మత్స్య మహా పురాణము

Table of Contents

166 - నారాయణ మార్కండేయ సంవాదము॥

మహాద్యుతియు (మహా ప్రకాశుడును) హంసరూపుడు (సంసార రూపానది ప్రవాహమయి సదా ప్రవ రిలు చుండువాడు) అగు నారాయణుడు పృథివీని నీటితో కప్పివేసి ఇట్లు ఏకార్ణవీ భూతమగు లోక మునందు మహార జోగుణరాశి మధ్యమున మహార్ణవ సరస్సుల । జలముల) యందు శయనించును॥ ఆతనినే రజోగుణ రహితుడు॥ మహాబాహుడు ( ఆధిక శక్తిశాలి) నాశరహితుడు అగు పరమాత్ముడని తత్వవేత్తలందురు॥ ఆ ప్రభువు అపుడు ఆత్మ (స్వ) స్వరూప మయి స్వయంసిద్ధమగు ప్రకాశముతోను తమో గుణాత్మకమగు ఆవరణముతో కూడ కప్పబడియుండును॥ సత్వగుణమయమగు మనస్సును సాధనముగా గ్రహించిన వారు మాత్రమే) ఆ సత్య తత్వము నుపాసించగలరు॥ బ్రహ్మ తత్వమునకు సంబంధించిన యథాతథ పరమజ్ఞానము ఆరణ్యక రహస్యము అనబడు ఉపనిషత్ నందు (ఉపనిషత్ అనగా రహస్యమని యర్థము) ప్రతిపాదింపబడినది; ఆ తత్వమున కే పురుషుడనియు బ్రహ్మమనియు పేరులు; అతని కంటే ఇతరులగు పురుషులు లేరు కావున అతడే పురుషోత్తముడు; యజ్ఞము నిర్వహించు ఊఋత్విజులును విప్రులును యజ్ఞ ములును ఇతరములగు॥ దేవతారాధనలు ( ఇజ్యలు)ను ఆ పురుషో త్తము నుండియే జనించేను॥

 ప్రజాపతి దేహమున వీరి ఉనికిని ఈ విధముగా చూపవచ్చును :

(అతడు తననుండి పదునారు మంది ఋత్విజులను జనింపజేసిన క్రమము: ముఖమునుండి బ్రహ్మ సు సామ వేద జ్ఞుడగు ఉద్దాతను - బాహువులనుండి హోతను ఆధ్వర్యుని బ్రహ్మ హృదయము నుండి బ్రాహ్మణాచ్చంసినీ ప్రస్తో తను వీపునుండి మైత్రావరుణుని ప్రతి ప్రస్థాతను॥ ఉదరమునుండి పోతను ప్రతిహర్తను - తొడలనుండి అచ్చా వాకుని నేషను - ముంజేతులనుండి ఆగ్నీధ్రుని ॥ మోకాళ్ళనుండి సుబ్రహ్మణ్యునీపాదములనుండి గ్రామ స్తుత్ ను॥ ఉన్నే తను-ఇట్లు సర్వయజ ప్రవర్తకులగు ఋత్విజులను సృజించెను॥ ఈ హేతువుననే ఈ పరమ పురుషునకు వేదమయుడనియు యజ్ఞ పురుషుడనియు నామము॥ వేదములును వేదాంగములును ఉపనిషత్తులును యాగాది క్రియలును ఈ భగవన్మయములే॥ )

ప్రజాపతి దేహావయవములుగా షోడశ (16) ర్విజులు॥


 

అవయవములు:

