మత్స్య మహా పురాణము

Table of Contents

214 - రాజ ధర్మములు. రాజు ఎన్నుకొనవలసిన అధికారుల లక్షణములు - రాజు ప్రజాపాలనలో తాను నడుచుకొనవలసిన రీతి.

 (గమనిక: ఈ రాజ ధర్మా ధ్యాయములలో 1. “శాస్త్రజ్ఞుడుత త్వజ్ఞుడు అనగా ఆయా శాస్త్రముల విష యమును చదివి బుద్ధి యందు బాగుగా కుదురుపరచుకొనినవాడు; 2. విధానజ్ఞుడు అనగా దానిని ఆచరించ గలవాడు; (1. శాస్త్రము.Knowledge in Theory 2. విధానము.Capability in Practice).

పట్టాభిషేక మందిన ప్రతి యొక రాజునకును ముఖ్య తమ కృత్య మేమి? నీవింతయు ఎరిగినవాడవు కావున తెలుప వేడుచున్నా ననిన మనువుతో మత్యుడిట్లు చెప్పెను: రాజు ఆభి షేకముతో తలతడి ఆరకుండగ నున్నప్పటినుండియు రాజ్యమును చూచుకొనుటకై తగిన సహాయులను ఎన్ను కొనవలయును; ఏలయన వారియందే రాజ్యము నిలిచియున్నది; చాల చిన్న పనియును ఒక డే చేయజాలడనిన మహోదయమగు రాజ్యము మాట చెప్పవలసినదేమి? కావున రాజు తానే కులీ నులు కులీన జాతీయులు శూరులు బలయుక్తులు సంపద(ముఖశ్రీ)గలవారు రూపము సత్వము (నిబ్బరము) గుణములు కలవారు సజ్జనులు క్షమాపరులు క్లేశము నోర్చువారు మహోత్సాహులు ధర్మజులు ప్రియంవదులు రాజునందు స్వామి భకు హితము నుపదేశించువారు తమకును రాజునకును కీర్తి కోరువారునగు సహాయుల నెన్ను కొని వారిని ఆయా మంచి పను లందు నియోగించవలేను. రాజు స్వయముగా పరీక్షించి చూచి ఈ చేప్పినన్ని గుణములులేని గుణహీనులై నను గ్రహించి వారిని తగిన పనులయందు భాగక్రమమున నియోగించవచ్చును; (ఇది రాజ సహాయుల సామాన్య లక్షణము;) కులీనుడు శీల సంపన్నుడు చతుర్వేద విశారదుడు హస్తి శిక్షాఋశ్వ శిక్షలయందు కుశలుడు మృదుభాషి శుభాశుభ ములగు నిమిత్తము లను శకునములను ఆయా చికిత్సా విధానములను ఎరిగినవాడు కృతజ్ఞుడు కార్యశూరుడు క్లేశ సహుడు ఋజు స్వభావుడు వ్యూహముల తత్వమును వ్యూహ విధానమును ఎరిగినవాడు తేలిక యైన విషయమేదో బరువగు విషయ మేదో ఎరిగినవాడు అగు బ్రాహ్మణుని కాని క్షత్రియునికాని సేనాపతిగా నియోగించవలెను; పొడగరి సురూపుడు దక్షుడు ప్రియవాది పొగరు లేనివాడు సర్వుల మనస్సులకు నచ్చువాడు -అందర మనస్సులలోని భావములను గ్రహించగలవాడు అగు వానిని ప్రతీ హారునిగా (ద్వారాధికారిగా) నియమించుకొనవలెను. దూత (రాయ బారి) చెప్పిన విషయము చెప్పినట్లు ఇతరులకు ఆందించువాడు దేశ భాషా విశారదుడు శ క్తి కలవాడు క్లేశ సహుడు మాటకారి దేశ కాల విభాగముల నెరిగినవాడు దేశ కాలముల గుర్తించి ప్రవర్తించగలవాడు (ఏ దేశ మందే కాలమందెట్లు వర్తించవలయునో తెలిసియుండుట మొదటిది-దానిని ఆచరణయందుంచి ప్రవర్తించుట రెండవది); రాజ హితము కోరువాడు రాజనీతి విషయములను తగిన సమయమందు తగినట్లు మాటలాడు వాడునయి యుండవలయును.

