మత్స్య మహా పురాణము

Table of Contents

38 - యయాత్యష్టక సంవాదము

యయాతి: “నేను యయాతి అను వాడను. నహుషుని పుత్రుడను. పూరుని తండ్రిని. సర్వభూతములను అవమానించినందున పుణ్యము తరిగి పడద్రోయబడి సుర సిద్ధ ఋషి లోకమునుండి జారినవాడ నగుచు పడుచున్నాను. వయస్సు చేత మీకంటే పూర్వుడను కావున మీకు నమస్కరింపకున్నా ను. ద్విజులలో (బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో) విద్య చేగాని తపస్సు చేగాని జన్మతేగాని వృద్ధుడగువాడు పూజ్యుడు. అష్టకుడు: “రాజా! “నేను వయస్సుచే చాల పెద్దవాడను.' అని నినుగూర్చి చెప్పితివి. ఏదోయొక విధముగా (మాకంటే) అభ్యధికుడవే. ఎవడు తాను . ద్వాంసుడును వయస్సు చేతను పెద్దవాడును నై యుండునో అతడు ద్విజులలో తప్పక పూజ్యు డే.” యయాతి: “కర్మములలో (ఇతరులకు) ప్రతి కూలమయి నది పాపము అనబడును. దానిననుసరించువారికి పాపలోక మే గమ్యస్థానము. సత్పురుషులు అసత్పురుషులు అనుసరించేడు పాపకర్మమును అనువర్తించరు. వీరికి సత్పురుషులు అనుకూలురై నట్లు అసత్పురుషులు కారు. నాకు విస్తారమగు ధనము ఉన్నది. అది గొప్పది కూడను. యత్నము చేసినచో, దానిని పొందక పోవుదునా? అని మనస్సున నిశ్చయము కలిగి ఆత్మ హితమునకై అభినివేశముతో యత్నించువాడు జీవుని తత్వమును అనుభవ సహితముగా తెలిసికొనగలడు. జీవలోకము నందలి జీవులు నానా రూపములలో నున్నారు. వీరందరును దేవునకు అధీనులు. తమతమ యత్నములందును ఆలోచనము లందును అస్వతంత్రులు. బుద్దిమంతుడగువాడు అదృష్టము బలవత్తరమయినదని ఎరుగవలయును. తనకు ఆ పియములగు ఆయా అనుభవములు ప్రాప్తించినపుడు దుఃఖమునొందరాదు. జీవులు సుఖమును కాని దుఃఖమును కాని దైవమునకు అధీనులై పొందుదురే కాని తమ శ క్తితో (స్వతంత్రతతో) కాదు. కావున దైవము బలవత్తరమని గురుతెరిగి ఎప్పుడును దుఃఖమునుగాని హర్షమునుగాని పొందరాదు. దుఃఖము ప్రాప్తించినచో మోహముగాని సుఖము ప్రాప్తించినపుడు హర్షమును కాని పొందక విచార శీలుడై రెంటియందును సమభావముతో నుండవలయును. దైవము బలవత్తర మని ఎరిగి ఎట్టి స్థితియందును మనస్సున బాధనొందకుండవలయును. అష్టకా! నేను మాత్రము భయము ప్రాప్తించినను మోహము పొందను. ఏ సమయమందును నామనస్సునకు ఏమాత్రము ను సంతాపము ఉండదు. సృష్టికర్త లోకమునందు ఎట్లు చేయునో నేను ఆట్టే యగుదునని నేను తలంతును. స్వేదజములు జరాయుజములు అండజములు ఉద్భిజములు సరీసృపములు (ప్రా కేడి ప్రాణులు) క్రిములు మత్స్య ములు మొదలగు ప్రాణులు కాని శిలలు తృణములు రాష్ట్రములు ఇట్టివి ఏవి అయినను తమతమ అదృష్టమును అనుభవించుట ముగియగనే తమతమ స్వాభావిక స్థితిని పొందును. సుఖదుఃఖములు రెండును. అనిత్యము లేయని నాకు తెలియును. ఇట్టి నేను ఏ హేతువుచే సంతోషమును పొందవలసియున్న ది? జీవునకు ఏది చేసిన తరువాతను ఏది చేయుచున్న ప్పుడును ఈ సంతాపము కలుగకుండును? (ఏది చేసిన తరువాతగాని ఏది చేయు చున్నప్పుడు గాని ప్రతిపనివలన కలుగు ఫలముకూడ సుఖదుఃఖ సంమి శ్రీత మే కావున ఏది చేయు వానికిని దుఃఖము కలుగుట తప్పదు.) అందుచే నేను ఏమియు పొరపడక (అన్ని సందర్బము లందును) సంతాపమును పొందక యుందును.

