మత్స్య మహా పురాణము

Table of Contents

245 - శ్రీ వామనమూర్తీ వచ్చినపుడు బలి శుక్రుల సంవాదము.

పర్వతవన సహితయగు ఊర్వ సంక్షుభితమగుట చూచి బలి శుద్దుడగు శుక్రుని కృతాంజలియై నమస్కరించి “ఆచార్యా! పర్వత ద్వీపవన సహితయగు మహి కలత చెందుచున్నది; పహ్నులును ఆసుర భాగములను అందుకొనుటలేదు; ఏల?” అనెను; మహామతియు వేద విద్వరుడునగు కావ్యుడు శుక్రుడు చాల సేపు ధ్యానమందుండి దైత్యాధిపతియగు బలితో ఇట్లనెను; జగత్కారణుడు సనాతనుడు పరమాత్ముడునగు హరి ఇపుడు వామనరూపుడే కశ్యపునింట అవతరించినాడు; దానవపుంగవా! అతడిపుడు నీ యజ్ఞమునకు వచ్చుచున్నాడు కాబోలును; అతని పొదవ్యాస విక్షోభమున ఈ మహి ప్రచలిత మగుచున్నది; అద్రులు కంపించుచున్న వి; సముద్రములు కలగుచున్న వి; భూతపతియగు ఈ ఈశ్వరుని భూమి మోయ జాలకున్న ది? దేవాసుర యక్ష గంధర్వ రాక్షస సమేతయగు పృథివిని పృథివ్య పేజో వాయ్వాకాశములను ఆతడే మోయు చున్న వాడు; మన్వాదులను మహాసురులను నతడే వహించుచున్నాడు; జగత్కారణుడగు కృష్ణుని మాయ గంభీరయ్నది; ఆ మాయ ధార్యధార కభావముతో ఈ జగత్తును పీడించుచున్నది; అసురోత్తమా! అతని సంనిధియంద సురులు యజ్ఞ భాగార్హులు కారు; అందు చేతనే ఈ వహ్నులు అసుర హవిర్బాగములను గ్రహింపకున్న వి; ఆన విని బలి ఇట్లనెను: బ్రహ్మన్ ! నేను ధన్యుడను; కృతవుణ్యుడను; ఏలయన యజ్ఞపతియే స్వయముగా నా యజ్ఞమున కేతెంచినాడు. నాకంటే గొప్పవాడింకెవడు? ఏ అవ్యయుడు దేవేశుడునగు పరమాత్ముని దర్శింపగోరి యోగులు సదోద్యుక్తులై యుందురో అతడే నా యజ్ఞమునకు రానున్నాడు. యజ్ఞమున హోత ఎవనికి హవిర్భాగములిచ్చునో ఉద్గాత ఎవనినుద్దేశించి గానము చేయునో అట్టి ఆధ్వ రేశ్వరుడగు విష్ణుని నేను కాక మరెవ్వరు పొందును? ఇట్టి సర్వేశ్వరుడగు కృష్ణుడు నాయజ్ఞమునకు వచ్చిన ఈ సమయమున నేను ఏమి చేయవలయునో ఆదేశింప ప్రార్ధించుచున్నాను

