మత్స్య మహా పురాణము
51 - అగ్ని వంశ వర్ణనము
ఋషులు సూతుని ఇట్లు అడిగిరి: సూతా! ద్విజులు సర్వకాలములందును ఆయా విహిత కాలములందు) ఆరాధింపవలసిన ఆయా అగ్ను లను ఆ అగ్నుల వంశములను ఆను పూర్వితో (దేని తరువాత ఏది చెప్పవలెనో ఆ క్రమ మున) చెప్ప వలసినదిగా కోరుచున్నాము.
(*ప్రథమం బ్రాహ్మణః స్మృతః; బ్రహ్మణః సుతః)
అనగా సూతుడు ఋషులకు ఇట్లు చెప్ప నారంభించెను: స్వాయంభువ మన్వంతరమున జరిగిన సృష్టియందు మొదట అవ్యక్త తత్వమునుండి వ్యక్తమయిన అగ్ని యను భూతమునకు అధిష్టాతగా ఉండు . అగ్ని యను దేవత చెప్ప బడెను. ఈ తత్వము అగ్న్యభిమాని దేవత యనబడును. (అగ్న్యభిమాని దేవత యనగా పంచ స్థూలభూతములలో ఒకటియగు అగ్ని అను పదార్థమును ఆశ్రయించి తాను ఉండి ఇది నాదియను నభిమానముతో వర్తించుచు అగ్నిని - ఆరాధించిన వారికి ఆయా ఫలములను ఇచ్చుచు అగ్నియందు చేసిన హవనాది ప్రయోజనములను ఇంద్రాది దేవతలకు అందించుచు ఉండు దేవతా తత్త్వము అని యర్థము. అగ్నియందు వ్యాపించియుండు దేవతా తత్వము ఇదియని తలచబడు తత్వము అనియును అర్థము.) ఈ అగ్ని దేవునకు స్వాహా అను పత్నియందు 1. పావకుడు 2. పవమానుడు 3. శుచి యను ముగ్గురు కుమారులు కలిగిరి. వీరిలో పవమానుడు భూర్ - భువః సువః అను మూడు ప్యాహృతులలో మొదటి వ్యాహృతికి అర్థము అగు భూలోకమునకు సంబంధించిన అగ్ని కి అధిష్టాత, అతని కుమారుడు. నిర్మథ్యాగ్ని (ఆరణులతో నిర్మథనము చేయుటచే ఉత్పన్ను డగు అగ్ని): పావకుడు అనునతడు భువః అను రెండవ వ్యాహృతికి అర్థమగు అంతరిక్ష లోకమునకు సంబంధించిన అగ్ని కి అధిష్టాత; అతని కుమారుడు. 5. వైద్యుతాగ్ని: శుచి అనునతడు సువః అను మూడవ వ్యాహృతికి అర్థమగు ద్యులోకమునకు సంబంధించిన అగ్ని కి అధిష్టాత; అతని కుమారుడు.6. సౌరాగ్ని. (పవమాన పావక -శుచుల కుమారుల ఈ రూపములు భౌతిక -జడ -రూపములు) ఇక ఈ మూడు అగ్నుల దేవతాత్మక రూపములగు కుమారులు ఇట్లు చెప్పబడుచున్నారు. పవమానుని దేవతా తత్త్వాత్మక కుమారుడు. 7. హవ్యవాహుడు హవ్యములను దేవతలకు కొనిపోయి అందించువాడు); పావకుని దేవతా తత్త్వాత్మక కుమారుడు. 8. సహర కుడు; శుచి అను అగ్ని కి కలిగిన దేవతా తత్వాత్మక కుమారుడు. 9. కవ్యవాహుడు (పితరులకు కవ్యము నందించువాడు) కావుననే హవ్యవాహుడు దేవతలకును సహరకుడు రాక్షసులకును కవ్యవాహుడు పితరులకును సంబంధించినవారు.
వారినందరను వేరువేరుగ వారివారి ప్రవృత్తి ప్రవిభాగముతో కూడ క్రమముగ చెప్పెదను.
