మత్స్య మహా పురాణము

Table of Contents

193 - అంకు శేశ్వర తీర్థాది మహిమానువర్ణనము - నర్మదా మాహాత్మ్య సమాప్తి॥ 

మార్కండేయుడు ధర్మజునకు ఇట్లు చెప్పెను; తరువాత ఆంకు శేశ్వరమను ఉత్తమ తీర్థము; ఆచటి ఆ అంకు శేశ్వరుని దర్శించినంతనే సర్వపాపముక్తుడగును; తరువాత నర్మదేశ్వర తీర్థము; ఈ ఉత్తమ తీర్థమున స్నానము చే స్వర్గ లోకప్రాప్తియగును; తరువాత ఆశ్వతీర్థము; ఆట కేగి స్నానమాచరించినచో చూడ ఇంపగు రూపము కలుగును; భోగ వంతుడగును; స్త్రీలకు ప్రీతిపాత్రుడగును; తరువాత పూర్వము బ్రహ్మ స్వయముగా నిర్మించిన ప్రేతామహ తీర్థము; అందు స్నానమాడి భక్తితో పితరులకు పిండదానము చేసి తిలదర ఏమిశ్రమగు జలముతో తర్పణము వదలినచో ఆ తీర్థ ప్రభా వమున ఆ పితృ కార్యమక్షయ ఫలప్రదమగును; తరువాత సావిత్రి తీర్థము; దానియందు స్నానమాడిన వారు బ్రహ్మలోక ప్రాప్తులగుదురు॥ అచ్చట నే మనోహరమును పరమ శోభనమునగు మనోహర తీర్థముగలదు; అందు స్నా నమాడినచో పితృ లోకప్రాప్తిచే సుఖించగలరు; తరువాత మానస తీర్థము॥ ఆందు స్నానమాడిన చో రుద్రలోక ప్రాప్తియగును॥ తరువాత అనుత్తమమగు కురు తీర్థము॥ అది త్రిలోక విశ్రుతమును-నర్వపాప ప్రణాశనమును॥ లోకమునందు మానవులు పడు పుత ధనాదికములను వేటిని వేటిని కోరుచుందురో అవన్ని యు ఈ తీరమున స్నానమాడినచో సిద్ధించును॥ తరువాత ఉత్తమమగు త్రిదశ జ్యోతి స్త్రీర్థము॥ ఆందు ప్రసిద్దలగు ఋషికన్యలు (కొందరు) మంచి వ్రత నియమముల నవలంబించి తమ కందరకును లోక ప్రభుడును అవ్యయుడునగు ఈశ్వరుడు ప్రతి కావలయునను సంకల్పముతో తపమాచరించిరి॥ అంతట శ్రీమహాదేవుడగు హరుడు॥ వారిని మెచ్చి ప్రశ సమగు (పలాశ) దండమును ధరించి బ్రహ్మచారియై వికృత మగు మొగము కలిగి అసహ్యము గొలుపు రూపముతో వచ్చెను॥ అయినను వారు పరమేశ్వరుని (గుర్తించి) వరించిరి; ఋషి కన్యలమగు మేము దేవదేవుడగు శివునకు పత్నులుగా దానము ఈయబడవలయును అని తపమాచరించిన ప్రదేశ మగుటచే దీనికి ఋషి (దశ) కన్యా తీర్థమను నామము ప్రసిద్దమయ్యెను॥ ఇందు స్నానమాడి శివునర్చించినచో సర్వ పాపము క్రియగును॥