బలి వచనములు విని శుక్రుడిట్లనెను: అసురా! వేద ప్రామాణ్యానుసారము యజ్ఞ భాగార్డులు దేవతలయియుండ నీవు దైత్యదానవులను యజ్ఞభాగ భోక్తలనుగా చేసితివి; ఈ దేవుడు. సత్వగుణాశ్రయుడై లోక స్థితి పాలనములను. చేయును. ఇది సృష్టికి తరువాత; ఆంతమందతడే ప్రజలను తినును; నీమూలమున నతడా విష్ణుదేవుడు స్థితియందు (లోక పొలన కృత్యమందు) ఉన్నాడు. మహాభాగా! ఇది ఎరిగి రానున్న దాని గూర్చి చేయవలసిన యత్నము చేయుము. దైత్యపతీ! అతడు నీకడకు వచ్చి నిన్నే అల్ప వస్తువడిగినను ఇత్తునని ప్రతిజ్ఞ చేయకుము. ఫలితము లేని సామ. (మృదు) వచనములు పలుకుము. నేను దానము చేయ శక్తుడను కాను. అనుము; ఏలయన మహాసురా! అతడు దేవతల యభ్యుదయమున ప్రవృత్తుడయియే ఇటకు వచ్చుచున్నాడు. ఆన విని బలి ఇట్లనెను: బహ్మన్! ఇతరులు యాచించినను. లేదని ఎట్లు చెప్పుదును; సంసార దోష రాశ్యపహారియగు హరి యాచించినపుడిం కెట్లు మాట అందును? హరి యనగా వివిధ. ములగు వ్రతోపవాసములతో ఆరాధింపబడి అనుగ్రహింపజేసికొనబడువాడు. నన్ను ఆట్టిగోవిందుడే దేహి' యనుచోనాకు అంత కంటే గొప్పదనమిం కేమియుండును? ఎవని నిమిత్తమయి దమశాచ గుణాన్వితులగు ఉపాసకులు ఉపహారాదీకమర్పింతురో యజ్ఞములాచరింతురో అట్టి దేవేశుడు నన్ను దేహియని యాచించనున్నాడు; ఇందువలన నేనింతవర కాచరించినది సుకృతమే యనియు సుతప సేయనియు నిశ్చయింపవచ్చును. ఏలయన నేనిచ్చు దానిని ఈశులకును ఈశుడగు హరి స్వయముగ గ్రహించనున్నాడు. గురోః స్వయముగా ఆ ఈశ్వరుడే రాగా నేను నా స్త్రీ అనను. తానై వచ్చిన హరిని నేను. వంచించుచో నా జన్మ ఫలము వ్యర్థమగును. ఈ యజ్ఞమునందు యక్షేశుడగు జనార్ధనుడే యాచించుచో ఇవుడు నాశిరము. నైన ఆవిచారితముగ ఇత్తును. ఇతరులు యాచకులుగా వచ్చినను నా స్త్రీ ఆనని నేను ఈనాడు అచ్యుతుని విషయమున అల వాటు లేని ఆ మాట ఎట్లు పలుకగలను? ధీరులకు దానము వలన ఆపదలు కలిగినను కొనియాడదగినదే. అయ్యా! బాధకారికాని దానము బలము కలది ఎట్లగును? నారాష్ట్రమునందు అసుఖ దరిద్రుడు ఆతురుడు (రోగి) అభూషితుడు. ఉద్విగ్నుడు పుష్పమాలాది రహితుడు ఎవడును లేడు. ప్రతియొకడును హరముతో పుష్టితో సుగంధానుభవములతో తృ ప్తితో నర్వసుఖములతో నున్నాడు. సదా సుఖవంతుడనగు నామాట చెప్పనేల? ఈ మహాపురుషునందీ దానము వదలి నంతనే యది మహాఫలదమగును. భృగు శార్దూలా! ఈ విషయమును నీయనుగ్రహము వలననే ఎరిగితిని.

