మత్స్య మహా పురాణము

Table of Contents

184 - ఆవిముక్త మాహాత్మ్యసమాప్తి॥

 (గమనిక : 181వ-188వ-184వ అధ్యాయములందు స్కందుడు ఋషులకు ఆవిముక్త క్షేత్ర మాహాత్మ్యమును చెప్పినపోడుగా పురాణమున కనబడుచున్నది॥ స్కందుడనగా శివుని పుత్రుడగు కుమారస్వామియని ప్రసిద్దముగా నున్నది॥ కాని 181వ అధ్యాయారంభమందును ఈ 184వ అధ్యాయారంభమందును ఈ స్కందునకు గల గుణముల తెలుపు విశేషణములను బట్టి ఈ స్కందుడు కుమారస్వామి కాడే మోయని తలచవలసి వచ్చుచున్నది॥ ఛాందోగ్యోపని షత్తునందలి సప్తమాధ్యాయంత వచనమును బట్టి సనత్కుమారుడను బ్రహ్మమానస పుత్తునకు కూడ నందుడను పేరు వైదిక వాజ్మయమున కలదని తెలియుచున్నది॥ ఈ స్కందుడును ఆ సనకనందన సనత్సుజాత సనత్కుమారలలోనిసనత్కుమారుడేఅయియుండునని గ్రహించవలయును -అనువాదకుడు)

మహాపుణ్య ప్రదమగు అవిముక్త క్షేత్ర ము నందు స్కందుని వలన ఆ మేత మాహ్మ్యామును వినుచున్న వారును ప్రియదర్శనులు (ప్రీతి కలిగించు శుభరూపము కలవారు)ను నగు ఆస్తికులెల్లరును హర్షము నే గద్దద కంఠులయిరి; మహా శ్చర్యమందీరి; మనమునందలి హర్షముతో వారు బ్రహ్మవేత్తలలో ఉత్తముడగు ఆ స్కందునితో ఇట్లనీరి: సేపు బ్రహ్మ దేవుని పుత్రుడవు॥ బ్రహ్మణ్యుడవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రహ్మిష్ఠుడవు బ్రహ్మవిదుడవు (పర) బ్రహ్మ రూపుడవు బ్రహ్మ (బ్రహ్మత త్వవేత్త)లలో ఇంద్రు! నంతటివాడ పు; బ్రహ్మలోక కర్తవు బ్రహ్మ విదుడవగుటకే బ్రహ్మచర్య వ్రత మనుష్ఠించిన (చు) వాడవు; బ్రహ్మ (వేద)మునకును ఆదిభూతుడవు; బ్రహ్మ (వేద)ము నందు వత్సలుడవు (ప్రీతి కల వాడవు;) బ్రహ్మ దేవునితో సమముగా సృష్టి చేయగలవాడవు; బ్రహ్మ తో సముడ పు; ఇట్టి నీకు నమస్కారము; పరమము పావనము గొప్పది యగు దీనిని విని మా ఆత్మ (మనస్సు) భావితము (ఉత్తమ సంస్కారవంతము) ఆయినది: ఏది ఎరిగినచో అమృతత్వము సిద్ధించునో అట్టి పర మత త్వమేరిగితిమి; నీకు శుభమగుగాక ! మేమిపుడు శంకరుని నివాస మగు భూర్లోకమునకు పోవుదుము; అచ్చటి సర్వభూతములకు ఆత్మరూపుడు (అంతర్యామి) ఆగు ప్రభువు స్థాణురూపుడై సర్వలోక హితార్థము ఉగ్రమగు తపస్సునందు నిలిచి తన ఆత్మను యోగముతో సంయోజనపరచి రౌద్ర త త్వ ప్రధానమగు దేహము దాల్చి పరమాత్మరూపుడతడు తనతో సమాన గుణములు కలవారగు గుహ్యకులును బ్రహ్మాది దేవతలును సిద్దులును పరమ ఋషులును తను పరివారించి యుండగా ఉన్నాడు గదా! ప్రమథ గణేశ్వరా! మేమచటి కేగి వచ్చిన తరువాత పరమభక్తితో క్షేత్ర మాహాత్మ్యము నెరిగిన మేమందర మును సునిశ్చయముతో నియతముగా ఆవి ముక్తమునందే వసింపగోరుచున్నాము; అని స్కందునితో ఋషులు పలికిరి॥

