మత్స్య మహా పురాణము
226 - స్తేయా(చౌర్యా)ది దోషదండములు.
శ్రీమత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఇతరులు తనయొద్ద దాచుట కిచ్చిన ధనమును అనుభవిం చిన వానికి ఆ ని షేప మూల్య సమాన మూల్యమే దండము; వస్త్రాదిక విషయమునందును ఇంతే; ఇట్లు చేయుట చేత ధర్మ మునకు హాని కలుగకుండును. ఇతరులు తనకడ దాచుట కిచ్చిన ధనమును తిరిగి ఈ యనీవానిని దాచక యే దాచితినని ధనమడుగు వానిని దొంగలను వలె దండించవలేను; నిక్షేప మూల్యము నకు రెట్టింపు ధనమయిన ఇప్పింపవలెను; మోసము లతో పరద్రవ్య మపహరించిన వానిని వాని సహాయులను కూడ చిత్రహింసలతో చాల హింసించవలెను; ఇతరుల కడ ఆడిగి తీసికొనిన దానిని సొంతదారునకు తిరిగి యథాక్రమముగ ఈయనివానిని దండించి బలవంతముగ ఇప్పింపవల యును; రెట్టింపు వేలనైన ఇప్పింపవలేను: తనకడ నున్న ఇతరుల వస్తువును తెలియక అమ్మినచో తప్పుకాదు: తెలిసి ఆమ్మినచో చోరునికి వలే శారీరదండ మీయవలయును: విద్యను శిల్పమును ఇత్తునని వెల తీసికొని యు అవి ఈయనివాని నుండి ధర్మజుడగు రాజామూల్య మిప్పింపవలేను: తన ఇంట బ్రాహ్మణ సంతర్పణము చేయుచు పొరుగు వానిని భోజనము నకు పిలువని వానిని మాషప్రమాణపు (ఐదుగురి గింజల ఎత్తు బంగారు నాణెము) బంగారముతో దండించవలెను; దీనితో ఆ పిలువనిపోని ఈ దోష మంటకుండును: ఆ మం) తణము చేయబడి ఒప్పుకొనిన ! బ్రాహ్మణు డింటియందుండియు నీషా. గణముగా పోనిచో పొనికి ఎనిమిది వందల దమము దుడ్డు)లు దండ ముగా విధించవలేను; ఇత్తునని ఒప్పినదాని నీయనివానికి ఒక నువర్ణము (నవరసు-80 గురిగింజల తూకము) దండముగా విధించవలేను: తన స్వామి ఇచ్చిన ఆజ్ఞను పొగరుతో చేయని సేవకుని ఎనిమిది కృష్ణలములతో (ఒక గురిగింజ తూకపు బంగారు నాణెము) దండము విధించవలెను; వాని వేతనమీయకుండవలెను. చాలకాలము నుండి తాను చేయించుకొనిన పనికై భృత్యునకు కాలములో వేతనమీయని వానిని ఆకాలములో భృత్యుని విడిచినవానిని. నూరు కార్షాపణములతో దాడించవలెను. (కార్షాపణము = పదునారు పణములు- పణము ఆనునది పూర్వపు నాలుగు ఆణాల ఎనిమిది కాసులని ‘కి ట్టెల్’ చెప్పెను.)
గ్రామ విషయమునను దేశ విషయమునను సస్య (పంటల) విషయమునను (రాజుతో) ఒడంబడిక చేసికోనియు లోభవశుడయి మాట తప్పినవానివి రాజు దేశమునుండి వెడలగొట్టవలెను. ఎవరై నను ఒక వస్తువును అమ్మికాని కొనికాని తరువాత పశ్చాత్తాపపడి అది మానుకొనదలచినచో పదినాళ్ళలోగా దానిని ఇచ్చి ధనము. పుచ్చుకొనుటయో దానిని తీసి కొని ధనమును తిరిగి ఇచ్చుటయో చేయవలెను. పది దినములు గడచిన మీదట ఈయరాదు. పుచ్చుకొనరాదు. కాని ఆ పదిదినముల లోపలకూడ ఈయనివానిని పుచ్చుకోనని దానిని రాజు ఆరు వందల పణములతో దండించవలేను. తన కన్యయందున్న దోషములను బయల్పరచక దాచియుంచిన కన్యాదానము చేసిన వానిని తొంబది యాదు పణములతో దండించవలెను. తన కన్యయందేదై న దోషముండగా అది బయల్పరచకుండుటకై ఆమె తన కన్య కాదనీన వానిని నూరు పణములతో దండించవలయను. ఒక కన్యను చూపి మరియొక కన్యను వరునకిచ్చిన వానిని రాజు ప్రథమ శ్రేణికి చెందిన (వేయి కార్షాపణముల) మూల్యముతో దండించవలయుసు. తనయందున్న దోషమును కప్పియుంచి. కన్యను ఇప్పించుకొనినవానికి ఆ కన్యను ఈయనట్లే: పైగా ఆవరునకు రాజు రెండు వందల కార్షాపణములు, దండముగా విధించ వలేను. తన కన్యను మొదట ఒక నికి దానము చేసి కాని ఇత్తునని మాట ఇచ్చికాని ఆమెనే మరల నింకొక నికిచ్చిన వానిని రాజు ప్రథమ శ్రేణి (వేయి కార్షాపణముల) దండముతో దండించవలేను. ఒక వస్తువునొకనికి అమ్ముటకు శపథ పూర్వకముగ మాట ఇచ్చినదానిని మరియొక నికి అమ్మువానిని ఆరువందల కాపణములతో దండించవలెను.
