మత్స్య మహా పురాణము

Table of Contents

62 - అనంత తృతీయా వ్రతము

సౌభాగ్యారోగ్య ఫలప్రదమును పరలోకమున. అక్షయఫల మిశ్చనదియు - భుక్తి ముక్తిప్రదమును నగు వ్రత మును నాకు తెలువుమని మనువు అడుగగా మత్స్యకారాయణు డిటులు చెప్పేను. పూర్వము అంధకాసురహంతయగు పర మేశ్వరుని ఉమాదేవి యడుగ కైలాస శిఖరమం దాసీనుడై యున్న ఈశ్వరుడు ధర్మమునకు అనుకూలములును లలిత ములును అగు ప్రసంగముల నడుమ చెప్పిన వ్రతము ఒకటి కలదు. దానిని చేప్పెద; వినుము.

ఈశ్వరుడు ఉమకు ఇటులు చెప్పెను: నరులకు కాని సారులకు కాని అనంత పుణ్యఫలమును ఇచ్చు ఆత్యుతమ  మగు వ్రతము ఒకటి కలదు; అవహితురాలవయి వినుము. భాద్రపద వైశాఖ మాఘ మార్గశిర మాసములలో దేనియందైన శుక్ల తృతీయనాడు తెల్లని ఆవాలతో  (ఆవపిండితో ఆవనూనేతో) స్నానము చేయవలెను. గోరోచనము గోమూతము నల్లని ఆవు గోమయము పెరుగు చందనము - ఇవన్నియు కలిపిన తిలకమును నుదుట ధరించవలయును. ఏలయన ఈ తిలకము సదా లలితా ప్రీతికరమును సౌభాగ్యారోగ్యకరమును. తరువాత పట్టు వస్త్రములు ధరించవలయును. ముత్తైదువలు ఎర్రని వస్త్రములను విధవమైనచో ఎర్రనివి కాని వస్త్రములను కన్యలే నచో తెల్లని వస్త్రములను ధరించవలయును. దేవిని వరుసగా పంచగవ్యముతో కేవలము గోక్షీరములతో తేనెతో పన్నీటితో స్నానము చేయించవలేను. తెల్లని పూపులతో తెల్లని అక్షతలతో తెల్లని పూవులతో పూజించవలయును. నానావిధ ఫలములు జీలక ధనియాలు ఉప్పు బెల్లము పాలు నేయి నివేదించవలయును.

పాదాది పూజా మంత్రములు: 1. వరదాయై నమః పాదౌ పూజయామీ; 2. శియే నమః గుల్ఫౌ పూజయామి 3. అశోకాయై నమః జంఘే పూజయామి; 4. పార్వత్యై నమః జానునీ పూజయామి; 5. మంగళ కారిడ్యై నమః ఊరూ పూజయా మి; 6. వామ దేవ్యై నమః కటిం పూజయామీ; 7. పద్మోదరాయై నమః జఠరం పూజయామి;  8. కామశియె నమః ఉరః పూజయామి; 9. సౌభాగ్యదాయిన్యై నమః కరౌ పూజయామి; 10. హరముఖియే నమః - బాహూ పూజ యామి; 11. దర్పణ వాసిన్యై నమః ముఖం పూజయామి; 12 న్మరదాయై నమః స్మితం పూజయామి; 13. గౌర్యై నమః నాసికాం పూజయామి; 14. అతులాయై నమః నేత్రే పూజయామి; 16. తుష్యై నమః లలాట ఫలకం పూజయామి; 16. కాత్యాయన్యై నమః శిరః పూజయామీ; గౌరికి ధృతికి కాశికి శ్రీకి రంభకు లలితకు వామదేవికి నమస్కారము. అని ఇట్లు పూజించవలెను.

పూజకు ముందే ఆయా దేవతలను కూర్చుండ పెట్టవలసిన విధానమును స్థానములును ఏవి యనిన- మొదట కుంకుమతో పండ్రెండు రేకులును నడుమ దుద్దుకల పద్మము ముగ్గుగా వేయవలెను. దాని పై తూర్పున గౌరిని అపర్ణను. దక్షిణమున భవానిని రుద్రాణిని పడమట సౌమ్యను మదనవాసినిని వాయువ్యమున పాటలను ఉగ్రను- ఉత్తరమున ఉమా సాధ్యా సత్యాశుభా సౌమ్యా మంగళా కుముదా సతీ-దేవులను నడుమ కర్ణిక పై రుద్రుని స్థాపించవలయును. అట్లు నిలుపు నపుడు వారి పై కుసుమములను అక్షతలను ఉంచి (ఆవాహయామి స్థాపయామి పూజయామి అనుచు) నమస్కరించుచుండ వలయును.

ఇట్లు మొదట ఆవాహనము తరువాత పైన చెప్పినట్లు పూజనము నివేదనము ఐన తరువాత మంగళ వాద్యములు మ్రోగుచుండ ముత్తైదువలను రావించి ఎర్రని వస్త్రములతో ఎర్రని పూలతో ఎర్రని గంధ ద్రవ్యములతో వారిని పూజించ వలేను. సిందూర కుంకుమ కుసుమ చూర్ణములతో స్నానము చేయించవలయునని శాస్త్రమున చెప్పబడియున్నది. కావున వారి శిరస్సుపై సిందూరమును కుంకుమమును వేయవలయును. తనకు మంత్రోపదేశము చేసిన గురునికూడ యత్న పూర్వకముగా పూజించవలయును. గురువునకు అర్చన చేసిన సమ స క్రియలు సఫలము లగును.

