మత్స్య మహా పురాణము

Table of Contents

273 - షోడశ మహాదానాను కీర్తనారంభము - తులాపురుష దాన విధానము

ఋషులు సూతునితో ఇట్లు పలికిరి: సూతా! ధనములను న్యాయ మార్గమున అర్జించుటయు వృద్ధి చేయుటయు అభిర క్షణము సేయుటయు సతాతమునందు దానము సేయుటయు సర్వ శాస్త్రములయందును చెప్పబడినట్లు ఆధ్యయనము చేయుచున్నాము. ఏ మహాదానమును ఇచ్చినచో వివేకియగు నరుడు తాను ధనవంతుడే నందులకు కృతకృత్యతనంది మానవంతుడగును? అది మాకు విస్తరించి చెప్పుము. అన సూతుడిట్లు చెప్పెను; ఇట్టి జిజ్ఞాన గలవారు గావున మీకు ఇపుడు మహాదానములను అనుక్రమమున కీర్తించుచు పేర్కొందును. అనేక విధములగు ధర్మ కర్మములందు ఒకటియగు దానాత్మక ధర్మ ప్రకరణమందు మహాసమర్థుడును లోక కర్తయునగు విష్ణువు మాకు ప్రవచించిన (ఇచట 'యద్ -నః-ఉక్తం యన్నో కం' అని ఆర్ష సంధి; 'న.ఉ కం' అని పొరపడవలదు.) సర్వోత్తమమగు మహాదాన సముదాయమును మీకు తెలి పెదను. అది నరులకు సర్వపాపక్షయకరము; దుఃస్వప్న నాశనము; ఇది ఈ భూతలమున పదునారు విధములుగా నున్నదని వాసుదేవుడే చెప్పెను; ఇది పుణ్యకరము పవిత్రము ఆయుష్యప్రదము సద్యఃపాపహరము ఉత్తమము; బ్రహ్మ విష్ణు శివాది దేవతల చేతను పూజితము; వరుసగా ఇవి.1. తులాపురుషదానము 2. హిరణ్యగర్భదానము 3. బ్రహ్మాండ దానము; 4. కల్పపాదప (వృక్ష) దాన ము: 5. గోసహనదానము; 6. హిరణ్య కామధేను దానము; 1. హిరణ్యాశ్వదానము 8. హిరణ్యాశ్వరథ దానము; 8. హిరణ్యగజరథ దానము; 10. పంచలాంగల దానము; 11. ధరాదానము; 12. విశ్వ చక్రదానము; 18. కల్పలతాదానము; 14.సప్త సాగర దానము; 15.రత్న ధేనుదానము; 16. మహాభూతఘటదానము.

పూర్వము మన్మథుడును వాసుదేవ భగవానుడును అంబరీషుడును భార్గవుడును కార్తవీర్యార్జునుడును ప్రహ్లా దుడును పృథుడును భరతుడు మొదలగు మరి ఇతర రాజులును ఈ మహాదానములను ఆచరించియుండిరి. దేవతలీ మహాదానములను సర్వదా వేలకొలది పఘ్న ములతో కాపాడుచుందురు; కావున వానిని అతిగమించి భూతలమందలి మాన వులు వీనిలో ఒక్కొక్క దానినే నను తప్పక యాచరించవలయును. వాసుదేవుని యనుగ్రహమున్న విషయములను అన్యథాక రించుట ఈ భూతలమునందు ఇంద్రున జైన శక్యముకాదు కావున గోవిందుని ఉమాపతిని వినాయకుని ఆరాధించి విపుల యనుమతీని కూడ పొంది ఈ మహాదాన యజ్ఞమాచరించవలయును; ఇంత మాత్రపు విషయము నే మనువు మత్స్యరూప జనార్ధనునడిగేను; ఆ విషయము జరిగినది జరిగినట్లు అనువచింతును; ఋషి సత్తములారా: వినుడు; మనుపు ఇట్లడి గౌను: అచ్యుతా! పవిత్రములును రహస్యములును శుభకరములునునగు ఏయే దానము లాచరించదగినవి యున్న వో చెప్పుము; అనగా మత్సుడిట్లు చెప్పెను.

