మత్స్య మహా పురాణము

Table of Contents

77 - శర్కరాఫల సప్తమీ వ్రతము

ఈశ్వరుడు బ్రహ్మతో ఇంకను ఇట్లు చెప్పెను: ఇట్టిదే యగు శర్కరా సప్తమీ వ్రతమును తెలి పెదను. అది కల్మషనాశకమును. అనంతాయురారోగ్యైశ్వర్యప్రదమును. మాఘ శుక్ల సప్తమినాడుదయమున తెల్లని నూపులపొడితో.నూనెతో స్నానము చేసి తెల్లని వస్త్రమాల్యముల ధరించవలెను. ఆరుగు అలికి దాని పై కుంకుమతో పద్మమును దాని నడుమ కర్ణికను వేయవలెను. 'నమః సవిత్రే' అను మంత్రముతో దాని పై గంధపుష్పము లుంచవలెను. దాని నడుమ నీటి కలశముంచి దాని పై శర్కరాపాత్ర నుంచవలెను. బంగారు గుర్రపు ప్రతిమను దానియందుంచి తెల్లని వస్త్రములతో మాల్యములతో గంధములతో ప్రతిమ నంగికరించవల యును. రవి నీ మంత్రముతో పూజించవలెను. (అర్థము): “దేవేశా! సర్వదేవమయుడవుగా నీవు వేదములందు పఠింపబడు చున్నావు. కనుక ఈ చరాచర జగత్తంతయు నీవే.” తరువాత పంచగవ్యము త్రావి (ఉపవాసముతో) ఆ ఆరుగునకు దగ్గరగా నేలపయి శయనించవలేను. సౌరసూక్తములనో పురాణములనో చదుపుచు కానీ వినుచు కానీ ఆ పగలును రాత్రియు గడుపవలెను. అష్టమినాడు నిత్యానుష్టానము నేరవేర్చికొని అదియంతయు బ్రాహ్మణునకు దానము ఈయవల యును. తన శక్తి కొలదిగా బ్రాహ్మణులకు నేతితో శర్కరా పాయసములతో భోజనము పెట్టవలెను. తానును మౌనముతో నుండి తైల లవణరహితముగా భుజించవలెను.

ఇట్లు ప్రతి మాసమునను సంవత్సరకాలము చేసి పిమ్మట శర్కరా పూర్ణకలశముతో సర్వోపస్కర (సర్వ సామగ్రీ) సహితమగు మంచమును పడకను పాడియావును శక్తి యున్న చో గృహమును కూడ సర్వోపకరణములతో ఈయవలయును. వేయి లేదా నూరు. లేదా మూడు లేదా ఒక నిష్కము (పూర్వపు ఒక బంగారు నాణెము , తూకముతో బంగారు గుర్రములను యథాశక్తి) చేయించి విప్రులచే సౌరసూక్త పాఠము పురాణ పఠనము చేయించి వారి కిది దాన మీయవలయును. ధనమునకు లోభించి లోపము చేయుట దోషకరము.

సూర్యు డమృతము త్రోవునపుడు అతని నోటినుండి పడిన అమృతపు బొట్టులే వడ్లు పెసలు చేరకు ఐనవి. ఇనుసారము శర్కర; ఆది అందుచే ఈ మూటిలో గొప్పది. అమృత స్వరూపము అయినది. హవ్యకవ్యములందు అందుచే శర్కర రవికి ప్రీతికరము.

ఈ శర్కరా సప్తమీ వ్రతానుష్టానము అశ్వమేధయాగ ఫలమును ఇచ్చును. సర్వదుఃఖశాంతిని పుత్రపౌ త్ర వృద్దిని పరబ్రహ్మత్వమును కూడ కలిగించును. అట్టివా డొక కల్పము కాలము స్వర్గమందుండి పిదప ముక్తి నందును.

దీనిని చదివినను వినినను తలచినను ఊ తమ జ్ఞానవంతుడై స్వర్గలోకమున అప్సరః సమూహము చే పూజింప బడును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున, శర్కరా సప్తమీ వ్రత కథనమను డెబ్బది యేడవ అధ్యాయము.