మత్స్య మహా పురాణము

Table of Contents

11 - సూర్యవంశానువర్ణనము

ఋషులు సూతునితో ఇట్లు పలికిరి: మీరు పురాణ తత్వమును ఎరిగినవారు. తాము మాకు సూర్యచంద్రవంశ ముల వృత్తాంతములను సంప్రదాయమున ప్రతిపాదింపబడిన విధమున యథా క్రమమున తెలుప వేడుచున్నాము.

సూతు డిట్లు చెప్పనారంభించెను: పూర్వము కశ్యప ప్రజాపతికి అదితి యందు సూర్యుడు, కుమారుడుగా జనిం చెను. అతనికి సంజ్ఞా రాజీ ప్రభా అనువారు ముగ్గురు భార్యలు. రేవతుని కూతురు రాజ్లి, ఆమె కుమారుడు రైవతుడు, ప్రభా కుమారుడు ప్రభాతుడు. త్వష్ట ఆను ప్రజాపతి కూతురు అగు సంజ్ఞకు వైవస్వతుడను మనుపును యముడు యమున అను కవలును కలిగిరి. సూర్యుని తేజోమయమగు రూపమును సహింపజాలక సంజ తన శరీరము నుండి పవిత్రురాలును సుందరియు నగు స్త్రీని జనింపజే పేను. ఆమేయును సంజ్ఞరూపములో సమానమగు రూపము కలిగియుండెను: ఆమె పేరు ఛాయ. నేనిపు డేమి చేయవలయును? అనుచు తన ఎదుట నిలిచిన ఛాయతో సంజ్ఞ ఇట్లనెను: నీవు స్త్రీలలో ఉత్త్రమురాలవు. నీవు నా భర్తను భర్తగా గ్రహించియుండుము. నా సంతానమగు ఈ ముగ్గురను ప్రీతితో రాపాడు చుండుము. అని సంజ్ఞ కోరగా ఛాయ అంగీకరించి ధర్మము నాచరించు తలంపుతోనే సూర్యునికడకు పోయేను. ఆతడు కు ఆమెను సంజ్ఞనుగా తలచి ఆమెతోనే కామముస ప్రవృత్తుడయ్యెను. సూర్యునకు ఛాయ యందు మనుష్య రూపుడగు సావర్ణి మనువు పు టైను. అతడు తండ్రితో సమానముగా వర్ణము కలవాడు. కనుకనే అతనికా పేరు కలిగెను. పిమ్మట సూర్యునికి ఛాయ యందే శని తపతి ఏషి అను ముగ్గురు సంతానము కలిగిరి. ఛాయ తన పుత్రుడగు సావర్ణి మనువు పై అధికముగా ప్రేమ చూప సాగెను. దానిని సంజ్ఞ మొదటి కుమారుడగు వైవస్వతుడు మనువు) సహించెను. కాని యముడు సహించక క్రోధో దేక ము చెందెను. అతడు తన కుడి కాలు ఎత్తి చాయను బెదరించెను. నీ ఈ పాదము ఎల్లుడును చీము ర క్తము కారు చుండును. దానిని క్రిములు తినుచుండును. అని ఛాయ యముని శపించెను. "

యముడును ఆ శాపమును సహించలేక సూర్యుని కడకు పోయి ఇట్లు పలికెను: దేవా !. మా అమ్మ (ఛాను). మా అన్న దమ్ముల. అక్క చెల్లెండ్ర -అందర యందును సమానముగా స్నేహ భావము చూపుటలేదు. అది సహించలేక నేను చిన్న తనపు స్వభావముచే ఒక్క మాకు కాలు ఎత్తితిని. కోపించి మా అమ్మ సన్ను శపించినది. . వైవస్వతుడు వలదని బ్రతిమాలు చున్నను ఆమె వినలేదు. అది విని సూర్యుడు యమునితో "నాయనా ! నీవు తెలియనివాడవు కావు. ఒక్కో క్కరికి తన మూర్ఖత్వము చేతను మరియొకరికి కర్మ వశ మునసు దుఃఖము కలుగుచుండును, ఈ రెండు విధములలో దేని చేతనైనను దుఃఖముననుభవించుట శివునకును తప్పించుకొసరానిది. ఇతరుల విషయము చెప్పవలసినదేమున్నది? జీపుల కర్మ విపాకము వారిని క్రిముల చేత భక్షింప జేయును. కర్మానుభవము వలన పాపము అనేది ) చీము రక్తము కారుట క్షీణించి పోవును.” అనెను.