ఈ చెప్పిన బ్రహ్మమానసపుత్రుడగు ప్రాథమికాగ్ని దేవుని తత్త్వ భేదమగు పావకుడను అగ్ని కి. భరతుడను కుమారుడు కలిగేను. ఇతనికే *బ్రహ్మోద(రా) నాగ్ని అనియు లౌకికాగ్ని అనియు దక్షిణాగ్ని అనియు వ్యవహారము. ఈ పావకాగ్ని కే మరియొక కుమారుడు. వైశ్వానరుడు. ఇతడు హవ్యమనెడు మహారసమును ఆయాదేవతలకు వహించును. (కొనిపోవుచుండును.) భృగుని కుమారుడు దధ్యజ్ అథర్వా- అను-ఋషి దక్షిణాథర్వా-అనియు-మరియొక పాఠము) అతడు ప్రపంచము అను పుష్కర (పద్మమును మథించి ఈ అమృతమును (దక్షిణాగ్ని ని) ఉత్పన్న మొనర్చెను. (అథర్వన్ అను ఋషికి కుమారుడు అంగిరుడు. ఇతడును అగ్న్యాత్మక తత్త్వముగా శ్రుతులలో ప్రసిద్ధుడు. ముఖ్యప్రాణ తత్వమును 'అంగిరా?' అని ఉపనిషదృషులు చెప్పినారు. 'అథర్వణః' 'అంగిరసః' అనువారు ఆథర్వణ మంత్రద్రష్టలుగా ప్రసిద్ధులు) ఈ దక్షిణాగ్ని కే పాచ్యః అన్వాహార్యపచనః ఇత్యాది వ్యవహారమును సంప్రదాయమునం దున్నది. అస్వా హార్యమనగా దర్శపౌర్ణమాసాదీష్టులయందు ఋత్విక్కులకు దక్షిణగా ఇచ్చు అన్న ము. అది దీనిపై పాకము చేయబడును కావున ఈ దక్షిణాగ్ని కి అన్వాహార్యపచనః అని శాస్త్ర వ్యవహారము.
లోగడ చెప్పిన నిర్మథ్యాగ్ని యగు పవమానుడు. త్రేతాగ్ను లలో) గార్హపత్యాగ్ని స్థానీయుడు. అతనికి 12.సభ్యుడు 13. ఆవనథ్యుడు అను ఇద్దరు కుమారులు. వీరి తల్లి శంసని అనునామె.
(*ఇచట ఉదర- శబ్దము 'ఉదరణా 'ఉదీరణా శబ్దములతో సమానార్ధకము. మాట-ఉచ్చారణము-వాక్కు- అని అర్థము. బ్రహ్మణ ఉదరణమసి-బ్రహ్మణ ఉదీరణమసి - అని శ్రుతి)
(పావకుడు దక్షిణాగ్ని స్థానీయుడును పవమానుడు గార పత్యాగ్ని స్థానీయుడు నైనట్లే శుచి ఆహవనీయాగ్ని స్థానీయుడగును. అట్టి ఆహవనీయాగ్న్యభిమానియగు దేవతయగు అగ్ని తాను యజ్ఞములందు స్థానము (ధిష్ఠ్యము) సంపాదించుకొనగోరి తను దా నుత్పన్న మొనర్చుకొనదలచి కావేరి.కృష్ణవేణి -నర్మద -యమున.గోదావరి. విత స్త-చంద్రభాగ-ఇరావతి-విపాశ - కౌశికి శతద్రూ సరయూ-సీతా.మనస్విని-హ్లాదిని.ప్లావని- అను పదునారు నదులయందును తన రూపమును పదునారుగా విభజించి విహరించుచు అవియే తనకు ధిష్ఠ్యములు (విహరణ స్థానములు) కాగా తాను ధిష్యేశుడు (ధిష్ఠ్యములకు ప్రభువు) అనబడెను. ఇట్టి ఆహవనీయాగ్ని తన ఆభిచారము (అభితః.అంతటను; చారః సంచ రణం-ప్రవృత్తి.చరించుట.తిరుగుట) వలననే తాను ధిష్ణ్యుడు అనియు వ్యవహరింపబడెను. అతడు విహరించిన స్థానము లన్నియు (నదులు) ధిష్ఠ్యములైనవి. ఇట్లు ధిష్ఠ్యములనబడు నదులయందు ధిష్ణ్యుడనబడు అగ్ని వలన జనించిన పదునారు మంది కుమారులకును *ధిష్టియులు-ధిష్ట్యజులు అను వ్యవహారము కలిగెను. ఇట్లు పదునారుమంది ఆహవనీయ పుత్తు లగు ఆగ్నులును నదీ పుత్రులై ఆ సంకేతము ననుసరించియే యాగశాలయందును ధిష్ట్యములనబడు త తోడశ నదీ సం కేత రూపములగు ఋత్విక్ట్రానములందు స్థితిని సంపాదించుకొనిరి.*