వక్త్రము-

బాహువులు-

హృదయము –

వృష్ట (పార్శ్వ)ము॥

ఉదరము-

ఊరువులు-

పాణులు॥జానువులు

పాదములు

ఋత్విజులు

1॥ బ్రహ్మ

2॥ ఉద్దాత

3॥ హోత

4॥ ఆధ్వర్యువు

5॥ బ్రాహ్మణాచ్ఛంసి

6॥ ప్రస్తోత

7॥ మైత్రావరుణుడు

8॥ ప్రతిప్రస్థాత

9॥ పోత

10॥ ప్రతీహర్త

11॥ అచ్చా వాకుడు

12॥నేష్ట

13॥ అగ్నీధ్రుడు

14॥ సుబ్రహ్మణ్యుడు

15॥ గ్రావస్తుత్

16॥ ఉన్నేత

ప్రధానులు

1॥ బ్రహ్మ                      2॥ ఉద్దాత      3॥ హోత        4॥ అధ్వర్యువు

సహాయులు

5॥ బ్రాహ్మణాచ్ఛంసి    6॥ ప్రస్తోత 7॥ మైత్రావరుణుడు 8॥ ప్రతివ్రస్థాతా 9॥ పోత

10॥ ప్రతిహర్తా 11॥ అచ్చావాకుడు 12॥ మేష్టా ॥ 13॥ ఆగ్నీధ్రుడు 14॥ సుబ్రహ్మణ్యుడు

15॥ గ్రావస్తుత్ 16॥ ఉన్నే తా॥

A drawing of a map

Description automatically generated

*అతడు తననుండి పదునారు మంది ఋత్విజులను జనించజేసిన క్రమము: ముఖమునుండి బ్రహ్మను సామ వేదజ్ఞుడగు ఉద్గాతను బాహువులనుండి హోతను అధ్వర్యుని బ్రహ్మ ' (హృదయము నుండి) బ్రాహ్మణాచ్చంసిని ప్రస్తో తను వీపునుండి మైత్రావరుణుని ప్రతి ప్రస్థాతను॥ ఉదరమునుండి పోతను ప్రతిహర్తను ॥ తొడలనుండి ఆచ్చావాకుని నేషను - ముంజేతులనుండి ఆగ్నీధ్రుని ॥ మోకాళ్ళనుండి సుబ్రహ్మణ్యుని పాదములనుండి గ్రావస్తుత్ ను ఉన్నతను- ఇట్లు సర్వయజ ప్రవర్తకులగు ఋత్విజులను సృజించెను॥ ఈ హేతువుననే ఈ పరమ పురుషునకు వేదమయుడనియు యజ్ఞ పురుషుడనియు నామము॥ వేదములును వేదాంగములును ఉపనిషత్తులును యాగాది క్రియలును ఈ భగవన్మయము లే॥ 

(* ఈ పదునారుమంది ఋత్విజులలో బ్రహ్మ॥ ఉద్గాత హోత ఆధ్వర్యువు అను నలుగురును ప్రధానులు; మిగిలిన పండ్రెండు మందిలో బ్రాహ్మణాచ్ఛంసి॥పోతా- ఆగ్నీధ్రుడు-అను మువ్వు 1 ను బ్రహ్మకును ప్రస్తోతా॥ప్రతిహర్తా॥ సుబ్రహ్మణ్యుడు॥ అను ముగ్గురును ఉద్గాతకును॥ మైత్రావరుణుడు॥ ఆచ్చావాకుడు॥ గ్రావస్తుత్-అను మూవురును హోత కును॥ ప్రతి ప్రస్థాత॥నే॥ ఉన్నత-అను త్రయమును అధ్వర్యునకును యజ్ఞ నిర్వహణమున సహాయులుగా నుందురు॥ 