(అని ఇంత చెప్పి పర మేశ్వరుడు పార్వతితో ఇట్లనెను:) దేవీ! అవిము క్రమందు ఈ (చెప్పబోవు విధములగు గుణములు గలవారు; వారు ధర్మశీలురు; క్రోధమును మమకారమును ఇంద్రియములను జయించినవారు; ధ్యానయోగ పరులు; యోగ సిద్ధిని ఆవ్యయ (నాశరహిత) స్థానమును పొందువారు; యోగజ్ఞులు యోగ సిద్దులు; వారు భ క్తియుక్తులయి భోగయోగ మోక్షప్రదుడును విభుడును గుహ్య రహస్య) రూపుడును సనాతనుడును అగు మహాదేవుని ఉపాసించుచుందురు; వారు అవిముక్తమందుండి మ హేశ్వరుని వలన యోగమెరిగి సాధన చేసి పరబ్రహ్మమునందు చిత్తలయమంది తుదకు శివ సాయుజ్యమందుదురు; ఈ ఆవిముక్తము పరము (ఉత్తమ) క్షేత్రమని పండితులందురు; శివుని మాయచే వి మోహితులగు ఆప్రబుద్ధులు (అవివేకులు) దీనిని చూడ సరిగ తెలియ) జాలరు; శివుని చే అభ్యనుజ్ఞనంది అతనియందు శ్రద్ధ కలిగి ఆతనిని పరమ గమ్యముగా నెంచీ అవిముక్తము నొనర్చి శాంతులయి యోగ (సిద్ధిచే గలుగు ఉత్తమ) గతిని పొందుదురు

ఇది లోకమందలి శ్మశానములన్నింటిలోను గుహ్యమగు (రహస్య తత్త్వముగల స్థానము;) అని పెద్దలందురు; ఏలయన భూలోక వాసులగు మానవులకు యోగము లేనిదే ముక్తి లభించదు; కాని అవిముక్త వాసులకు మా తము యోగ మోక్షములు రెండును॥ సిద్దించును; ఈ జన్మమందే వారికి ఉత్తమగతి లభించును; దేవీ! ఏక జన్మముతోనే అనుత్తమమగు మోక్షమం దుదురనున దొక్కటియే పర మేశ్వరీ! ఈ క్షేత్ర మహాప్రభావము;

(పూర్వము కారణాంతరమున అవిము క్తము పై కోపించి దానిని శపింపబూనిన వ్యాసుడును దానిని విడువజాలక పోయేను॥ ఆ కథ తెలి పేద వినుము॥) అమిత తేజస్కుడగు ప్యాసుడోకప్పుడిందు వసించుచుండగా అతడు తన శ క్తి యున్నంతవరకు సంచరించియు ఎటను భిక్ష పొందజాలక పోయేను॥ ఆతని తనువున క్షుధా క్లేశమధికమయ్యేను; ఆతడు క్రుద్దుడయ్యేను; నేను దినదిన క్రమమున ఇట ఆరుమాసములుంటినీ; ఇది ఎట్లు? ఈ నగరము॥ నాకు భీక్ష నీయకున్నది; ఈ దోషముతో ఇది హతమైనది; (చెడినది;) ఇచటి బ్రాహ్మణుడో క్షత్రియుడో బ్రాహ్మణ విధవ ఎవ రేకాని నాకు నంస్కరించినదో సంస్కరించనిదో ఏదోయొక పరిపక్వాన్న మీయకున్నా రే! ఏమీ బ్రాహ్మణులు॥ఏమి జనులు వీరు? ఆశ్చర్య కరముగ నున్న దే: వీరికీని ఈ తీర్థమునకును ఈ నగరమునకును శాపము పెట్టుదును; దానితో తీర్థము ఆతీర్థమగుగాక ! అవిముక్తమునందు ఎంత పుణ్యకర్ముల కై నను నాప ప్రభావమున వరుసగా మూడుతరములపోటు విద్య కొని ధనముకాని సఖ్యము (మోక్షము కాని కలుగకుండుగాక! ఇట్లు శపించి ఇచటివారికి కలుగు సిద్దియందు విఘ్నము కలిగింతును; ఆని అతడు శపింప సంకల్పించెను॥ ఇది ఎరిగి దేవదేవుడగు ఉమాపతి భయమందుచు తన ప్రియదేవి యగు గౌరితో ఇట్లనెను: దేవీ! నామాట వినుము; ఎట్టి స్థితి వచ్చినదో చూడుము; కృష్ణ ద్వైపాయనుడు కోపించి శపింపబూనినాడు: అనగా దేవి “దేవా: ఎందుచే ఆతడు క్రుద్దుడె శపించుచున్నాడు? ఆతనికి భగవానుడవగు నీవేమి కీడు చేసితివి? అనగా దేవదేవుడిట్లు పలికెను:

ప్రియా! వరాననా! ఇతడు మౌనియై ధ్యానయుక్తుడై పండ్రెం డేసి సంవత్సరములోకోక్క కాలావధిగా ఏర్పరచుకొని బహువర్షములపాటు మహా తపమాచరించెను॥ అది ముగించిన తరువాత అతడు ఆకలివేసి భిక్షాటనము నకు రోగా అతనికి ఇట ఎవ్వరును ఆరముద్దయెనను భిక్ష వేయలేదు; ఈ భగవానుడగు మునికి ఆరు మాసములపాటు గడచినది; అందుచే క్రోధ పరీత మనస్కుడై ఇపుడు శాపము ఈయనున్నాడు॥ ఈతడు శపించులోపుగనే కోప నివారణమునకు ఉపొయ మాలోచించవలయును; ప్రియా! ఇతడు కృష్ణద్వైపాయన వ్యాసుడన సాక్షాత్ నౌరాయణుడే అని ఎరుగుము; సాక్షాత్పితామహుడే యయినను ఇతని శాపమునకు ఏల భయపడకుండును? ఇతడు అదే వతమును దైవతమునుగా దైవతమును అదైవతముగా చేయగలవాడు; వరాననా? మనము మానవులుగా ఇచట వసించు గృహస్థులుగా అయి ఇతనికి తృప్తి కలిగించు భిక్ష పెట్టుదము; అనీ శంభుడ నిన వెంటనే దేవి మానుషీరూపము దాల్చి అతనికి దర్శన మిచ్చెను॥ సత్తమా! భగవన్! మహామునీ! ఇంతవర కెన్నడు మా ఇంటికి రాక పోతిరి; రారండు; వెంటనే వచ్చి భిక్ష గ్రహించుడు; అనెను; ఆది విని ప్రేతమనస్కుడై అతడు భిక్ష అందుకొనవచ్చెను; ఆమె వ్యాసునకు షడ్రసయుక్తమయి అమృతోపమ మగు భీక్ష ఇచ్చెను; అంతట ఆ ఋషియు అదివరకెన్నడును ఎరుగని రుచిగల ఆ భిక్ష భుజించెను; అతడు హరమందిన మనస్సుతో ఆ వర దులగు దేవదేవులకు మనస్సునందే నమస్కరించి కమల ప నేత్రుడగు ఆ వ్యాసుడు ఇట్లనెను:

ఈ దేవుడును ఈ దేవియు గంగానదియు మృష్టాన్న మును శుభగతియు లభించు ఈ వారాణసియందు నీవా సము ఓ విశాలాక్షీ! ఎవరికి ఇష్టము కాదు! అని వలికి వ్యాసుడు ఆ నగరిని పరికించి చూచుచు తన హృదయానంద కారకమగు భీక్షను గూర్చి యాలోచించుచుండగా అతనికి ఎట్టఎదుట మహాదేవుడును శుభయగు గిరిజాదేవియు సాక్షాత్క రించిరి; ఇంటి ముంగిట నున్న వ్యాసునితో దేవదేవు డిట్లనెను: మహామునీ! నీవు కోపీవి; ఈ క్షేత్రమున నీవు వసింప దగదు; అని ఆశ్చర్యపడి ఆతడు మహాదేవునితో ఇట్లనెను: నా కిందు ఆష్టమీ చతుర్దశులందు ప్రవేశ మీయ వేడుచున్నాను॥ అన నరేయని అనుమతించి మహాదేవు డటనే యంతర్గాన మందెను॥ ఆ ఇల్లుగాని ఆ దేవుడు గానీ ఆ దేవి కాని ఏదియు ఎచ్చట నుండెనో కనబడకుండ అదృశ్యమయ్యెను॥

భద్రా! దేవీ: ఇట్లు త్రైలోక్య విఖ్యాతుడును మహాతపస్కుడును నగు వ్యాసుడు ఈ క్షేత్రగుణముల నెరిగి దాని సమీపమందే యుండెను॥ ఇట్లు ఆచట వ్యాసుడుండుటనుబట్టియే ఈ క్షేత్రపాత్ర స్వమును పండితులు నిర్ణయించినారు; ఈ అవిముక్త క్షేత్రగుణముల నన్నిటిని చెప్పగలవాడెవ్వడు? దేవ బ్రాహ్మణద్వేషులు దేవభక్తిని నటించువారు వెక్కిరించు వారు బ్రహ్మఘ్నులు కృతఘ్నులు వంచకులు జనద్వేషులు గురుద్వేషులు తీర్థ క్షేత్రముల నిందించువారు అపవిత్ర మొనరించు వారు పాపాసక్తులు కుత్సితులు దీనియందు ప్రవేశించరాదని వసించరాదనీ దండ నాయకుడు కాపుదలగా ఉంచబడినాడు; కావున యథోచితమంత్రముల నెరిగి పోనీతో ఈ దండనాయకోత్తముని గంధపుష్పదీప ధూపొదికము తో పూజించి నమస్కరించీ నర్వవర్ణములవారును సర్వవిధసరీసృపము లును ఆవరించియుండు ఈ క్షేత్రమున ప్రవేశించి వసించువారు ఈశ్వరాను గహము నంది గణేశ్వరులు అందు గతినందిరి॥ నానారూపధరులును దివ్యులును నానా వేష ధరులునునయి గణాధీనాధరూపులయిరి; సర్వదేవతలుకూడ ఆవిముక్తమందు పరమేశ్వరునియందు శ్రద్ధకలిగి॥ అతనినే పరమగతిగా నెంచి ఏగతినందగోరుదురో ఆట్టి పరమాక్షయ స్థానమునందిరి॥

