మత్స్య మహా పురాణము

Table of Contents

126 - అగ్ని సూర్యుల పరస్పర తేజోనుప్రవేశము -జ్యోతిర్గోళముల దేవగృహత్వ నిరూపణము

(*లో కేస్మి నాపక సోగ్ని రుచ్యతే.)

ఋషులు సూతునిట్లడిగిరి: నీవు ప్రతిపాదించిన ఖగోళ విషయము అంతయు వింటిమి. జ్యోతిర్టోశ ములు దేవ గృహములు అంటివి. అది ఎట్లో వర్ణించుము. అనసూతుడిట్లనెను: సూర్యచంద్రుల గతి విధానమును సూర్థ్య చంద్రాది గ్రహములు దేవగృహములగు విధమును తెలి పెదను. అవ్యక్త తత్వము (మాయాశ బలము) నుండి జన్మించిన బ్రహ్మకు ఒక రాత్రి ముగిసి మరల తెల్లవారుసరికి ఈదృశ్య ప్రపంచ నంతయు ఈ వస్తువునకు ఇది రూపము. ఇది పేరు అను విభాగము లేక రాత్రి సంబంధియగు చీకటితోనిండి (చీకటిలో . ఏ వస్తువునకుగాని ఇది రూపము. ఇది పేరు అని తెలియనట్లే యుండెను. ఈ నాలుగు వేదములును ఇది ఈ వేదమని అనుశాసించుటయు అప్పటికి జరుగ లేదు. అట్టి సమయమున లోకసృష్టి రూపమగు అర్థమును (పనిని సాధించదలచి భగవానుడగు స్వయంభూ బ్రహ్మ మిణుగురు పురుగువలె మినుకు మినుకుమని ! ప్రకాశించుచు జగదావిర్భావము ఎట్లు జరుపవలేనాయని ఆలోచింపసాగేను. అట్టి సమయమున అతనికి అగ్ని జలమును పృథివిని ఆశ్రయించి యున్నట్లు కనబడెను. స్వయంభూబ్రహ్మ జల పృథివులనుండి ఆ అగ్ని భూతమును ఒక చోటికి చేర్చి దానినంతయు మూడుగా విభజించెను. పవ(మా)నుడుగా వాయువునందు కనబడుచున్న నిర్మథనముతో ఏర్పడేడి ఆగ్ని పార్థివమగు (పృథివీ సంబంధియగు) అగ్ని; ఈ రవియే శుచియను అగ్ని; జఠరమునందుండి జీర్ణాది ప్రక్రియల చేయుచు నిర్మథనముతో కాక ఇంధనములతో పనిలేక వేలిగేడి అగ్ని వైద్యు తాగ్ని; అదియే పావకాగ్ని .

ఓనిలోనొక యగ్ని (సౌరాగ్ని) తేజస్సులతోనే శాంతించును. తన ప్రకాశమును కోల్పోవును.) మరి యొకటి (వైద్యులౌగ్ని) ఇంధనములతో పనిలేక యే వెలుగును. అది నీటితో చల్లారదు.) నిర్మథ్యాగ్ని మాత్రము కాష్టములతో వెలుగును. నీటితో శమించును. పవమానాగ్ని యనబడేడి నిర్మథ్యాగ్ని ప్రార్థివాగ్ని) జ్వాలలుండియు ప్రభలు తక్కువయ.గుటచే సౌమ్యుడుగా కనబడు చుండును. రవి మండలమునందు వేరొక యుష్ణముతో పనిలేక యే ప్రకాశించు అగ్ని కి సంబంధించి సౌర ప్రభయందలి మూడు పాదములు అగ్ని యందు ప్రవేశించును. అందువలన అగ్ని రాత్రులందు రవికంటే అధికముగా నున్నట్లు ప్రకాశించును. మరల రవి ఉదయించునపుడు ముందటి దినమున అ సమయకాలమున రవినుండి ప్రకాశము పొందిన ఆగ్ని మరల రవిని ప్రవేశించును. అందుచే అగ్ని పగటివేళల నాలుగవవంతు తేజస్సుతో మాత్రమే వెలుగును. ఇట్లు ఆగ్నేయ సౌర ప్రకాశములు రాత్రింబవళ్ళలో పరస్పరాను ప్రవేశమున పరస్పర పూరణము చేసికొనుచుండును.