ఆశ్వలాయన శ్రాత సూత్రములు॥పూర్వషట్క-చతుర్థాధ్యాయారంభము) స్నాతకుడు (గురుకులమున వేద విద్యా ధ్యయనము చేసి విద్యా సమాప్తి వ్రత స్నాన మొనర్చిన యాతడు కాని బ్రహ్మచారి (గురుకులమున వేద విద్యా ధ్యయన మొనర్చువాడు కాని ఉపకుర్వాణ బ్రహ్మచారి) కాని మరెవ్వరైన దీక్షితుడు (ఆదివరకే యజ్ఞ మాచ రించిన పవిత్ర జన్ముడు॥) కాని ఉన్నతకు దీక్ష ఇచ్చును॥ ఉన్నత-నేష్టకు ఆగ్నీ ద్రునకు-సుబ్రహ్మణ్యునకు గ్రావస్తుత్ కు॥దీక్ష ఇచ్చును॥ నేష్ట-ప్రతి ప్రస్తాతకు పోతకు॥ప్రతిహరకు ఆచ్ఛావాకునకు దీక్ష ఇచ్చును; ప్రతి ప్రస్థాత॥ అధ్వర్యునకు-బ్రాహ్మణాచ్ఛంసికి॥ ప్రస్తోతకు॥ మైత్రావరుణునకు దీక్ష ఇచ్చును॥ అధ్వర్యువు-గృహపతికి (యజమానునకు)- బ్రహ్మకు - ఉద్గాతకు-హోతకు దీక్ష ఇచ్చును॥ శతపథ బ్రాహ్మణము-మధ్యమకాండము 16; 1 బ్రా॥) 

పూర్వ మొక ప్రళయ సమయమున ఏకార్ణవ జలమున ఈ పురుషోత్తముడు నిద్రించుచుండ జరిగిన యాశ్చర్య కుతూహలకర విషయమును తెలిపేదను వినుడు॥ బహు సహస్ర వత్సరాయువుగల మార్క) డేయ మహాముని ఆ భగ వాసునిచే ప్రళయ సమయమున మింగ బడి ఆతని కుక్షి యందు ఆ దేవుని తేజస్సులోనే వ్యాపుడై యుండెను॥ అచటనే తీర్థయాత్రా ప్రసంగమున పృథివియందు సంచరించుచు పుణ్యములగు తీర్థములందు ఆ శ మములందు దేవాలయములందు దేశములందు రాష్ట్రములందు విచిత్రములగు వివిధ పురములందు సంచరించుచు జపహోమపరుడును శాంతుడునునె ఘోర తపస్సాచరించెను॥ అతడు మెల్లగా అతని నోటినుండి వెలికి వచ్చుచు ఇది ఈ భగవానుని మాయవలననే జరుగుచున్న దని గుర్తించేను॥ వేలికి వచ్చిన తరువాత అతడు జగమంతయు ఏకార్ణవమయి ఆంధకారావృతమయి యుండుట చూచేను: అతనికి తీవ్ర భయమును తన జీవితము విషయమున బ్రదుకుదునా లేదాయను) సంశయమును కలిగెను॥ అతడు భగవ దర్శనము చే సంతుష్టు డయ్యెను; మిగుల ఆశ్చర్యమును కూడ పొందేను॥ అత డట్లు జలమధ్యమం దుండియే భయముతో నా చిత్తమునం దీదియేమయిన మోహము కలిగేనా స్వప్నము ననుభవించుచున్నా నా? అనుకొనెను॥ ఒక వేళ ఆ జగత్పదార ములు ఒక విధముగా నుండగా మరియొక విధముగా నున్న వని (నశించకయున్నను నశించినవని) నేనే పొరపడుచున్నా నేమో ! ఏలయన జగత్తునకు ఇంతటి క్లేశము (నాశము) సంభవించుట యుక్తము కాదు గదా! చంద్ర రవి వాయువులును పర్వతములును భూతలమును నశించిన తరువాత ఈ లోకము ఏ లోకమని భావించవచ్చును? అని చింత నందుచుండగనే ; పురుషుడు నిద్రించుచు కనబడెను॥ అతడు మేఘమువలే సముద్రమునందు మునిగిన సగము శరీర

