ప్రమథగణమువారిలో శ్రేష్టుడు. ఈతని పేరు నంది. ఇక మీదట ఈత డే నీకు మహేశ్వర ధర్మములను చెప్పగలడు. అని పలికి ఈశ్వరుడచటనే అప్పుడే అంతర్థానము నందెను. నార దుడు (ఆయా విషయముల) వినగోరినవాడు (శుశ్రూషువు) అగుచు నంది కేశ్వరునిట్లడిగేను: అయ్యా! శివుడు నిన్ను తనకు ప్రతినిధిగా నిలి పెను గదా! కావున నాకు మా హేశ్వరమగు (మహేశ్వరునకు సంబంధించిన) వ్రతమును ప్రతిపాదింపుము. అనగా నంది కేశ్వరు డతనికిట్లు చెప్పెను :

బ్రాహ్మణా: వినుము; మా హేశ్వరమగు వ్రతమును తెలి పెదను, ఆది శివచతుర్దశీ వ్రతమను పేరున త్రిలోక ములయందును ప్రసిద్ధము. మార్గశిర శుక్ల త్రయోదశినాడు దేవదేవేశుడగు ఈశ్వరుని నేను నిన్ను శరణుజొచ్చినాను. చతుర్దశినాడు నిరాహారుడ నైయుండి మ హేశ్వరుని సమభ్యర్చించి సువర్ణ వృషభమును దానము చేసి భుజింతును.” అని సంకల్పించి ఆనాడు (త్రయోదశినాడు) ఒక పూట మాత్రమే భుజించి యుండవలెను. ఇట్లు నియమము నేర్పరచుకొని ఆ రాత్రి నిద్రించి చతుర్దశినాటి ఉదయమున మేలుకొని స్నాన జపాదికము చేసికొని తెల్లక మలములతో గంధ మాల్యాను లేపనములతో సహితుడగు శివుని పూజించవలేను.

(పూజా మంత్రములు) : 1. శివాయనమః పాదౌ పూజయామి; 2. వ్యోమాత్మనే నమః గుల్ఫౌ పూజయామి; 3. ప్రధానాయ నమః జంఘే పూజయామి; 4. అనంతైశ్వర్య నాథాయనమః జానునీ పూజయామి; 6. జ్ఞాన రూపాయ నమః కటిం పూజయామి; 7. అనంత ధర్మాయ నమః-పార్శ్వే పూజయామి; 8. ఈశానాయ నమః - ఉదరం పూజయామి; 9. తత్పురుషాయ నమః- స్తనౌ పూజయామి; 10. అ ఘోర హృదయాయ నమః-హృదయం పూజయామి; 11. వామ దేవాయ నమః. భుజౌ పూజయామి; 12. సద్యోజాతాయ నమః. కర్లో పూజయామి; 13. శ్రీకంఠాయ నమః కంధరాం పూజయామీ; 14. ఇందు ముఖాయనమః ముఖం పూజయామి; 15. హరయే నమః.నే తాణి పూజయామి; 16. త్రిణే త్రాయ నమః-లలాటం పూజయామి; 17, సర్వాత్మనే నమః- శిరః పూజయామి; 18. వ్యోమకేశాయ నమః కేశాన్ పూజ యామి; 19. పరమ రూపాయ నమః-సృష్టం పూజయామి; 20, ఆత్మరూపాయ నమః-పుష్టిం పూజయామి; పుష్టిం, అనగా ఈ చెప్పినవి కాక తెలిసియో తెలియకయో చెప్పక మిగిలిన అంగములు అని అర్థ ము,

తరువాత-పుష్ట్యై నమః-తుష్ట్యై నమః-ఇత్యాది మంత్రములతో పార్వతిని పూజించవలయును.

తరువాత బంగారు వృషభమును బంగారు కుంభము (జలపాత్రను శుక్ల మాల్యాంబరములు నానావిధ భక్ష్య ములు “సద్యోజాతుడు దేవదేవుడు పినాక ధనుర్ధారియగు పర మేశుడు ఈ వ్రతముచే ప్రీతుడగుగాక !” అను అర్థము నిచ్చు మంత్రముతో గురు (ఆచార్యు-వురోహితు)నకు సమర్పించవలయును. శుచిత్వమును భక్తియు కలవాడయి భక్ష్య భోజనము లతో బ్రాహ్మణులను సంతృప్తుల జేయవలయును. వృ*షదాజ్యము ఆహారముగా తీసికొని ఉత్తరపు మొగమై నేల పై పడు కొన వలయును. పిమ్మట పూర్ణిమ నాడు బ్రాహ్మణులను (భోజనాదికముతో) పూజించి తానును భుజించి మౌనియై గడుప వలెను. ఇట్లే మరల కృష్ణ చతుర్దశియందును ఇదియంతయు చేయవలయును. ఇట్లు మార్గశిరము మొదలుగ అన్ని మాసము లందును రెండుచతుర్దశులందును చేయుచు పోవలెను. ఈ విషయమున ఆయా మాసములందు వేరుగనుండు అంశములను తెలి పెదను; వినుము. మార్గశిరము మొదలుగ ప్రతి మాసమునందును ధ్యాన పూజాదులయందు వరుసగా 1. శంకరాయ తే నమః; 2. గరకంధరాయ తే నమః; 3. త్ర్యంబకాయ తే నమః; 4. మ హేశ్వరాయ తే నమః; 6. మహాదేవాయ తే నమః; 6. స్థాణవే తే నమ; 7. పశుపతయే నాథాయ తే నమః; 8. శంభవే తే నమః; 9. పరమానందాయ తే నమః; 10. సోమార్గధారిణే తే నమః; 11. భవాయ తే నమః; 12. భీమాయ తే నమః; అను మంత్రములను ప్రతి మంత్రముతోను త్వామహం శరణం గతః, అను వాక్యమును పలుకవలయును. అట్లే యజమానుని) ఆహారము వరుసగా 1. గోమూతము 2. గోమయము 3. క్షీరము 4. పెరుగు 5. నేయి 6. కుశోదకము 1. పంచగవ్యము 8. బిల్వ ఫలము; 9. కర్పూరము 10. సాంబ్రాణి 11. యవలు 12. నల్లనూవులు; పూజకై పుష్పములు మార్గ శీర్షాది మాసములందు వరుసగా-1. మందార 2. మాలతీ 2. ఇప్ప 4. తెల్ల కలువ 5. పేంకణము 6. అశోకములు 7. మల్లె 8. పాటలము-దాసాని అనేడు ఎర్రని పూవు; 9. జిల్లేడు 10. కడిమి 11. నూరు రేకుల పద్మము 12. కలువ;