ఇట్లు అగ్ని భూమికి ఉత్తరార్ధ దక్షిణార్ధములందు స్థాన పరివర్తనమున తన తేజమును పువర్తనము చేసికొనుచు ప్రకాశాధిక్యమును పొందుచు కోల్పోవుచు నుండును. ఇట్లే సూర్యుడుదయించగానే రాత్రి (కాల ప్రభావము) నీటియందు ప్రవేశించును. అందుచే పగటి వేళలందు నీరు అగ్ని వలేనే ఎర్రగా కనబడును. మరల రవి అస్తమించగనే పగలు (పగటికాలపు ప్రభావము) నీటియందు ప్రవేశించును. అందుచేతనే నీరు రాత్రులందు రవినలే తెల్లగా కనబడును. ఈ క్రమమున భూమి దక్షిణే తరార్థము లందు రవ్యగ్ని ప్రకాశముల పరస్పర ప్రకాశ పఠివర్తనముచే ఉదయా స్తమయ ప్రభావానుసారము రవియు ఆగ్ని యు జలములందు ప్రవేశించుచు వాటి వర్ణమును కూడ మార్చును.

ఈ సౌరాగ్ని (రవి మండలము) వేయి కిరణములతో పరి వారితమే ఒక కడవవలె నున్నది. అతడు తన వేయి నాడులతో నదీ సముద్రహద కూపాడులనుండి నీరు పీల్చి తనయందు నింపుకొనును.

సూర్యుని వేయి కిరణములలో నాలుగు వందల కిరణములు శరద్వరా కాలములందు వాన కురియును. ఆ కిరణములు చల్లనివి పవిత్రములు తక్కువ వేడిమి నిచ్చునవి. వాటికి అమృత కిరణములని నామము. ఇవికాక మూడు వందల కిరణములు హేమంత శిశిర ఋతువులందు రవియందు సేకరింపబడియున్న జలమును హిమ రూపమున లోకమున కందించును. ఈ కిరణ సముదాయమునకు చంద్రములు అని పేరు. ఇవియన్నియు పవిత్రములును ఆనందము కలిగించునవియును. మరి మూడువందల కిరణములు వసంత గ్రీష్మములందు ఘర్మమును ఆవిరిని వదలును. వినికి శుక్ల కిరణములని వ్యవహారము.

ఇట్లు రవి తన సహస్రకిరణప్రకృతిద్వారమున ఓషధులతో మానవులను స్వధాద్రవ్య కవ్యముతో పితరులను అమృతముతో దేవతలను ససుముగా పోషించుచున్నాడు.

ఈ సహస్ర కిరణములు కూడ ఋతుభేదమున మరియు అనేక విధముల మార్పును పొందుచుండును.

ఇట్లు శుక్లవర్ల మై ప్రకాశ శీలమైన 'లోక'మను సంప్రదాయసిద్ధ వ్యవహార నామముగల రవియే నక్షతములకు. (తారా)గ్రహములకు సోమునకు గూడ జన్మ హేతువును స్థితికారణమునై యున్నాడు.