తులాపురుష దానవిధానమ్.

గుహ్యములగు ఏ మహాదానములను వదు నారింటిని ఇదివరకు ఎవరును ఎవరికినిగాని నేను నీకును గాని చేప్పి యుండ లేదో అవి కల్పమున ఉన్న వియున్నట్లు ఆనుపూర్వోతో(క్రమానుసారముగా) చెప్పెదను; వీని యన్నిటిలోను మొదటిదిగా శాస్త్రమున వీధింపబడినది తులాపురుష దానము.

తులా పురుష దాన విధానము.

అయనము విషువము వ్యతీపాతము దీనక్షయము యుగాదిదినము గ్రహణదినము మన్వంత రాదిదినము రవి సంక్రాంతిదినము వైధృతియోగ దినము చతుర్దశి ఆష్టమీ శుక్ల పంచదశీ ( పూర్ణిమా) పర్వదినము ద్వాదశి ఆష్టకా యజ్ఞ ములు ఉత్సవములు వివాహాది శుభకార్యములు.దుస్స్వప్నములు అద్భుతములు కనబడుట ద్రవ్యము లభించుట తగిన బ్రాహ్మణులు లభించుట శ్రద్ద కలుగుట. ఇట్టి సమయములందును తీర్థములు క్షేత్రములు గోష్టములు ఆరామములు నదులు గృహము దేవాలయములు తటాకములు మనోహర ప్రదేశములు -ఇటువంటి ప్రదేశములందును నంసారపు వలనుండి భయపడు వారెవరయినను ఈ మహాదానములను ఈయవచ్చును; ఏలయన జీవితము ఆనిత్యము; ధనమతిచంచలము; మృత్యువు కేశములయందు పట్టుకొనియే ఎల్లప్పుడును సిద్ధమయియున్నదన్నట్లుగానే మానవుడు ధర్మమాచరించవలయును,

పుణ్య (శుభ) కరమగు తిథినాడు ఐరాహ్మణులచే న్వ స్త్రీ పుణ్యాహవాచనము జరిపించవలయును; పదునారు పిడి మూరల పొడవును పదికాని పండ్రెండుకాని మూరల వెడల్పునుకల దీర్ఘ చతురస్రాకృతి మండపమును నిర్మింపజేయ వలయును; ఆందు నాలుగు శుభాననములమర్చవలేను; దాని నడుమ ఏడు కాని ఐదు కాని మూరల వెడల్పున వీథి.మనుజులు నిరాఘాటముగా తిరుగుటకు.ఉండవలయును; ఈ మండపమునకు నడుమగా నుండునట్లు తోరణ ప్రధాన ద్వారమును దృఢమగు దారువుతో చేయించవలేను; నాలుగు దిక్కులందును నాలుగు కుండములును వానికి చుట్టును మేఖలలును (ఆంచు కట్టలును) యోనులును (ఇది లోగడ చెప్పబడినది) పూర్ణ కుంభములతో ఆసనములతో కూడ నిర్మించవలెను; అచటనే ప్రతి కుండముకడను రెండేసి తామ్ర పాత్రనులును స్రుక్రువాజ్యస్థాలీ ప్రభృతి యజ్ఞ పొత్రములును మూరెడు చదరపు విషరములును (దర్భాసనములో అజినము లో) ఉండవలయును: తిలలు ఆజ్యము ధూప సామగ్రియు శోభన పుష్పోపహారములును ఉండవలయును. ఈశాన్యమున వేరుగా మూరెడు చదరపు వేదిక గ్రహాదులను లోక పాలురను పూజించుటకై ఉండవలయును; తరువాత ఆందే పండ్లు మాల్యములు వస్త్రములు మొదలగువానితో బ్రహ్మ విష్ణు రుద్రుల ఆర్చనము కూడ జరుపవలయును: ఆందుచే అచట ఆయా లోకేశ్వర గ్రహాదులకు చెప్పిన వర్ణములతో వస్త్రములతో చేసిన పతాక (చిరుజెండా)లును వాని నడుమ చిరుగంటలతో మువ్వలతో కూడిన ధ్వజము (పెద్ద జెండాయు)ను ఉండవలెను; నాలుగు దిక్కులందును నాలుగు ద్వారములును దానికి మర్రి జువ్వి మొదలగు పాలుగల వనస్పతుల (పూలు పూయక యే కాయలు కాయు వృక్షజాతులు పనన్నతులు) చివుళ్ళతో చేసిన తోరణములు నాలుగును ప్రతి ద్వార మందును రెండేసి పూర్ణ కుంభములును మాలికలు గంధ ద్రవ్యములును ధూప సామగ్రియు వస్త్రములు నుండవలయును; ఈ మండప సమీపమున ఏపి గార.మంచి గంధము. దేవదారు-శ్రీపర్లి-చూ రేడు.మామిడి.కడిమి మొదలగు వానితో చేసిన ఐదు మూరల రెండు. స్తంభములును తెచ్చి రెండు మూరలలోతుగల గోతిలో ఒక దానికొకటి నాలుగు మూరల దూరములో నుండునట్లు దృఢముగా పాతవలేను; (అనగా స్తంభదారువు. ఐదును రెండును కలిపి ఏడు మూరలు) వానిపై అడ్డముగా ఒక దారువును అమర్చ. వలేను ( ఉత్తరదొరువు అని దానికిచట పేరు వ్యవహరింపబడినది; పైగా కట్టిన కొయ్య అని అర్థము.) ఇదియు ఈ స్తంభములు రెండును ఒకేజాతి దారువుతో చేసినవిగా నుండవలెను.