సూర్యుడు పలికినది విని మహాయశ శ్శాలియగు యముడు తీవ్రమగు తపస్సు నాచరించెను. అతడు గోకర్ణ తీర్థమున కోటి సంవత్సరముల పాటు వే రాగ్యమును పూని పండ్లు దుంపలు వేళ్లు గాలి ఆహారముగా శివుని ఆరాధించెను. త్రిశూల ధారి మహాదేవుడు సంతుష్టుడె వరము కోరుకొమ్మనెను. యముడును లోక పాలత్వమును పితృ లోక పాలనాధి కారమును ధర్మాధర్మ స్వభావములతో నడచు జగములను నిరీక్షించ చుండుటయు కోరెను. శివుననుగ్రహమున యమునకీ చూడధికారములును లభించెను.

వాస్తవ స్థితిని ఎరిగి సూర్యుడును రోషము చెంది త్వష్టకడకుపోయి సంజ్ఞ చేసిన పని తెలి పెను. త్వష్ట అతనితో ప్రార్థనా పూర్వకముగా ఇట్లు పలికెను : భగవన్ ! ఆనాడు సంజ్ఞ చీకటులను పారదోలు నీ తీవ్ర తేజమును సహించలేనిదయి నీ కడనుండి బయలుదేరి ఆడు గుర్రపు రూపముతో , కడకు వచ్చెను. నేను నీకు భయపడి ఆమెను నా ఇంటికి రావలదని వారించితిని. నీవు నీ భర్త హృదయమును ఎరుగక ఆతని అనుమతి లేక) నా దగ్గరకు వచ్చితివి. కనుక నీవు నొ గృహమును ప్రవేశింపదగదు. అని నేను అనగా "ఆ సు గుణవతి భూలోకము నందలి మరు దేశమునకు పోయినది. ఆమె ఇప్పుడును అదే ఆడు గుర్రపు రూపముతో అచ్చట తానుండదగిన చోటు దొరుకక తిరుగుచు) ఉన్నది. నేను నీయనుగ్రహము పొందదగిన వాడని మీరు భావించిన చో నన్ను ఆను గ్రహించుడు. మీ దేహమును యంత్రము నందు ఉంచి మీ తీవ్ర తేజస్సును కొంత పోగొట్టుదును. మీ రూపము ప్రాణులకు ఆనందకరము అగునట్లు చేయుదును. త్వష్ట మాట లను రవి అంగీక రించెను. త్వష్టయును భాస్కరుని తరిమెన పట్టు యంత్రమునందుంచి ఆతని తీవ్ర లేజస్సులో కొంత భాగము వేరు పరచెను. దానితో అతడు విష్ణుని చక్రమును శివుని త్రిశూలమును దైత్యదానవ సంహర్త అగు ఇంద్రుని వజ్రమును చేసెను.

అప్పటికిని త్వష సూర్యుని రూపమును చూడజాలక పోయెను. అందుచే ఆతడు సూర్యుని కిరణములను ఇంకను తగ్గించి సహ స కిరణములు మాత్రమే కలిగిన సాటిలేని గొప్ప అంద మైన రూపమును ర ..కి కలిగించేను.

(కిరణములను సంస్కృతమున కరములు పాదములు అని కూడ అందురు. ఈ చెప్పిన దానిని ఒట్టి త్వష్ట సూర్యుని పాదములను తీసివే నెను.)

