మత్స్య మహా పురాణము

Table of Contents

54 - నక్షత్రపురుష వ్రతము   

సూతుడిట్లు ఋషులకు చెప్పెను : ఇక మీదట (కర్మయోగ సంబంధులగు) దానములను ధర్మములను వ్రతము లను ఉపవాసములను యథా శాస్త్రముగా సమగ్రముగా తెలి పెదను. ఇవి అన్ని యు ధర్మ కామార్థ సాధకములు. మహాదేవ నారద సం వాద రూపములగు వీటిని మత్స్యనారాయణుడు మనువునకు తెలి పెను.  పూర్వము ఒకప్పుడు త్రిశూలి మన్మథ శత్రువు ఉమాదేహార్ధ ధారి అగు హరుడు కైలాస శిఖరమున కూర్చుండి యుండ నారదుడు అతని నిట్లడిగేను : “భగవన్! నీవు దేవదేవేశుడవు-బ్రహ్మ విష్టిందులకును ఈశ్వరుడవు. నీ యందో విష్ణునందో భక్తి గల పురుషుడు కాని సువాసిని అగు శ్రీ కాని యథాసంభవముగా సిరి ఆయువు రూపము భోగములు సౌభాగ్యము సమృద్ధిగ పొందుటకు అనుకూలించునదై క్రమముగ ము క్లినికూడ ఇచ్చు వ్రత మేదయిన నున్న చో తెలుపుము.” ఈశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను: నారదా! నీవు అడిగిన ప్రశ్నము సర్వలోక హితకరమయినది. ఇట్టి వ్రతము ఒకటి కలదు. దీనికి నక్షత్రపురుషవ్రత మని పేరు. పరమ పురుషుని శరీరమును నక్షత్ర రూపమున భావించి ఆర్చించుట); దీని యందు వాసుదేవుని ప్రతిమను పాదాదిగా నక్షత్ర నామములతో విష్ణు నామములు కీర్తించుచు అర్చించవలయును. చిత్ర మాస శుక్ల పక్షమున చంద్రుడు మూల నక్షత్రముతో కూడియున్న నాడి వ్రతము చేయవలెను, మొదట (సంకల్ప పూర్వక ముగా) బ్రాహ్మణులచే పుణ్యాహవాచనము జరిపించవలెను. పిమ్మట ఈ క్రింది విధమున పూజించవలెను.

 1. విశ్వధరాయ నమః-మూలే పొదౌ పూజయామి; 2. అనస్తాయ నమః- రోహిణీషు-గుల్ఫౌ పూజయామి, 8. వర దాయ నమః అశ్విన్యాం-జం మే-జానునీచ పూజయామి; 4. శివాయ నమః పూర్వాషాడాను ఉత్తరాషాఢసుచ-ఊరూ పూజ యామి; 5. పంచశరాయ నమః-పూర్వ ఫల్గున్యాం ఉత్తర ఫల్గున్యాంచ - మేడ్రం పూజయామి; 6. శార్జధరాయ నమః-కృత్తి కాసు కటిం పూజయామి; 1. కేశినిషూదనాయ నమః-పూర్వాభాద్రోత్తరాభాద్రయోః పార్శ్వే పూజయామి; 8. దామోద రాయ నమః. రేవతీషు-కుక్షి ద్వయం పూజయామి; 9. మాధవాయ నమః_అనూరాధాసు. ఊరఃస్థలం పూజయామి; 10. అమౌఘ విధ్వంసక రాయ నమః ధనిష్టాసుపృష్టం పూజయామి; 11. శ్రీ శంఖ చక్రగదాసీధరాయ నమః విశా ఖాను. భుజాన్ పూజయామి; 12. మధు కైట ధారయే మధుసూదనాయ నమః హస్తే-హస్తాన్ పూజయామి- 18. సామ్నాం అధీ శాయ నమః-పునర్వసౌ-అంగుళి పర్వభాగాన్ పూజయామి; 14. మత్స్య శ రీరిణే నమ: ఆ శ్లేషాసు-నఖాని పూజయామి; 15. కూర్మ రూపిణే హరయేనమః జ్యేష్టాసు-కంఠం పూజయామి; 16. వరాహ రూపిణే జనార్ధనాయ నమః-శ్రవణే-శ్రోత్రే పూజయామి; 17. దానవ సూద నాయ నర సింహాయ నమః-పు ష్యే-ముఖం పూజయామి; 18. కారణ వామనోయ నమః స్వాతీషు-దంతాగ్రం పూజయామి; 19. భార్గవ నందనాయ నమఃశతభిషకు ముఖం పూజయామి; 20. రఘునందనాయ రామాయ నమః. మససు-నాసికాం పూజయామి; 21. పరశురామాయ నమః-మృగశిరే-నేత్రే పూజయామి; 22. . శాస్త రూపాయ బుద్దాయ నమః-చిత్రాసు-లలాటం పూజయామి; 28. కల్కి రూపాయ నమః -భరణీషు శిరః పూజయామీ; 24. పురుషోత్తమాయ నమః. ఆర్దాసు. కేన్ పూజయామి.(ఇవి మొ త్తము ఇరువది నాలుగు).

