మత్స్య మహా పురాణము

Table of Contents

90 - రౌప్య పర్వత దానము

 ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను: ఇక మీదట రౌప్య పర్వత (వెండికొండ) దాన విషయము తేలి పెదను. ఇది సర్వోత్తమము. దీని నాచరించినవారు సోమలోక ప్రాపులగుదురు. దీనికే పదివేల పలములు కాని ఐదువేల పలములు కాని రెండున్నర వందల పలములు కాని తూకముకల వెండి కావలయును. శ క్తిలేనివారు భక్తితో ఇరువది పలములకు తక్కువ కాని వెండితోనైన చేయవచ్చును. ప్రవలేనే చతుర్థాంశముతో విష్కంభ పర్వతములను వెండితోనే మందరాది పర్వతముల సాయా దిశ లందును బంగారుతో లోకపాలురను బంగారుతో నెత్తము చేయించి దాని పై బ్రహ్మ విష్ణు రవి రుద్రుల స్వర్ణ ప్రతిమలను చేయించవలెను. మిగిలిన పర్వతముల విషయమున వెండినుపయోగించిన వానికి ఈ రౌప్య పర్వత దానములో బంగారు ఉపయోగించవలెను. హోమ జాగరణాదికము పైవలెనే చేయవలెను. తెల్లవారిన పిదప ఈ రజతా చలములోని నడుమ భాగమును ఆచార్యునకును విష్కంభ పర్వతములను ఋత్విక్కులకును నీయవలెను. (దాన కాలమున) వారినందరను వస్తాభరణములతో పూజించవలయును. దర్భపాణియై విమత్సరుడై - ఈ అర్థ మునిచ్చు మంత్రమును పఠించవలయును: “రజతమా! నీవు పితరులకును విష్ణు శంకరులకును ప్రియ మైన దానవు. ఇట్టి నీవు సంసార సాగరమునుండి నన్ను దాటించుము.” ఇట్లు ఆవాహనము చేసి ప్రార్థించి రజతాచల దానము నొనరించువారు వేయి పది వేల (1000x10000) గోవుల దానమిచ్చినంత ఫలము నందుదురు. గంధర్వ కిన్న రాప్సరో గణముల పూజలనందుకొనుచు కల్పాంతమువరకును సోమలోకమునందు వసింతురు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున రజతాచల దాన మాహాత్మ్య కథనమను తొంబదియవ అధ్యాయము.