 గురూ! ఇంత ఎరిగిన నా చేతి దానబీజము జనార్దనుడను మహాపా క్షే)త(పొలమందే పడినచో నాకిక లభించని దేముండును? ఈతడు "నావలన దానమందు కొని దానితో దేవతలకు పుష్టి కలిగించుచో ఈ హరి నాచే యజ్ఞ ద్వారమున నారా ధీతుడై నాయందనుగ్రహము చూపిన ప్లేయగును. ఈ విధముగ వినియుక్తమగు దాన ధనము దానిని నేననుభవించు నంతకంటే పది రెట్లు ఫలమునిచ్చినదగును. అట్టి దానము శ్లాఘనీయము. ఇదియే నిజమగుచో అతడు తన దర్శనము చేతనే నాకుపకారము చేయదలచి వచ్చుచున్నాడనుట నిశ్చయము. ఒకవేళ నేను దేవతల యజ్ఞభాగములను విరోధించు చున్నా నను కోపముతోనే నన్ను చంపవచ్చు చున్నా డా? అచ్యుతుని చేత నేను వధింపబడుటయు కొనియాడదగినదే కదా! ఈ విశ్వమంతయు యన్మయమో అట్టి హరికి లభించనిదేమున్నది? అయినను ఆతడు నన్ను యాచింపవచ్చుట నాయందలి అనుగ్రహము చేతనే కాని వేరు హేతువుచే కాదు. తన ఇచ్చాశక్తి బలముచే సర్వమును సృజించి తన చేత ముతోనే లయమందించు హృషీ కేశుడు న్వయముగా నన్ను చంపవచ్చుటకు హేతువు మరిం కేమయియుండునో? కావున నిది యెరిగి గురూ! జగన్నాథుడగు గోవిందుడు వచ్చినపుడు నీవు దానవిఘ్నకరుడవు కారాదు. అని అతడిట్లనుచుండగనే జగత్పతి సర్వదేవమయుడు అచింత్యుడునగు హరి వామనరూపధారియే యటకు వచ్చేను. యజ్ఞవాటమున ప్రవేశించిన యా ప్రభుని చూచి సభాసదులగు అసురులు అతని తేజము చే నిష్పభులై క్షోథమందిరి. ఆ మహాధ్వరమున కచట సమేతులయిన మునులు వేదముల పఠించిరి. బలి తన జన్మమంతయు నఫలమయ్యెననుకొనెను; ఆట ఏయొక్కడును కలతనందిన వాడే కాని మాటలాడిన వాడు లేకుండెను. ప్రతియొక్కడును ఆ దేవదేవేశుని తనమనమునందే పూజించెను. అంతట వినీతు డగు ఆ ఆసురపతిని ఆ మునివరులను చూచి సాక్షాత్ దేవదేవపతియు వామన రూపుడునగు విష్ణుడు ఆ యజ్ఞమును వహ్ని ని యజమానుని ఋత్విజులను (యజ్ఞ కర్మాధికారములందున్న సదస్యులను యజ్ఞార్థ ద్రవ్య సంపదలను ప్రశంసించెను. తత్తణమే ఎల్లరును వామనుని విషయమున ప్రసన్ను లయిరి. యజ్ఞవాటస్థితుడగు ఆ ధీరునుద్దేశించి సాధువాదములు చేసిరి.

 బలికృతవామనపూజాది

ఆనందముచే పులకించి బలి అర్ఘ్యము చేబూని గోవిందుని పూజించి ఆ దేవునితో ఇట్లనెను: సువర్ణ మో రత్న సంఘములో గజములో వస్త్రములో అలంకార ములో గ్రామములో సర్వ పర్వతాది సహిత పృథివియో పుష్కలముగ యథే పితముగ గ్రహించుము. నీకు ప్రియమగునది కోరుకొనుము. ఇది కావలయునని యాచించుము. ఇత్తును. అని దైత్య పతియన అచ్యుతుడు ప్రీతినంది వామనాకృతియగు ఆ భగవానుడు చిరునవ్వుతో గంభీరముగ ఇట్లనెను: రాజా!నాకు అగ్ని శాలకుగా మూడడుగులిమ్ము; సువర్ణ గ్రామ రత్నా దికమును అది కోరువారికిమ్ము. అనగా బలి పురుషోత్తమాః మూడడుగులతో అగునదేమీ? నూరడుగులో వేయి యడుగులో అడుగుము. ఆన వామనుడు 'దైత్యపతీ! ఆ మాత్రపు ధర్మబుద్ధితోనే కృతకృత్యుడను. నీవు ధనార్డులగు ఇతరులకు అది ఇత్తువు కాని.' అన విని మహాబాహుడా బలి మహాత్ము డగు వామనునకు పదతయమిచ్చెను. దాన జలము తన చేతియందు పడగానే వామనుడు ఆవామనుడయ్యెను. అతడు తత్తణమే సర్వదేవమయరూవమును చూ పెను.

 శ్రీవామనేన సర్వదేవమయ స్వరూపప్రదర్శనం.