స్తంభముల దారు జాతికే చెందిన దారువుతో చేసిన *తులను ఈ ఉత్తర దారువునుండి వేలాడ జేయవలెను; ఈతుల నడుమ బంగారుతో చేసిన పురుషమును రెండు వైపులను బరువులు సమానముగా నున్న వని తెలుపు సన్నని మొనగల కడ్డీగాని రేకుగాని) నాలుగు మూరల పొడవును పది అంగుళముల మందము (వెడల్పు)ను కల దానిని ఆమర్చ వలేను; ఈ తులకు బంగారు పట్టికలే ఆభరణములుగా నుండవలెను; ఈతులకు రెండు కోనలయందును ఇనుప పళ్సెరము లను ఇనుప గొలుసులతో బిగించవలయును; వీనిని బంగారుతో రత్న ములతో చేసిన మాలలతో మాల్యములతో విలేప నములతో అలంకరించవలయును; అచట భూమి పై చక్రమును ముగ్గులుగా విభజించి దాని పై తామర పూ రేకులును ఇతర పుష్పములును చల్లవలయును; ఈ తులకు పైగా వచ్చునట్లు పుష్ప ఫలోప శోభితమగు ఐదు వన్నెల వీతానక ము (మేల్కట్టు-చాందినీ) ఏర్పరచవలయును.

ఇవికాక వేద విదులును మంచి రూపము వేషము వంశము శీలము కల వారు విధానమందు సమర్ధులు నేర్పు గట్టి దనము గలవారు అనుకూలురు ఆర్యదేశమునందు జన్మించినవారునగు ఋత్విజులను వేదార్థ విచారణా దముడుసు ఉత్తమ వంశోత్పన్ను డును మంచి శీలమును వంశ మును సౌందర్యమును కలవాడును పురాణములందును శాస్త్రములందును ఆస క్తి కలవాడును మహాసమర్థుడును ప్రసన్న ముగాను గంభీర ముగాను మాటలాడు వాడును తెల్లని శుద్ద) వస్త్రముల ధరించు వాడును కుండలములను బంగారు హారములను ధరించిన వాడును భుజకీర్తులను కంఠాభరణములను ధరించి అందముగా నుండు వాడునగు ఆచార్యుని నియమించుకొనవలయును.