దూతాదిలక్షణమ్

పొడగరులు పొడవు బాహువులవారు శూరులు దృఢభక్తులు దేనికిని కలతపడనివారు క్లేశ సహులు హితకరులునై రాజ రక్షకులుండవలెను; తమ్ముపడిగ పట్టువారు (తాంబూల కరండధారులు) స్త్రీలుకాని పురుషులు కాని కావచ్చును; వారు అనాహార్యులు (ఆహార్యము- వేషధారణము) ఎక్కువ ఆకర్షణీయము ఆడంబర ద్యోతకము ఆగు వేషము ధరించనివారు క్రూర తలేని వారు రాజునందు దృఢభక్తులు అయియుండవలెదు; సంధి.విగ్రహము యానము. ఆసనము-ద్వైధము - ఆశ్రయము అను షాఢుణ్యపు తత్వమును దాని ఆచరణ విధానమును ఎరిగినవాడు దేశ భాషా విశారదుడు ; రాజనీతి విశారదుడునయి ‘సంధి విగ్రహకుడు’ విదేశ వ్యవహారముల చూచు మంత్రి) ఉండవలెను; రాజు కడ నుండు ఖడ్గధారి రాజ భృత్యులలో ఏదీ ఎవరు చేసి కో చేయుదురో చేయవలెనో ఎవరు తమ క రవ్యమును ఆచరించని వారో గమనించగలవాడు దేశ రక్ష జాసక్తుడు సురూపుడు తరుణుడు ప్రాంశుడు (పొడగరి) దృఢభక్తుడు సత్కులోద్భవుడు శూరుడు క్లేశ సహుడునయియుండ వలేను; రాజుకడనుండు ధనుర్ధారి శూరుడు బలయుక్తుడు గజాశ్వరథ (తత్వమునందును వానిని నడుపుటయందును) కోవిదుడు సర్వ క్లేశ సహుడు శుచీ (కపటము లేని వాడు) అయియుండవలయును; రాజసారథి నిమి త్తములందు. (ఉత్పా తములు మొదలగువానియందు శకునములందు) ఎరుక గలవాడు హయ శిక్షా విశారదుడు హయాయు ర్వేద తత్వజుడు భూభాగ ములు ఎచ్చట ఎట్టివిగా నున్న వో ఎచ్చట ఏయే ప్రదేశములున్న వో ఎరిగినవాడు రథికుని బలాబలముల నెరిగిన వాడు స్థిరదృష్టి కలవాడు ప్రియంవదుడు శూరుడు యుద్ధ విద్యయందారి తేరినవాడు నయియుండవలయును: సూదము నకు (వంటశాలకు వంటపనులకు) ఆధ్యక్షుడు ఆడంబరపు వేషము ధరించని వాడు (శరీసమున చిత్తమున) శుచి దక్షుడు చికిత్సా విధానముల నెరిగినవాడు సూద పాక శాస్త్రమును దానిని చేయుటను ఎరిగినవాడు అయియుండవలెను. మహా నసమందు (వంటశాలయందు) ఉండు పని వారు సూద పొక శాస్త్రమును దాని ప్రధానమును ఎరిగిన వారు ఇతరులకు (ఆంతర్బహిశ్శత్రువులు మొదలగువారి భేదోపాయములచే) భేదింపనలవికాని వారు గోళ్ళను జుట్టును కత్తిరించుకోని యుండు వారు నయియుండవలెను; ధర్మాధికృతుడు(Judge) శత్రుమిత్రులయందు సముడు ధర్మశాస్త్రము (Law) నందు పండితుడు కులీనుడు బ్రాహ్మణ శ్రేష్టుడునయియుండవలెను; ఇట్టి ద్విజముఖ్యులే అతనికి సహాయులగు ధర్మ సభాసదులుగా నుండవలయును.

