మత్స్య మహా పురాణము

Table of Contents

281 - హిరణ్య హస్తి (గజ) రథ దాన విధానము. 

శ్రీమత్యుడు మనువునకు ఇట్లు చెప్పెను: ఇపుడిక శుభమగు సువర్ణగజ రథ దాన విధానము తేలిపెదను: ఆ ప్రదానము చే వివేకులగు నరులు వైష్ణవపదస్థానము నందగలరు; శుభదినమందు తులాపురుష దానమందువలేనే విప్రు లచే స్వస్తిపుణ్యాహవాచన లోకపాలావాహనాదికము జరుపవలేను; ఋత్విజులను మండపమును సం భారములను భూషణ వస్తాదికమును కూడ ఆయై నమకూర్చుకొనవలయును; ఇందును ఆ పై ఉపవసించి బ్రాహ్మణులతో కూడి భోజనము జరుపవలయును; పుష్ప రథాకారమగు బంగరు రథము చేయించవలయును; అందు మణ్యలంకారములు వింతగొలుపు వలభులు (చూరులవంటి కూర్పులు) నాల్గుచక్రములుఉండవలెను; ఆప్షలోకపాలురు బ్రహ్మరవి శివులు నడుమ లక్ష్మీ పుష్టి దేవీసహితుడగు నారాయణుడు నుండవలెను; ఇవియన్నియు కృష్ణాజినము పై తిలద్రోణమందుంచవలయును; దగ్గరలో అష్టాదశ ధాన్యములు పాత్రములుఆసనములు చందననము దీపికలు పాదుకలు పాదరక్షలు ఛత్రములు అద్దములు ఉండ వలెను; రథపు ధ్వజమందు గరుడుడు కూబరపు కొన పై వినాయకుడు నుండవలెను; దాని పై మేలుక ట్టును దగ్గరలో నానాఫల ములును ఐదు వన్నెల పట్టువస్త్రమును వాడని పూవులును కుళ చతుష్టయమును అష్ట గోవులును సువర్ణగజ చతుష్టయమును ముత్తెముల దండలును రెండు వాస్తవ గజములును. ఇన్ని యుఉంచి దానమీయవలెను; బంగరు రథము మాత్రము ఐదు పలములనుండి బారువ వరకుగల బంగారుతో చేయించవలయును; మంగళ వాద్య వేదధ్వనులతో కూడ వేదవేత్తలగు బ్రాహ్మణ పుంగవులచే స్నానము చేయించుకొని యజమానుడు పూవులు దోసిట పట్టుకొని అగ్న్యాదులను త్రిప్రదక్షిణము చేసి ఈ మంత్రముచ్చరించుచు బ్రాహ్మణులకుఅవి దానము చేయవలెను :

“తేజోమయ రథమా! నమోనమః; బ్రహ్మ విష్ణు రుద్ర రవి లోకపాల విద్యాధరులును వేద పురాణ యజ్ఞ ములును నిన్ను సేవిం(ఆశ్రయిం)చును; కావున ఇట్టి నీవు మమ్ము కాపాడుము; పరమ గుహ్యతమమును ఆనంద హేతువును గుణరూప రహితమును నగు ఏ విష్ణు స్థానమును యోగై కావలంబనమగు స్వదృక్కులుగల యోగులు తమ హృదయ మధ్య మందు చూతురో ఆ మహాతత్వము నీవే 'నాథుడవు' 'రక్షకుడవు' అను పదమందు నిలిచినవాడవు; భవసాగర మున ముంచబడినవారికి ఆనందకరమగు అమృతమును త్రోవుటకుపయోగించు యజ్ఞాంగ పానపాత్రమవు (చమసము) నీవే; కావున బంగరు టేనుగుల అరదమురూపున నుండు మాధవా! పాపరాశినీ శమింపజేసి ఈ దానము చే మాయందనుగ్రహమును చూపుము.”

ఇట్లు పలికి నమస్కరించవలయును; ఇట్లు హిరణ్యగజ రథ ప్రదానము చేయువాడు నకల పాప విముక్త దేహుడై విద్యాధర మునీంద్రదేవతా గణముల కాశ్రయమగు మహోత్తమ శివస్థాన మందును; తాము చేసిన ఆనేక పాప రాసు లనెడు మంటలగముల నంపర్కముచే మండుచు బాధలనందు దేహములు కలిగి బాధలను ఉద్వేగమును అందుతున్న బంధువులను పితృపౌత్తులను ఇతరాజ శేష బంధువులను కూడ ఈ దాత విష్ణు లోకమునకు తీసికొనిపోవును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున హిరణ్య హస్తిరథ ప్రదానిక మను రెండు వందల ఎనుబది యొకటవ అధ్యాయము.