ఈ ఆవిముక్తపురము పరమ పదము; దేవస్థానమగు స్వర్గముకంటే విశిష్టతరమయినది; బ్రహ్మపురముకంటె పైగా నున్నది; ఆంతకంటే గొప్పది; ఈశ్వరుడు తన తపోబలముచే దీనిని నిర్మించేను బ్రహ్మలోక స్వర్గలోకములును దీనితో సమములుకావు; ఇది మనోరమము; కోరినట్లు పోగలది; ఏ బాధలును లేనిది; సకల తేజస్సులను తపశ్శక్తులను మించిన యోగశ క్తి కలది; ఈస్థానము నధిష్టించి దేవదేవుడు విరాజిల్లుచున్నాడు; తపస్పులచే వ్రతములచే నియమములచే సర్వతీర్థాభి షేక (స్నాన) ములచే సర్వదానములచే లభించు ఫలములును సర్వయజ్ఞ ఫలములను ఆవిముక్త క్షేత్రవాసము చేతనే లభించును; తెలిసికొని తెలియక కాని ఇదివరకు చేసినది ఇప్పుడు చేయుచున్న దియగు పాపమంతయును ఈ క్షేత్ర దర్శనమున నశించును; శాంతులు దాంతులునగు మునులు తపస్సులు చేసి సంపాదించు ధర్మముచే కలుగుఫలమీదట జితేంద్రియుడై వసించుట చేతనే కలుగును॥

ఆవిముక్తమందుండి లింగము నర్చించు నరుడు నూరుకోట్ల కల్పముల తరువాత కూడ మరల జన్మించడు; రుద్రసంనిధియందు ఆమరుడు నక్షయుడునై విహరించును; ఈ క్షేత్రము సర్వతీర్ణోపనిషద్ రహస్య) రూపమయినది; ఇది నిస్సంశయము; ఇచట మహాదేవుని అర్చించువారును స్తుతించు వారును సర్వపాపముక్షులు జరామరణరహితులై యుందురు; సర్వకామఫల ప్రదములగు యజ్ఞములు కూడ పునరావృత్తి ప్రదములు; కాని అవిముక్తమున మృతినందు వారికి మాత్రము పునరావృత్తి లేదు; గ్రహనక్షత్ర తారాదిక మయిన తమ కాలము వచ్చినపుడు పతన మందవచ్చును; అవిముక్తమున మృతి నందినవారికి పతనము లేదు; వారువందల-వేల-కోట్లసంవత్సరముల తరువాత నై న పునర్జన్మ వృత్తినందరు; ఘోర సంసారసాగరమందు పరిభ్రమించువారు కూడ కాలవశమున ఆవిము క్షమునకు వచ్చి ఆట వసించి మృతినందినచో వరమ గతీనందుదురు; ఈ కలియుగము ఘోరమయినది హాహాకార జనక ము; చైతన్య నాశకము అని ఎరిగి ఆవిము క్షమునకు వచ్చి ఆటవిడువక నివసించువారు కృతార్దులగుదురు; దీనియందు ప్రవేశించియు ఇట వసీంపక విడిచి పోవు వానినీ చూచి సకల భూతములును చప్పట్లు చరచుచు నవ్వును; కామ క్రోధ లోభ మోహ గ్రస్తులగు మానవులు మాత్రము ఇటకు వచ్చియు దండనాయకునకు భయపడి బయటకుపోవుదురు; జపధ్యానాదికములు లేక జ్ఞానరహితచిత్తులగు వారికి తామసులకు ఈ వారాణసి పరమగతి యగును; తీర్థములందు సార భూతమగునవి ఐదు! 1॥ విశ్వేశుడు 2॥ దశాశ్వమేధము 3॥ లోలార్కుడు 4॥ బిందుమాధవుడను విష్ణువు; 5॥ మణికర్ణిక; ఈ ఐదుతీర్థములతో కూడి ఏర్పడినదియే అవిముక్త క్షేత్రము అని పెద్దలు వర్ణించుచున్నారు; ఇదీయంతయు ఆవిముక్త మునుగూర్చి మహాదేవుడు దేవికి చెప్పినది; ద్విజులారా! ఇది యంతయు నేను మీకు తెలిపితిని॥

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మహా దేవ దేవీ సంవాదమున ఆవిముక్త క్షేత్ర మాహాత్మ్య కథనమను నూట ఎనుబది యైదవ యధ్యాయము॥