మత్స్య మహా పురాణము

Table of Contents

256 - గృహ నిర్మాణమునకై దారువుల తెచ్చుట-ఆయవ్యయగణనము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: ఇక మీదట గృహనిర్మాణ ప్రక్రియలో ఉత్తము(ముఖ్యాంశమగు దొర్వా హరణము (దారువులను సేకరించి తెచ్చుకొను పద్దతి) చెప్పెదను; దార్వాహరణమున కై బయలుదేరుటలో నక్షత్రములలో ధనిష్టాపంచక మును విష్టిగ భదా) మొదలగు దుష్ట సమయములను విడువవలయును; ఇవి కానిదియు దైవజ్ఞుడు నిర్దేశించినదియు నగు శుభ సమయమున వనమునకు పోవలయును; ఎల్లప్పుడును మొదట తాను నరుక దలచిన వృక్షమునకు పూజాపూర్వకముగా బలిచేయవలయును; గృహనిర్మాణమునకుద్దేశించి నరకిన వృక్షము ఈశాన్యదిశలో పడుట మంచిది: ఇట్లు కాక పడుట ఆంతగా మంచిదికాదు: పాలుగల (మర్రివంటిది - పనులు నివసించుచుండినది .వాయువుతో ఆగ్నితో పీడింపబడునది. ఏనుగు విరుగగొట్టబడినది పిడుగుపడి చెడినది నగము ఎండినది విరిగి ఎండినది చైత్య (ప్రార్థనాపూజాస్థాన) దేవాలయనదీసంగమ శ్మశాన కూపత టాకాది ప్రదేశ ములందలిదియగు వృక్షమునుండి దారువును గ్రహించుట శ్రేయోదాయక ముకాదు; ముండ్ల చెట్లును నీవనింబ విభీతక శ్లేష్మాత  కా మ దొరువును - గృహ నిర్మాణమున వాడరాదు: అసనము అశోకము మధుకము సర్జము సాలము చందనము పనసము దేవదారు హరిద్రకములు - వీని దారువులు (కలపలు) మంచివి: ఇండ్ల నిర్మాణము నకై ఒకటి. రెండు లేదా మూడు విధములగు దారువుల మాత్రము వాడవలయును; ఆంతకంటే ఎక్కువ విధములగు దారువులను ఉపయోగించుట భయప్రదము: శింశుపా శ్రీపర్లీ-ఎందుక-స్యందన-పనస-సరళార్జున-దారువులు మరివేనితోను కలుపక ఒకే విధమగునవి వాడుట చాల మంచిది; చెట్టు నరకునపుడు దాని దొరుఖండము పచ్చగానున్న చో ఉడుము. మంజిష్ఠవలే ఎర్రగానున్న చో కప్ప-నీలముగానున్న చో చిలుక ఒక పిలవర్ణ మైనచో ఎలుకలు - వజ్రపువన్నె యైనచో జలము. అందు కలవని తెలియవలయును. చిట్లిన గర్భదారువును గృహనిర్మాణమున నుపయోగించరాదు: మొదట ఇట్లు నరకి. యుంచిన దారువును ఆది ఆరిన తరువాత శుభశకున సమయమందు వచ్చి తీసికొని పోవలయును.

ఆయగణితము.

ఇంటి వెడల్పును పొడవుతో గుణించి వచ్చిన దానిని ఎనిమిదితో భాగించగా (పొxవె%8 ) వచ్చిన శేషములలో 1. ధ్వజ. 2. ధూమ. 3. సింహ; 4, శునక. 5. వృషభ, 6, ఖర. 7. గజ, 8(o) ధ్వాంక్ష-ఆయములను తెలుపును; (పొడవు వెడల్పులు మూరలలో లేక్కకు తీసికొనుటచేత ఈ పొడవు వెడల్పులను పరస్పరము గుణించగాను - దానిని భాగించగాను వచ్చిన సంఖ్యలు చదరపు మూరలను తెలుపును;) ఈ ఎనిమిది ఆయములును వరుసగా తూర్పునుండి ఈశాన్యము వరకు ఎనిమిది దిక్కులయందుండునని తెలియవలయును: వీనిలో ధ్వజాయము అన్ని దిక్కులకును ఆభి ముఖమై-వి శేషించి పశ్చిమాభిముఖమై గృహనిర్మాణ(వాస్తు) స్థానమునందు తూర్పుదికయందుండును: సింహాయము దక్షిణ దిశ యందు ఉత్తరాభిముఖమయి యుండును: వృషభాయము పశ్చిమ దిశ యందు పొగ భీముఖమైయుండును: గజాయము ఉత్తర దిశ యందు డ క్షీణాభిముఖమై యుండును: ఈ ఆయములు మంచివీ: విదిశల (మూలల) యందు వచ్చిన 2.4. 6-8 ఆయములు మంచివి కావు.  (ఈ వ్యవస్థను 3x3=9 గడులుగల చక్రము వ్రాసి చూచుకొనునది.)

నక్షత్రగణనము-వ్యయగణనము.

ఇట్లే గృహపు పొడవు వెడల్పులను పరస్పరము గుణించగా వచ్చిన చదరపు హస్తముల సంఖ్యను ఎనిమిదిచే గుణించి ఇరువది ఏడిటిచే భాగించగా పోxవెx8/27 వచ్చు శేషమును నక్షత్రమందురు; ఈ నక్షత్ర సంఖ్యను ఎనిమిదిచే భాగించగా వచ్చు శేషమును వ్యయమందురు; ఇట్లు గణన చేయగా వచ్చిన ఆయవ్యయములలో ఆయమధికమగుట గృహ స్వామికి శుభమునిచ్చును; అని భగవానుడగు హరి చెప్పెను.

ద్విజవర్యులను ముందుంచుకొని పూర్ణకుంభమును దధి అక్షతలు మామిడి చివుళ్ళు పుష్పములు- ఫలములు తీసి కొని శోభాయమానముగా బయలుదేరిపోయి విప్రుంకు హిరణ్య వస్త్రాదికమునిచ్చి మాంగల్యమును శాంతియు కలుగవలే నను తలపుతో గృహస్వామి నూతన గృహమున ప్రవేశించపలయును. గృహ్యోక్త కల్ప విధానానుసారముగ గృహవాస్తు శాంతి విధానమున హోమమును బలి కార్యమును నిర్వర్తించ వలయును; బ్రాహ్మణ శేష్టులను భక్ష్యభోజ్యములతో తృప్తినందించవలయును; శుక్ల వస్త్రములతో గృహమున ప్రవేశించ వలయును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున వాస్తు శాస్త్రమున దార్వాహరణాది కథనమను రెండు వందల ఏబది ఆరవ అధ్యాయము.

వాస్తు శాస్త్రము ముగిసినది.