ఈ ధిష్ట్యాగ్నులు పదునారు మందియు ఉప సేయులు విహరణీయులు అని రెండు విధములుగా నున్నా రు. వీరందరును హవిర్వహులగు యజ్ఞములందు హత మొనర్చిన హవిస్సును వహించుకొనిపోయి దేవతలకు అందజేయు)వారే. వీరిలో ఆందరకుగల స్థానములును ధిష్ఠ్యములు ఐనను (ధిష్ట్యం అనగా ధిష్ట్యమోకో నివ సనం స్థానావసథ బాస్తుచ' అను అమర ప్రామాణ్యమున గృహము నిలుచు స్థానము అనియే అర్థము. ఐనను ఈ స్థానము ఉపమేయము. నియతమగుటచే ఉప-తస్మిన్నేవ స్థానే-ఆస్థానమునందే-సేయాః-ఉంచబడవలసినవారు;విహరణీయాః.విహరణం యథావశ్యకం స్థానాల్ స్థానం నయనం. అపి అరతి. ఆవశ్యకతను బట్టి ఒక స్థానము నుండి మరియొక స్థానమునకు తీసికొని పోబడుటకును ఆ ర్హులగువారు) వీనికి స్థితి భేదమును బట్టి సంజ్ఞా భేదమును కలిగినది. ఈ సంజ్ఞాభేదానుసారము వీరి విషయమును క్రమముగా తెలి పెదను: వినుడు.
(*అంగిరసో ధిష్ణియై రగ్నిభిః - అని యజురారణ్యకము; తృతియ ప్రశ్నము.
ఆర్య ఋషులు పూర్వకాలమున పవిత్రములుగా నెంచిన పదునారు నదులను తమ కర్మానుష్ఠానములందు సతతము స్మరించుటకు అనుకూలముగా ప్రవచించిన భావన ఇదియని తోచును. దీనికి అనుకూలముగానే యజ్ఞములందు ఋత్విజులును పదునారుమంది. వీరిలో ఎనిమిది మందిని అగ్నిరూపులనుగా భావించి చెప్పిన ఋక్-ఋగ్వేదమున ఇట్లున్నది.
తవ ప్రశాస్త్రం త్వ మధ్వరీయసి బ్రహ్మచాసి గృహపతిశ్చ నో దమే')
(*పావకాగ్నిః సమూహ్యస్తు ఉత్తరః సోగ్ని)
(*అనిర్దేశ్యో ; అంతర్దిశ్యో రుచ్యతే; పావకోన్యస్తు ముఖ్యః స్యా)
వీరిలో మొదట ఉప సైయాగ్నులను తెలి పెదను. శ్రుతులయందు 'స మాడసి కృశానుః' అని స్తుతించబడిన అగ్ని ద్వితీయోత్తర వేదియం దుండును. ద్విజులు యజ్ఞములందు అగ్ని ముఖమును. యజ్ఞమును. వితతము చేయబోవుచు ఇతనిని స్తుతింతురు. ‘పరిషద్యోఒసి పవమానః' అని శ్రుతులయందు స్తుతించబడిన అగ్ని రెండవ ఉప సేయాగ్ని; ఇతడు ధ్రువస్థలియం దుండును. 'ప్రతక్వాసి నభస్వాన్' అని స్తుతించబడు అగ్ని మూడవవాడు; ఇతడు చత్వాలమను శాలా భాగమందు స్థానము పొందియుండును. 'అసంమృష్ణో ఒసి హవ్యసూదః' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని నాలుగవ ఉప సేయాగ్ని; ఇతడు శామిత శాలయం దుండును. 'ఋతధామాసి సువర్ణ్యోతిః' అని శ్రుతులయందు స్తుతించబడు నతడు ఐదవ ఉపసేయాగ్ని; ఇతడు ఔదుంబరియను స్థానమునం దుండును; 'బ్రహ్మజ్యోతి రసి సువర్గామా' అని శ్రుతులయందు స్తుతించబడు ఆగ్ని ఆరవ ఉపసేయాగ్ని; ఇతడు బ్రహ్మ స్థానమునందుండును. 'అజో స్యేక పాత్' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని ఏడవ ఉప సేయాగ్ని; ఇతడు 'సుఖశాలా' అను స్థానమునం దుండును. 'అహిరసి బుధ్ని యః' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని ఎనిమిదవ ఉప స్టేయాగ్ని;. ఇతడు 'గృహపతి' . 'యజమాన’ స్థానమునం దుండును.