తన కుమార్తెకు ఆమే ఆత్త ఇంటివారు కాని ఇతర బంధువులు కొని చదివించిన కానుకలు మొదలగు వానిని అమ్మినవానిని అవి తనయొద్ద లేనే లేవని నిరాకరించిన వానిని వాని వేలకు రెట్టింపు వేలతో దండించవలెనని ధర్మవ్యవస్థ చెప్పుచున్నది. వస్తువును కొనినవాడు దాని వేలలో కొంతమా తమిచ్చి మిగిలిన దానినీయక మానినచో వానీని (నూరు కార్షాపణములనుండి ఐదు వందల కార్షాపణముల వరకు గల) మధ్యమ దండముతో దండించుటయే కాక ఆ తీసికొనిన వస్తువును తిరిగి సొంతదారునకు ఇప్పించవలెను. పశువును (ఆవును) కాచేదను మే పెదను అని అందులకై వేతనము తీసి కొనియు దానిని కాపాడక మేపక దాని పాలు పిదుకుకొను పశుపాలుని రాజు నూరు నవరసులతో దండించవలయును. ఈ విధించిన దండమును చెల్లించిన తరువాత తన స్వామీచే తన దేహమున తన అపరాధపు గురుతు వేయించుకోని ఆ మొదటి పని విడువవలెను. తరువాత తన కాలికి ఇనుప గొలుసు కట్టుకొని ఆ స్వామి చెప్పిన పని చేయవలెను. గ్రామమునకు చుట్టును నూరు ధనువుల దూరమునందును నగరమునకయినచో రెండు మూడు వందల ధనువుల దూర మందును రాజు ఒంటె తన మెడ ఎత్తి చూచినను అవతలిది కనబడనంత ఎత్తున కంచే వేయించవలయును. ఈ కంచెలోనుండి పందులు కుక్కలు మొదలగునవి దూరిపోకుండునట్లు కంచే సందులను మూయించి యుంచవలయును; ఈ కంచెకులోగా ఉండు పైరు పంటలకు పశువులేమి హాని కలిగించినను రాజు పశు పాలకునకు దండము విధించవలసిన పనిలేదు; ఈని పది దినములు గడువని ఆవుగాని ఆబోతుగాని దేవతకు అర్పించిన పశువు గాని పొలములో దూరకుండ ఛిద్రములు మూయవలెనే కాని అవి పొలములలోనికి ఒక వేళ పోయినచో వానిని కొట్టకూడదు; ఈ విధముగ కాక మరి యొక విధముగ పశువులు పంట పైరులు మొదలగు వానికి హాని కలిగించినచో ఆ నష్టమయిన ధాన్యాదికము క్షత్రియుని దయినచో పశుపాలకుని నియమించుకొనిన పశుస్వామికి వినష్టమయిన దానిలో పదియవ వంతు దండముగా విధించ వచ్చును; పశువు పైరు పంటలను తిని అచ్చటచే పండుకొనియున్న చో పెదానికి రెట్టింపు దండము విధించవలయును; క్షత్రియుని ఆ స్త్రీని వైశ్యుని పశువు ఇట్లు నష్టపరచినచో పైదానికి పదింతలు దండముగా విధించవలేను: గృహము చేరువు తోట పొలము మొదలగునవి హరించినవానికి ఐదు వందల కార్షాపణము దండము విధించవలయును; ఇవి తేలి యక చేసినచో రెండు వందల కార్షాపణము చాలును; పొలపు గట్టులు నిర్ణయించి ఏర్పరచుటలో తప్పు హద్దులను నిర్ణ యించినను ఏర్పరచినను ఆట్లు చేయుటకు అనుకూలించు సైగలు చేసినను గుర్తులుంచినను అట్టివాని నాలుక కోయవలెను: జ్ఞాన పూర్వకముగా తెలిసి తెలిసి ఇతరుల సొలపుగట్లను వ్యత్య స్తముగా చేసిన వానికిని చేయించినవానికిని ఆ సంకేతము లను అందుకొనినవానికిని ఉత్తమ శ్రేణికి చెందిన (వేయి కార్షాపణముల) దండము విధించవలయుసు.
అకార్యకారిబ్రాహ్మణాదీనాం ప్రాయశ్చిత్తరూప దణ్డవిధిః
వధ దోష ప్రాయశ్చిత్తము.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో నెవ్వ రేకాని ఆ కార్యము (చేయరాని పను) లాచరించినచో ఏమియు ఎక్కువ తక్కువలు పాటింపక వారిచే రాజు ప్రాయశ్చిత్తము లాచరింపజేయవలెను; మోసగించి శ్రీహత్య చేసినవాడు శూద్ర హత్యా వ్రతమాచరించవలెను; సర్పాడి ప్రాణులను తాను చంపజాలక ధనము మొదలగునవి ఇచ్చి చంపించిన ద్విజుడు ఒక్కొక్కటిగా కృచ్చవ్రతములను ఆచరించి పాపము పోగొట్టుకొనవలయును: వండ్లు ఇచ్చు చెట్లను పూచు పొదలను వల్లులను లతలను నరకి (పచ్చినచో నూరు ఋక్కులను (అవి శాస్త్రమందు చెప్పబడినవి తెలిసికొని జపించవలెను: ఎముకలు గల ప్రాణులను వందలకొలదిగ చంపించి)నను . బండ్లకొలదిగ ఆ ప్రాణుల చర్మా స్థిమాంసాదికమును నింపించి తోలించినను ద్విజుడు శూద్ర హత్యావ్రతమాచరించవలెను. విప్రులకు దానము కూడ చేయవలెను. అస్థిరహిత ప్రాణులను చంపించిన)నచో ప్రాణాయామములతోనే శుద్ధియగును; అన్న ములయందును రస ద్రవ్యములందును ఫల పుష్పములందును ఉత్పన్న ములగు ప్రాణులను చంపించినచో ఘృతపాళ నముచే శుద్దుడగును; వనమందు స్వయముగ ఉత్పన్న ములగు. దున్ని పండించిన ఓషధులను అహేతుకముగ నర కినచో ఒక దినము వయోవ్రతమాచరించవలెను; హింసా నముద్భవ పాపమీ విధముగ వ్రతములతో పోగొట్టుకొనవలయును.
చౌర్య ప్రాయశ్చిత్తము
దొంగతనముతో వస్తువులపహరించిన వారి దోష పరిహార ప్రకారము చెప్పెదను వినుము: ద్విజుడు బుద్ధి పూర్వ కముగా తన జాతివారి ధాన్యాన్న ధనములలో నేవి దొంగిలించినను కృ చోర్ధమాచరించవలయును; స్త్రీలను పురుషులను నేత్ర (పొలము) గృహములను కూపవాడీస్థజలములను దొంగిలించినచో చాంద్రాయణముచే శుద్ధి యగును; అల్ప సారము లగు ద్రవ్యముల నితరుల గృహములనుండి హరించినచో సొంతపనకృచ్చమాచరించవలయును: భక్ష్యభోజ్యళయ్యా సన పుష్పమూల ఫలాదుల హరించినచో పంచగవ్య ప్రాశనముతో శుద్ధియగును; గడ్డి కట్టెలు చెట్లు కుషాన్నము ఎండు జొన్న రొట్టె మొదలగునవి) వస్త్ర చర్మ మాంసములు దొంగిలించినచో త్రిరాత్రోపవాసముతో శుద్దుడగును: మణిముక్తా ముత్తెములు ప్రవాళ స్వర్ణరజతాయః (ఇనుము) కాంస్యోపలములు (రాలు) దొంగిలించినచో పండ్రెండునాళ్ళు బియ్యపు నూకల అన్నము తినవలెను; దూది (క్రీటజము-పురుగులనుండి వచ్చునది) పట్టును ఉన్ని ని రెండు గిట్టలు గల.ఒక గిట్ట గల ప్రాణులను.వకులను గంధ ద్రవ్యములను ఓషధులను దొంగిలించినచో మూడు దినములు శ్రీరాహారముతో ఉండ వలెను; దొంగతనముచే కల్లు పాపముల నీవ్రతములతో పోగొట్టుకొనవలెను.
అగమ్యాగమన ప్రాయశ్చిత్తము.