 అందుచేతనే నాటి నుండి తరువాత ఇప్పటికిని ఎవరును సూర్యునికి పాదములు న్న ట్లుగా అతని ప్రతిమను నిర్మింపజేయరాదు. అను ని షేధము ఏర్పడినది. ఒకవేళ అటు పాదములు గల రవి ప్రతిమ చేయి )చినచో ఆ పాపిష్టుడు నిందితమగు గతిని పొందును; కుష్ఠ రోగమును పొందును. ఈ లోకమున దుఃఖములను పొందును. కావున ధర్మమును కామమును కోరినవారెవ్వరును చిత్త్రరువుల యందును ఆలయములందును దేవ దేవుడును, మహాబుద్ధి శాలియును నగు సూర్యునకు పాదములు నిర్మింపజేయరాదు.

 తరువాత అమరులకు అధిపతియగు భగవానుడు సూర్యుడు భూలోకమునకు పోయేను. అతడు మహాతేజస్సుతో 1 కమ్మ బడిన వాడును అశ్వ రూపమును ధరి )చినవాడును ఐ ఆమేకడకు పోయెను. ఆ దివాకరుడు కామారుడుగా ఉండే నందున ఆడు గురపు రూపమున ఉన్న సంజ్ఞ ముఖమునే తన కామ ప్రవృ తికి సాధనముగ చేసికొనెను. ఆమె తన భర్తను గుర్తించక ఆతడెవరో పరుడు అను భ్రాంతిచే మన స్సునందు భయముచే భాధనొంది కలవరపాటు చెందెను. ఆమే సూర్యుని వీర్యమును తన ముక్కు పుటముల ద్వారమున వదలివేసెను. ఇట్లు జరిగిన ' ఈ రేతఃస్రావమువలన పుట్టిన ఇద్దరు దేవతలే అశ్వినులు అని మనము సంప్రదాయమున) వినుచున్నాము.

నా కల (ముక్కుల నుండి పుట్టినందున నాసత్యులు అనియు దసము అశ్వము) యొక్క ఓష్ఠము ( పెదవుల నుండి పుట్టుటచే దసులనియు అశ్వి దేవతలకు పేరు లేర్పడినవి.

తరువాత సంజ్ఞ తాను పూర్వము చాలకాలము క్రిందట అర్చించిన తన పతియే ఇతడని సూర్యుని గుర్తించి మరల సంతోషము నందేను. రవియు విమానము పై తన భార్యతో కూడ స్వర్గమునకు వెళ్లెను.

సూర్యునకు ఛాయయందు కలిగిన సూర్య సాపల్లి తపోధనుడుగా ఈనాటికిని మేరు పర్వతమునందున్నా డు. శని తపస్సాచరించి తన తపోబలము గ్రహములతో సమానత్వము పొందినాడు.

యమున తపతి అను ఇరు కన్యలును నదులే 6. విప్షి అను కన్య మాత్రము ఘోర రూపురాలు (మిగుల నల్లనిది). ఈమె కాల రూపురాలయి ఉవేవ స్వత మనువునకు మహాబలులగు పదిమంది కుమారులు కలిగిరి. వారిలో మొదటి వాడు ఇళుడు. ఇంకను ఇక్ష్వాకుడు కుశనాభుడు అషుడు ధృష్ణుడు సష్యంతుడు కరూశుడు శర్యాతి పృషదశ్వుడు "భాగుడు అనువారు తొమ్మిది మంది. ధర్మమును ఎరిగి అనుష్టి చు ధార్మికుడగు వైవస్వపడు జ్యేష్ట పుర్తుని ఇశుని రాజ్యమునందభి షేకించి ! శేష్టమగు హిమపచ్చిఖరమునకు (మ హేంద్ర వనమునకు) పోయి అందరకంటే మిన్న గా తపమాచరింపసాగెను.