తేజస్సులతో వేడిమి నిచ్చుచు కిరణయుకుడగు భాస్కరుడువలే నత డుండెను॥ స్వ తేజస్సులతో వెలుగుచు రాత్రియందు కూడ మేల్కాంచినవాడువలే నుండెను॥ జగమంతయు చీకటితో నిండి రాత్రివలే నుండెను॥ ఆ మహాపురుషుడు మాత్రము మేల్కాంచి యుండెను॥) “నేను భగవానుని దర్శించుటకు వచ్చితిని; మరి నీ వెవ్వడవు?” అని మార్కండేయుడా పురుషునితో అనుచుండగనే మరల మార్కండేయుడు భగవానుని కుక్షి యందు ప్రవేశింపజేయబడెను॥ మార్కండేయు డట్లు మెల్లగ కుడియందు ప్రవేశించి మిగుల విస్మయపడుచు ఇదియంత యు స్వప్న దర్శనమని భావించుచు మరల ఎప్పటివలే భూ సంచారము చేయుచు ఆ దేవుని కుడియందు పుణ్యతీర్థ జలములను వివిధాశ్రమములను సమగ్రము లును  శ్రేష్టములును నగు ద॥క్షిణలతో యజనము చేయుచున్న యజమానులను వారి చే యజింప జేయబడుచున్న యాజకులను వందలకొలది మంది బ్రాహ్మణులను చూచెను॥ వారేకాక బ్రాహ్మణాది వర్ణములవారు సద్వర్తనులయి నేను మత్యుడు నీకు తెలిపిన ఆయా వర్ణాశ్రమ ధర్మములను లెస్సగ ఆచరించుచు అతనికి కనబడిరి॥

ఇట్లా ధీమంతుడగు మార్కండేయుడు సంపూర్ణముగ నూరేండ్లు పృథివీ సంచారము చేసినను భగవానుని కుక్షికి కొన మాత్రము దొరుక లేదు; కాని ఆట్లు సంచరించుచునే ఒకానొకప్పు డతడు ఆ కుక్ష్మి నుండి వెలికి వచ్చెను॥ అతని కీ మారు మరికొమ్మ పై నిద్రించుచున్న బాలు డొకడు - నబడెను॥ అత డ డై ఏకార్ణవ జలమున మంచుతో కప్పబడిన ఆంతరిక్షము నడుమ ఏ ప్రాణియును లేని లోకమున అవ్యక్త రూపుడై క్రీడించుచుండెను॥ ఆ మువి విస్మయా విష్టుడును కుతూహలవంతుడును నయ్యెను॥ కాని సూర్య సమానుడగు ఆ బాలుని మాత్రము సమగ్రముగా పరిశీలించి చూడ జాలక సోయెను॥ ॥ అత డపుడు ఏకాంతమందు జల-సన్నిధియందు స్థానమందు) నిలిచియుండి ఎంత యో ఆలోచించెను॥ ఇది ఏమని ఆలోచించుచునే ఇది నే నిదివరకు చూచినదేయని అత డనుకొనెను॥ ఆ దేవుని మాయతో భయపడెను॥ మిగుల ఆశ్చర్యముతో అతడు ఆ ఆగాధ సలిలమందు తేలుచు ఈదులాడుచు మిగుల శ్రమ - చెందుచు భయగ్రస్త లోచను డయ్యెను భగవానుడగు ఆ యోగి బాలుడు అతనికి స్వాగతము పలికెను॥ ఆ పురుషోత్తముడు మేఘ సమాన ధ్వనితో “నాయనా! మార్కండేయా! భయపడకుము॥ నా దగ్గరకు రమ్ము॥” ఆనేను॥ “నా తపమునకు పరాభవము కలిగించుచు దివ్యవర సహస్రముల పరిమాణముగల॥ నా వయస్సును ఆలక్ష్యము చేయుచు నన్ను పేరుతో పిలుచుచున్న ఈత డెవ్వడు? ఈ నీ తక్కువపరచు నడువడి దేవతలయందు కూడ నేను ఆలవాటుగా చూచియుండలేదు॥ దేవేశుడగు బ్రహ్మ కూడ నన్ను 'దీరాయూ!' అని పలుకరించును॥ ఇట్టి నన్ను తాను ఘోరాంధకారమందుండియు జీవిత త్యాగమునకును సిద్దపడి మార్కండేయా! అని నన్ను పిలిచి మృత్యువును దర్శింపగోరుచున్న ఈత డెవ్వడు?” అని॥ మార్కండేయ మహాముని పలికినంత భగవానుడును మధు సూదనుడు నగు బాలుడు మరల ఆట్లే మేఘ గంభీర ధ్వనితో ఇట్లు పలికెను: ॥