ఇక అగమ్యాగమన ప్రాయశ్చిత్తము తెలి పేద వినుము: స్వజాతీ య స్త్రీయోనియందును శిష్యపత్నీ పుత్ర పత్నీ కుమారీ యోనులయందును అంత్యజ స్త్రీ యోనియందును రేతస్సు విడిచినచో గురుతల్పగమన ప్రాయశ్చిత్తమాచ రించవలయును. మేనత్తను పిన(పెద) తల్లిని మేనమామ భార్యను కూడినచో చాంద్రాయణమాచరించవలెను; వివేకి ఎవ్వడును వీరిలో నెవ్వరినిగాని పెండ్లాడరాదు; జ్ఞాతిస్త్రీలను మేనమామ కూతులను పతితలను పెండ్లాడినను మను ష్యేతర ప్రాణియోనులందును ముట్టుతయోనియందును రేతః సేక మాచరించినను కృచ్చసొంతపన మాచరించవలయును; పురుషుడు ఆచరించు స్వాభావిక మైథునమునుకానిస్త్రీ ఆచరించు (పురుషాయిత) మైథునమును కాని ఎద్దుల బండియందో పగటి వేళ నో చూచినచో వస్త్ర సమేతుడై జలములందు మునిగి స్నానమాడవలేను; అజ్ఞానముచే చండాలస్త్రీని అంత్యజ్యశ్రీని పొందినను ఆమెచేతి అన్నము తినినను ఆమెను పెండ్లాడినను పతితుడగును; తెలిసియే ఇవి చేసినచో తత్సముడగును; (పరపురుషుడగు) విప్రునితో కూడి చెడినస్త్రీని (భార్యను) భర్త ఒంటరిగదియందు బంధించి ఉంచి పర దారగమనమున పురుషుడాచరించ వలసిన వ్రతముల నీమెచే ఆచరించ జేయవలయును; ఆమె మరల అదే తప్పు చేసి దోషమందినచో చాంద్రాయణ వ్రతమాచరించి శుద్దయగును; ఒక రాత్రి వృషలి (శూద్రస్త్రీ)ని పొందిన ద్విజుడు మూడు సంవత్సరములపాటు ప్రతి దినమును ఏక భుక్తము చేయుచు (గాయత్ర్యాదికము) జపించపలయును; ఇట్లు నాలుగు వర్ణముల వారును చేయు ఆయా పాపములకు ప్రాయశ్చిత్తములు చెప్పబడినవి.
పతితసంసర్గ ప్రాయశ్చిత్తము - ఘటస్ఫోట విధానము.
పతితులతో కూడిన దోషమునకు ప్రాయశ్చిత్తము తెలి పెదను వినుము; అనగా పతితునిచే యజ్ఞమో ఆధ్యయ నమో చేయించుట వానితో వివాహ సంబంధాదికము చేయుట కలిసి ప్రయాణించుటచేసినవాడు తానును పతితుడగును; ఏదోషముచే పతితుడగు వానితో వీనికి సంసర్గము కలిగెనో ఆదోషమున కాచరించవలసిన ప్రాయశ్చిత్తమీతడాచరించిన పాప పరిహార మగును.
ప్రాయశ్చిత్తమొనర్చుకోనని పతితునకు ఘటస్ఫోటము.
పతితుని జ్ఞాతులును నపిండులును బాంధవులును (ఆ మావాస్యవంటి) అశుభదినమున సాయాహ్నమున పెద్దల సన్నిధిలో పతితునకు తిలోదక మీయవలెను; దాసిచే నీటితో నిండిన కడవను తెప్పించి దానిని అప్రదక్షిణముగా త్రిప్పి ఎత్తివేసి బద్దలు చేయవలెను; వీరందరును వానికై ఒక ఆహోరాత్రముపవాసముండి ఆశాచము పాటించవలెను; వీరందరును వానితో సంభాషణమును కలిసి కూర్చుండుట మొదలగు వానిని లౌకిక వ్యవహార ములను దాయాదవ్యవహార మును విడువవలయును; అంతేకాదు; వానికి అన్నదమ్ములలో జ్యేష్ఠుడగుటచే ఉండు అధికారములును పైతృకమగు ఆ సిలో జేష్ట భాగమును లేకుండ పోవును; అవి అన్నియు గుణాధికుడగు అతని తమ్మునకు సంక్రమించును.
శాస్త్రధర్మాను సారముగ నేర్పరచిన మర్యాదలను ఉల్లంఘించి నడుచు పొపకర్ములను ప్రతియొక రిని రాజు వేరు వేరుగ ప్రథమ శ్రేణికి చెందిన (సహస్రకార్సాపణముల) దండముతో దండించవలయును; బ్రాహ్మణుని తిట్టిన క్షత్రియుని నూరు పణములతోను వైశ్యుని రెండువందల పణములతోను శూద్రునై నచో వధముతోను దండించవలయును; బ్రాహ్మణుడు క్షత్రియుని తిట్టినచో ఏబది పణములతోను వైశ్యుని తిట్టిన చో ఇరువది యైదు పణములతోను శూద్రుని తిట్టినచో పండేండు పణములతోను దండించవలయును; క్ష తీయుని నిందించిన వైశ్యుని నూరు పణములతోను శూద్రుని తిట్టినచో అతని సహన పణములతోను వైశ్యుడు శూద్రుని తిట్టినచో అతనిని ఏబది పణములతోను దండించవలయును; వీరిలో ఎవరికివారు తమ జాతీవారిని తిట్టినచో పండేండు పణములతోను అనరాని మాటలు అని తిట్టినచో ఇరువది పణము లతోను దండించవలయును; ఏక జాతివాడు (శూద్రుడు) ద్విజాతి వానిని (బ్రాహ్మణ క త్రియ వైశ్యులలో నేవనినైనను) దారుణ వాక్కుతో తిట్టినచో ఆశూద్రుని జిహ్వాచ్ఛేదము చేయవలెను; ఏలయన ఆతడు తక్కువజాతి వారిలో మొదటి వాడుగదా! ఏక జాతివాడు ద్విజాతివానిని నామజాతి గృహములు ఇంటి మర్యాద మొదలగునవి) ఎత్తి తిట్టినచో వాని నోటిలో మండుచున్న పందెండంగుళముల అయోమయ శంకువు నుంచవలయును; శూద్రుడు బ్రాహ్మణునకు ధర్మోప దేశము చేయుదునని వచ్చినచో రోజు వాని నోటిలోను చెవులలోను త్రాగుచున్న నూనే పోయించ వలెను. వేదశాస్త్రి ధ్యయనమును దేశమును జాతిని శారీరకమయిన కర్మమును ఒక విధముగానున్న దానిని మరొక విధముగా ననుచు(అనగా శాస్త్రము చదివిన వానినీ చదువలేదనీ. ఒకజాతి వానిని నీవీజాతివాడవు కావని ఒక దేశపు పోనిని నీవాదేశపు పొడవుకావని ఒక మంచి పనిని చేసిన వానీనీనీవాపనిని చేయనేలేదని తిట్టినచో) తిట్టిన వానికి రాజు రెండువేల పణములు దండముగా విధించవలయును; స్వతః తాను పాతకుడయి యుండియు మరియొక జాతివానిని తిట్టిన వానిని వేయి పణములతో దండించవలయును; కొందరు కలిసి ఒక టియే రాజేర్పరచిన నియమము సరియైనదికాదని నిందించిన వారిని వేరువేరుగా ద్విగుణ రెండువేల పణముల) దండముతో దండించవలేను; ఏలయన వారందరు ఎదిరించు చున్నారు; ఒకరు ఇంకొక రిని నిందించిన సందర్భములలో “నేను ఇతనియంలి 'ప్రీతి' ‘చనవు’ చే ఆంటీని" “పొర బాటున అంటిని” “ఇక మీదట ఇంకెప్పుడు అనను." అని చెప్పినచో వాడు దండమునకు పాత్రుడు కాడు; మెల్లకంటి వానిని గ్రుడ్డివానిని కొంకుల కాళ్ల వానిని ఇట్టే అంగవైకల్యము కలవానినీ ఆ మాట అనినచో వానికి ఒక కొరా పణధనము దండముగా విధించవలెను; తల్లిని తండ్రిని అన్నను మామగారినీ గురుని ( పెద్దలను) తిట్టినను గురు(వు నడచు) మార్గమున ఏబాధ (ఆటంకము) కలిగించినను అట్టివానిని శత వణములతో దండించవలేను.
