మత్స్య మహా పురాణము
72 - అంగారక వ్రతము
ఈశ్వరుడిట్లు చెప్పెను: బ్రహ్మా! రూప సంపదలనొసగు మరియొక భవిష్య (ముందటి కాలమునకు పనికి వచ్చు) వ్రతము చెప్పెదను; నుము. నె మిశారణ్యమున తపస్సాచరించుచుండు తపోనిధియు ధర్మయుక్తుడునగు పిప్పలాదమునికడకు పోయి ధర్మపుత్తడగు యుధిష్ఠిరుడు ఆరోగ్యైశ్వర్యములు ధర్మమందు స్థిర బుద్ది అవికలాంగత్వము శివ విష్ణులయందు ధ్రువభ క్తి కలుగు నుపాయము తెలుపుమని అతనిని వేడును. పిప్పలాదుడతనికిట్లు చెప్పును: రాజా! చక్కగా అడిగితివి. అంగారక వ్రతమనునది కలదు. నీక దియంతయు చెప్పెను. ఈ విషయమున విగోచన భార్గవ సంవాదమను ఇతిహాసము పరంపరలో వినబడుచున్నది.
ఎట్లనగా ఒక మారు రాక్షస రుడు భృగు నందనుడు శుక్రుడు రూపమునను కాంతియందును నిరుపమానుడును పదునా రేండ్ల ప్రాయము వాడును ప్రహ్లాద పుత్తూడునగు విరోచనుని చూచి నవ్వుచు - బాగు- బాగు-మహాబాహూ! విరోచనా! నీకు క్షేమమా! ఆనెను. విరోచనుడతని చిరునవ్వు చూచి విప్రా! నన్ను చూచి అకారణముగా నీవేల నవ్వితివి? బాగు బాగనియు పలికితివి! ఏల? ఇదంతయు నాకు తెలుపుమనగా పురుషోత్తముడగు శుక్రుడతనికిట్లనెను: వ్రత మాహాత్మ్య విషయమై ఆశ్చర్యముతో నవ్వితిని. పూర్వము దశ వినాశమునకై కుపితుడై భయంకర ముఖుడై న త్రిశూలి లలాటము నుండి స్వేదబిందువులు క్రింద పడెను. వాటినుండి సప్తపాతాళముల భేదించుచు సప్తసాగరముల దహించుచు అనేక వక్షనయనుడును మండెడు అగ్ని వలే భీషణుడును పది వేల కరములు పొదములు ఆయుధములుగా కలవాడే మో యన దగిన వీరభద్రుడనునతడు జనించెను. అతడు యజ్గ ధ్వంసము చేసి మరల భూతలము చేరెను. అతడు మరల త్రిజగముల నిర్గ హించనుండ శివుడది వారించెను. వీర భద్రా! నీవు దక్షయజ్గ వినాశము చేసితివి. ఈ లోక దాహకృత్య - మిక చాలును. లోక) శాంతి ప్రదాతవయి సర్వగ్రహములలో నొకడవగుము. నావరమున జనులు విస్తరించి నీపూజ జరుపుదురు. భూమి ( పైపడిన స్వేద బిందువుల నుండి పుట్టిన నీవు అంగారు. డు (అంగారక 2 నిప్పుకణిక వలె ఉన్న వాడు) అని ఖ్యాతి నొందుదువు. నీరెండవ రూపము దేవ (ద్యు) లోకమునందుండును. (గ్రహముగా ఉండు రూపము అంతరిక్షమునందలిది.) చతుర్థి తిథియందు (మంగళ -అంగారకవారమునాడు) నిన్ను పూజించు పొరు అనంత రూపారోగ్యైశ్వర్యవంతులగుదురు. శివుడిట్లనగనే ఆ వీరభద్రుడు శాంతించి కామరూపుడు కాపున తత్ క్షణముననే గ్రహమై యంతరిక్షమున నిలిచెను.
ఇది ఇట్లుండ నీవు పూర్వ జన్మమున నొకప్పుడు శూద్రుడ నై ఉండి(ఎవరో) చేయు చుండిన అంగారక పూజను అతని అర్చామూర్తిని చూచుట తటస్థించెను. సురశత్రుకుల శ్రేష్ఠా! దానిచే నీవు రూపవంతుడ వయితివి. నీకుగల వివిధ. రుచి(కాంతి) చాలదూరమువరకు పోవుచున్నందున, “నీకు విరోచనుడు(వి.రుచ్) అను పేరు ఏర్పడినది. శూద్రుడు చేయు చుండిన వ్రతమును చూచినందువలన (అపుడు శూద్రుడుగా నుండిన) నీకు కలిగిన ఈ రూపసంపత్రి చూచి విస్మీతుడనయి స్మితము చేసితిని. ఈ వ్రత మాహాత్మ్య ముత్తమమని ‘సాధు..సాధు' 'బాగు - బాగు' అంటిని. వ్రతమును చూచినవానికి కూడ రూ పైశ్వర్యములు కలు' నే! 'చేసినవానికి కలుగునని) వేరుగా చెప్పనేల! ఏలయన.రాక్ష సకుమారా! నీవు వివేకవంతుడవై ధరణీ పుత్రుని పూజాదికమును గోదానాదికమును చూచినందుననే నీవు ఇట్లు రాక్షసరాజ గర్బసంజాతుడ వయితివి కదా!