నాయనా! నేను నీ తండ్రిని; హృషీ కేశుడను; హృషీక ములకు॥విషయేంద్రియములకు॥ ఈశుడను) మహాగురు డను గురువులకును గురుడను॥) నీకు (నులోకమందలి ప్రాణులకును) ఆయువును ఇచ్చువాడను; పురాణ (ప్రాచీనతమ)

తత్వమను నేనే; నీవు నా కడకు రాకున్నా వేల? మొదట పూర్వకాలమున నీ తండ్రియగు ఆంగిరస అంగిరో వంశజుడగు) మృకండుముని పుత్రుల కోరి తీవ్ర తవ మాశ్రయించి తల్సాధనమున నన్ను మెప్పించెను; అమిత శక్తివంతుడవగు నీవు కుమారుడుగా కావలెనని వర మడిగెను॥ ఆత్మనిష్ఠుడు ఆ మీతేజః శాలియగు ఆతని కోరికకు నేను సరే యంటిని॥ సర్వ భూతాత్ముడగు ఆటి మహర్షి కుమారుడు కాక మరెవ్వరు ఏకార్ణవగతుడయి యోగమాయతో క్రీడించు నన్ను చూడగలడు? ఆనగా దీర్ఘాయుష్కుడు లోకపూజితుడు మహా తపస్కుడగు మార్కండేయుడు హర్ష పూర్ణ హృదయముతో ఆశ్చర్యమున విప్పారిన కన్నులతో॥ తల పై నిలిపిన దోసిలితో తన పేరును గోత్రమును పేర్కొని నారాయణుని నమస్కచెను॥ పూజ్య భగవన్! నీవు బాలరూపుడవై ఏకార్ణవమందున్న హేతువును నీ మాయకు గల వా స్తవ రూపమును తెలియగోరు చున్నాను॥ ప్రభూ! భగవన్ ! నీవు ఏ సంజ్ఞ(నామము )తో లోక మున వ్యవహరింపబడుదువు? నీవు మహాత్ముడ(పర మాత్ముడవని యూహించుచున్నాను॥ కానిచో మరి ఎవ్వరు ఈ ఏకార్ణవ జలమున ఉండగలరు? అనేను॥

బ్రాహ్మణ శేషా! నారాయణుడు *సర్వకారణుడు సర్వపోషకుడు॥ సర్వ స్థితికర్త సర్వనాశ కుడు సహస్ర శీరాది పదములతో వ్యవహరింపబడువాడు ఆదిత్యవర్ణుడగు పురుషుడు యజ్ఞమం దారాధింపబడు బ్రహ్మ(వేద)మయ పురుషుడు యజ్ఞము హవిస్సును వహించు ఆగ్ని జలచర ప్రాణుల కధిపతియగు సముద్రాధి దేవత (వరుణుడు , అవ్యయ (ఏ మార్పును లేని తత్త్వము ఇంద్రుని నామములలో శక్రవదముచే వ్యవహరింపబడు తత్వము వర ములలో పరివత్సరము (ఆనేడు వర్షము) యోగి యుగాది యుగాంతము వర్షము సర్వ రత్నములు సర్వ దేవతలు సర్పములలో శేషుడు సర్వ పక్షులలో గరుత్మంతుడు సర్వ భూతములందు కాల సమానుడగు యముడు ఆయా ఆశ్రమ ధర్మములందుండు వారి ధర్మ తపస్సులు దేవనదియగు గంగ క్షీర సాగరము పరమ సత్యము ప్రథమ ప్రజాపతి సాంఖ్యము యోగము పరమ పదము దేవతా 7 ధన (ఇజ్యా) క్రియ విద్యాధిపతి అగ్ని వాయు పృథివ్యాకాశ జలములను పంచభూతములు సముద్రములు నక్షత్రములు దశ దిశ లు నేనే॥