గురువు కాకున్న ను త్రోవవిడువదగిన వారికి త్రోవనీయని వాడు తత్పాపశాంతికై రాజునకు ఒక కృష్ణలము దండముగా చెల్లించవలెను; శూద్రుడు ద్విజునకు ఏ ఆవయవముతో అపరాధము చేయునో వాని ఆ అవయవమును అవిచారి తముగా శీఘమే ఛేదించవలెను; ఎట్లన.దర్పముతో ఉమిసినచో రెండు పెదవులను-మూత్రించినచో మేడ్రమును . అప శబ్దము (అపాన వాయుధ్వని) చేసినచో గుదమును.ఛేదించవలెను; గొప్పవానితో సహాసనము కోరినవాని కటిని ఛేదించి గురుతు కలుగునట్లు చేసి వెడలగొట్టవలెను; లేదా వాని పిరుదును నరుకవలెను; జుట్టు పాదములు నాసిక మెడ వృషణములు పట్టినచో అవి చారితముగా శీఘ్రమే వాని హస్తము(ల)ను ఛేదించవలెను; చర్మము రేగునట్లును ర క్తము కారునట్లును గాయ పరచిన వానిని నూరు దుడ్డులతోను మాంసము వెలికివచ్చునట్లు గాయపరచినవానిని ఆరు వణములతోను దండించవలెను; ఎముకలు విరుగునట్లు కొట్టినవానిని ఊరినుండి వెడలగొట్టవలెను; ఇతరులకు అంగ వైకల్యము కలిగించినవాని అదే ఆవ యవము తొలగించవలెను; దండ పారుష్యము (తప్పునకు మించిన దండనము) చేసిన వానిచే ఆందువలన కలిగిన నష్టపు పరిహారమీప్పించవలెను; గోవులను గజములను ఆశ్వములను ఉష్ట్రములను చంపినవానీ కాలు నేతులు సగము నగము నరుకవలెను; హానికరములు గాని పశువులను క్షుద్ర మృగములను హింసించివానికి ద్విగుణమగు రెట్టింపని అర్థముకాదు; రెండవ శ్రేణికి చెందిన నూరు కార్షాపణముల దండము విధించవలెను; మృగపక్షుల హింసించిన వానిని ఏబది పణముల తోను క్రిమికీటాదులకు అకారణముగ హింస కలిగించిన వానిని మినుపగింజ తూకపు వెండితోను దండించవలెను; ఇది కాక ఆ ప్రాణులస్వామికి వానికి కలిగిన నష్టమునకు తగిన మూల్యమును కూడ ఇప్పించవలేను. స్వస్వామి సంబంధము కల మీగిలిన వాని విషయమందును దండ విధానము ఇట్లేయని ఎరుగవలేను; పండ్లుకల వృక్షమును ఛేదించిన వానిని నవ రసు బంగారుతోను ఆవృక్షము మార్గము ప్రక్కనో ఊరి పొలిమేర మీదనో జలాశయ తీరమందో ఉన్న దైనచో రెట్టింపు దండముతోను దండించవలేను; అఫలమగు వృక్షమును ఛేదించిన వానిన రెండవ తరగతి (నూరు పణముల) దండము తోను పొదలు వల్లులు లతలు ఆకారణముగా ఛేదించినచో మాషపు తూకపు బంగారుతోను దండించవలెను; గడ్డినెనను వ్యర్థముగ నర కినచో కార్షాపణము దండము; ప్రాణులను ఆకారణముగ కొట్టినచో మూడు కృష్ణలములను వెండి . నొణె ములు దండము; వృషాదీకమును నరకినచో దానికి దేశ కాలానుసారమగు వేలను వాని సొంతదారునకిప్పించుటతోపాటు శాస్త్రానుసారముగ ఆ అపరాధమునకు దండముకూడ విధించవలెను; (దండధనము రాజునకు చెందును).
బండిని తోలేడివానీ తప్పిదమున ఎద్దులు సరిగా నడువక బండి బోల్తాపడుట మొదలగునవి జరిగి నరకునకో మనుష్యులకో ఏహాని కలిగినను అది కలుగునపుడు ప్రాజకుడు (తోలేడువాడు) ఎదురుగ లేనిచో ఆ బండి సొంతదారు నకును ఎదురుగనున్న చో ఆ ప్రొజకునకును దండము విధించవలెను; దుస్సంఘటనకు ప్రాజకుడు హేతువు కానిచో వానికి ఏశిక్షయు విధించరాదు; తెలిసియో తెలియకయో (సరకుల సొంతదారునకు తెలియునట్లో తెలియనట్లో) ఇతరుల ద్రవ్య మపహరించినవాడు మొదట ఆ స్వామినో విషయమున సంతృప్తుని చేయవలేను; చేసిన తప్పిదమునకుగాను రాజునకు దండమును (జుర్మానా-Fine) చెల్లింపవలెను; (ఇది ఈ విధమగు స్వస్వామితో సంబంధముగల వాని విషయమున జరుగు అన్ని అపరాధములయందును వర్తించు సామాన్య రీతి) (జనులకందరకుపయోగించు). బావినుండి కడవనుగానీ చేదు తొటీనిగాని హరించినవాడు ఆవి తిరిగి తెచ్చి అమర్చవలెను: మాష పరిమాణపు వెండి దండ మీయవలేను; ఒకవేళ ఆ నీటి సౌకర్యమునకు ఏహానినై న కలిగించినను ఇదే దండనము; పది కడవల (కొలత) కంటే ఎక్కువ ధాన్యము దొంగి లించిన వానీకి మరణమే దండము; అంతకంటే తక్కువ దొంగిలించిన సందర్భములందును ఆ దొంగిలించినంతకు పదునొకండు రెట్ల ధాన్యము దండముగ విధించవలెను; భక్ష్యాన్న పానములు అధిక పరిమాణములో దొంగిలించినను వధము విధించరాదు; సువర్ణము రజతము ఉత్తమ వస్త్రములు గొప్పవంశమందు జన్మించిన పురుషులను విశేషించి స్త్రీలను మహాపశువులను శస్త్రములను ఔషధములను మహా రత్నములను హరించిన చో అపరాధికి వధ దండము విధించ వచ్చును; పెరుగు పాలు మజ్జిగ పానీయములు రసద్రవ్యములు వెదురు బ్రద్దలతో చేసిన బుట్టలు తడికలు మొదలగునవి లవణములు మృణ్మయ పాత్రాదికము మన్ను భస్మము దొంగిలించినచో కాలమును చేసిన అపరాధ కార్యమును అనున రించి దండము విధించవలెను; బ్రాహ్మణుల ఇండ్లయందలి గోవులను ఎనుము (గేదె)లను అశ్వములను హరించినవానికి వెంటనే కాళ్ళు సగము నరకించవలెను; దారము ప్రత్తి-కిణ్వము (తేలికపిండి) గోమయము బెల్లము చేపలు పక్షులు తైలము మృతము మాంసము తేనె ఆయా ఈవస్తువులనుండి ఉత్పన్న మణులగు ద్రవ్యములు ఇతర విధములగు లవణములు అన్నము మద్యములు పక్వాన్నము (పిండివంట)లు దొంగిలించినచో వాటి వెలకు రెట్టింపు దండముగా విధించవలయును; పుష్ప ములు పచ్చని ధాన్యములు పొదలు వల్లులు లతలు పరిపూర్ణాన్న ములు. ఇవి దొంగిలించినవానికి ఐదు మాషముల తూకపు వెండి దండము; పరిపూర్ణ ధాన్యములు కమూల ఫలములు దొంగిలినదానికి ఆతడు ఒక్కడే వచ్చి దొంగిలించినచో నూరు కార్షాపణములును తనకు తోడు మరికొందరిని కూడ తెచ్చికొనినవానికి రెండువందల కొరాపణములును దండము; ఆయా దొంగతనములందు దొంగ ఏ యవయవములతో ఎట్లు పనిచేయునో వాని ఆయా అవయవమునట్లే హరించి ప్రత్యాదేశము (ఆ పని అట్లు చేయనీయకుండుట) క లిగించవలెను.