తరువాత దిగ్విజయమును సాధించుటకై ఆ ప్రతాపవంతుడగు ఇళుడు ఈ భూమిము.) దంతటను అన్ని ద్వీష ముల యందును సంచరించుచు రాజులను అందరను తనకు లోబరచుకొనెను. ఆ దిగ్గయ యాతా క్రమములో అతడు (ఇలుడు దిగ్విజయము కోరి అశ్వమును మంత్రపూర్వకముగా వదిలి అది భూమండల మందంతట తిరుగుచుండ   తానును దాని వెంట పోవుచుండెను. ఆ యశ్వము అట్లు పోవుచు శరవణములోనికి పోగా ఇలుడును దానిననుసరించి  ఆ ఉద్యానములో ప్రవేశించెను. అని అర్ధము)తన గుర్రము తీసికొనిపోగా శిపుని ఉద్యానవనముకు పోయెను ఆ ఉద్యానము కల్పవృక్షపులతలతో వ్యాప్తమయి  (సుందరమయి) నది. చాల పెద్దది. గొప్పది. దాని పేరు శరవణము. దాని యందు అర్ధచంద్రుని శిరోభూషణముగా ధరించు వాడును దేవేశుడును అగు సోముడు (స+ఉమా) పర మేశ్వరుడు పార్వతి (ఉమతో కూడి విహరించుచు ఆనం దించుచుండును. దశ యోజన వేశాల్యము గల మా యీ వనమునందు పురుషప్రాణి ఏది వచ్చినను అట్టి ప్రతి యొక పురుష ప్రాణియు స్త్రీత్వమును పొందును. అని పూర్వము ఒకప్పుడు పార్వతి ఈ వన విషయమున ఒక వ్యవస్థ కట్టడి చేసెను.

పూర్వము ఎప్పుడో ఇపుడు చేసిన ఈ వ్యవస్థ తెలియని రాజు ఇలుడు ఆ శరవణములో ప్రవేశించిన వెంటనే శ్రీ. అయ్యెను. అతని అశ్వమును బడబ (ఆడు గుర్రము) అయ్యెను. రాజు వెంటనే తాను పురుషుడుగా ఉన్నప్పుడు చేసిన ప్రతి పనిని మరచెను. ఆమే ఇక అను పేర శ్రీ అయ్యేను. ఈ రూపములో ఆమె వక్షోజములు బలిసినవై ఉన్నతములై యుండెను. ఆమే పిఱుదులును కటి ప్రదేశమును ఉన్న తమయి ఉండెను. ఆమె కన్నులు తామరపూరే' లవలే విశాల ములయి యుండెను. ఆమె ముఖము నిండు చందురుని పోలియుండెను. ఆమె శరీరము అంత స్థూలముకొక సన్న నై యుండెను. ఆమె చూపులు ఒయ్యారపు కదలికలచే మెరయు చుండెను. అంతవరకు సంతానమును కని ఉండని యావ నములో ఉండెను. ఆమె మేను బంగారు . చాయతో ఉండెను. ఆమె హంసవలె నడచుచుండెను. కోరికల రేకె తించు రూపమును శృంగార గుణములును కలిగి యుండెను. ఆమె గోళ్ళ మొలకలు పలుచనై ఎర్రనయి యుండెను.

ఇటువంటి ఆ సుందరి ఇళ' ఆ శరవణమను ఉద్యానమునందు అటునిటు తిరుగుచు తను: "మనస్సులో “నా సాయన ఎవరో ! అమ్మ ఎవరో ! - సోదరులు జవ్వరో ! . ' ఎవరిని భర్తగా చేసి నన్ను అతనికి ఇచ్చిరో ! 'భూలోకమున అతడు ఏ వర్ణము వాడో ?”. అని ఆలోచింపసాగెను. ఆమే ఇట్లాలోచించుచు తిరుగుచుండగా ' చంద్రుని పుత్రుడగు బుధుడు ఆమెను చూచెను.. ఆమె సౌందర్యము అతనిని ఆకర్షించెను. కామము పీడింపగా.. ఆ ఉద్యానమునందే అతడామె యందు అనురాగము చెందెను [అతడు, ఆమె విషయమున తన కోరిక తీర్చుకొనుట.కై ఒక ఉపాయము చేసెను.)