తరువాత స్వర్ణ బిందుతీర్థము; ఆండు స్నానమాడిన వారికి దుర్గతి కలుగదు;తరువాత అప్పరస్ తీర్థము; ఇందు స్నానమాడినవారు నాగలోకమును పొంది ఆందు అప్సరసలతో సుఖింతురు; తరువాత అనరక తీర్థము; అందు స్నానమాడి శివునర్చించిన వారికి నరకప్రాప్తి యుండదు; తరువాత భార భూతి తీర్థ ము; ఇందు స్నానమాడి ఉపనా సమాచరించి శాంభ వావతార మగు విరూపాక్ష దేవుని అర్చించినచో రుద్రలోక ప్రాప్తులగుదురు; ఈ భార భూతితీర్థమునందు స్నానమాడినవారు మహాత్ములు; ఏలయన-వారు ఇందేకాక మరి ఎచ్చట మరణించినను గణేశ్వరులు గానయి శివసానిధ్య మందుట నిశ్చయము॥ ఇచ్చట కార్తీకమాసమున మహేశ్వరుని ఆర్చించినచో అశ్వమేధమునకు పదింతలుగా ఫలము కలుగునని విద్వాంసు లందురు; అందు నేతిదీపములు నూరు వెలిగించినచో సూర్య సమానప్రకాశ ఏమానముల పై శంకరుని సంనిధి కేగును; శంఖమువలే మొల్లపూవువలె చంద్రునివలే తెల్లనగు వృషభమును ఇచ్చట దానమిచ్చినచో రుద్రలోక ప్రాప్తుడగును; ఈ తీర్థమున గోదాన మొక టియెన చేసినను తేనేతో పాయసముతో కూడ వివిధ భక్ష్యములను యథాశక్తిగా బ్రాహ్మణులను భుజింప జేసినచో ఈ తీర్థప్రభావమున ఈ పుణ్య కార్యములలో ప్రతియొక టియు కోటిగుణితమగు ఫలము నిచ్చును; ఈ తీర్థము నాశ్రయించి యుండి ప్రాణత్యాగము చేసినవాడు శంకర లోకమున కేగును; ఇచట నర్మదా జలముత్రావి వృషధ్వజునర్చించినచో దుర్గతి కలుగదు; ఈ తీర్థ మున (ప్రాణ త్యాగమునకై) జలప్రవేశము చేసినచో హంసలను పూంచిన విమానము పై రుద్రలోక మేగును; చంద్రసూర్యులు హిమాలయము మహాసముద్రము గంగాది నదులు ఉన్నంత వరకు స్వర్గలోకమున సుఖపడును! నిరాహార తావ్రతముతో ఇచట ప్రాణ త్యాగము చేసిన వారికి పునర్జన్మ ముండదు॥

తరువాత ఆషాడీ తీర్థము; ఇది ఉత్తమము; అందు స్నానమాడినచో ఇంద్రుని ఆర్గాననములభించును; తరువాత యాతీర్థము॥ ఇది సర్వపాప ప్రణాశ కము॥ ఇందు స్నానమాత్రముచే గణేశ్వరుడే రుద్రలోక మున సుఖించును॥ తరువాత ఐరండీ (ఉపనది) నర్మదా నదుల సంగమపు తీర్థ ము॥ ఇది లోక విశ్రుత ము॥ ఇందు అనుదినము స్నానము చేయుచు వత పరాయణుడై ఉపవాసము చేయు చుండినచో బ్రహ్మ హత్యాదోష ముక్తి యగును॥ (ఈ పేరు లోగడ కూడ వచ్చినది)॥ తరుపోర నర్మదో సొగర సంగమ తీరము॥ దీని కే జామ దగ్న్య తీర్థమనియు నామాంతరము॥ ఇచట జనార్దనుడు సన్ని హితుడై యుండును॥ అతడిచ్చట సిద్ధినందెను॥ ఇచ్చట బహుయజ్ఞము లాచరించినందుననే ఇం దుడు దేవాధిపతి కాగలిగేను॥ ఇందు స్నానమాడిన నరుడు అశ్వమేధ ఫలమునకు మూడింతల ఫలమందును॥ ఇది పశ్చిమ సముద్రపు సంధియందు ఉన్నది॥ స్వర్గ ద్వారమును తెరచు పవిత్ర ప్రదేశ మిది॥ ఇచట దేవగంధర్వ ఋషి సిద్ద చారణాదులు ప్రాతర్మధ్యాహ్న సాయం సంధ్యలయందు దేవేశుడగు విమలేశ్వరుని ఆరాధింతురు॥ ఇందు స్నానమాడిన వారు రుద్రలోక ప్రాప్తులగుదురు॥ ఈ విమలేశ స్థానముకంటే గొప్పదియగు తీర్థము॥ ఇదివరకు లేదు॥ ఇక ముందుండదు॥ ఇచట ఉపవసించి విమలేశ్వరుని దర్శించి నవారు నప్త జన్మకృతమగు పాపములనుండి ముక్తులయి శివస్థానము చేరి సుఖింతురు॥