(*గురుంవాబాలంవృద్ధంవా)
ద్విజుడు త్రోవనడుచుచు జీవమునకు (దారిబ తైమునకు) ఏమియు లేనందున రెండు చెరకుగడలో ముల్లంగి దుంపలో (చేదుదోస) బుడమకాయలో దోసకాయలో రెండు ఏవయిన పండ్లో పిడి కేడు ధాన్యపు కంకులో కూరకు నరిపోవు నంత ఆకు కూర యో దొంగిలించినను అది దోషము కాదు; పండ్లు దుంపలు వానస్పత్యములు (పూచి కాచుకాయలు) అగ్న్యర్థమయిన కట్టెలు ఆవు మేత కైన గడ్డి స్వామ్యనుమతి లేకుండ తీసికొన్నను దొంగతనము కాదని మను వచనము; దేవాలయమందలిది. కాని పూవులు దేవతార్థమై పర క్షేత్రమునుండి తత్సామినడుగక తీసికొనినను దండార్హుడు కాడు; కొమ్ములు గోళ్ళు కోరలు కల ప్రాణులను తను చంపబూను వానిని చంపినను పాపము కాదు; ఆతతాయి యగువాడు తన కెదురు పడినపుడు ఆ ఆకతాయి తనకు గురుడయినను బాలుడో వృద్దుడో బహు శాస్త్రాధ్యతయగు బ్రాహ్మణుడో అయినను వానిని ఆలోచించకయే చంపివేయవలెను; అది దోషముకాదు. ఈ ఆత తాయివధాపరాధము ప్రకాశముగా జరిపినను ఆప్రకాశ ముగా జరిపినను దీని దోషము ఆ అపరాధిని అంటుకొనదు. గృహములను క్షేత్ర (పొలము)లను బలవంతముగ హరించువారు పొందరాని స్త్రీని పొందువారు ఇండ్లకు మఠాదులకు నిప్పు పెట్టువారు విషము పేట్టు వారు ఇత రుల హింసించు తలపుతో ఎల్లప్పుడు ఆయుధములు పని తిరుగుచుండువారు ఆభిచారకర కర్మలాచరించువారు ప్రభువు కడచేరి ఇతరుల పై కొండెములు చెప్పువారు ధర్మజులచే ఆతతాయులనబడుదురు. భిక్షుకులు పురుషులేకాని స్త్రీలేకాని పాటలు పాడి జీవించువాడుగాని వలద నినను ఇంటిలోపలికి చొరబడినచో రెట్టింపు దండమునకు (రెండవ శ్రేణికి చెందిన నూరు పణముల దండమునకు) అర్ధులగుదురు. తీర్ధమునందు అరణ్యమందు గృహమందు నదీ సంగమములందు పర స్త్రీలను అకారణముగ మాటలాడించినచో వానిని చేరయందుంచవలయును. తనతో మాటలాడరాదని నిషేధించుచున్న ను ఆ స్త్రీలతో మాటలాడినవానికి ఒక సువర్ణము (నవరసు బంగారము) దండము. తన శ క్తి పై తానాధారపడి జీవించు చారణ దొరల (గాయన నర్తక స్త్రీల) విషయమున ఈ నిషేధములును దండములును వర్తించవు. ఏలయన వారు మనుష్యులతో కలిసియే కాని రహస్యముగాగాని జీవించుచుందురు. అయినను ఇట్టి చారణ ధారలతోగాని దాసీజనముతోగానీ గృహము లందును మఠాదులదును పనులతో తిరుగుచుండు స్సీలతో గాని ఆకారణముగా మాటలాడినవానికిని రోజు ఏదేని కొంత దండము విధించవలయును. ఇష్టపడని కన్యను చేర చిన వానిని వెంటనే వధించవలెను.
ఇష్టపడు (కామయానయగు) కన్యను కూడిన వానిని రెండు వందల పణములతో దండించవలయును. ఇట్టి అకృత్యములకు అవకాశమిచ్చినవానికిని పర దొర గమనము చేసిన వానికి వలెనే దండము విధించవలయును. శ్రీయందు ఏమాత్రమును దోషము లేనిదే బలాత్కారమున పరస్త్రీని చెరచినవానిని వధించవలెను. మూడవమారు రజస్వలయైన తరువాత తాను పితృ గృహమంద వివాహితయైయుండి తానే స్వయముగ పతిని వరించినచో రాజామెను దండించవని లేదు. తన కుమా రెను తన దేశ మందాతనికిచ్చి పెండ్లి చేసి తరువాత ఆమెను తీసికొని పర దేశమున కేగినవాడు. శ్రీచోరుడే యగును. కావున రాజు వానిని చంపవలయును. పతి మరణించిన ధనహీన స్త్రీని ఉంచుకొన్న వానిని దండించపనిలేదు.
ఆమె ధనవతియగుచో ఇతనిని ఉత్తమ (వేయి పణముల) దండముతో దండించవలెను. తన యోగ్యతను బట్టి అంత కంటే ఉత్కృష్టుడగు వరుని తానే వరించిన కన్యను అతనికే ఇచ్చి పెండ్లి చేయవలెను. తక్కువ వానిని వలచినచో ఆ కన్యను ఇంట బంధించి ఉంచవలేను. తన వర్ల ముకంటే ఉత్తమ వర్ణపుత్రీని కూడిన వానిని వధించవలేను. ఉత్తమ వర్ణ శ్రీ ఆధమవర్లుని కూడినచో ఆమెను వధించవలయును. తన పుట్టినింటి వారి బలము చూచుకొని దర్పించి భర్తను ఎదిరించిన స్త్రీని రాజు బహుజనులున్న సంస్థానమందవమానించి దేశమునుండి బహిష్కరించవలెను. సవర్ణునితో (తన జాతి పరపురుషునితో) కూడి అపవితయయిన స్వేగిణీ స్త్రీని (కుటుంబమందు) ఆమెకు గల అధికారములన్ని యు తోల గించి పిండ (పొట్టకు చాలినంత ఆన్న ము) మాత్రముతో జీవించుచుండునట్లు చేసి ఉంచవలెను. తనకంటే అధిక వర్ణునిచే అపవిత్రయయిన స్త్రీకి మలిన వస్త్రము ధరింపనిచ్చి పది శిఖలుండునట్లు తల గొరిగించవలయును. బ్రాహ్మణుడు క్షత్రియ స్త్రీని క్షత్రియుడు వైశ్యశ్రీని వైశ్యుడు శూద్రస్త్రీని పొందినచో ఇట్టివారిని ఉత్తమ (వేయి పణముల) దండముతో దండించవలయును.