లేఖకలక్షణమ్

ధనాధ్యక్షాదిలక్షణమ్

హస్తిశిక్షకాదిలక్షణమ్

రాజునకు అన్ని అధికరణముల(Departments) యందును లేఖకులుండవలయును; లేఖకుడు తలకట్టులు కలవి నిండయినవి సరియగు వరుసలయందుండునని సమపరిమాణము కలవిఅగు అక్షరములు వాయువాడు ఉపాయముల నేరుగుటయందు ఆవగాహనము చేసికొనుటయందు నేర్పరియు సర్వశాస్త్ర విశారదుడును కొలది వాక్యములతోనే వి సృ తార్థమును చెప్పగలవాడు వాక్యాభిప్రాయ తత్వము నెరిగినవాడు దేశ కాల విభాగమును (ఏ కాలమందేది చేయవలెనో మాటాడవలెనో) ఎరిగినవాడు వేషాడంబర ము లేని వాడు (Simple in dress) శ క్తి (బుద్ది స్పురణము) కలవాడు ఆయి యుండవలయును; పురుషుల (ఆయా వ్యక్తుల) స్వభావములందలి భేదమును గురుతింపగలవారు పొడగరులు ధనాశా రహితులు జనులను తమవై పునకు తిప్పుకొనగలవారు ధర్మాధికరణ శాఖయందు నియోగింపబడవలెను; రాజునకు దేవా రికులు (ద్వార పాలురు)ను ఇట్టివారే అయి యుండవలెను; ధనాధ్యక్షుడు లోహములు వస్త్రములు చర్మములు రత్న ములు మొదలగువాని తత్వమును విధానమును (ఆయా వస్తువుల స్వరూప లక్షణములును ఏది ఎట్లున్నదో మంచిదో మంచిది కాదో తెలియుట తత్వమును ఎరుగుట. ఆయా వస్తువులలో ఏది ఏ పనికి వచ్చునో ఎట్లు దేనిని వినియోగించుకొనవచ్చునో ఎరుగుట విధాన జ్ఞానము) ఎరిగినవాడు కొంచేపుది ఏది యో గొప్పది ఏదియా ఎరిగినవాడు వేషాడంబరము లేనివాడు నిర్మలమగు నవ్వు కలవాడు నిపుణుడు ఏమరుపాటులేనివాడు ధనాధ్యక్షుడుగ నుండవలయును: ఆయ ద్వారము (ఆదా యపు సాధనములగు శాఖ)లన్నిటియందును వ్యయ ద్వారముల (శాఖల) యందును ధనాధ్యక్షునితో సములగువారేయుండ వలయును; శల్యము శాలాక్యము కాయ చికిత్స భూత విద్య కౌమార భృత్య ఆగదతంత్రము రసాయన తంత్రము వాజీ కరణ తంత్రము. లేదా-యము బాలము గ్రహము ఊర్ధ్వాంగకము శల్యము దంష్ట్ర-జర-వృషము అను ఎనిమిది వై ద్యొంగముల యందును చీకిత్సా ప్రక్రియయందును నిపుణుడు వంశ పరంపరాక్రమ మున వచ్చినవాడు వేషమున నిరా డంబరుడు ధర్మ మనస్కుడు ఉత్తమ వంశమున పుట్టినవాడు రాజ వై ద్యుడుగా నియోగింపబడవలేను. ఆతడు రాజునకు ప్రాణా చార్యుడు; కావున భూభర్తయగు రాజు ఎల్లప్పుడును ఆతడు చెప్పిన మాటను సాధారణ జనులు పాటించినట్లే పాటించి ఆచరించవలయును; గజ శిక్షా విధానము బాగుగ నేరిగినవాడు క్లేశమును ఓర్చుకొనువాడు వనగజ జాతులను బాగుగ నేరిగినవాడు గజాధ్యక్షుడుగా నుండవలెను; ఇవే గుణములతో కూడినవాడును అందునను ముఖ్యముగా మూల వ్యాధి మొద లగునవి లేక బాగుగ కూర్చుండగలవాడు రాజ గజారోహుడుగ (మావటివాడుగ) నుండవలయును; ఇట్టివాడు సర్వకర్మల యందును ప్రళస్తుడు.