(*వృష దాజ్యము అనగా గడ్డకట్టించిన  గట్టి పరచిన పాలి-నేయి కలిపిన మిశ్రము; దూద్ ఖోవా- దూద్ బడా అను పాలవంట లేదా మీగడ పెరుగు.)

మరల కార్తిక మాసము రాగానే బ్రాహ్మణులను ప్రార్థించి పిలిచికొనివచ్చి నానావిధ భక్ష్యములు మొదలగు దానితో పూజించి వస్త్రములు మాల్యములు భూషణములు బంగారుతో చేసిన ఉమా మహేశ్వరుల ప్రతిమ గోప్రతిమ వృషభ ప్రతిమ గోవృషభ ప్రతిమలకు ఎనిమిదేసి ముత్యములు తెల్లని నేత వస్త్రములు సర్వోపస్కారములతో కూడిన చక్కని శయ్య రాగి పళ్లెరములో (పాత్రలో కాని తెల్లని బియ్యము అంగవైకల్యము లేని వారు శాంతులు వేదవతములను ఆచరించినవారు సౌమ్యులు శుభమును ఆచరించువారు జ్యేష్టసామ అను సామవేద భాగము ఎరిగినవారు దురాచరణములు లేనివారు సపత్నీ కులు ఆగు వారికిని-గుణజ్ఞుడు (ఉత్తమ గుణములు ఎరిగినవాడు కలిగినవాడు) శ్రోత్రియుడు (సొంగముగ వేదాధ్యయనము చేసినవాడు) తత్వవేత్తయు నగు గురువు ఉన్నచో గురునకును లేని ఎడల అట్టి బ్రాహ్మణునకును దానమీయవలెను. వేదోక్త విధానమున నీల వృషోత్సర్జనమ ను చేయవలెను. విత్త శాఠ్యము చేయరాదు. చేసినచో దోషము పొందును.

ఈ విధానమున శివ చతుర్దశీ వ్రతము చేసినవారు అశ్వమేధ సహస్ర ఫలము పొందుదురు. వారి తండ్రులో సోదరులో తానో చేసినవై నను బ్రహ్మహత్యాదిదోషము లేవయిన ఉన్న చో వానివలన కలుగు ఇహలోక పర లోక పాప ఫలము లేవేవియున్నను అవి యన్నియు నశించును. ఇహమున దీర్ఘాయురారోగ్యమును కులాభివృద్ధియు పరమున విష్ణు సారూప్యమును సిద్ధించును. ద్యులోకమున ప్రమథ గణములకు అధిపతియే నూరుకోట్ల కల్పముల కాలము ఉండి తుదకు శివ స్థానమును చేరుదురు.

ఈ శివ చతుర్దశీ వ్రత ఫలమును చెప్పుటకు బృహస్పతికిని బ్రహ్మకును సిద్దులకును నాకు (నందికేశ్వరునకు)ను నోటియందు పదివేల కోటుల నాలుకలున్న ను శ కీ బోలదు. ఏలయన ఆ ఫలము అనంతమయినది.

ఈ శివ చతుర్దశీ వ్రత విధానము సకల పాప విమోచనమును కలిగించునది; దీనిని స్మరించినను పఠించినను విమత్పరుడై వినినను వినిపించినను ఇంద్రత్వము సిద్ధించును. దీనిని అమర యువతి కోటులు స్తుతించుచుందురు. నదా ఇట్టి ప్రశస్తమగు దాని నాచరించినచో కలుగు ఫలము ఇంతయని చెప్పనేల? స్త్రీయేనను తన భర్తను కాని కుమారులను తన ఇంటి పెద్దలను కాని అడిగి వారి అనుమతి పొంది ఆచరించినను ఆమెయును పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రురాలై పినాక పాణియగు ఆ మహానుభావుని పరమపదమును పొందును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున శివ చతుర్దశీ వ్రతవిధాన కథనమను తొంబది నాలుగవ అధ్యాయము.