తరువాత కౌశికీ తీర్థము॥ ఇది ఉత్తమము॥ ఇందు స్నానమాడి శ్రద్ధతో ఒక ఆహోరాత్రము ఉపవసించి నియమపరుడే ఆహార నియమము పాటించినచో ఈ తీర్థ ప్రభావమున బ్రహ్మహత్యాదోష మోచనమగును॥ ఇచట సర్వ తీర్థ స్నానము చేసిన పుణ్యఫలమునిచ్చు సాగ రేశ్వర తీర్థము కలదు॥ ఇచట సాగరేశ్వరుడను శివుడు ఉన్నాడు॥ ఈ శివుడు సముద్రమునుండి యోజనము లోపలగా సముద్ర జలపు సుడుల నడుమనున్నాడు॥ ఆ తీర్థ మును అందలి విమలేశ్వరుని దర్శించినచో సర్వ తీర్థ దర్శనము చేసినట్లే యగును॥ తత్ఫలముగా నర్వపాప ముక్తియగును॥ రుద్రత్వము ప్రాప్తించును॥

నర్మదా తీర్థ మాహాత్మ్య ఫలశ్రుతి॥

నర్మదా నదికి ఆది స్థానమందున్న ఆమరకంటక పర్వత ప్రాంతము మొదలుకొని నర్మదా సాగర సంగమము నకు నడుమ పది కోట్ల తీర్థములున్న వి॥ తీర్థమునకును తీర్థమునకును నడుమ కోట్లకొలది ఋషులును ఉన్నారు॥ వారందరును అగ్నిహోత్రపరులు॥ ధ్యానపరాయణులు॥ విద్వాంసులు॥ వీరందరును అట ఉండుచు ఈప్సిత ఫలప్రదాత్రి యగు నర్మదను సేవించుచుందురు॥ ఈ నర్మదా తీర్గ మాహాత్మ్యమును ఎవరు శ్రద్దా భావముతో విందులో పఠింతురో అతనిని ఈ సమస్త తీర్థములును తమయందలి జలముతో అభి షేకించును॥ అన్ని తీర్థములయందు స్నానమాడినంత పుణ్యము లభించును॥ అత నియందు నర్మదకు ప్రీతి కలుగుట నిన్సంశయము॥ రుద్రుడును మార్కండేయుడును అతని పై ప్రీతులగుదురు॥ ఇది వినుటచే చదువుట చే గొడ్రాలికిని సంతతి కలుగును॥ దుర్బగ (మగని ప్రీతికి నోచు కొనని శ్రీ) కూడ సుభగ (భర్తకు ప్రీతిపాత్రము) అగును॥ కన్యకు తగిన భర్తతో త్వరగ, పెండ్లియగును॥ కోరిన కోరికలన్నియు తీరును॥ ఇందు సంశయము లేదు॥ బ్రాహ్మణునకు వేదార్ధ జ్ఞానసిద్దియు క్షత్రియునకు విజయమును వైశ్యునకు ధనలాభమును శూద్రునకు సద్దతియు లభించును॥ దీనిని మూడు సంధ్యలయందును పఠించుచుండినచో మూర్బుడును విద్యావంతుడుఅగును॥ నరకమునకు పోవరు॥ హీన నానులందు జన్మించరు॥

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మార్కండేయ యుధిష్ఠిర సంవాదరూపమగు నర్మదా మాహాత్మ్య వర్ణనమను నూట తొంబది మూడవ అధ్యాయము॥