మత్స్య మహా పురాణము

Table of Contents

 173 - తారకామయ యుద్ధమునకయి దేవతల సన్నాహము॥

శ్రీమత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను॥ రవికుమారుడవగు మనూ! దైత్య సేనా॥ విస్తారమును దాని నన్నా హమును నీకు తెలిపితిని॥ ఇక విష్ణు పక్షీయమగు దేవ సేనా విస్తారము కూడ వినుము; వీరిలో ఆదిత్యులు వస్తువులు రుద్రులు మహాబలులగు అశ్వినులు ( ఆదిత్యులు 12+వసువులు 8 రుద్రులు 11+ అశ్వినులు 2 = 88:) వీరు తమ తమ బలములతో అనుచరులతో కూడ యథాక్రమముగా యుద్ధ సన్నాహ మొనర్చిరి॥ పలు పేరులతో యజ్ఞములందు పిలువబడువాడు వేయి కన్నులు కలవాడు॥ లోక పాలకుడు ఆగు ఇంద్రుడు నర్వ దేవతలకు నాయకుడై వారి ముందుండి, అందరకంటే ముందుగా దేవగ జమగు ఐరావత మేక్కెను॥ ఆ సేనా మధ్యమునందు నర్వ పక్షి శ్రేష్టుడగు గరుత్మంతుడు వలే వేగ శాలియగు ఇంద్రుని రథ ముండెను॥ ఆది మిగుల ఆందమగు చక్రములును పాదము లనబడు దారుపరికరము లును కలది; బంగారుతో వజములతో అలంకృతము; వేలకొలదిగ దేవగంధర్వ యకులు దానివెంట నుండిరి॥ ప్రకాశ వంతులగు దేవర్షులు బ్రహ్మరులు యజ్ఞ సదస్సులందుండు వారు ఆ రథమున కన్ని వైపుల నిలిచి స్తుతించుచుండిరి॥ వజముల(పిడుగులతోను వాని ధ్వనులతోను మెరపులతోను ఇంద్ర ధనువులతోను కూడినవియు పర్వతములవలె నున్న వియు సంకల్పానుసారముగ సంచరింధునవియు ఆగు మేఘ సమూహములతో అది కూడి ఉండెను॥ దాని నిరోహించియే ఆ ఇంద్రదేవుడు నకల జగత్తునందును నంచరించుచుండును॥ యజ్ఞారంభములందు హవిర్ధానములను ప్రదేశములందు నిలిచి ఈ రథమును విప్రులు కీర్తించుచు వేదగానము చేయుదురు॥ స్వర్గమునందు యుద్ధ సన్నద్ధమయిన నేనయందు దేవతా వాద్యములను మోగించుచువాదకులు వెంట వచ్చుచుండ అప్పరసలు వందల కొలదిగ నాట్య మాడుచుండిరి॥ మనో వాయువేగముగల వేయి గుర్రములను పూంచినది నాగరాజ ధ్వజముతో కూడినది "అగు ఆ రథ శ్రేష్టము మాతలి యను సారథిచే రక్షితమగుచు రవివలె ప్రకాశించుచుండెను॥ అది అన్ని వైపులను సూర్యతేజస్సుతో క్రమ్మబడిన మేరువో యను నట్లుండెను॥ యముడు కాలపాశముతో కూడ దండమును ఎత్తి పట్టి ముద్దరమును ధరించి తన నాదముతో దైత్యు లకు భయము గొల్పుచు దేవతా సేనయందు నిలిచేను॥

శ్రీమంతుడు విభుడునగు విష్ణువు గరుడుని ఆరోపించెను॥ అతడు కశ్యప ప్రజాపతి పుత్రుడు॥వృక్షజాతీ యుడు॥సర్పభోజనుడు॥వాయువుకంటే అధికముగా ఆకాశ మును క్షోభింపజేయుచు ఆకాశమున సంచరించువాడు (ఖ-గ); నోటియందు భుజగ రాజము నుంచుకొని ప్రకాశించువాడు అమృతము విషయమయి ఇంద్రుడు వై చిన వజ్రపు దేబ్బ) మచ్చగలవాడు అమృత నిమిత్తమయిన కార్యమునుండి బయట ఠీవితో తల ఎత్తుకొని ఉన్న తమయియున్న మంథ) పర్వతము వంటివాడు పొలమార్లు దేవదానవ యుద్దములందు తన విక్రమమును ప్రదర్శించినవాడు శిఖ గలవాడు బలశాలి కాచిన బంగారుతో చేసిన కుండలములు భూషణములుగా గలవాడు వన్నేలు గల రెక్కలు ఈకలు కలిగి గైరిక ధాతువు లతో నిండిన కొండవలె నున్న వాడు॥బలిసిన వక్షమున వ్రేలాడుచున్న దీయు చంద్రుని కాంతివంటి కాంతి కలదియు నాగముల పడగల యందమరియున్నదియు ప్రకాశించుచున్నదియు అగు మణి శేష్టముతో కూడినవాడు; ప్రళయకాలమందు ఇంద్రధనువులతో కూడిన మేఘములవలె నున్న అందమగు ఈకలు కల రెక్కలతో ఆకాశమును ఆవరించినవాడు; నీలము ఎర్రనివి పచ్చనివి అగు పతాకలతో అలంకరింపబడినవాడు; పతాకా వేషముతో కప్పబడిన మహాశ రీరము ఆనేడు గ్రహ ముగా ఉన్న వాడు; రవి రథ సారథియగు ఆరుణునకు తమ్ముడు; మంచి వన్నె గల బంగారు కాంతిగల దేహముతో కూడి మంచి రెక్కలు కలవాడు అను అర్థముతో సుపర్ణుడని ప్రసిద్దుడగు పక్షి శ్రేష్ఠుడతడు॥ ఇట్టి గరుడు నారోహించిన విష్ణుని అనుసరించి వెంటనంటి పోవుచు దేవతలును నమాహితులగు మునులును పరమోత్తమ మంత్ర పవిత్రములగు వాక్కులతో ఆ జనార్దనుని స్తుతించుచుండిరి॥

"ఇట్లు సన్నద్ధమయిన ఆ దేవ సేన కుబేరునితో కూడి యముని తన ముందుంచుకొని పక్ష్మిరాజగు గరుడునిచే చుట్టుకొనబడి దేవరాజగు ఇంద్రునితో కూడి ప్రకాశించుచు చంద్రుని కాంతులతో విస్తరిల్లి వాయువు వీచుటచే ధ్వనుల నిచ్చుచు జయశీలుడు మిగుల ప్రకాశించువాడు నగు విష్ణుని తేజస్సుతో ఆవృతమయి ప్రజ్వలించు ॥ అగ్ని వలె ఒప్పుచు బలశాలియు గర్వించినదియునై యుద్ధమునకు సిద్ధమయ్యెను॥

ఆంత॥దేవతలకు శుభమగుగాక యని బృహస్పతి పలికెను॥ దానవ సేనకు శుభమగువ మని శుక్రుడ నేను॥

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవదానవ సంగ్రామమున దేవకృత సేనా సన్నాహమను నూట డెబ్బదినాలుగవ అధ్యాయము॥