హయశిక్షను హయచికిత్సను తుదముట్టనేరిగిన వాడును స్వాధనుడు (మూలవ్యాధి మొదలగునవి లేక ఎంత సేపయిన బాగుగ కూర్చుండగలవాడు), రాజునకు అళ్వాధ్యక్షుడుగ నుండవలయును; నిరాడంబర వేషుడు శూరుడు మాట నేర్పరి ప్రాజ్ఞుడు- కులీ నుడు సర్వకాలములందును సదా పూనికతో నుండు వాడు దుర్గాధ్యక్షుడుగా నుండవలయును; వాస్తు విద్యను వాస్తు విధాన మును బాగుగ నెరిగినవాడు లఘుహస్తుడు (శీఘ్రముగా పనులు చేయగలవాడు). శ్రమకోర్చు వాడు దూరదర్శియు శూరుడునగువాడు రాజునకు వడ్లంగిగా నుండవలయును; యంత్రములతో విడుచునవి చేతితో విడుచునవి ధనుస్సు నుండి విడుచునవి విడిచి మరల గ్రహించి పట్టుకొనునవి అగు ఆయుధములందు కుశలుడు ఉద్వేగము లేనివాడు రాజునకు అస్త్రాచార్యుడుగ ఉండవలయును; వృద్ధుడు కులీనుడు చక్కని మాటలాడువాడు పితృ పితామహాది వంశ క్రమాగతుడు మనశ్శరీరములందు శుచియగువాడు వినయము మంచి నడువడి) కలవాడు అంతఃపురాధ్యక్షుడుగా నుండవలయును; రాజు ఈ విధముగా (ఈ చేప్పిన వానిలో ప్రధానములగు) ఏడధికారములందును ఏడుమంది రాజ పురుషులను చక్కగా పరీక్షించి పురమందు ఆచరించవలసిన సర్వ కర్మముల నిర్వహణములందును నీయోగించవలేను; వీరుకాక . రాజు ఆయుధాగారాధ్యక్షునిగా ఆయా యాయుధములను అమర్చు విధపు తత్వమును బాగుగ నెరిగినవాడు నిరంతరము మెలకువతో నుండువాడు సర్వకర్మములందును సదా పూనికతో నుండువాడు అగు వానిని నియోగించవలయును; నృపకులోద్వహుడవగు మనూ! రాజునకు గల కార్యములు అపరిమితములు; అవి ఉత్తమములు ఆధమములుననీ మూడు విధములు; వాని తరము నేరిగి రాజు పోటిని వరుసగా ఉతములు మధ్యములు ఆధములునగు పురుషులయందు నిలుపవలయును; నరులు చేయు కర్మల వ్యత్యానము వలన రాజు వ్యననమును - (కీడును) పొందును; వారివారి అధికారమును . దానిని వారు నిర్వహించు తీరును వారిపౌరుషమును పోరాపనుల నిర్వహించుటలో చూపుపూనికను వారి రాజభ క్తిని శాస్త్ర జ్ఞానమును శౌర్యమును కులమును రాజనీతిజ్ఞానమును ఎరిగియే రాజు రాజ పురుషులను నియోగము (ఆయా అధికారములందు నిలుపుట) చేయవలసి యుండును; ఇది చేయుటలో రాజు ఆయా పురుషుల ఆంతర (చిత్తములందలి) విజ్ఞాన (అనుభవ పూర్వక విషయ పరిజ్ఞాన) సారమును త త్వ (విషయ పరిజ్ఞాన) జ్ఞాన సారమును ఎంతటివియో ఎరిగి వానిని ఆధారముగా తీసికొనవలెను.

రాజ్ఞో మంత్రిభిస్సహ మంత్రణక్రమః.