చంద్రాదీనాం సూర్యకిరణాప్యాయన కథనమ్

చంద్రుడు నక్షత్రములు గ్రహములు ఇవి యన్నియును సూర్యుని ర శ్ములు అనేది నాడుల నుండియే జనించి తృప్తిని పుష్టి ని పొందునని తెలియవలయును. ఎట్లన సుషుమ్నా అనెడి నాడి రశ్మి షేణుడగు చంద్రుని పరిపోషించును. హరి కేశము అను రశ్మి నక్షత్ర ములను దక్షిణమునం దుండెడి విశ్వకర్మయను నొడి బుధుని వెనుక నుండెడి విశ్వావసుసోడి శుకుని సంవర్గన నాడి అంగారకుని ఆర్వావసువను ఆరవనాడి బృహస్పతిని స్వరాట్ అను నొడి శనైశ్చరుని ఆప్యాయన మొందించును. క్షయము నొందపు కావున నక్షత్రములు (న-క్ష-త్ర) ఇవి సూర్యుని క్షేత్ర(స్థాన)ములుగా నుండి తమ కిరణ ములతో సూర్యుని తపింపజేయును. సూర్యుడు అసంత క్షేత్ర రూపములగు ఆ నక్షత్రములలో తానును సక్షతత్వము పొందియున్నాడు. ఈ లోకమునుండి పై లోకములకు దాటిపోయిన సుకృతాత్ములను దాటించునవి కావునను తెల్లనివి కావు నను తారకలు (తరింప-దాటునట్లు-చేయునవి) అని వీనికి పేరు. పృథిపిగతులగు వారిలో దీవ్యవంశ ముల వారిని వారి తపోబలమును తన తేజోబలమును ఆశ్రయించి తనలోనికి గ్రహించును కావున సూర్యునకు ఆదిత్యుడు ( ఆద తే-తనలోనికి తీసికొనును) అని పేరు. స్వస్థనము-సవింపజేయుట అను ఆర్థము నిచ్చు 'సూ' అను ధాతువునుండి ‘సవితా' అను పద మేర్పడినది. తేజస్సును ప్రసరింపజేయు వాడు కావున సూర్యుడు “సవిత' అనబడును. 'చది' అను ధాతువునుండి ‘చంద్ర’ అనేడు శబ్దము ఏర్పడినది. తెల్లగోఅమృతరూపుడై చల్లనై - ఆనందింపజేయువాడై - ఉండును అని అర్థము. ఇట్టి సూర్య చంద్రుల మండలములు ప్రకాశవంతములు దివ్యములు ఆకాశ గాములు తెల్లనివి గుండ్రని కుండలవంటివి. వీరిలో రవి తేజో మయుడు చంద్రుడు జలమయుడు. తమ సుకృతములచే దేవత్వ మండిన కర్మదేవులు ఆయా మన్వంతరములం దెల్ల ఈ రవి నక్షత చంద్రగ్రహ లోకములందు తమ పుణ్యానుసారము ప్రవేశింతురు. ఇవీ వారికి స్థానము లగును. కావున వీనికి ‘దేవ గృహములు’ 'కర్మదేవులకు ఇండ్లు' అని పేరు ఏర్పడినది. ఇంతే కాదు. సూర్య శుక్ర బృహస్పత్యంగారక శనైశ్చర బుధ రాహుపులు ఇతర నక్షత్రములు కూడ వాస్తవమున దేపతాత త్వములే. వీరును తమ సుకృతమున కర్మదేవులై ఆయా జ్యోతిర్గోళ ములను తమ తమ ఇండ్లుగా పొందిరి. ఈ కనబడు జ్యోతిర్లోకములు కేవలము జడ పదార్థములు కావు. వానికి ఆధిష్ఠాతలుగా రవ్యాది దేవతలున్నారు. 

 సూర్యాద్యుత్పత్తికథనమ్

ఈ చెప్పిన కారణములచే ఈ జ్యోతిర్గోళములన్నియు సుకృతము చేసికొనిన కర్మదేవుల ఇండ్లయినందున దేవ గృహము లయ్యెను. ఇవి ప్రళయకాలము వరకు ఇప్లే యుండును. ప్రతి మన్వంతరమునందును ఆయా స్థానములకు అధి మానులగు దేవతలు ఇట్టే వానిని మరల మరల తమ ఇండ్లుగా చేసికొందురు. అతీత మన్వంతరములందు అతీత దేవత లును వర్తమానమన్వంతరములందు వర్తమానదేవతలుసు భావి మన్వంతరములందు భావి కర్మదేవులును ఇట్టే ఉండిరి. ఉన్నా రు ఉందురు.

ఇక వీరి దేవతాత్వములు ఇట్లుండును: ఆదితి కుమారులలో ఎనిమిదవవాడగు 'వివస్వాన్' అను నతడే సూర్య దేవుడు; ద్యుతి (కాంతి) కలవాడు ధర్మయుక్తుడు నగు సోమ(చంద్ర)దేవుడు వసువులలో నొకడు; శుక్రుడు అసురుల యాజకుడు (యజ్ఞాదులు చేయించు పురోహితుడు) ఐనను దేవతా కోటిలోని వాడు; దేవాచార్యుడు బృహస్పతి అంగిరుని కుమారుడు; బ్రహ్మాంశ సంభూతుడు; బుధుడు మనోహర రూపుడు త్విషి(చంద్ర)పుత్రుడు; శనైశ్చరుడు విరూపుడు.రవికి సంజ్ఞాదేవియందు కలిగినవాడు; వేణుపులు అసువారు అగ్ని దేవునకు ఏ కేశి అను భార యందు జనించినవారు; దాక్షా యుణులు (దక్షపుత్రికలు) నక్షత్రములు; భూతము ప్రాణులకు సమ్మోహము కలిగించు స్వర్భానుడు (రాహువు) సింహికా పుత్తుడగు అసురుడీ యెనను చంద్రార్క గ్రహనక్షత్రములందు ఒక డుగా అభిమతు డై ఆరాధింపబడు చున్నాడు.