శంస్యుడు అనియు వ్యవహారముగల ఆహవనీయాగ్ని కుమారులలో ఉప స్థేయులనబడు అగ్న్యష్టకము విషయము ఇది.
(*అపాం యోనిః స్మృతశ్చాసీ త్పోతుర్నామ విభావ్యతే; తే క్షత్తానామ.
అతని కుమారులలో విహరణీయులనబడు మరి ఎనిమిదిమంది విషయము ఇక చెప్పెదను. ఏలయన యజ్ఞము వీతతమగునప్పుడు ఆయా సుత్యాహస్సులయందు తమ తమ స్థానములందు నిలిచియుండువారు కొందరును స్థానాంతర నయనమునకు (ఒక చోటినుండి మరియొక చోటికి కానీ పోబడుటకు) ఆర్డులగువారు కొందరునై ఈ అగ్నులు రెండు విధములుగా నుందురుగదా!
ఈ విహరణీయాగ్ను లలో 'విభూరసీ ప్రవాహణః' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని విహరణీయాగ్ను లలో మొదటివాడు. ఇతడు ఆగ్నీధ్ర స్థానీయుడు; 'వహ్ని రసి హవ్యవాహనః'. అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని విశేషము విహరణీయాగ్నులలో రెండవవాడు; ఇతడు హోత్రియ స్థానీయుడు; “శ్వాతో ఒసి ప్రచేతాః' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని విహరణీయాగ్నులలో మూడవవాడు. ఇతడు ప్రశా సృ స్థానీయుడు. 'తుథోసి_విశ్వవేదాః' అని శ్రుతులయందు ప్రశంసింపబడు అగ్ని విహరణీయాగ్నులలో నాలుగవవాడు; ఇతడు బ్రాహ్మణాచ్ఛంసిస్థానీయుడు. ఉశిరసి కవిః' అని శ్రుతులయందు ప్రశంసింపబడు అగ్ని విహరణీయాగ్ను లలో ఐదవవాడు; ఇతడు పోత్రియ స్థానీయుడు; 'అంధారీరసి బంభారిః' అని శ్రుతులయందు ప్రశంసింపబడుఅగ్ని ఆరవ విహరణీయాగ్ని . ఇతడు వేష్టియ స్థానీయుడు; ' అవస్యు రసి దువస్వాన్' అని శ్రుతులయందు ప్రశంసింపబడు అగ్ని విహరణీయాగ్ను లలో ఏడవవాడు; ఇతడు అచ్ఛా వాకీ య స్థానీయుడు; 'శుంధ్యు రసి మారారీయః' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని విహరణీ యాగ్ను లలో ఎనిమిదవవాడు; ఇతడుమార్జా(లీ)రీయ స్థానీయుడు.
ద్విజులచేత సోమసంస్థలనబడు యాగములందు గార పత్యాగ్నియందుండి ఆహరింపబడి యజ్ఞములందలి ఆహవనీయాగ్ని భేదములుగా ఉండి హవిర్వహనము (దేవతలకు హవిస్సును కొనిపోవుట) చేయు ధిష్ట్యాగ్నుల స్పష్ట ప్రతిపాదన ప్రకారము ఇది. (ఇంతవరకు 13+16 =29 అగ్ను లయినారు.)
