మత్స్య మహా పురాణము

Table of Contents

225 - రాజు దండోపాయమును అవశ్యమాచరించవలెననుట. రాజునకు లోకపాలురతోడి సామ్యము.

శ్రీ మత్స్య నారాయణుడు మనువుతో నిట్లు చెప్పెను: సర్వభూతములను అధిగోపనము (వాటియందు తాను అధిష్ఠాతగానుండి రక్షణము) చేయుటకై దండోపాయము నాచరించుటకుగా స్వయం భూబ్రహ్మ సకల దేవతాంశములను ఉపాదానకారణము (ముడి సరకు)గా తీసికొని రాజును సృష్టించెను; ఈతని తేజస్సుచే ఈతని నెవ్వరును తేరిపార చూడనైన జాలకు కావున రాజు భాస్కరుడువలేనే లోకములందు ప్రభువనబడుచు రాజు రవిగా వెలుగొందుచున్నాడు;

ఎపుడు (ఎందుచే) ఈతని దర్శనమున లోకము ప్రసాదమును హాయిని) పొందునో ఆపుడు (ఆందుచే) ఆతడు జన నయ నానందకరత్వ గుణముచే (రాజ) చంద్రుడగుచున్నాడు; ఎట్లు యముడు తగిన కాలము వచ్చినపుడు ప్రాణులకు ప్రియ (మగు సుఖమును ద్వేష్య(మగు దుఃఖమును ఇచ్చుచున్నాడో అట్లే ప్రజలకును రాజు యమ (వ్రతసమాన వ్రతమును ఆచరించవలసి యుండును; (రాజు ప్రజలలో మంచి పొరీ నాదరించవలెను; దుష్టులను దండించవలయును; వరుణుడు ఎల్లరను పాశములతో బంధించువాడుగానే కనబడు చున్నాడు; ఆపై రాజు కూడ పాపులను పారిపాపముల ననుసరించి నిగ్రహించ దండించవలేను: ఇది రాజాచరించ వలసిన దారుణవ్రతము కర్మము); పరిపూర్ణుడగు చంద్రుని చూచి నంతనే మానవుడు ఎట్లు హర్షమందునో అట్లే ఎవని విషయమందు ప్రకృతులు (ప్రజలును రాజోద్యోగులును హర్షింతురో అట్టివాడే చంద్ర సమానుడగు రాజు; రాజు ఆగ్నేయ (అగ్ని సమాన) వ్రతము నందుండి ప్రతాపయుక్తుడును తేజస్వియునై పాపకర్ములగు మానవుల విషయమందును దుష్టులగు సామంతుల విషయమందును హింసప్రాణుల విషయమందును. ప్రవర్తించవలయును: ధర భూమి తనంత తానై సర్వభూతములను ధరించునట్లే సర్వభూతములను ధరించు (పోషించు - రక్షించు - అదుపులోనుంచు) ఇంద్రార్క వాయు యమవరుణ చంద్రాగ్ని వృథివుల తేజోవ్రత రూపమగు పార్థివవ్రతమును రాజు ఆశ్రయించి చరించుచు వర్తించవలయును; ఇంద్రుడు వర్షర్తు మాసముల నాలుగింటి యందును వర్షించునట్లే రాజు కూడ తన రాష్ట్రమందు ఇచ్చకు వచ్చునట్లు మిక్కిలిగా వర్షించి ఇంద్ర వ్రతవర్తి కావలెను; ఆదిత్యుడు సంవత్సరమందలి ఎనిమిది మాసములపాటు కిరణములతో తోయమును లాగి కొనునట్లే రాజును తన రాష్ట్రమునుండి పన్ను లను లాగికొనవలెను: ఇది రాజు పూనవలసిన యరవ్రతము; మారుతుడు సర్వభూతములయందును ప్రవేశించి సంచరించునట్లే రాజుకూడ చారుల ద్వారమున సర్వభూతముల యందును ప్రవేశించవలయును; ఇది రాజవలంబించు మారుత(వాయు) వ్రతము.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున రాజధర్మమున రాజు దండోపాయమును ప్రయోగించుట ఆవశ్యక ర్తవ్యమనుటయు రాజునకు లోకపాలురతోడి సొమ్యమును అను రెండువందల ఇరువది యెదవ అధ్యాయము.