విప్రుడు వైశ్య స్త్రీని క్షత్రియుడు శూద్ర స్త్రీని పొందినచో వారిని ద్వితీయ (మధ్యమ-ఐదువందల కారా పణముల) దండముతో దండించవలెను. వైశ్యుడు శూద్రస్త్రీని పొందినచో ప్రథమ (నూరు కార్పొపణముల) దండముతో దండించవలయును. పర) శూద్ర స్త్రీని శూద్రుడు పొందినచో నూరును వైశ్యుడు పొందినచో రెండు వందలును. క్షత్రియుడు పొందినచో మూడు వందలును. బ్రాహ్మణుడు పొందినచో నాలుగు వందలును ఆరావణములు దండముగ విధించవలయును. అంత గా రక్షణము లేని స్త్రీల విషయమున ఇది దండము. సురక్షితల విషయమునందలి ఈ అపరాధము లకు ఇంకను అధికమగు దండము విధించవలెను. తల్లి-మేనత్త - అత్త . మేనమామ భార్య - పినతండ్రి పేద తండ్రి)-వీరి కూతురు పినతండ్రి భార్య తన మిత్రుని భార్య శిష్యుని భార్య తన ఆక్క ఆమెకు మిత్రురాలు. ఆక్క కూతురు. ముట్టుత-రాజపత్నీ - సంన్యాసిని.ఉ త్తమ వర్ల స్త్రీ - వీరు పొందరాని స్త్రీలు. వీరిని పొందిన వాని శిశ్నమును నరకి పిదప దానిని చంపవలెను. సోదరుని పత్ని ని పొందినచో మొదట (లోగడ) చెప్పిన దండమునకు రెట్టింపు దండము విధించ వలయును. చండాలస్త్రీని శ్వవచస్త్రీని పొందినచో వధమే దండము. గోవుకాక ఇతర తిర్యక్పాణియోనియందు మైథునమొనర్చినవాని తల గొరిగించి ఆ పశువునకు మేతను నీటిని వానిచే ఇప్పించవలయును. గోయోనియందు మైథునము చేసినచో సువర్ణము (నవరసు బంగారము) దండము. ద్విజుడు వేశ్యను కూడినచో వేశ్యకు ఎంత శుల్కమో అంత దండము; వేశ్య పొందిక కే శుల్కము, ఒక నికడ తీసికొని ధన లోభముచే మరియొక నీతో కూడినచో ఈ మొదటి వానికి వాడిచ్చిన దానికి రెండింతలు తిరిగి ఇచ్చుచు అంతే ధనమును రాజునకు దండముగా చెల్లించవలేను. వేశ్యను ఒక నినుద్దేశించి తీసికొనిపోయి మరియొకనితో కూర్చినవానికి మాషమాత్రపు సువర్ణము దండము. భోగించుటకై వేశ్యను పిలుచుకొనిపోయి ఆమెకు శుల్కమీయనివాడు తానొమే కొప్పుకొన్న దానికి రెండింతలు తిరిగి ఇచ్చుటతోపాటు అంతే ధనమును రాజునకు దండము చెల్లించవలయును. ఒకే స్త్రీని అనేకులు పొందిననో వారందరును వేరువేరుగా ఆమెకు ద్విగుణ శుల్కమును చెల్లించవలయును. అంతే ధనమును రాజునకు దండముగా ఈయవలెను.
ఎవడును తనత ల్లిని తండ్రిని తను ఆశ్రయించి జీవించున్రీని తన ఋత్విజుని తనచే యజనము చేయిబడు యజమానుని అకారణముగా విడువరాదు; పతితులు మాత్రము తామొకరితో నొకరు కలియక ఒకరినింకరు విడిచి యుండవలెను; వారొకవేళ కలిసి జీవించుచో వారిని రాజు ఆరువందల పణములతో దండించవలెను; గురువులు పతితు లే నచో వారినై న విడువవచ్చును. కాని తల్లిని మాత్రము ఏవిధముగను ఎట్టిస్థితియందును విడువరాదు. గర్భమున ధరించుట అను హేతువులచే ఆమే అందరకం టెను గొప్పది; అనధ్యాయ దినమునందు అధ్యయనము చేయువానిని మూడు కారాషణములతోను అందులకు అవకాశమిచ్చిన అధ్యాపకుని ఆంతకు రెట్టింపుతోను దండించవలయును; ఇందు చెప్పని దానికి బంగారు కృష్ణలము దండమగును; భార్యపుత్రుడు దాసుడు శిష్యుడు సహోదరుడగు భ్రాత (తమ్ముడు)-వీరు అప రాధము చేసినచో త్రాటితోగాని వెదురు బ్రద్దతో కాని వీపు పై కొట్టవచ్చును; కాని తల పైనేన్నడును కొట్టరాదు; ఇట్లు కాక వేరొక విధముగా వీరిని కొట్టినచో వీనిని దొంగను దండించినట్లు రాజు దండించవలెను; దూతిని పిలిచి ఆమెతో నిషిద్ధ వర్తనముతో అనుచితముగ వ్యవహరించినచో అది అతడు ప్రచ్ఛన్న ముగా చేసినను ప్రకాశముగా చేసినను రాజు వానిని తనఇచ్చానుసారము దండించవలెను; రజకుడు వస్త్రములను నున్న నయిన పలకలతో (ఉదికి) శుద్ధము చేయవలెను; మరొక విధముగా చేసినచో వానిని మాషపుతూకపు బంగారుతో దండించవలెను; రక్షాధికృతులు (కాపలా పోండ్రు) దొంగలు దొంగిలునపుడు చూచి ఆ వస్తువును చోరులనుండి తీసికొని సొంత దారునకీయక తామే హరించినను కరకుల నుండి పన్ను తీసికొన్న అధికారులు దానిని ప్రభువునకీయక తామే హరించినను అట్టివారి సర్వస్వమును హరించి రాజు వారిని దేశ బహిష్కృతుల చేయవలెను: తాము ఏ పనులయందు నియుక్తులై రో ఆస్వామికి చెందిన ఆయా కార్యములను సరిగా చేయక పోగా చెడ గొట్టుచుండు వారును ధనపు వేడిమి (పొగరు)చే ఉడికిపోవుచుండు వారునగు జనులను రాజు ధన హీను లనుగా చేయవలెను. రాజుచే ప్పెననుచు తప్పుడు శాసనములను జరుపు వారిని ప్రజలనుఇట్టివానితో ఇబ్బంది పెట్టువారిని శ్రీ బాల బ్రాహ్మణ హింస చేయు వారిని రాజ శత్రువులను సేవించు వారిని వధించుటయే దండము: తాను చేయవలసిన కార్యమునన్యథాగా చేయు ప్రాడ్వివాకుని (న్యాయాధి కృతుని) అమాత్యుని రాజు సర్వస్వహరణముతో దేశ బహిష్కృతుని చేయవలయును.