(*కామో గృహే సంచతరతే)
అధ్వర్యుని కుమారుడు (ఆధ్వర్యు స్థానము నందుండువాడు) పావకుని కుమారుడు పావకాగ్ని సంబంధి) ఆవ భృథ స్నాన సమయమందు వరుణునితో పాటుగ ఆరాధించబడువాడునగు అగ్ని యొక డు కలడుగదా! అతని కుమారుడు హృదయుడు; ఇతడు మానవుల జఠరమునందుండి వారి ఆహారమును పచనము చేయుచుండును. అతని కుమారుడు మన్యుమాన్; ఇతడు దేవపుడను అగ్ని కి కుమారుడుగా (కూడ ) చెప్పబడును. ఈ అగ్ని పర స్సర ఘర్షణముచే జనించి చెల రేగి ప్రాణులను దహించివేయును. అతని కుమారుడు సంవ రకుడు; అతడు భయంకరుడు; ఇతడు బడ బో - ముఖ. రూపమున సముద్రముననుండి దానిని త్రాగుచుండును. అతని కుమారుడు సహర క్షుడు; అతని కుమారుడు క్షాముడు; ఇతడు నరుల గృహములయం దుండును. అతని కుమారుడు క్రవాదాగ్ని; ఆతడు మరణించిన పురుషులను తినుచుండును.
పావకాగ్ని పుత్తులుగానిద్విజులు పేర్కొను అగ్నులు వీరు ఆరుగురు.
(* “వీరస్యాగేః సుతః కంఠః కంఠస్యాగేః సుతః కవిః" అని ఒక పంక్తి ఉన్నది. దీనివలన శుచ్యగ్ని సంతానసంఖ్య పదునాలుగు కాక రెండు ఎక్కువై పదునారగును.)
(*సమ్హితాగ్నిస్తు ; పుత్త్రోదవానాగిస్తు)
(*సర్వస్మాదేవ లోఅకాచ్చహుతం హవ్యంభిభర్తియః.)
పూర్వము గంధర్వులు సూర్యునినుండి తెచ్చిన వసురూపుడు శుచియను అగ్ని; (ఇతడు వారిచే పురూరవునకు ఈయబడిన తరువాత వృక్షములయందు దాగగా మరల ఆ రాజు వారి యుపదేశముచే) అరణియందు మథించగా ఉత్పన్ను డై ఆగ్ని నుండి మరియొక యగ్ని అను క్రమమున ప్రజ్వలించుచు (లోకమున నీతడు నిర్మథ్యాగ్ని గానే ఉన్నాడు. అతని నామము *ఆయువు (ఇతడు ఊర్వశీ పురూరవసుల కుమారుడుగా ప్రసిద్ధుడనుట గమనింపదగినది.) ఈ ఆగ్ని భగవానుడు ఆహవనీయాగ్ని గా పశు యజ్ఞములందు ప్రణయనము చేయబడుచున్నాడు. అతని కుమారుడు మహిషుడు; అతని కుమారుడు సహసుడు; ఈతడు పాక యజ్ఞాభిమానియే వాటియందు వేల్చబడిన హవిస్సును అనుభవించుచుండును. ఈతని కుమారుడు మహాయశుడగు అద్బుతుడు. అతని కుమారుడు మహాన్) గొప్పవాడు పూజ్యుడు సర్వదేవాంశుడు అగు వీరుడు అనునతడు: (వీరుడను అగ్ని కి కుమారుడు కంఠుడు; కంఠుని కుమారుడు కవియనునతడు.) ఈ వీరుడు అనునతడు ప్రాయశ్చిత్త కర్మానుష్టానాభిమానియై యుండును. అతని కుమారుడు వివిధాగ్ని; వివిధాగ్ని కుమారుడు అర్కుడు; ఈతని కుమారులు ఎనిమిదిమంది. వీరిలో మొదటివాడు కామ్యాదిక ములగు ఇష్టులకు అభిమానియె యుడు రక్షోహా (రక్షాంసి - హంతి - రాక్షసులను చంపువాడు) అను ఆగ్ని ఇంకను ప్రతికృత్ (ఇతరులు చేసిన అపకారములకు ప్రతీకారము చేయువాడు) సురభి వసు మర్యాదుడు హర్యశ్వుడు రుక్మహన్ ప్రవరుడు క్షమపాన్ అను పోరును కలిసి వీరు మొ త్తము ఎనిమిదిమంది.