 చంద్ర సూర్యులు నేత్రములు - ద్యులోకము శిరము --క్షితి-చరణములు పిశాచులు పాదాంగుళులు గుహ్యకులు హస్తాంగుళులు విశ్వదేవులు జానువులు సురోత్తములగు సాధ్యులు జంఘాలు యక్షులు నఖములు రేఖలు అప్సరసలు ఆ శేష జ్యోతిర్గోళములు దృష్టులు సూర్యాంశువులు కేశములు తారకలు రోమ కూపములు ఓషధులు రోమము విదిశలు బాహువులు దిశలు చేవులు ఆశ్వినులు శ్రవణము (ఆఇంద్రియతత్వము) వాయువు నాసిక ప్రసాద రూపుడగు చంద్రదేవుడు మనస్సు  జీహం దేవమాతయగు అదితి  గీవ-విద్యలు ముడుతలు సరద్వారము గుదము తంషయు పూషయు కనుబొమలు వైశ్వానరుడు ముఖము ప్రజాపతివృషణములు పరబ్రహ్మము హ్మదయము కశ్యపముని పుం స్వము వసువులు కృష్ణము మరుతులు సర్వసంధులు సర్వసూక్తములు దంతములు జ్యోతిస్సులు విమలకాంతులు మహాదేవుడు వక్షము మహాసముద్రములు హృదయము గంధర్వులు ఉదరము లక్ష్మీ మేధాధృతి కాంతులును నర్వవిద్యలును కటిదేళము నర్వజ్యోతిః కాంతులును అతని పర మహతేజస్సు వేదములు స్తనములును కుక్షియు మహామఖములు ఇష్టులు పశుబంధ ములు ద్విజులు ఆచరించు కర్మానుష్ఠానములును ఉదరము ఆ మహాత్మునక య్యెను.

త్రివిక్రమనియోగాద్బలేః పాతాళ గమనమ్.

మహాబలులగు దైత్యులును ఆ విష్ణుని సర్వదేవమయ రూపము చూచినంతనే మిడుతలు ఆగ్ని నీవలే ఆ దేవుని సమీపించిరి; ఆ విభుడంతట హ స్తపాద తలములతో పాదతలములతో అసురుల నెల్లరను నలుగగొట్టి మహాకాయ రూపము దాల్చి శీఘ్రమే భూమినెల్ల హరించెను; అతడు భూమిని దాటి విక్రమించుచుండ మొదట చంద్రాదిత్యులు అతని స్తనములనడుమ ఇమిడిరి; అంతరిక్షమును దాటి విక్ర మీంచుచుండ వారే తొడలకడకు వచ్చిరి; అంతకుమించి ద్యులోక మునుక్రమ్మి విక్ర మించుచుండగా వారే జానుమూలమునకు సరిపోయిర్; మహీపాలా! విష్ణుడు చేసిన దేవరక్షాకార్యమున నిట్లు జరిగెను; ఉరుక్రముడు (విస్తృత పాదవిన్యాసములు కల) విష్ణుడు లోకత్రయమును నిః శేషముగ జయించి అసుర పుంగవుల వధించి ఇంద్రునకు త్రైలోక్యమునిచ్చెను; ప్రభవిష్ణుడగు విష్ణు భగవానుడు వసుధాతలా ధోభాగమందలి సుతల మనెడు పొతొశాంశమును బలికిచ్చి ఆ సర్వేశ్వరేశ్వరుడా దైత్యేశ్వరునితో నిట్లనెను: నీచే దత్తమయిన సలిలమును నేను నాపాణితో గ్రహించిన దాని ఫలముగా నీకు కల్పప్రమాణముగల ఉ త్తమాయువగును; వైవస్వత మన్వంతరా నంతరము సావర్ణికమన్వంతరమున నీవింద్రుడవగుదువు; నేనిపుడఖిలతైలోక్యమును దేవరాజునకిచ్చితినిగదా! ఇక డెబ్బదియొక చతుర్యుగముల వరకు నేనతని శత్రువులను నా ఆదుపులోనుంతును; ఏలయన పూర్వమతడు పరమభక్తితో నన్నా రాధించియుండెను: నీవంతవరకు నేను నీకిచ్చిన మనోరమమగు సుతల రామక పాతాళము ననే నా యాదేశము నేమాత్రమును తప్పక పాలించుచు నటవసింపుము.

