మత్స్య మహా పురాణము

Table of Contents

210 - సావిత్రి యమ సంవాదము - సావిత్రికి ద్వితీయ వరప్రాప్తి. 

సావిత్రి యమునితో ఇట్లనెను: సత్పురుషులకు సజ్జనులతో సమాగమము లభించిన తరువాత క్లేశము ఎక్కడిది? దుఃఖము ఎక్కడిది? సత్పురుషులు సదాసజ్జనులకును అసజ్జనులకును గతి యగుదురు; కాని అసజ్జనులు మాత్రము సజ్జనులకుగాని ఆసజ్జనులకుగాని కడకు తన కేకాని గతి (ఉపకార కులు) కారు; అకారణముగనే లోకమునకు అపకారము చేయు (శత్రువులగు) ఖలుల వలన భయముండునట్లు విషము వలన కానీ అగ్ని వలన కాని శత్రువుల వలన కాని శస్త్రముల (ఆయుధముల) వలనకాని భయముండదు; సజ్జనులు తమ ప్రాణముల వదలియైనను పరార్థమును (పరోపకారమను. ఆర్తము ప్రయోజన మును) చేయుదురో అట్లే అసజ్జనులును తమ ప్రాణములు పోగొట్టుకొని యైనను పరపీడ కలిగించుటలో ఆసక్తులయి యుందురు; సజ్జన లోకము సమూహము) పర లోక సుఖసాధనమునకై ప్రాణములనైన గడ్డిపోచవలె వదలు కొన సిద్దమగునో దానిని పరాకార సమర్థులగు అసజ్జనులు తృణమువలెనే వదలుదురు; ఆయా జనసమూహము లందున్న ఆసజ్జనులను దండించుట కై బ్రహ్మతానై రాజును ఏర్పరచి సృష్టించెను; రాజు నరులను పరీ-క్షించవలయును; అసజ్జనులను నిగ్రహించ దండించ వలయును; లోక మందు ఇట్టివాడే లోక య(సుఖములను)మును జయించు వారందరలో ఉత్తముడు; ప్రజలు తమ రక్షణమును బీజర క్షణమును లోకరక్షణమును చేసికొనుటకై ఎట్లు ధాన్యమును పరీక్షించి మంచి దాని నుంచుకొని చెడుదానిని వదలి ఆ మంచి ధాన్యమును మరల పేరువేసి వృద్ధి పర తురో అట్లే రాజు కూడ సజ్జనులను పరిపాలించుచు అసజ్జనులను నిగ్రహించుచు ప్రజలను వర్దిల్ల చేయవలయును. స్వర్గమును పొందగోరు రాజు చేయదగినది ఇంత మాత్రమే; జగత్తులకు పతి అగు ధర్మరాజా! లోకములందు రాజు చేయదగిన కృత్యము ఇంతకంటే ఇతరము ఏదియు లేదు; ఇట్లు అసజ్జన నిగ్రహముతోను సజ్జన పరిపాలనముతోను రాజు శాసింపలేని అసజ్జను లను కూడ శాసించు పొడవు నీవు; ఆ హేతువుచే దేవులందరకంటే నీవు అధికుడవగు దేవుడవు అని నాకు తోచుచున్నది; లోకము సరిగా నడు చునట్లు చేయుచు దానిని నరియగు వ్యవస్థయందు నిలుపువారు సజ్జనులే; అట్టి సజ్జనులలో శ్రేష్టుడవు నీవు;  ఆ హేతువుచే నేను నీ వెంట (ఎంత దూరము) వచ్చు చున్న ను క్ల మము (శ్రమము) లేదు; అనవిని యముడు “విశాలాక్షి! ధర్మ సంబద్ధములగు నీ వచనములను విని నీ విషయమున తుష్టుడనయితిని; నత్యవంతుని ప్రాణములను తప్ప మరే దయిన వరమును శీఘ్రమే కోరుకొనుము;” న సావిత్రి “విభూ! నాకు నూరుమంది సహోదరులగు నా తల్లి కడుపుననే జన్మించిన) భ్రాతలు వర ముగా (కోరుకొనుచున్నాను;) ఇమ్ము; ఇంతవరకును (పుత్తులు లేమిచే) ఆనపత్యుడుగానున్న మా తండ్రి పుత్రలాభము వలన ప్రతినందునట్లనుగ్రహించుము;” అనెను.