మండపమునందు ఉత్తరమున ఋగ్వేద విదులను దక్షిణమున యజుర్వేద విదులను పశ్చిమమున సామవేద విదులను ఉత్తరమున ఆథర్వణ వేదపారంగతులను ఇద్ద రేసి చొప్పున కూర్చుండ బెట్టవలయును.

వినాయ కొదులగు దేవతలను గ్రహములను లోకపాలురను ఆష్టవసువులను ద్వాదశాదిత్యులను మరుత్తులు మొద లగు ఇతర దేవతాగణములను బ్రహ్మ విష్ణు రుద్ర రవులను ఉద్దేశించి ఆయా వనస్పతి సమిధలతో వారి వారి మంత్రము లతో నాలుగేసి హోమములను జరుపవలయును. వారి వారికి శాస్త్రమందు చెప్పబడిన సూక్తములను ఈ దేవతల నందర నుద్దేశించి ఆయా సూక్తములను జపించ పఠించవలయును; హోమాంతమునందు ఆచార్యుడు తూర్యనాదములతో బలి పుష్ప ధూపములను ఇచ్చుచు యజమానునితో కూడి చెప్పబోవు మంత్రములతో లోకపాలుర నందరను క్రమమున ఆవా హించవలయును.

(*“సమాన జాతీశ్చ తులావలంబ్యా హైమేన మధ్యే పురుషేణ యుక్తా”

ఇందు పురుష శబ్దమునకు ‘ఒక సమగ్ర పదార్థపు రెండవయవముల నడుమ సమానతను చూపునది’ అని అర్థము; ఈ యర్థము వ్యాకరణ శాస్త్రమునందలి పారిభాషిక పదపు ఆర్థముతో కూడ సరిపోవుచున్నది.

1. సర్వ దేవతలచే సిద్దసాధ్యులచే అభిషతుడవు వజధరుడవు అమరేశుడవు అప్పరోగణము చే వీజనము చేయ బడువాడవు నగు భగవన్! నా యజ్ఞమును రక్షించుము; ప్రణవస్వరూపుడగు ఇంద్రునకు నమస్కారము.

2. సర్వ దేవతలకును హవిస్సును కొనిపోవువాడును ముని ప్రవరులచే అన్ని వైపులను ఆశ్రయించబడు వాడును నగు కవీ(విద్వన్:) నీకు వందనము; తేజః కౌలురగు దేవగణముతో కూడి నా అధ్వరయజ్ఞమును రక్షించుము; ప్రణవరూపుడగు ఆగ్ని కి నమస్కారము.

3. వివస్వంతుని (సూర్యుని కుమారుడు ధర్మరాజు సర్వామర పూజితుడు దివ్యమూర్తి శుభాశుభ ఫలములను ఇచ్చువారగు దేవాదులకు అధీశుడు శివ(శుభకరుడు నగు దేవా! రారమ్ము; నా యజ్ఞమును రక్షించుము; నీకు సమ స్కొరము. ప్రణవరూపుడగు యమునకు వందనము.

4. రక్షోగణనాయకుడవు శుభములకు అధినాథుడవు లో కేశుడవుఅగు నీరృతీ! భగవన్! నీకు నమస్కారము; నర్వ బేతాళ పిశాచ సంఘములతో కూడి రారమ్ము; నా ఆధ్వరమును రక్షించుము; ప్రణవరూపుడగు నిరృతికి వందనము.

5. జలజంతు గణములతో సముద్రముల గణములతో అప్సరోగణములతో కూడి రారమ్ము; విద్యాధరేంద్రులచే అమరులచే గానము చేయబడు వరు? భగవన్! మమ్ము రక్షించుము; నీకు నమస్సు; ప్రణవరూపుడగు వరుణునకు నమ స్కొరము.