రాజ్ఞో విద్యాగ్రహణవిధిః

రాజు తన ఇష్టము వచ్చినంత మందితో వేరువేరుగా మంత్రణము చేయవచ్చును; కాని మంత్రాలోచన పరుడగు రాజెప్పుడును మంత్రులకు కూడ ఇతర మంత్రులు చెప్పిన మంత్రమును బయలు పరచగూడదు; రాజు ఏ మానవులను నమ్మ రాదు; ఆయా మంత్రులు చెప్పిన మంత్రణముల పై నిశ్చయము మాత్రము తానే వివేచనపరుడై చేయవలెను; ఇతరుల బుద్ధినుండి పుష్టి పొందిననే కాని తాను నిశ్చయము చేసికొనలేడనుట నిజమే; కాని . రాజై నవాడు ఇతరులు చెప్పిన దానిమీద కూడ తన బుద్ధితో నే నిశ్చయము చేసికొనవలెను; వేద శాస్త్రములను బాగుగనేర్చి వాటియందు దృఢపాండితిగల బ్రాహ్మణులను రాజు సేవించవలేను; ఆసచ్చాస్త్రములను చదివిన మూఢులను సేవించరాదు; వారు లోకమునకు అపకారులు; వేద వేత్తలు నిర్మల మనస్కులునగు విపులనే సేవించవలేను; తాను వినయ సంపన్నుడే వారినుండి ఇంకను వినయ (సత్పవర్తన)మును ఎడతెగక శిక్షణ పొందుచుండవలెను; దీనిచే రాజు పృథివి నంతటిని తన వశము చేసికొనగలుగును; చాలమంది రాజులు అవినయము వలన తాము తమ పరివారముతో కూడ భ్రష్టులయిరి; వినయము వలన ధనములను రాజ్యములను పొందిరి.

రాజు వేదత్రయము నందును తదంగ శాస్త్రములందును పండితులగు వారినుండి వేద శాస్త్రాది విద్యలను శాశ్వతము (సార్వకాలికము) అగు దండనీతిని తర్కశాస్త్రమును ఆత్మ విద్యను నేరువవలేను; వాణిజ్యము కళలు మొద లగు వానిని లోకపు నడువడిక నుండి తెలిసికొనవలెను; ఇంద్రియ జయమునకై యోగమును నిరంతరమధ్యసించవలెను; ఏలయన జితేంద్రియుడే ప్రజలను తన అదుపులో ఉంచుకొనగలుగును. ధర్మసాధనకై రాజు బహుదక్షిణలతో కూడ క్రతువులతో దేవతల నారాధించవలయును; విప్రులకు ధనభోగముల నీయవలెను; ఆప్తుల ద్వారమున ఏటేట రాష్ట్రము నందలి ప్రజల నుండి రావలసిన పన్నులను సేకరించుకొనవలెను; స్వాధ్యాయపరుడై ఎప్పుడును వేద శాస్త్రాదుల నధ్యయనము చేయుచు ఉండవలెను. జనులకు తాను తండ్రివలె బంధువువలె నడుచుకొనవలెను; గురుకులము నుండి విద్యముగించి వచ్చిన స్నా తకులగు విప్రుల పూజించ (ఆదరించ)వలెను. ఇది రాజుల కై బ్రహ్మ (ప్రజాపతి) ఏర్పరచిన ఆక్షయ (శాశ్వత) విధానము; అని శాస్త్రమున చెప్పబడు చున్నది; ఈ విధమగు ప్రక్రియలచే సంపాదించిన అక్షయనిధిని దొంగలు కాని శత్రులు కానీ హరించజాలరు; అది తనంతట తాను నశించునదియు కొదు; కావున రాజు ఈ బ్రాహ్మమగు అక్షయ విధానమును పాటించి నడువవలెను; అపుడపుడు రాజు ప్రజల యందలి ఉత్తములు సాధారణులు ఆధములు అను మూడు వర్గములకు చెందిన ప్రజల(లోముఖ్యు)లను తన కడకు పిలిపించుకొని (వారిననువర్తించుచు) ప్రజలను పాలించవలెను.

