మత్స్య మహా పురాణము

Table of Contents

74 - కల్యాణ సప్తమీ వ్రతము

బ్రహ్మ ఈశ్వరుని ఇట్లడిగెను. 'భగవన్! సంసార సాగర దుఃఖమునుండి ఉద్దరించు సాధనమగుచు స్వర్గారోగ్య ఫలప్రదమగు వ్రతమేదయిన తెలుపుము.' ఈశ్వరు డిట్లు చెప్పెను: సౌర (సూర్యోపాసన ప్రధానములగు) ధర్మములను చెప్పెదను. వాటి పేరులు ఒక ల్యాణ సప్తమి విశోక సప్తమి.ఫల సప్తమి.శర్కరా సస్తమి.కమల సప్తమి. మందార సప్తమి. శుభ స పమి. ఇవియన్నియు అనంతఫలదములును దేవరులచే కూడ పూజితములును. వీటి విధానమును కల్పోక్త ప్రకార మున నామక్రమమున చేప్పేను.

ఆదిత్య వారముతో కూడిన శుక్ల సప్తమికి కల్యాణ సప్తమియని లోకప్రసిద్ధి. ఈనాటి ఉదయమున గోక్షీర స్నానము చేయవలెను. పిమ్మట తెల్లని స్వచ్చ వస్త్రములు ధరించి అక్షతలతో అష్టదళ పద్మము వేయవలెను. దాని నడుమ గుండ్రని కర్ణికను వేయవలెను. ఈ పద్మమునందంతట నిండునట్లు పుష్పములతో అక్షతలతో నారాయణుని ఆకృతి వేయవలెను.

పూర్వస్యాం దిశి తపనాయనమః. ఆగ్నే యతః మార్తాండాయనమః-దక్షిణస్యాం దిశి దివాకరాయనమః- నైరృత్యాం విధాత్రేనమః.పశ్చిమాయాం వరుణాయనమః -వాయవ్యాం భాస్కరాయనమః- ఈ తరస్యాం వికర్తనాయనమః-ఐశాన్యాం రవయేనమః.ఆదౌ పరమాత్మనే నమః-మధ్యే పరమాత్మనేనమః.అంతే పరమాత్మనేనమః. ఈ మంత్రములతోను శుక్లవస్త్రల భక్ష్య ధూపమాల్యానులేపనములతో గుడ లవణములతో పరమాత్ముని పూజించవలెను.

పిమ్మట భూః భువః సువః అను వ్యాహృతి మంత్రములతో బ్రాహ్మణులను యథాశక్తిగా భ క్తి పూర్వకముగా గుడ క్షీర ఘృతాదికముతో పూజించవలెను. తలపాతమును హిరణ్యమును బ్రాహ్మణు నకర్పించవలెను. ఈ నియమముల పాటించి వ్రతము జరిపి నిద్రించి ఉదయమున మేలుకని స్నాన జపములాచరించి బ్రాహ్మణులతో కూడ మృతపాయసము భుజించవలయును. దంభమునకు కాక నిష్కపట భావముతో వేదవేత్తయగు విప్రునకు ఘృతపాత్రమును ఉదకుంభము ను బంగారమును దీనిచే పరమాత్ముడగు దివాకర భగవానుడు ప్రీతి చెందుగాక!' అను మంత్రముతో సమర్పించవలయును. ఈ విధముగా ప్రతీ మాసమునందును చేయవలయును. పదుచూడవ మాసమున మొగమునందు బంగారు పడే వస్తా లంకారములు కలిగిన పాడియావులను పదుమూడింటిని దానమీయవలయును. ధనము లేని వాడు ఇతరులతో పోటీపడక ఒక పాడి ఆవునై న ఈయవలయును. ధనము కలవాడు మాత్రము తనకు శ క్తియుండియు ధనలోభము చే తక్కువ ఈయరాదు. విత్త మోహము చూపుట చే అధఃపతితుడగును. ఈ విధానమున కల్యాణ సప్తమీ వ్రతము చేయువాడు సర్వ పాప వినిర్ముక్తుడై ఇహమున అనంతములగు ఆయురారోగ్యైశ్వర్యములను పొంది పరమున సూర్యలోకమున పూజితు డగును. ఈ కల్యాణ సప్తమి సదా సర్వపాప హరయును సర్వదేవతా పూజితయును సర్వ దోషోపశమనియునునై నది.

అనంత ఫలప్రదయగు ఈ కల్యాణ సప్తమీ విషయమును వినినను చదివినను పాపముక్తుడగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున కల్యాణ సప్తమీ వ్రతకథనమను డెబ్బది నాలుగవ అధ్యాయము.