(*ఊర్వశీ పురూరువసుల పేరులలోని సామ్యము గమనింపదగినది. పురు-ఉరువన్>పురూరవన్; ఉ-రువన్-ఈ-(స్త్రీ వాచక ప్రత్యయము)> ఉర్(ఉ)వస్-ఈ> ఊర్వసీ>ఊర్వశీ)
ఈ పదునలుగురును శుచ్యగ్ని కి సంతానమగువారు. (ఇట్లు మొత్తము అగ్నులు 29+6+14 = 19.)
ఈ విధముగా అధ్వరములందు ప్రణయనము చేయబడు అగ్నుల విషయము ప్రతిపాదింపబడినది. వీరందరును సృష్టికి ఆరంభమునందు నుండియు యాములు అనబడు దేవ ! శ్రేష్టులతో కూడియుందురు (ఏక భావము నొందియుందురు.) వీరందరును పూర్వము స్వాయంభువ మన్వంతరమునందును ఆయా వైదిక కర్మానుష్టానములకు అభిమానులై విహర యులై (అర్ధము లోగడ చెప్పబడినది) సృష్టియందలి చేతనములు ఆచేతనములునగు పదార్థములయందు స్థానాభి మానులై ఆయా అగ్నులకు అభిమానులునై (ఈ స్థానమునకు వీరు అధిష్టాతలు అని విద్వాంసులచే భావన చేయబడు వారై -ఈ స్థానము నాది. ఈ స్థానమునకు నేను అధిష్ఠతను అను అభిమానము కలవారై) ఉండిరి.
ఇది యామదేవులలోని వారగు అగ్నుల విషయము. (ఆది కాలమున ప్రాయశ్చిత్తములును కామ్య కర్మాను ష్టానములును ఆభిచారిక కర్మములును ఉండలేదు. అందుచే ఆనాటికి యాములు అను దేవతలు మాత్రమే ఉండిరి. తరువాత ఈ కామ్యాది కర్మల ప్రవృత్తి ప్రజాపతి భావనలోనికి రాగా దీనికి అభిమానులగు మద్రులు అనబడు దేవతల భావన కర్మ కాండములలో ప్రవేశించినది.) ఇట్లు ప్రథమ మన్వంతరము అతీతము కాగా కామ్య నైమిత్తికాది కర్మలయందును పేత కర్మలయందును అభిమానులై యుండిన అగ్నులు ఏర్పడి యాములను దేవతలతోపాటు మందులనబడు అగ్నులయందును వీరు సమన్వయము పొందిరి.
ఇట్లు ఆయా జాతవేదసుల యోనులును (ఉత్పత్తి ప్రకారములును) సౌనా భిఖ్యలును (అధిష్టానమును బట్టి వచ్చిన నామములును) ప్రతిపాదింపబడినవి. ఈ విషయము గత మన్వంతరములయందు వలెనే వీరి విషయమున ప్రసంఖ్యాత (ప్రతిపాదిత) మయినది.
ఇదే విధముగ స్వారోచిష మన్వంతరము మొదలుకొని సావర్ణి మన్వంతరాంతముగా నుండు (స్వాయంభువము కాక మిగిలిన అన్ని) మన్వంతరములందును ఇంతవరకు గడచిన- గడచుచున్న- ఏడు మన్వంతరముల యందువలెనే నానారూప ప్రయోజనముల ననుసరించి అతీతులును వర్తమానులునగు ఆయా అగ్ని సంబంధులగు యామాది దేవ గణములతో కూడి ఆయా ఆగ్నులుందురు. ఇక ఆనాగత(రాబోవు) మన్వంతరములయందు రాబోవు ఆయా దేవ గణాంతర్బూతులగు వారితో కలిసి రాబోవు అగ్నులు ఉపాసింపబడుదురు.
ఈ విధముగా అగ్నుల వర్గము(ను వారి నామకర్మ ప్రవిభాగము)ను ఆనుపూర్వీతో సవిస్తరముగా నేను ప్రతి పొదించితిని. మరి ఇంకను ఏమి వినగో లేదో తెలుపుడు. అని సూతుడు ఋషులతో పలికెను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున ఆగ్ని వంశ వర్ణనమను ఏబది ఒకటవ అధ్యాయము.