ఇట్లు చెప్పుచు పోవుచున్న యయాతి రాజును అష్ట కుడు మరల అడిగేను: (యయాతి అష్టకునకు మాతామహుడు కావున ఏ విషయమునైన అడుగదగిన చనవు తనకు గలదు. అతడు సర్వ విషయములను ఎ-గియుండు బేకాక సర్వ సద్గుణములును గలవాడు. కావున ఏ విషయములనై నను విసుగు లేకుండా చెప్పగలడు.) ఆష్టకు డిట్లడిగేను: “రాజేంద్రా! యయాతి రాజా! నీవు క్షేత్ర. క్షేత్రజ్ఞత త్వమును ఎరిగినవాడువలె ధర్మమును చెప్పుచున్నావు. ఇట్టి నీవు స్వర్గలోక ము నందు ఎచ్చటనేచ్చట నుంటివో ఎట్లు ఉంటివో ఏయే ప్రధాన లోకముల ననుభ వించితివో ఎంత కాలము అనుభవించితివో ఎట్లనుభవించితివో ఈ ప్రతియొక యంశ మును వాస్తవ రూపమున నాకు తెలుపుము.” యయాతి: “నేను భూలోకము నందు ఉన్నంతవరకును సార్వభౌముడనగు రాజుగా నుంటిని దేహత్యాగానంతరము ‘మహత్' జనులు నివసించెడి లోక ములందు సంచరింపసాగితిని. అచ్చట సహస్రవరము లుంటిని. తరువాత అంతకం పెను పైలోకములకు పోయితిని. తరువాత అచ్చటీ నుండి ఇంద్రునీనగరికి పోయినాను. అది రమ్యమయినది. అదీ వేయి వాకిండ్లు గలది. నూరు యోజనముల పరిధి కలది. దానియందు సహస్ర సంవత్సరము లుంటిని. తరువాత దానికంటే పెలోకములకు వెళ్లి తిని. తరువాత లోక రక్షకుడగు ప్రజాపతి లోకమునకు వెళ్లి తిని. అది దివ్యము. ఎన్నటికిని చెడ నిది. దానిని చేరుట సుకరము కూడ కాదు. అచ్చటను నేను సహసవరములుంటిని. తరువాత దానికంటే పెలోకమునకు వెళ్లి తిని. ఇట్లు ఏయే దేవుని లోక మున కై నను (నా పుణ్యబలము చేస్తే దానిని జయించి వెళ్లి తిని. కనుకనే పోటియందు నేను నా ఇచ్చ ననుసరించి నివసించితిని. లో కేశ్వరుల కాంతితో ప్రభావముతో తుల్యములగుద్యుతియు ప్రభావమును కలిగి అచ్చట నుండెడివాడను. సమస్త దేవత లును నన్న చ్చట సంపూజించు సర్వోపచారములతో ఆదరించు చుండెడివారు. అట్లు నేను నందనవనమునందు కామ రూపుడనై అయుతశత సంవత్సరములు (1000x11/0 -1000000) ఉంటిని. అచ్చట మనోహరములగు రూపములు కలవియు పుష్పించినవీయు అగు పుణ్య సుగంధములను (సుగంధవంతములగు మనోహర పుష్పములను) చూచుచు అప్సర సలతో కూడి సంచరించెడి వాడను. ఇట్లు దేవభోగములయందు ఆసక్తుడనై నేనచటనుండగా అవధి లేనంత అధిక కాలము గడచెను. అంతలో భయంకర రూపుడగు దేవదూత యొకడు వచ్చి పుతస్వరముతో ధ్వంస[3]' (జారిపడుము!) అని మూడు మారులు బిగ్గరగా ననేను. రాజసింహా! నాకు ఇంత మాత్రమే తెలియును. వెంటనే నేను క్షీణపుణ్యుడనై నందనము నుండి జారిపడితిని. ఇంతేకాక అంతరిక్షమందు నాస్థితికై శోకించు దేవతల దయాపూర్ల మేన హక్కులు నొకిట్లు వినబడేను: “ఆయ్యో! ఎంత కష్టము! ఇడుగో! ఈ యయాతి పుణ్యకర్మములు ఆచరించి పుణ్యమును సంపాదించినవాడు. పుణ్య కరమగు కీర్తికలవాడు. ఇట్టివాడు క్షీణపుణ్యుడై క్రింద పడుచున్నాడే!" ఏమైనను నేనచ్చటినుండి పడద్రోయబడితిని. క్రిందకు పడుచునేయుంటిని. కనుక సత్ జనుల నడుమ నేను పడవలెనని దీవించి పలుకుడని నేను వారిని వేడితిని. వారును మీయజ్ఞ భూమిని పేర్కొనిరి. నాకు వెంటనే ఇది కనబడినది. త్వరితముగా ఇటకు చేరితిని; ఎట్లన హవిర్గంధములే మీయజ్ఞ భూమిని నాకు చూపినవి. యజ్ఞ ధూమపు కొనను దాని సుగంధమును అందుకోని ఆనందీతుడనైతిని."

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున యయాత్యష్టక సంవాదము అను ముప్పది ఎనిమిదవ అధ్యాయము.