బ్రహ్మఘ్నుని సురాపాయిని తస్కరుని గురుతల్పగుని మహాపాతకులగు వారినందరను రాజు వేరువేరుగా అపరాధానుగుణమగు చిత్రవధలతో వధించవలయును; ఈ మహాపాతకి బ్రాహ్మణుడయినచో వానిని చంపరాదు; వాని శరీరమున - ఆ దోషపు చిహ్న ములను ఏర్పరచి దేశమునుండి వేడల గొట్టవలయును. చిహ్నముల ఆకృతులను చెప్పే దను; వినుము; గురుతల్పగునికి భగచిహ్నము - సురాపాయికి మద్యపాన గృహమున నుండు జెండా - చౌర్యమయినచో కుక్క పాదచిహ్నము బ్రహ్మహత్య అయినచో శిరము లేని పురుషుడు . ఈ గుర్తులు ఇట్లు వాని దేహమందేర్పరచవలేను; వీరితో ఎవరును మాటలాడరాదు; కలిసి భుజించరాదు; బాంధవ్యము జరుపరాదు; కలిసి ప్రయాణించరాదు; ఇట్లన్ని విధముల వాని జ్ఞాతిసంబంధ బాంధవులు విడువవలయును; మహాపాతకికి గల ధనమును రాజు లాగివేసికొని దానిని నీటముంచి వరుణున కర్పించవలయును; దొంగిలిన సొమ్ము దోరుక నిదే దొంగను ధార్మికుడగు రాజు చంపరాదు; దొంగిలిన ధనమును వాని ఉపకరణములునువానికడనే దొరకినచో అవిచారీతముగ వానిని చంపవలెను; గ్రామనగరాదులందు ఈ దొంగలకు ఆహారమునో పదార్థములనో ఇచ్చు వారిని ఈ చౌర్యమునకు అవకాశమునిచ్చు వారినికూడ చంపవలయును; రాష్ట్ర (రాజ్యాంశమునందలి రాజాధికృతులు (రాజోద్యోగులు) దేశము పై ముట్టడి మొదలగు శత్రు కృతములగు కీడులు జరుగునపుడు ప్రజల మనస్సులను తమ రాజునకు విరుద్ధముగా చెడ గొట్టు టయో తాము తటస్థులే పట్టించుకొనక ఊరకుండుటయో చేసినచో వారిని రాజు దొంగలనువలెనే వధించవలయును; ఊరి దోపిడులు (మఠాది) ధర్మ సంస్థల దోపిడులు దారిదోపిడులు జరుగునపుడు తమకు శక్తి ఉండియు ఆపద నివారించుటకు పరుగెత్తనివారినీ సపరివారముగా దేశమునుండి వెడలగొట్టవలయును; రాజకోశమును హరించు వారిని చిత్రహింసలతో చంపవలయును; రాత్రివేళ లకన్న మువేసి దొంగతనము చేయు దొంగల చేతులు నరకి తరువాత వాడికొరుత వేయవలెను; తటాకములు చెడగొట్టిన వానిని 'నీటముంచీ చంపవలయును; ప్రజలకును పశువులు మొదలగు వానికి ఉపయోగించుటకై చెరువులందు నిలువచేసి యుంచిన నీటిని వ్యర్థముగా వదలుటో చెడగొట్టుటో చేసిన వానిని వేయి కార్షాపణముల ప్రథమ శ్రేణి దండముతో దండించవలయును; చెరువులోనికి నీరువచ్చు మార్గములను చెరచినవానికిని ఇదే దండము.
కోష్ఠాగారాయుధాగార దేవాలయములను పాడు చేసిన పాప ప్రవృత్తులను పాపులను వేరువేరు రీతుల చంపవల యును;తనకే ఆపదయు లేనిదే రాజ మార్గమునందు మల విసర్జనము చేసిన వారిని కార్షాపణముతో దండించవలేను; వారిచేతనే ఆ ఆమేధ్యమును తీసి వేయించి శుద్ది చేయిఅచ వలెను; ఆపదయందున్న వాడు (రోగి) వృద్ధుడు గర్భిణి బాలుడు ఐనచో వారిని తిట్ట (చీవాట్లు వేయ) వలెను; వారిచే శుద్ధి చేయించనక్కర లేదు; పశువులకు తప్పుడు చికిత్స చేసినచో సాధా రణ దండము (207 దుడ్లు) మనుష్యునకు చేసినచో మధ్య దండము (504 దుడ్లు) ఉత్తమ పురుషునకు చేసినచో ఉత్తమ దండము విధించవలెను; రాజదేవ సంబంధులగు ఛత్తమునో ధ్వజయష్టినో (జెండా స్తంభమునో) ప్రతిమలనో చెడ గొట్టిన వారిచే అవి సరిచేయించవలయును; లేదా వారికి ఐదు వందల కార్షా పణములు విధించవలెను; ఏ దోషములేని మంచి వస్తు వులను అపవిత్ర పరచినను చెడ గొట్టినను మణులు పగులగొట్టుటవంటి తప్పుచేసినను ప్రథమ శ్రేణి (1008 కార్షా పణముల) దండముతో దండించవలయును, లేదా వాని వేల ఇప్పించవలెను; ఆయా వస్తువుల వేలలను తారుమారుగా నిర్ణయించినను అట్టి వేలలతో ఆమ్మినను మొదటి విధమగు తప్పిదమునకు ప్రథమ శ్రేణి (1008 కార్షా పణముల) దండమును రెండవ విధమగు తప్పిదమునకు మధ్యమ (504 కార్షా పణముల) దండమును విధించవలయును; బంధన గృహములు (చెర సాలలు) అన్ని యు రాజమార్గమునందు నిర్మించవలయును; అందు చే పాపకారులు వికృతులయి అనుభవించు శిక్షా క్లేశము లను జనులందరును చూతురు; ప్రాకారములను అగడ్తలను (దుర్గ) ద్వారములను చెడగొట్టు వానిని పురమునుండి వెడల గోట్టవలెను; అభిచార కర్మలతో ప్రజలను బాధించు వారిని రెండు వందల కారావణములత్వోదండించ వలయును; విత్త నములు కాని వానిని విత్తనములని చెప్పి మోసగించి అమ్ము వానిని (విత్తిన) బీజములను అపహరించు వానిని పోలి మేర లను హద్దురాలను భంగపరచు వానిని వికృతములగు బంధనములతో చెరయందుంచ వలయును; క లీపనులు చేయు పాపి షుడగు బంగారు పని వానిని చురకత్తులతో ముక్కలు ముక్కలుగా నరుకవలయును; అమ్మకమునకె పదార్ధములు సేక రించి నిలువ ఉంచుకొని తక్కువ వెలగానున్నదని అవి ప్రజలకమ్మక వేలలు ఎక్కువ ఆగుటకై ఎదురు చూచుచుండు వానీని కలితీక లిపి ద్రవ్యములమ్ము వానిని రహస్యముగా వస్తువులను అధిక మూల్యమున కమ్ము వానిని మధ్యమ శ్రేణి (ఐదు వందల నాలుగు కార్షా పణముల) దండముతో దండించవలెను; ఇందుకై కుట్ర చేయు అధికారికి ఉత్తమ శ్రేణి (1008 కార్షాపణముల) దండము విధించవలెను.
