మత్స్య మహా పురాణము

Table of Contents

27 - శర్మిష్ఠా దేవయానీ విరోధకారణము

శౌనకుడు శతానీకునితో ఇట్లు చెప్పెను:- కచుడు శుక్రుని వలన విద్యను - సంపాదించికొని రాగా దేవతలు మిగుల సంతోషించి ఆ విద్యను కచునినుండి అధ్యయనము చేసి కృతారు లయిరి.. తరువాత వారు ' అందరును ఇంద్రుని కడకు పోయి-ఇది మనము విక్రమము చూపదగిన సమయము. శత్రువులను చంపుదము. అనిరి. వారి మాటను వినుచునే క్రోధముతో చూచిన ఇంద్రునకు విజన ప్రదేశమున కుబేరుని చైత్రరథమువంటి వనమున జలమున క్రీడించుచున్న రాక్షస కన్యలు కనబడిరి. అతడు వాయువుగా, నయి వారి. వస్త్రములను అన్ని టిని కలిపివేసెను. కొంత సేపటికి నీటినుండి పైకి వచ్చిన ఆ కన్యలు అందరును చాల వరకు ఒకరిది "మరియొక రికి రాకుండునట్లు వస్త్రములను తీసికొని ధరించిరి. వారిలో "వృషపర్వుని కూతురు శర్మిష్ట వస్త్రముల మార్పిడి, గుర్తించలేక తాను, దేవయాని వస్త్రమును తీసికొని ధరిం చెను. అంతట దాని నిమిత్త్రమై శర్మిష్ణా దేవయానులకు విరోధము ఏర్పడెను. -

దేవయాని: “నీవు రాక్షస కన్యవు నాకు. శిష్యురాలవు 'ఐయుండి, నా వస్త్రమును ధరించితివి,. కనుక, నీకు శ్రేయస్సు కలుగకుండు గాక!”

శర్మిష్ఠ: మా నాయన ఉన్నత స్థానమున కూర్చున్నప్పుడును పండుకొన్న ప్పుడును ఆయనను మీ నాయన తాను క్రింద నిలువబడి మాటికిమాటికీ వినీతుడై స్తుతించుచు యాచించుచు ఉండును. నీవు పొగ డెడి.అడుగుకొనేది.దాని కూతురవు. నేనో. పొగడబ డెడి యాచింపబడెడివానీ కూతుర ను. - నీవు నిరాయుధవు. నేను సాయుధను. బిచ్చగ తెవు నీవు నా పై ఏమి కోపింతువు? నీకు సాటియగు ప్రతియోధ (ఎదిరించి యుద్ధము చేయువాడు) లభించును లెమ్ము. నేను మాత్రము నిన్ను నొ సరిదానిగా లెక్కింపను.".

జరిగిన దానికి ఆశ్చర్యపడుచు దేవయాని వంగి తన వస్త్రమున కై పట్టుదలతో నుండెను. ఆమెను బావిలో త్రోసి శర్మిష్ణ తన పురమునకు పోయెను. పాప సంకల్పము గలదియే ఆ శర్మిష దేవయాని మరణించియుండునని తలంచుచు క్రోధవేగవశురాలయి తిరిగియైన చూడక అక్కడినుండి వెడలిపోయెను.

అంతలో నహుష పుత్రుడగు యయాతి వేటకై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు మృగముల వెంటనంటిపోగా పోగా అతని రథపు గుర్రములును తానును అలసిపోయెను. దప్పిగొనెను. అతడు నీటికై వెదకుచు దగ్గరలో నీటితొట్టి ఉండియు నీరులేని గోతిలో ప్రజ్వలించుచున్న అగ్ని జ్వాలవలె ఉన్న కన్యను దేవయానిని చూచెను. ఆ నర శేష్టుడు మహా మనోహరమగుమాటలతో ఆమెను ఓదార్చుచు దేవక న్యవంటి ఆ దేవయానిని ఇట్లు ప్రశ్నించేను: “మనోహరముఖము చక్కని దేహచ్ఛాయ చక్కగా మెరుగు దీర్చిన మణికుండలములు కలిగి ప్రకాశించుచున్న నీవు ఎవరవు? ఏల చింతించుచు ఆతురురాలవయి శోకించుచున్నావు? తీగలతో గడ్డితో కప్పబడి ఉన్న ఈ గోతిలో ఎట్లు పడితివి? నీవు ఎవ్వరి కూతురవు? అంతయు నాకు విశదముగా చెప్పుము."