అంతట యముడా మెతో నిట్లనెను: అనిందితా! (నిర్మల స్వభావా!) నీవు వచ్చిన త్రోవను పొమ్ము; నీ భర్తకు జరుపవలసిన ఔర్ధ్వ దే హిక కార్యముల విషయములలో యత్నము చేయుము; అంతేకాని లోకాంతర గతుడగు ఇతనిని నీవు వెంటనంటజాలవు; భద్రా! నీవు నీ గురువులకు (అత్త ఇంటి పెద్దలగు అత్తమామలకు)ను ముఖ్యగురు డేయగు సత్యవంతునకును చేసిన శుశ్రూష చేత నీవు మహాపుణ్యమును సమర్జించితివి; ఆ హేతుపుచేతనే (నాదూతలను పంపక) నేను స్వయముగా వచ్చి ఇతనిని తీసికొనిపోవుచున్నాను. వరవర్ధినీ! విజ్ఞానవంతుడు అగు పురుషుడు ఆచరించవలసిన కర్తవ్యము తల్లిని తండ్రిని గురుని శుశ్రూషించుట అనునది మాత్రమే; వనమందుండియు నిరంతరమును సత్యవంతుడు ఈ మువ్వురను పూజించెను; సంతోషపర చెను; శుభరూపా! ఇట్లు ఇతడు చిర కాలము అనుభవించదగినంత స్వర్గమును జయించినవాడయినాడు; శుభా! తపముచే బ్రహ్మచర్యము చే గురు ( పెద్దల) శుశ్రూషచే అగ్ని శు శూషచే పురుషులు స్వర్గ నుఖ ప్రాప్తులగుదురు; ఎవ రేకాని-వి శేషించి. విప్రుడు ఆచార్యుని తన తండ్రిని తల్లిని అన్నను అవమానించ (అలక్ష్యపరచ) రాదు; ఆచార్యుడు బ్రహ్మరూపుడు; తండ్రి ప్రజాపతి రూపుడు; తల్లి పృథివీరూప: అన్న స్వయముగ తమ్ముడగు) తన రూపమే ); మానవులు జన్మించుటలో వారి తల్లిదండ్రులు పుట్టుకతోనే మహా క్లేశ మనుభవింతురు: నూరేండ్లకయినను వారి ఋణము తీర్చుకొనుట శక్యము కాదు; కావున పొరికిని ఆచార్యునకును సర్వదా ప్రీతి కలిగించవలయును; ఈ మువ్వురును సంతుష్టులయిన చో సర్వ తపస్సులును సమాప్తములగును; ఈ మువ్వుర శుశ్రూష యే పరమ తపమని పెద్దలందురు; వారి యనుమతి లేనిదే ఇతర ధర్మమేదియు ఆచరించరాదు; వారు మూవు రే మూడు పృథివ్యంత రిషద్యు) లోకములు; మూడు (డ్రహ్మచర్య గార్హస్య వానప్రస్థ ఆశ్రమములు; మూడు (ఋగ్యజుస్సామ) వేదములు; మూడు (దక్ష్మి గార్హపత్యా హవనీయ) అగ్నులు; తండ్రి గార్హపత్యాగ్ని; తల్లి దక్షిణాగ్ని; గురుడాహవనీ యాగ్ని; ఈ అగ్ని త్రయము అన్ని టికంటెను గొప్పది; ఈ మూడిటి విషయమున గృహస్థుడు పొరపడరాదు; అట్లున్న వాడు పైజెప్పిన లోకత్రయ (సుఖ) మును జయించును; ప్రకాశించు (తేజోమయమగు) తన శరీరములో కూడి దేవునివలెనే డ్యు స్వర లోకమున సుఖించును; భద్రా! కల్యాణీ! నీకోరికలు నెరవేరినవి; కావున నీవు మరలుము; నీవనీన ఈ విషయమంతయు జరుగును; ఇంకను నీవు నన్న నున రించుటచే నాకు ఆటంకమును నీకు శ్రమమును అగును; అందుచే . ఈమాట ఇట్లు చెప్పుచున్నాను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున సావిత్ర్యుపాఖ్యానమున సావిత్రీయమ సంవాదమును యమునివలన సావిత్రికి ద్వితీయ వర లాభమునను రెండు వందల పదవ ఆధ్యాయము.