రాజ్ఞః కృపణాదిరక్షణ విధిః

క్షత్రియ వ్రతధర్మమును జ్ఞప్తియందుంచుకొని యుద్ధము లందువెనుదిరుగ కుండవలెను; సంగ్రామములందు మరల కుండుట ప్రజలను సరిగా పాలించుట బ్రాహ్మణులను సేవించుట ఇవి రాజులకు పరమ నిః శ్రేయస (పర లోకసుఖ) సాధనములు; దీనులు అనాధులు వృద్దులు విధవలు. వీరిని కను పెట్టి చూచుచు పాలించుటతో పాటు వారి యోగక్షేమము లకు జీవనమునకు ఏర్పాటు చేయవలెను; రాజేప్పుడును స్వధర్మము తప్పి నడుచు వారిని దానియందు నిలుపవలెను; ముని ఋష్యాద్యా శ్రమములందలి వారి కై అన్న మునకు వస్త్రమునకు పాత్రలకు ఏర్పాటు చేయవలెను; వారిని సత్కార పూర్వకముగా రాజ్యములోనికి (నగరమునకు) పిలుచుకొనివచ్చి సత్కరించవలెను; వారిని సత్కరించవలెనే కాని లోక సత్కారము పొందుచుండు అట్టి పెద్దలనెన్నడు నవమానించరాదు; వారికి తాను చేయు (పరిపాలన సంబంధి) సర్వ కార్యములను (నేనిది ఇట్లు చేయుచుంటినని) నివేదించవలెను; రాజ్యమును తను తన పరివారాదిక మును కూడ (ఇది యంతయు తమ అధీనమేయని) యత్న పరుడై నివేదించవలెను; దేవతలనువలె వారి నర్చించవలెను; మను సంప ఊయముననుసరించి రాజులు ఋజ్వీ (వంకర లేనిది) వక్రా (వంకరయగునది) అను రెండు ప్రజ్ఞలను (వర్తన విధానము లను ఆలోచనా సరణులను) తెలిసికొనవలెను; కానీ తాను మాత్రము ఋజ్వీ ప్రజ్ఞనే పాటించవలెను; ఇతరులు వక్ర ప్రజ్ఞను తన పై ప్రయోగించుచో దానిని గుర్తించి దాని నెదుర్కొనీ దానికి ప్రతీకారము చేయవలెను; తాను మాత్రము సాత్విక భావము నవలంబించి ఋజ్వీ ప్రజ్ఞనే ఆచరణములోనికి తీసికొనవలెను; తన ఛిద్రము (లోపము )ను ఇతరులకు తెలియనీయక పరచ్చిద్రమును తెలిసికొనుచు తన అవయవములను కప్పుకొనునట్లును తనలో దొరలు లోపములను కూడ కప్పిపుచ్చు కొనుచు (ఇత రులకు బయలుపడనీయక) వాటిని రక్షించుకొనుచు తప్పులను సవరించుకొనుచు)ఉండవలయును; తను నమ్మని వానిని తాను నమ్మరాదు; నమ్మినవానినికూడ మితిమీరి నమ్మరాదు; దానివలన కలుగు భయము (కీడు) వేళ్ళను కూడ నరకును; (సమూలముగా నాశము కలిగించును;) వా స్తవములగు హేతువులతో ఇతరులను తాను నమ్మించవలెను; కొంగవలె (కపట ధ్యానముతో నిశ్చల చిత్తముతో) రాజకీయ విషయములలోచించవలయును; సింహమువలె పరాక్రమింపవలెను; తోడేలువలే దోచవలెను; డేగవలె శత్రువులను పడగొట్టవలెను; ఆడవి పందివలె గట్టి దెబ్బ కొట్టవలెను; నెమిలివలె పలువన్నెల రూపములు (వేషములోకాదు; తన ప్రవర్తనములో) తాల్చవలెను; కుక్కవలె అశ్వమువలే దృఢభక్తితో నుండవలెను; కోకిలవలె తీయగా పలుకవలెను.

రాజ్ఞోఽపరీక్షితాఽన్న భోజనాది నిషేధః.