దేవయాని: “యుద్దమున మరణించిన దానవులను తన విద్యతో బ్రతికించెడి శుక్రుని ఎరుగుదువు కదా! నే నాతని కూతురను. కాని ఆయన నన్ను లెక్క పెట్టుచున్నట్లు లేదు. నీవు ఉన్నత వంశమున జన్మించినవాడవని నాకు తెలియును. నీవు వీర్యవంతుడవును యశోవంతుడవును అని అందరును నిన్ను గురించి చెప్పుచున్నారు. కావున నీవు నన్ను అంటినను దోషము లేదు. ఇదుగో! ఎర్రని గోళ్లును వ్రేళ్లును కలిగి ప్రకాశించు నా కుడి చేయి. దీనిని గ్రహించి బావిలోనుండి నన్ను పైకి తీయుము.”

- యయాతి ఆమె బ్రాహ్మణ స్త్రీయని ఎరిగి ఆమె కుడి చేతిని పట్టి ఆ గోతినుండి ఆమెను పైకి తీసెను. తరువాత ఆమె దగ్గర సెలవు తీసికొని అతడు తన పురమునకు పోయేను.

తరువాత ఆ దేవయాని చూర్ణిక యను తన చేలిని చూచి నేను ఇక వృషపర్వుని పురము ప్రవేశించను. ఈ విషయ మును నీవు పోయి మా తండ్రికి చెప్పుము అనెను. చూర్ణికయును త్వరితముగా పోయి వృషపర్వుని భవనమున శుక్రుని దర్శించి తెలివి తప్పి వణకుచు “ఓ మహాజ్ఞా: మహాభాగురాలగు దేవయానిని వృషపర్వుని కూతురగు శర్మిష్ణ కొట్టినది.” అని చెప్పెను. అది విని శుక్రుడు దుఃఖముతో ఆమెను వెదకుచు ఆడవికి పోయెను. అడవిలో ఆమె కనపడ గానే అత డా మెను కౌగిలించుకొని దుఃఖముతో ఇట్లు పలికెను: “ఎల్ల ప్రాణులును తమ దోషముల (కర్మముల) ఫలముగానే దుఃఖ మునుగాని సుఖమునుగాని పొందుచుందురు. నీవు ఏదో దుష్కర్మమును చేసియుందువు. దానికి ఇది ప్రాయశ్చిత్త్రము ఐయుండును.” అనగా “ఇది ప్రాయశ్చిత్త్రము కావచ్చును. కాక పోవచ్చును. నా మాట సావధానముగా వినుడు. వృష పరు ని కూతురు శర్మిష్ట నేను తనకంటే హీనురాలనే కాని అధికురాలను కాదు అనినది. ఈ మాట నిజమే ఆగునా? ఆమె తన కన్ను లను క్రోధముతో మిగుల ఎర్ర జేసి తీక్షముగను పరుషముగను మాట లాడినది. నీవు స్తుతించుచు యాచించుచు దాన ములు అందుకొనెడి వాని కూతురవు. నేను స్తోత్రములు అందుకొనుచు యాచింపబడుచు దానములు పట్టక ఉం డేడి వాని కూతురను. ఆని శర్మిష్ట నన్ను తూలనాడినది. ఈ మాటలు పలుకునప్పుడు ఆమె మొగము ఎంత దర్పముతో నిండి యున్న దనుకొనుచున్నావు! నేను నిజముగ స్తుతించుచు యాచించుచు దానములు ప్రతిగ్రహించుచు ఉండువాని కూతుర నేమో నీవే చెప్పుము. అట్లయినచో నే నా మేను వేడికొని అనుగ్రహింపజేసికొందును." ఆని దేవయాని పలికెను. అది విని శుక్రుడు "ఇట్లనెను: “ప్రీయపు తీ! నీవు స్తుతించుచు దానములు ప్రతిగ్రహించుచు ఉండువాని కూతురవు కావు. స్తుతింప బడువాని కూతురగు దేవయానివి నీవు. ఈ విషయము వృషపర్వునికే తెలియును. ఇందునకును తెలియును. యయాతి కిని తెలియును. ఊహింప అలవికానిదియు ఉత్పత్తి నాశములు ఆనేడి ద్వంద్వము లేక నిత్యమును ఈశ్వర సంబంధియు నగు బ్రహ్మము (వేదము) నాకు గల బలము."

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున యయాతి చరితమున శర్మిష్ఠి దేవయానీ విరోధాది కథనము అను ఇరువది ఏడవ అధ్యాయము.