దివ్యాంగనాయుతమును ప్రాసాద శత సంకులమును ప్రవికసిత పద్మ సరోయుతమును ప్రవహమాణ నిర్మల నదీయుతమును సుగంధయుత ధూమ పుష్పమాలా వస్త్ర చామరాది విభూషితమును పుష్పమాలాచందనాదులచే సంతోష ప్రదమును గాన నృత్యములతో మనోరమమును నగు ఆ సుతలమునందు మహానురా! నీవు వివిధాన్న పొనాది భోగము అనుభవించుచు స్త్రీ శతపరివృతుడవయి నేను ఇపుడు - చెప్పిన ఈ కాలమంతయు ముగియువరకుండుము; దేవ బ్రాహ్మణు లతో విరోధము పూననంతవరకు నివీ భోగముల ననుభవింతువు; నీవది పనిననాడు నిశ్చయముగ వారుణ పాశములు నిన్ను వధించును; కావున ఇది ఎరిగి దైత్యనత్తమా! నాయాజ్ఞానుసారము ఈ పొర బాటు చేయకుండు ము; దేవ దేవుడును ప్రభ విష్ణుడునగు విష్ణువిట్లు పలుక విని బలి మోదముతో నమస్కరించి యతనితో నిట్లనెను: భగవన్! నీ యాజ్ఞతోనే పాతాళమున వసించునప్పుడు నాకు ఈ భోగములను సంపన్న మొనరించు ఉపాదానము (మూలసాధనము) ఏది? ఆన విష్ణువి విధముగా పలికెను.

(*దానాన్యవిధిదత్తాని శ్రాద్ధాన్యశ్రోత్రియాణిచ ।

హుతాన్యశ్రద్ధయా యాని తాని దాస్యంతి తే ఫలం.

అదక్షిణా స్తథాయజ్ఞాః క్రియాశ్చావిధినాకృతాః।

ఫలానితవదాస్యంతి అధీతాన్యవ్రతానిచ.)

నీవిదివరకు శ్రద్ధతో శ్రోత్రియులయందిచ్చిన దానములును అగ్ని యందు చేసిన హోమములును ఆచరించిన నదక్షిణాక వివిధ యజ్ఞములును ఆధ్యయనములును వేదవ్రతములును నీకాఫలమును అందజేయుచుండును; అని బలికి ఈ వరమునిచ్చి త్రిదివ రాజ్యమునీంద్రునకిచ్చి హరి మరల వామన రూపము నంది యనంతరము ఆదృశ్యుడయ్యెను; ఇంద్రుడు యథాపూర్వముగ పుష్టి సంపన్న త్రైలోక్య రాజ్యము నేలేను; బలియు పాతాళ మాశ్రయించి ఉత్తమ కామముల ననుభవిం చెను; ఆ దానవోత్తముడటనే ఆ దేవదేవునిచే బద్దుడె మరల దేవకార్యము నిర్వహింపనై ఈ జగమునందే వేచి యున్నాడు. మహాభాగా! అర్జునా! ఆ కృష్ణుడే ఇపుడు నీసంబంధి(బావమరదియే దానవ వినాశమును భూభారోత్తారణమును చేయబూని యదుకులమున జనించి ద్వారకయందున్నాడు; ఇక ముందు నీళత్రులను నిగ్రహించుటకై ఆ బలానుజుడే నీకు సహాయ భూతుడై సారథ్యము చేయును; మహావీరా! అర్జునా! వినగోరిన నీకు ఇట్లు ధీమంతుడగు వామనుని యవతార వృత్తాంతమంతయు తెలిపితిని. అనిన శౌనకునితో అర్జునుడిట్లనెను: విభూ! నేనడిగిన కేశవమాహాత్మ్యము ఇది నీచే వింటిని; ఇచటినుండి గంగాద్వారమునకు పోవుదును; అనుజ్ఞను ఇమ్ము; అని ముని యనుజ్ఞగోరి యర్జునుడేగెను: శౌనకుడును నే మీ శారణ్యమునకు పోయెను; ఇట్టి ఈ దేవదేవుడగు వామనరూపి విష్ణును త్తమ మాహాత్మ్యమును వినువారు సర్వపాపముక్తు లగుదురు; బలి ప్రహ్లాద బలి శుక్ర బలి విష్ణు సంవాదములను స్మరించు మానవుడు ఆధివ్యాధిమనోహములనందడు; రాజ్యభ్రష్టుడు రాజ్యమును ఇష్టజనవియుక్తుడు వారితోడి పొందును ఈ కథా శ్రవణఫలముగా నందగలడు.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున శ్రీ వామన చరిత్రమున విష్ణుడు బలిని పాతాళమున నియమించుట యనురెండు వందల నలువదియైదవ యధ్యాయము.