అపరిచితులను త్వరగ నమ్మక కాకివలే సదాళంకతోనే ఇతరులను చూడవలెను; ముందుగా ఆప్తులతో పరీక్షించక ఆహారమును తినరాదు; వస్త్రాలంకార వుష్పాదికము ప్రయోగించరాదు; జనసమ్మర్గములోనికి పోరాదు; ఎరుగని నీటి తావులకు పోరాదు; అశి క్షితమగు చిన్న వయసు ఏనుగునేక్కరాదు; అట్టి గుర్రమునెక్కరాదు; ఎరుగని స్త్రీని కలియరాదు; దేవతోత్సవములందు నిలువరాదు; రాజు లక్ష్మీ రక్షకుడును శ్రమను లెక్కచేయనివాడును కావలయును; పృథివిని జయించగోరు రాజు తన భృత్యులను సరిగా పోషించుచు సంమానించుచు తనకు సహాయులుగా నుంచుకొన వలయును; *ఆర్హతానుసారము రాజు ఆయా పనులయందు భృత్యులను నియోగించపనియందుంచుకొనవలయును. ధర్మకార్యములందు ధర్మిష్ఠులను యుద్ధ కర్మలందు వీరులను ధనాది విషయములందు అర్థ విషయ నిపుణులను స్త్రీల రక్షణాదికములయందు నవుం నకులను దారుణకృత్యములందు తీక్షలను నియమించవలెను; చిత్త నిర్మలత్వము ఇందరకు అందరకు నుండవలసిన సాధారణ లక్షణము; ధర్మము అర్థము కామము భయము అను నాలుగు *ఉపధల యందు పరీక్షించిన తరువాతనే వారిని భృత్యులనుగా నియమించవలెను; ఆయా కొనుక లను తెచ్చి ఇచ్చుచుండు వనచరులను (అడవిజాతుల వారిని) రాజు అడవికి సంబంధించిన పనులకై కొలువు నందుంచుకొని వారిలో ఎవరే యే స్థానములందు బాగుగ వెదకుచు ఆయా స్థానవిషయములను గమనించి కను పెట్టి చూచుచుందురో ఆట్టి పూనీకగల వారిని ఆ పనులకు అధ్యక్షులనుగా నియమించవలెను; రాజు మొదలగు పనులను సరిగా చేయవలెను; ఏమయినను రాజు తీక్షోపకరణము మునకు పూనరాదు.

(*మత్స్య-214 ఆ; శ్లో 76. ఆసుభృతః - ఆసు – జీవికా- వేతనము అనునర్థముతో వాడినట్లు తోచును:

ధర్మే చార్థేచ కామేచ భ(న)యే చ రవినందన ! రాజా యథార్హంకుర్వీత ఉవధాభిః పరీక్షణమ్.)

(*214 ఆ; 80శ్లో ఉపధాభిః-రాజు తన కొలువునకు తీసికొనదలచిన వారిని వీటితో పరీక్షించవలెను. ఇవి నాలుగు.)

పాపాచరణముతో సాధింపదగు పనులను, సత్పురుషులు ఆచరించరు; కావున రాజులు అట్టివాని నవలంబించ రాదు; రాజులకు తీక్షోపకరణక్రియ తగదు; అనుమాటకు ఇదియే ఆర్థము; ఏ పనియం దేవరికి మిక్కిలి నేర్పుగలదో హరిని, వానియందు పరీక్షించి నియోగించవలేను; జ్ఞాతిసంబద్ధములగు పనులయందు కాక మిగిలిన ప్రతిపని యందును పితృపితామహక్రమాగతులగు భృత్యులను నియమించుట మంచిది; ఏలయన వీరు సదా రాజహితకరులుగా నుందురు; దాయాదులు (రాజ సోదరులును రాజకుటుంబముతో సన్నిహితులగు . ఇతర దాయాదులును) చేయవలసిన కొన్ని పనుల యందు మాత్రము వారే దాయాదులే-బాగుగ ఇమిడి పోవుదురు; వానిని ఇతరులు ఆచరించుట సముచితముగాదు; జనులను తనవైపునకు త్రిప్పుకొని తనలోనికి చేర్చుకొను కోరిక యున్నను పర రాజ గృహము నుండి వచ్చిన వారిని మాత్రము-వారు దుష్టులైనను ఆదుష్టులెనను. ఆశ్రయించరాదు; వారిని విడు చుటకే యత్నించవలయును; వారిలో దుష్టుని గుర్తించవలెను; అట్టివానిని రాజు నమ్మకుండవలెను; అట్టివానికి కూడ రాజు జీవనవృత్తి నేర్పాటు చేసి జనులను తనవైపున నుంచుకోన యత్నించవలెను; అంతేకాదు; దేశాంతరము నుండి వచ్చిన వానిని రాజు మిక్కిలిగ గౌరవించవలెను; వీడు గతిలేక నా దేశమునకు వచ్చినాడు లెమ్మను ఆవమాన దృష్టితో ఆలోచించరాదు; రాజెన్నడును అధిక సంఖ్యలో భృత్యులను నియమించుకొనరాదు; వారిలో బాగుగ పనిచేసిన వారిని బహుమానించకుండ రాదు; ఏలయస రాజునకు శత్రువులు. అగ్ని విషము - ఖడ్గము (మొదలగు ఆయుధములు) సర్పములు - ఇన్ని యును ఒక ఎత్తు; కోపించిన భృత్యులు ఒక ఎత్తు; (కావున వారిని కోపింపజేయరాదు.)