భాద్రపదాదిగా పండ్రెండు మాసములందును పూజకు పుష్పములు ఉపవాసమునాడు ఆహారముగా తీసికొన వలసిన ద్రవ్యము దాన సమయమున చెప్పు మంత్రము వేరు వేరుగా నుండును. ఎట్లన.

మాసము:           పూజా పుష్పములు:             ఆహారము:            మంత్రము :

భాద్రపదము        నల్ల కలువలు                 గోమూత్రము   కుముదా ప్రీయతామ్

ఆశ్వయుజము          మంకెన                    గోమయము    విమలా ప్రీయతామ్

కార్తికము         నూరు రేకుల తామర            ఆవు పాలు     నందో ప్రీయతామ్

మార్గశిరము            జాజి                         ఆవు పెరుగు     భవానీ ప్రీయతామ్

పుష్యము              పచ్చ గోరంట                  ఆవు నేయి     వసుధా ప్రీయతామ్

మాఖము      మొల్ల లేదా కుంకుమ పూవులు దర్భలు వేసిన నీరు శివా ప్రియతామ్

ఫాల్గునము   పేంకణము లేదా జాజీ        మారేడు దళములు    లలితా ప్రియతామ్

చైత్రము      మల్లిక లేదా ఆశోకము          తెల్ల జిల్లేడు పూలు    కమలా ప్రీయతామ్

వైశాఖము      సంపెగ -పాటల            యవలు వేసిన నీరు         గౌరీ ప్రీయతామ్

 జ్యేష్ఠము    కమలము- మందారము   ఆవు కొమ్ము లో పోసి        సతీ ప్రియతామ్

                                                         ఉంచిన- నీరు

ఆషాఢము జపాకుసుమ-పద్మములు      పంచగవ్యము              రంభా ప్రియతామ్

శ్రావణము  కడిమి- మాలతీ                  బిల్వఫలము                 పార్వతీ ప్రియతామ్

ప్రతిమాస శుక్లపక్ష తృతీయాతిథినాడును బ్రాహ్మణ దంపతులను భక్తితో వస్త్ర పుష్ప గంధములతో అర్చించ వలెను. పురుషులకు పచ్చని వస్త్రము లీయవలెను. (పురుషులకు దోవతి ఉ తరీయము కాని రెండు దోవతులను కాని లకు చీరను రవిక గుడ్డను-ఇ పైవరి కై నను రెండు వస్త్రము లీయవలెను.) స్త్రీలకు బొబ్బరలు జాజికాయ లవణము చెరకుగడ బెల్లమును పురుషులకు ఈ పదార్థములతోపాటు బంగారు కలువపూవును కూడ ఈయవలేను. ఇవి ఇచ్చు నపుడును శయనము మొదలగునవి ఇచ్చునపుడును దేవిని “దేవీ! పర మేశ్వరుడు ఎన్నడును నిన్ను విడువక సుఖింప జేయుచున్న ప్లే నీవును నన్ను సంసార సాగరమునుండి తరింపజేసి సుఖింపజేయుము.” అని ప్రార్థించవలేను.

వ్రతము ఇట్లు పండ్రెండు మాసములు జరిగి ముగిసిన తరువాత మంచము పరపు మొదలయినవి బంగారు కమలముతో కూడ విప్ర దంపతులకు ఈయవలెను. ఇదిగాక ప్రతి మాసము నను విప్ర దంపతులను యథాశక్తిగా ఇరువది. నాలుగు మందిని కాని పండ్రెండు మందిని కాని ఎనిమిది మందిని కానీ ఆరు మందిని కాని అర్చించవలెను. (వారికి పుష్పగంధ తాంబూల దక్షిణాదిక ము నీయవలెను.) ఇట్లు అర్చించునపుడు మొదట తన గురుని పిమ్మట మిగిలినవాని ఆర్చించవలెను.

దేవీ! ఈ చెప్పిన అనంత తృతీయావ్రతము సదా అనంతఫలప్రదము సర్వపాపహరము; సౌభాగ్యారోగ్యవృద్ధి కరము. దీనిని స్త్రీలు కాని పురుషులు కాని ఎవరై నను చేయవచ్చును. కాని తనకు శ క్తి యున్నంతలో ధనమున లోభము చూపరాదు. చూపినచో అధః పతితు లగుదురు.

ఈ వ్రతమును చేయుట శ్రీ గర్బిణి. రోగిణి కుమారియైనను చేయవచ్చును. పగలే కాదు; రాత్రి (ప్రదోషకాల మున-రాత్రి ఎక్కువ గడువకుండ) చేయవచ్చును. ప్రసవించుట మొదలయిన కారణములచే అశుచిత్వము వచ్చినపుడు శుద్ధి అయిన తరువాత చేయవలెను.

అనంత ఫల పదమగు ఈ అనంతతృతీయా వతమును ఆచరించినవాడు కల్వకోటి శతములపాటు (పూర్తిగా) శివలోకమున సుఖించును. ధనము లేనివాడు మూడు సంవత్సరములు మాత్రమయిన ఆయా మాస శుక్ల తృతీయనా డుపవాసముండి పూవులతో మంత్రములతో యథాశక్తిగ దొరకిన ద్రవ్య నివేదనముతో ఈ వ్రతమును జరిపినచో నమగ్రఫలమును పొందును. దీనిని కన్య కాని విధవకాని చేసినను గౌరీకృపచే వ్రతము ఫలించును. 

దీనిని చదివినను వినినను ఉత్తమ జ్ఞానము శివలోక ప్రాప్తి అచట కిన్నరాది దేవగణములచే  పూజలు లభించును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదాంతర్గత పార్వతీశ్వర సంవాదమున అనంత తృతీయావ్రతమను ఆరువది రెండవ అధ్యాయము.