 బుధుడు ఒక విశిష్టమయిన రూపము ధరించెను. అతని చేతులయందు దండము కమండలువు పుస్తకమును ఉండెను. బ్రాహ్మణ రూపము శిఖ బంగారు కుండలములును దాల్చి ఉండెను. వేదము చెప్పుచుండెను. తమ చేతులందు వేణు దండములు ధరించి సమిధలు పుష్పములు కుశ లు ఉదకము చేత పట్టుకొనియున్న అనేకులు అగు బ్రహ్మచారులు అతని వెంట నుండి.. ఇట్టి రూపముతో పరివారముతో ఆ బుధుడు (ఇళ తప్పిపోగా ఆమె కొరకై ) వేదకుచున్న వానివలె నటించుచు ఆ శరవణమున ఆమెను గట్టిగా పిలువసాగెను. బుధుడు ఆ శరవణమునకు వెలుపలనే (లోపలకు వచ్చినచో తానును స్త్రీగా మారుసను భయమున చెట్ల గుబురు చాటున నుండి తడబాటు పడుచు ఆకస్మికముగా మందలింపు మాట లతో ఈ విధముగా పలుకసాగేను. “అగ్ని హోత్ర కాలములో చేయవలసిన నాశుశ్రూష చేయక విడిచి నా ఇంటి నుండి ఎక్కడకు వెళ్ళితివి ? నీవు విహరించు వేళ ఇప్పుడు ముగిసిపోయినది. ఓ సుందరీ ! రమ్ము-రమ్ము ! ఇంకను రాకున్నావు. కారణమేమి ? సాయంకాలమున నీవు విహరింపదగిన సమయము గడచిపోవు చున్నది. నా ఇంటికి రమ్ము. వచ్చి ఇల్లు అలికి పూలతో అలంకరించుము."

ఈ మాటలు విని ఇళ ఇట్లు పలికెను. “తపోధనా  నేను ఈ విషయమంతయు మరచితిని. మీరు ఎవరో మీ కులమేమో శీలమే మో చెప్పవేడుచున్నాను.”

బుధుడు మిగుల సౌందర్యవతియగు ఇళతో ఇట్లు పలికేను: “నేను కాముకుడు అను పేరుతో ప్రసిద్ధుడను. అనేక ములగ విద్యల నెరిగిన వాడను. (కనుక) బుధుడను ప్రసిద్ధి వహించి యున్నాను. తేజస్వి (కాంతి గలవాడు. చంద్రుడు) అనువాని కులము (వంశము-ఇల్లు) నందు పుట్టిన వాడను. నా తండ్రి బ్రాహ్మణులకు (ద్విజులకు-అనగా పక్షులకు) అధిపతి (చంగ్రుడు) ; ఇట్లు పైకి తాను బ్రాహ్మణు డై నట్లును రహస్యార్థమున తాను చంద్రుని కుమారుడు, బుధుడనియు మాటలాడగా ఆమె అతని ఆ మాటలు విని బుధుని గృహమునకు పోయి దాని యందు ప్రవేశించెను. ఆది మనోహర ములగు స్తంభములతో వ్యాపింపబడి యున్న ది. దివ్యములగు ము తైములు అంతట కూర్చబడి యున్నవి. ఇదీ యంతయు చూచి ఆ ఇళ ఆ ఇంటిలో ఉండుటవలన తాను కృతార్జురాలయెనని తలచేను. ఎంతో మేచ్చదగిన ఇల్లు! ఎంతో మెచ్చదగిన రూపము. ఎంతో ప్రశంసింప దగిన ధనము. ఎంతో పొగడదగిన వంశము. ఎంతో కాలము" - - - నుండియు ఇతడే నా భర్త. ఇతని లావణ్యము ఉత్త్రమమైనది. అని ఆమె సంతోషపడెను,

నాటి నుండియు చాలకాలము వరకు ఇళ ఇంద్రభవనము వంటిదిగా తనకు తోచుచు సర్వభోగములతో నిండిన ఓ ఇంటియందు ఆ బుధునితో కూడ విహరించి ఆనందించెను.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమనుసంవాదమున సూర్య వంశ వర్ణనమున ఇళా బుధసమాగమమగు ఏకాదశాధ్యాయము.