(పిప్పలాదుడనేను:) మహాత్ముడగు భార్గవుని (శుక్రుని) ఆ మాటవిని ధీరుడు ప్రహ్లాదనందనుడు నగు విరో చనుడు విస్మితుడై మరల ఇట్లడిగెను: భగవన్! ఆ వ్రతమును జన్మాంతరమున నేను చూచిన ఆ వ్రతదానాదికమును లెస్సగా వినగోరుచున్నాను. ఆ వ్రత మాహాత్మ్య విధానములను యథావత్ గా చెప్ప వేడెదను.
చవితి మంగళవారము నాడు పద్మరాగమణి ధరించి ఉత్తరాముఖుడై “అగిర్మూర్గాదివః" అను మంత్రమును జపించుచు మృ తిక తో స్నానము చేయవలెను. శూద్రుడైన మంత్రము జపింపక యే చేయవలెను. భోగము లేవియు అనుభవించకుండ నిరాడంబరుడై యుండవలెను. పగలంతయు ఇట్లుండి) సూర్యుడస్తమించగనే ముంగిటిని గోమయ ముతో అలికి పుష్పమాలలతో అక్షతములతో అభ్యర్చనము చేసి ఆ చోట కుంకుమముతో అష్టదళపద్మము వేయవలెను. రక్తచందనముతోనైన వేయవచ్చును. నాలుగు గరిగ ఒక విధమగు మట్టిపాత్రలను భక్ష్యభోజ్యపదార్థములతో ఎర్ర వడ్ల బియ్యముతో పద్మరాగములతో నింపవలెను. (ఈ అలికినచోట) నాలుగు మూలలందు వాటిని వివిధ ఫలములను గంధమాల్యాది ద్రవ్యములను ఉంచి అంగారకునకు నివేదించవలేను. బంగారు కొమ్ములు వెండి గిట్టలు పిదుకుటకు కంచుపాత్ర దూడ కలదియు మెరయు వస్త్రములతో కప్పబడినది శ్రేష్టమయినది రత్నములు కలది సాధు స్వభావ అగు పాడి కపిలగోవును దానము చేయుదునని సంకల్పించి దానిని సిద్దపరచవలెను. పొడవయిన చతుర్బాహువులుకల సురూపు డగు పురుషుని విగ్రహమును బంగారముతో బొటనవ్రేలియంత పరిమాణముతో చేయించి ధాన్యముతో నింపిన తామ్రపాత్రము పైభాగమున బెల్ల ముంచి దాని పై ఈ ప్రతిమను నిలుపవలేను. ఇదంతయును సస్వరముగ సామవేద మును నేర్చిన వాడు జితేంద్రియుడు దానయోగ్యుడు మంచి శీలము వంశము కలవాడు కుటుంబి దంభములేనివాడు నగు విప్రునకు దాన మీయవలేను.
అర్ఘ్యదాన మంత్రము: “భూమిపుత్త్రాః మహాభాగా! శంకర స్వేద సంజాతా! సురూపముకోరి నిన్ను శరణు జొచ్చి నాను. నీకు వందనము. ఈ ఆర్య మందుకొనుము.” అను అర్థము నిచ్చు మంత్రముతో చందనోదకముతో అర్యమునిచ్చి రత్న మాల్యవస్త్రాదులతో బ్రాహ్మణు నర్చించి ఇదే మంత్రముతో గో మిథునముతో కూడ (ఆవును కోడెదూడను) సర్వోప కరణములతోడి శయ్యను లోకమున జనుల కిష్టమగునదియు తన ఇంటిలో తన కిష్ట మనిపించినదియు లభ్యమగునంతలో) సద్గుణవంతుడగు ఆ విప్రవర్యునకు ఇది అక్షయఫలదము కావలెననుచు దాన మీయవలెను. పిమ్మట ప్రదక్షిణపూర్వకముగా బ్రాహ్మణుని వీడ్కొనవలెను. పగ లుపవసించి) న క మున (రాత్రియందు) ఉప్పు కారము పులుపు లేకుండ నేతితో భుజించవలెను. ఎనిమిది కాని నాలుగు కాని చవితితోడి మంగళ వారములందు వ్రత మాచరించినవాడు జన్మజన్మము లందును రూపసౌభాగ్యసంపద యు విష్ణుశివులందు భక్తియు సప్తద్వీపాధిపత్యమును (ఇహలోకమున) అనుభవించి పర మున) డెబ్బదివేల కల్పములపాటు రుద్రలోకమున పూజితుడై సుఖించును. కావున దై త్యేంద్రా! నీవు ఈ వ్రత మాచ రించుము.
(పిప్పలాదుడు) ఇట్లుపదేశించి శుక్రుడు వెళ్లగా విరోచను డదియంతయు నట్లే చేసెను. కావున రాజాయుధి షిరా!) నీవును అక్షయఫలదమని వేదవేత్తలు చెప్పెడి ఈ వ్రతము నాచరించుము. అని పిప్పలాదుడు యుధిష్ఠిరునకు తెలి పేను.
ఈశ్వరుడు: అద్భుతశక్తియు ఆద్భుత కర్మాచరణమునుకల యుధిష్ఠిరుడును పిప్పలాదుని వచనము నాదరించి ఆ వ్రత మట్లే యాచరించెను. అనన్యచి తముతో దీనిని వినినవానికి భగవంతు డదే ఫలము నొసంగును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున అంగారకవ్రత కథనమను డెబ్బది రెండవ అధ్యాయము.