రాజ్ఞశ్చార నియోగక్రమః.

రాజు సర్వదా చారుల ద్వారమున భృత్యుల నడువడిని గుర్తెరిగి వారిలో సద్దుణులను గౌరవించుచు గుణహీను లను శాసించుచు. ఉండవలయును; మనురాజా! రాజులు చారచక్షులు (చారులే కన్నులుగా కలవారు;) అని శాస్త్రమునందు చెప్పబడినది; తన దేశ మునందును పర దేశమునందును జ్ఞానశీలురు విచక్షణులు నిరాడంబర వేషులు క్షేశ సహులునగు చరు లను నియోగించవలయును; వారు జనులకు తెలియబడక సౌమ్యులై పరస్పరము మాత్రము తెలిసియుండవలెను; వణిజు లను మాంత్రికులను జ్యోతిషికులను వైద్యులను సంన్యాసులవలెనుండువారిని (బైరాగులు సాధులు మొదలగువారిని) చారు లుగా నియోగించవలెను; గూఢచరుడొక్కడే చేప్పినది సుభాషితయైనను (విశ్వసనీయ మేయైనను) నమ్మరాదు; ఇరువుర మాటలలోని పర స్పర సంబంధమును వానిలోని ఐకమత్యమును ఎరిగి ఆది నరిపోయినవారి మాటలను నమ్మవలేను; అట్టి వారిరువురును పరస్పర మెరుగనివారై నను సరియే; కావున రాజు ప్రయత్నముతో చారులను గూడులనుగా చూచీ నియోగించ వలెను; ఏమయినను రాజులు చారులే తమ కన్ను లుగా నుండుట రాజునకు క్షేమమూలము; ఈచరులను కూడ రాజు యత్న పూర్వకముగా పరీక్షించవలెను; భృత్యులు కానీ రాజ్యజనులు (ప్రజలు) కాని రాజునందు రక్తులో విరక్తులో వారు సద్దుణులో దుర్గుణు లో తెలియుట మొదలగునవి చారాధీనము కావున వారి విషయమున రాజు ఎచ్చరిక కలిగియుండవలెను; రాజ్య మందలి జనులును భృత్యులును నో విషయమందుఏ హేతువుచే రక్తులగుచున్నారు; ఏ హేతువుచే విరక్తులగుచున్నారు? అను నది రాజులేరుగుచుండవలెను; అనురాగకరమగు పనులు చేయుచుండవలెను; విరక్తులగు జనులతోడి సంబంధమును ప్రయత్న ముతో విడువవలయును; భాస్కర వంశ చంద్రా! మనూ! రాజులకు లక్ష్ములు జనులకు తనయందు గల యనురాగము వలననే సిద్ధించును. కావున నరేంద్ర ముఖ్యులు మానవుల హృదయములలో తనయందనుగాగము కలుగ జేసికోన యత్నించవలేను.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున రాజ ధర్మములందు రాజ సహాయ సంపత్త్యాది కథనమను రెండు వందల పదునాలుగవ అధ్యాయము.