ఇట్లు జ్యోతిః స్థాస తత్వమును ఆ స్థానముల కభిమానులగు దేవతలను తెలిపితిని. ఆ జ్యోతిః స్థానముల భౌతిక సంస్థానమును తెలిపెదను. సహస్రాంశుడగు వివస్వంతు(సూర్యు)ని స్థానము ఆగ్ని మయ జ్యోతిర్గోళము. చంద్ర స్థానము కూడ వేయి కిరణములు గల జలమయగోళము. మనోజ్ఞుని గోళము కూడ జలమయమే; బృహస్పతి గోళము ఐదు నాడులు కలది; శు, క గోళము పడునారు నాడులు కల జలమయగోళము; ఆంగారకునిది తొమ్మిది నాడులుగల జల మయగోళము; బుధునీటి పండ్రెండు నాడులుగల పచ్చని ప్రకాశముగల గోళము; రాహు స్థానమగు గోళము భూత సంతా చము కలిగించునది; ఇతని కిరణములు హిరణ్మయములు శుక్ల సౌమకములయి తెల్లని వగుటచే తారకములని కూడా పేరు గల సూర్య కిరణములే; ఇవి తారలకు కూడ తాపము కలిగించును.

సూర్యాదిమణ్డలపరిమాణకథనమ్

(*సాష్టషట్పఞ్చచత్వారిత్రీణిద్వేఏకేఏవచ)

రవి మండల వ్యాసము తొమ్మిది వేల యోజనములు. చుట్టు కొలత దానికి మూడింతలు; చంద్రుని వ్యాసము సూర్యుని వ్యాసమునకు ద్విగుణము; తారకలు వీటికి పైగా నున్నవి. పోని వ్యాసము అర్ధ యోజనము మాత్రమే. అదే వ్యాసముతో రాహువు నక్షత్ర ములకంటె క్రిందుగా సంచరించును. ఇతడు పృథివీ ఛాయను మండలాకారమున చేసికొని యుండును. రాహు స్థానము పెద్దదే కానీ తమోమయము; అతడు చంద్రపర్వములందు పూర్ణిమలందు) సూర్యుని నుండి చంద్రుని కడకును రవిపర్వములందు (ఆమావాస్యలందు) చంద్రునినుండి సూర్యుని కడకును పోవుచుండును. తన భానువులతో (కిరణములతో) భానుని బాధించును కావున అతనికి స్వర్భానుడని పేరు. చంద్రునిలో పదునారవవంతు శుక్ర మండలము; శుక్ర మండలములో నాల్గవవంతు తగ్గించినచో బృహస్పతి మండల మగును. బృహస్పతి మండలములో నాల్గవవంతు తగ్గించినచో అంగారక మండల మగును; శని మండలము అంగారక మండలముతో సమానము. అంగా రకుని మండలములో నాల్గవవంతు తగ్గించినచో బుధ మండల మగును. తారా నక్షత్రము లన్నియు బుధ మండలముతో సమాన మండలము కలవి. ఇవి ఒకదానికంటే మరియొకటి తక్కువ తక్కువ పరిమాణము కలవి. ఇవి వందలుగా ఐదు లుగా నాల్గులుగా మూడులుగా పండ్రెండులుగా నున్న వి. ఈ తా నక్షత్ర మండలములకు పైగా నక్షత్రము లున్న వి. లోగడ చెప్పినట్లు వీనిలో ఒక్కొక్కదాని మండలము అర్ధ యోజనము; ఇంతకంటే చిన్న మండలము కల జ్యోతిస్సులు లేవు; వాటికి పైగా నున్న గ్రహములగు శని బృహస్పత్యంగార కులు మంద సంచారులు; నక్షత్రములకు క్రిందుగా రాహు కేతువులున్నవి. సోమ శుక్ర బుధులు శీఘ్ర సంచారులు; వీరును నక్షత్ర మండలమునకు క్రిందుగానే యున్నారు.