 ఇట్లు ఆయా నక్షత దినములందు ఉపవాసముండి ఏ నక్షత్రమునాడు ఏ అవయవమును పూజించవలేనో ఆ అవయవమును ప్రధానముగా ఉద్దేశించి మిగిలిన సర్వావయముల పూజను కూడ చేయు చుండవలెను. ఈ విధముగా పూజిం చుచు ఆ నక్షత్ర దినములందు బ్రాహ్మణులను భోజన దక్షిణా వస్తాదులతో పూజించవలెను.

ఇట్లు వ్రతము పూర్తియైన తరువాత నర్వ సద్గుణములును ఉత్తమమగు వాక్కు రూపము శీలము కలిగి సామ వేదము నధ్యయనము చేసిన బ్రాహ్మణునకు ఈ చెప్పబోవు వానిని దానము చేయవలయును. 1. విశాలములయి పొడవయిన బాహుదండములు కలదియే ము తెములు ఇంద్రనీలమణులు వజములు తాపటము చేసిన విష్ణు స్వర్ణ ప్రతిమను బెల్లముతో నింపిన పాత్రయందుంచి దానిని-గోవును. వస్త్రములను ఆయా సాధన సామగ్రులతోను పాత్రలతోను కూడ మంచమును పడకను కూడ దానము చేయవలయును. ఇది కాక తనకు ఏదేది ప్రీతికర మో అది ఎల్ల తనహితమునకు గాను దానము చేయవలయును. “హిరణ్య గర్భ రూపా! అచ్యుతా! రుద్రరూపా! మా మనోరథములను సఫలము చేయుము.” అను అర్థ మిచ్చు పంతమును దానసమయమున పలుకవలెను. ఇట్లు బంగారుతో చేసిన విష్ణు ప్రతిమను లక్ష్మీ ప్రతిమతోకూడ భార్యతో కూడియున్న బ్రాహ్మణునకు (బ్రాహ్మణ దంపతులకు దానమీయవలెను. ముడులు పగుళ్లు లేని మంచమును శయ్యను కూడ ఈయవలెను. విష్ణువునకు అర్యమును కూడ ఈయవలెను. ఇట్టి విష్ణుభక్తులకు పాపములు తొలగును. ఏ పాపమును అంటదు. ఆరోగ్యము కలుగును. శయ్యా దానము చేయునప్పుడు “జనార్ధనా! నీ శయనము లక్ష్మీదేవితో శూన్యము కానట్లే కృష్ణా! నాశ యనము కూడ జన్మజన్మములందును శూన్యము కాకుండుగాక !" అను అర్థ మిచ్చు మంత్రము చేప్పవలయును.

ఇట్లు వస్త్రములను మాల్యములను గంధద్రవ్యములను పై చెప్పిన వాటిని నక్షత్ర పురుషత త్వ మెరిగిన బ్రాహ్మణునకు దాన మిచ్చి అతనిని వీడు కొనవలయును. ఈ ప్రతి నక్షత్ర దినమునందును ఉపవాసముండి తైలము లవ ణము (పులుపు కారము) లేని ఆహారము తినవలెను. ధనమున లోభము చూపక యథాశ క్తిగ భోజనములు పెట్టవలెను.

ఇట్లు నక్షత్ర పురుషవ్రతమును సమాప్తము చేసినవారికి సర్వకామములు (సంకల్పములు) నెర వేరును. విష్ణులోక ప్రాప్తియగును. తాను కాని తన పెద్దలు కాని చేసిన బ్రహ్మ హత్య మొదలగు పాపములన్నియు నశించును.

ఈ వ్రత విషయ) మును చదివినను వినినను వ్రతమును ఆచరించినను స్త్రీలకు కాని పురుషులకు కాని కలి దోషములన్నియు నశించును. సకలైశ్వర్యములు కలుగును. అన్ని కోరికలును తీరును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమను సం పోదమున నక్షత్ర పురుష వ్రతము అను ఏబది నాలుగవ అధ్యాయము.