(* శ్లో॥50 సర్వభూః: సర్వం భవతి అస్మాత్॥ ఈ విశ్వమంతయును ఈతని నుండియే కలుగును; కావున సృష్టిక ర్త, 

సర్వం॥ భవతి అస్మిన్ అనేన; ఈ విశ్వమంతయును ఈతని చేతనే ఈతనియందే నిలిచియుండును; కావున 'స్థితి'కర్త॥ 

ఇట్లు ఈ రెండు అర్థములును ఇచటి 'సర్వభూః' అనెడు పదమునుండియే లభించును॥ )

వర్షము సోముడు (ఓషధులకు పుష్టి నిచ్చు దేవత) పర్జన్యుడు మేఘాధిష్టాన దేవత) రవి క్షీర సాగరము సముద్రమందలి బడబాగ్ని సంవర్తకాగ్ని అయి ప్రళయమున జలము హవిస్సును శ్రావు అగ్ని -పురాణ(అతి ప్రాచీన) త త్వము పరాయణము (ఎల్ల భూతములకును చివరి గమ్యము) భూత భవిష్యద్ వర్తమానములకు ఆదికారణము - విప్రాః నీవు చూచునది వినునది అనుభవించునది అంతయు నేనే అని తెలియుము॥ పూర్వము సృజించునది ఇపుడు సృజింపబడ నున్నది అంతయు నేనే॥ యుగయుగమునందును నేనే అఖిల జగమును సృజింతును॥ నీవును నా కుక్ష్మి యందు సుఖ ముగా సంచరించుచు నేను వ్యవస్థ చేసిన ధర్మములను ఎరుగుచు ఉండుము॥ బ్రహ్మ యు దేవతలతో ఋషులతో కూడి నా శరీరమందే యున్నాడు॥ వ్య క్తము అవ్య క్తము అగు తత్వములును అసుర' నాశకుడును ఏకాక్షర మంత్రమగు అకారము త్ర్యక్షరమగు తారకసంసారమునుండి తరింపజేయు ప్రణవమంత్రము నేనే; ధర్మార్థ కామము లనెడు మూడు పురుషార్థములను (వేదరూపమున నిరూపించుచు ఈ త్రివర్గముకంటె ఆవల నున్న తత్త్వమును నిరూపించు ఓంకారమును నేనే; ఆని ఈ మొదలగునవి చెప్పుచునే మహామతిశాలియు పురాణుడునగు ఈశ్వరుడు నారాయణుడు మార్కండేయ మహా మునిని తన నోటిలోనికి తెచ్చుకొనెను॥ అంతట ఆ మునిస ముడును భగవానుని కుక్ష్మియందు ప్రవేశించి ఏకాంతమున అవ్యయుడు హంసరూపుడును అగు భగవానుని సేవించుచుండెను॥ వివిధ తనువుల ధరించి లోకముల ప్రవర్తింప జేసి చంద్ర సూర్యులునులేని మ హైకార్ణవమున ఈ వివిధ రూపములతో మెల్లగా సంచరించుచు మరల కాలము వచ్చినపుడు తత్పరిణామానుసారము జగములను సృజించుచు విహరించు హంసరూప భగవానుని స్వరూపము ఇది॥

ఇది శ్రీమత్స్య మహాపురాణమున నారాయణ మార్కండేయ సంవాదమను నూట ఆరువది ఆరవ అధ్యాయము॥