 దేవత్వమును పొందిన నక్షత్రాచ్ము లెందరు కలలో అన్ని కోట్ల తారక లంతరిక్షమందున్న వి. (కావున ఆపి ఇన్ని యని లెక్కింపజాలము. )

అన్ని టికంటెను దిగువగా సూర్యు డున్నా డు. అతని మీదుగా చంద్రుడు. ఆతనికి పైగా బుధుడు అతని పై శుక్రుడు అతని పై కుజుడు అతని పై బృహస్పతి అతనిపై శనైశ్చరుడు అతనికి పైగా సప్తర్షి మండలము దానిలో ఊర్ద్వ మున ధ్రువుడు ఉన్నారు. ఇడ్లీ ద్యు లోకమంతయు ధ్రువునియందు నిబద్ధ మయి యున్నది.

ఈ గ్రహాదులన్నియు ఒక దానికి మరియొకటి రెండు వేల ఒక వంద) లక్షల యోజనముల ఎడముతో పై పైగా ఉన్న వి. ఈ తారాగ్రహములును చంద్ర స్యూలును ద్యులోకమున దివ్యతేజస్సుతో ప్రకాశించుచు అశ్విన్యాది నక్షత్రము లందు నియమానుసారము సంచరించుచుండును. ఇవి నీచోచ్చమృదు గతులలో సంచరించును. వీనికి సమాగమము భేదము అను స్థితులును కలుగుట కనబడుచుండును. ఈ సమాగమ భేదములు గణనవశమున పండితులు తెలిసికొందురు. వా సవమున అవి కలియుట జరుగదు. ఏలయన అవి ఒక దానిని మరియొకటి తాకని చక మున (కక్ష్యలలో నియత ముగా తిరుగుచుండును. కాని వాని కన్నింటికి దిగువగా నున్న మనకు అవి అట్లు కనబడును.

ఇట్లు పృథివీ సన్ని వేశము జ్యోతికి సన్నివేశము ద్వేప సముద్ర పర్వత నదీ వర సంనివేశము జ్యోతి రాత్మక దేవగృహ సంనివేశము సూర్యాశ్రిత జ్యోతిర్వ్యవస్థ ధ్రువాశ్రితమగు ఆద్య న ప్రాంత మధ్య ప్రదేశములందలి అంతరిక్ష జ్యోతిర్గోళ వ్యవస్థ మీకు తెలిపితిని. గుండ్రని భవనములవలే కనబడు ఈ ఉన్నత జ్యోతిర్గోళముల వ్యాస ములు మొదలగు కొలతలు లోక సంవ్యవహారార్థము ఈశ్వరుడు సంకల్పించిన విధమున కల్పాదియందు స్వయంభూ బ్రహ్మ బుద్ధి ఆలోచన పూర్వకముగా ఏర్పరచెను. మీకు నేను తెలిపిన జ్యోతిర్వ్యవస్థ దాని ననుసరించినదే; ప్రధాన (ప్రకృతి) పరిణామమే ఈ విశ్వరూపము (విరాట్స్వరూపము.) దీనిని ఉన్న దున్న ట్లు గణన చేయుట కానీ జ్యోతిర్గోళముల గతాగత రూప సంచారము కాని మాంసచకుపుతో నుండు మానవునకు సాధ్యము కాదు. 

 [ఈ చేప్పిన వానిలో – (అధ్యా-123-124-125-126-) కొన్ని ఆధునిక సిద్ధాంతములతో సరిపోవు. మరికొన్ని ప్రాచీన భారతీయ సిద్ధాంతములతో కూడ సరిపోవు. మరికొన్ని తత్వపరము లయినవి. వీనిని తాత్విక దృష్టితో విచారించి ఎరుగవలెను.                                                                                -అనువాదకుడు)

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఖగోళ వర్ణన పరిసమాప్తి యను నూట ఇరువది ఆరవ అధ్యాయము.