6. ప్రాణములకు అధిపతి కాలరూపుడగు కవి (విద్వాంసుడగు దేవుడు) నీకు తోడు కాగా మృగ(లేడి) వాహన మారోహించి దేవసంఘములతో కూడి నా యజ్ఞమును రక్షించుటకై రారమ్ము; భగవన్! నా పూజ నందుకొనుము; నీకు వందనము; ప్రణవరూపుడగు వాయువునకు నమస్కారము.

7. సోమా! యజైశ్వరా! భగవన్! నీకు నమస్కారము; నక్షత్ర గణములతోను సర్వెషధులతోను పితరుల తోను కూడి రారమ్ము; నా పూజనందుకొనుము; నా యజ్ఞరత చేయుము; వ్రణవరూపుడగు సోమునకు నమస్సు.

8. విశ్వేశ్వరా! రారమ్ము; లోకేశా! భూతపతీ! భగవన్! త్రిశూల కపాల ఖట్వాంగ ధారణముతో కూడి రారమ్ము; మా యజ్ఞఫలము సిద్ధింపజేయుము; ప్రణవరూపుడగు ఈ కానునకు నమస్కారము.

9. పాతాళ ధరను (భూమిని) ధరించువారిలో ఇంద్రా! (శ్రేష్ఠా) నాగాంగనలచే కింకరులచే గానము చేయబడు వాడా! యక్షనాగదేవతాగణములచే పూజింపబడువాడా! ఆనంతా! మా యజ్ఞమును రక్షించుము. ప్రణవరూపుడగు అనంతు నకు నమస్కారము.

10. సర్వ విశ్వమునకును సృష్టికర్తవై విశ్వాధిపతివగు చతుర్ముఖాః మునీంద్రులతో పితృ దేవతలతో కూడి రారమ్ము; అమితప్రభ(భా)వా! భగవన్! నీకు నమస్కారము; మా యజ్ఞమును రక్షించుము; ప్రణవరూపుడగు బ్రహ్మకు నమస్కారము.

త్రైలోక్యమునందును గల స్థిర చర భూతములును బ్రహ్మ విష్ణు రుద్రులును . సదా నన్ను రక్షింతురు గాక ! దేవదానవ గంధర్వ యక్షరాక్షస నాగ ఋషి మనుజ దేవ మాతృదేవతలందరును మోద ముతో కూడి నా యజ్ఞమును రక్ష సేయుదురు గాక!

ఇట్లు దేవతల నావాహనము చేసిన తరువాత ఋత్విజులకు సువర్ణాభరణములను స్వర్ణ కుండల కటక సూత్రాగు శీయ పవిత్రములను వస్త్రశయనాదులను ఈయవలెను. ఋత్విజున కిచ్చిన దానికి రెట్టింపు దక్షిణ నాచార్యున కీయవల యును. ఆతనికి భూషణ వస్తాదిక మధికముగా ఈయవలయును; ఈ సమయములందు దేవతాధివాసనము జరుగునది జరుగుచుండ అన్ని దిశలయందు ఉండు జాపకులు ఉపవాసముతో నుండి శా నికాధ్యాయములను పఠించుచుందురు; ఆది మధ్యావసానములయందు బ్రాహ్మణులు స్వస్తి వాచనములు జరుపుచుండవలయును.

తరువాత యజమానుడు మంగళ వాద్యాది ధ్వనులతో బ్రాహ్మణులచే స్నానము చేయించబడి శుక్ల వస్త్ర పుష్ప ధారియై వారిని దేవతలను తులను కూడ ముమ్మారు ప్రదక్షిణించి దోసిట కుసుమములను పట్టుకొని ఈ మంత్రముతో 'తుల'ను అభిమంత్రించవలయును.

తులా! నీకు నమస్కారము; నీవు సర్వదేవతా శ క్తిరూపురాలవు; సత్యము నాశ్రయించినదానవు; లోకసాక్షి భూత వు:శ్రిలోక ధాత్రివి (లోక ములను తమ తమ స్థితియందు నిలుపుదానవు;) నిన్ను విశ్వయోని (జగత్కారణుడు) ఆగు నారాయణు డే నిర్మించెను; నీయందు సర్వ సత్యములును ఒకవైపున అన్ని అసత్యములును ఒక వైపున ఉండును; లోక హితకారిణీ! ధర్మాధర్మముల నాచరించు మానవుల నడుమ వానిని తూకము చేయుటకై భగవానుడు వారి నడుమ నిన్నుంచినాడు; తులా! నీవు సర్వభూతములకును ప్రమాణమని కీర్తింపబడుచున్నావు; నన్ను ను నీవు తూకము చేసి సంసారమునుండి ఉద్దరించుము. నీకు నమస్కారము; దేవీ: చతుర్వింశతి తత్వములకును అధిపతియగు పంచవింశక ( ఇరువది యైదవ తత్వమగు) ఏ పురుషుడు కలడో ఆ ఈ పరమపురుషుడును నీయందధిష్టించియున్నాడు; కావున నీకు పునః పునర్నమస్కారము; తులా పురుష నామము గల గోవిందా! నీకు నమస్కారము! నమస్కారము; హరీ! నీవు మమ్ములను జన్మ సంసారసాగరమునుండి తరింపజేయుము; ఇట్లు దేవతాధిపాసన కార్యమంతయునై న తరువాత వివేకి యగు యజమానుడు పుణ్య సమయము రాగానే ఖడ్గము చర్మము (డాలు) కవచము ధరించి నర్వాభరణ భూషితుడై మరల తులను ప్రదక్షీణించి దాని నా రోహించవలయును; ఆనంతరము బంగారు దారముతో హారముతో కూడిన ధర్మ రాజును పిడికిళ్ళు గట్టిగా బిగించి పట్టుకొన్న చేతులతో పట్టుకొని హరి ముఖమును చూచుచు ఉండవలెను; తరువాత బ్రాహ్మణ శ్రేష్టలు రెండవ తులా భాగమందు (సిబ్బెయందు) యజమానుని బరువుతో సమమగు దానికంటే ఆధిక భారము గల అతి నిర్మలమగు బంగార ము నుంచవలయును; పుష్టి (వృది) కొముడగు రాజు ఆ అపర తులాభాగమును ఆ బంగారు ఐరువుతో ఆ సిబ్బె నేలను తాకునట్లు చేయవలయును; క్షణమాతము ఆ ట్లేయుండి అపుడు ఈ మంత్రముచ్చరించ వలయును.

“సర్వభూత సాక్షిభూతా! సనాతనీ! నీకు నమస్కారము; దేవీ! నీవు పర మేష్టియగు పితామహుని (బ్రహ్మచే నిర్మింపబడినదానవు; సావర జంగమాత్మకమగు జగమంతయు నీచేతనే ధరించబడుచున్నది; సర్వభూతములకు ఆత్మ భూతురాలవై వాటియందుండు భూతధారిణీ! నీకు నమస్కారము.”

తరువాత తులనుండి దిగి (తూచిన ధనమును) సగము ఆచార్యునకును అనంతరము మిగిలిన సగమును ఋత్విజు లకును ఉదకపూర్వకముగా ప్రదానమొనరించవలయును; గురునకును ఋత్విజులకును గ్రామములను రత్నములను ఈయ వలేను. అంతే కాదు వారి యనుమతినంది ఆపై ధనమును ఇతరులకును ఇప్పించవలయును; బ్రాహ్మణులను దీననాధులను కూడ పూజించవలయును; ప్రోక్షితమగు (దానమునకై నీరు చల్లబడిన) న్వర్ణమును వివేకియగు దాత ఎక్కువ కాలము ఇంటియందుంచుకొనరాదు; ఉన్న చో అది మానవులకు భయావహమును శోక వ్యాధికరమునునగును; అది ఎంత శీఘ్రముగా వరులు స్వీకరించినచో దాతయగు నరునకంత ఆధిక శ్రేయము కలుగును.