శాస్త్రములను యజ్ఞములను తపస్సులను దేశ ములను దేవతలను పతివ్రతలను నిందించు వానికి సహస్ర కార్షా పణముల దండము విధించవలయును; ఒక వ్యక్తి (ఒక రాజాధికారి) అనేకుల విషయమున దండ పారుష్యము చూపి తప్పునకుమించి దండించినచో ఈ దండించిన వానికి అపరాధికి విధించవలసిన దండమునకు రెట్టింపు దండము విధించ వలయును; కలహమయిన చోట్ల ఆ కలహమునకు మూల భూతుడగు వానికి ఇతరాపరాధులకు విధించుదానికి ద్విగుణ దండము విధించవలేను; ఇట్టివాడు బ్రాహ్మణుడైనచో వానిని దేశమునుండి బహిష్కరించవలేను; వెల్లి ఉల్లి పెద్ద ఉల్లి సూకరము ఊర కోడి ఐదుగోళ్లకల ప్రాణులు - మొదలగు అథక్షణీయముల భక్షించిన బ్రాహ్మణుని శీఘ్రమే దేశమునుండి బహిష్కరించవలయును; ఆభక్ష్య భక్షణము చేసిన శూద్రునకు కృష్ణలము దండము; వైశ్యునకును క్షత్రియునకును బ్రాహ్మణునకును వరుసగా దీనికి రెండింతలు మూడింతలు నాలుగింతలు దండమగును; సాహసపు పనులకు ప్రేరకుడగు వానికి ఆపని చేసిన అపరాధికి విధించు దానికి రెట్టింపు దండము విధించవలెను; జ్ఞఎంత అయిన కానిమ్ము; నేనిత్తును; అని ఉబ్బించి ప్రోత్సాహించి ఆకృత్యము చేయించిన వానికి అపరాధికి కంటే నాలుగింతల దండము; ఇతనికి ఇది ఇమ్మని రాజు ఆదేశించగా ఆది అతనికి ఈయని వానికిని బీగముకాని ముద్రకాని వేసియున్న ఇంటి బీగమునో ముద్రన్ పగులగొట్టి చేడగొట్టి ఇల్లు తెర పించిన వానికి ఏబది పణముల దండము విధించవలెను; ఆర్యుడు (తైవర్లి కులలోనివాడు) ఆంటరాని వానినంటినను అయోగ్యుడు యోగ్యమగు తన యోగ్యతకు మించిన పని చేసినను పశువుల పుం స్వము హరించి నను దానికి గర్భపాతము చేసినను దైవ పైతృక కార్యములందు శూద్ర సంన్యాసిని భుజింపజేసినను దైవ పైతృక కార్యము లందు నిమంత్రితుడై వత్తునని పోకున్న ను వీరికందరకును (ప్రతియొక అధికారికిని) నూరు కార్షాపణములు దండము విధించవలెను; దుఃఖ హాని కరద్రవ్యములను ఇతరుల ఇండ్లలో ఉంచిన వానికి కృష్ణ లము దండము; తండ్రి కొడుకు లకు కలిగిన కలహములో సాక్ష్యము పలికిన వానికి రెండువందల కార్షాపణములు దండము; ఇట్టివాడు శూద్రుడు కాక ఆర్యుడు శ్రావర్ణికులలోని వాడు అయినచో వారిలో వైశ్యునకు నాలుగువందలు క్ష శ్రియునకు ఆరువందలు-బ్రాహ్మణు నకు ఎనిమిది వందలు - కారావణ ములు దండమగును; తుల.కాసనము (చట్టము) మానము (తూకపు రాళ్లు కొల తల పాత్రలు) నాణెములు . ఇవి తప్పుడువి చేసినను వానితో వ్యవహరించినను వారికి వేరువేరుగ సహస్ర కార్షాపణముల దండము; విషము పెట్టి(ట్టునదియు ఇండ్లు మొదలగు వానికి నిప్పంటించి(చునదియు పతినో అత్తమామలనో తల్లి దండ్రులనో మరి ఇత రులగు పెద్దలనో తన సంతానమునో చంపి(పునదియు ఆగుస్త్రీని చెవులు ముక్కులు పెదవులు నరకించి ఎద్దులతో (తొక్కించియో పొడిపించియో) చంపవలెను; పంటకళ్ల మునో గ్రామముతో పొలమునో ఇంటినో కాల్చు(ల్చినవారును రాజపత్నీ గాములు కటాగ్ని తో ( చావలు చుట్టి ఆంటించిన మంటలతో) చంపనర్హులు; రాజశాసనమును ఎక్కువయో తక్కువయో చేసి లిఖించినవాడును పరదారహణము చేసిన చోరుని దండించక వదలిన వాడునగు వానిని (రాజాధికృతుని) సహస్ర కార్షాపణములతో దండించవలయును.
అభక్షణీయమగు పదార్థమును భక్షింపజేసి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను ఆపవిత్రపరచినచో వరుసగా వేయి.ఐదువందలు-వంద.ఏబది-కార్షాపణములు దండము! చచ్చిన శవముల దేహములందలి పదార్థములనో సొమ్ములనో అమ్మువాడును గోవులను కొట్టువాడును రాజయానములనో ఆసనములనో ఆరోహించిన(చు) వాడును సహస్ర కార్షాపణము లతో దండ్యులు: తాను న్యాయ్యముగ ఓడియు నేను ఓడలేదని తలచు (చివిర్రవీగు) వానిని మరల జయింపజేసి రెట్టింపు దండము విధించవలయును; ఒకడు మరియొక నిని తన ఇంట భోజన నియంత్రణాదికమునకై మొదట (చౌలముందుగా) ఆహ్వానించి యుండక ఆవశ్యకమగునాడు పోయి నేనిదివ కే నిన్ను సరిగా పిలిచి యుంటిని; వత్తువాలేదా? అని మాటలాడు వానిని మధ్యమ (ఐదువందల కార్షాపణముల) దండముతో దండించవలయును; ఆభియుక్తుడు (అపరాధియయి శిక్షకు పాత్రుడ గుచు శిక్ష విధించబడినవాడు) శిక్షాదాతయగు దాండికుని (దండాధికృతుని) చేతినుండి తప్పించుకొని పారిపోవుచో అపుడు దండికుడు వానిని పట్టుకొనుటకును వాడు తప్పించుకోని పోకుండుటకును యత్నము చేయనట్లు ఋజువైనచో ఈ దండాధికృతుడు శిక్షాపాత్రుడు చెల్లించవలసిన దండమును చెల్లించవలేను; ఈ అపరాధి తప్పించుకొని పోవుటలో ఇతనిని పనియందుచుకొనిన వాడు హేతువని ఋజువయినచో దండధనములో నగము అతడే చెల్లించవలెను; పలువుర నపరాధులనోకేమారు నిగ్రహము (శివాచరణము) చేయుటకో చెరయందు బంధించుటకో తీసికొని పోవుచుండగా వారిలో నొకడు తప్పించుకొని పోయినచో ఆ తప్పించుకొని పోయినవాడు వారందరతోపాటు విహితమయిన దండము కాక దానిలో ఎనిమిదవపాలు అధిక దండము చెల్లించవలయును; వివాదమునందు ఆనిందితుడయిన వానిని నిందితునిగా నిర్ణయించి వానికి శిక్షారూపమున కేశ నఖములు కత్తిరింపించిన (రాజ పురుషుని) రాజాధికృతుని ఐదువందల కార్షాపణములతో దండించవలయును; అవధ్యుడగు (వధదండార్థుడు కాకున్నను ఆపరాధానుసారము చెరయందుంచబడిన వానిని తప్పించి తన బలముతో ఏడిపించినను వధ్యుని వధమునుండి విడిపించినను అట్టివానిని (రాజాధికృతుని) ద్విగుణ దండముతో దండించవలెను; లోభవశముననో ఇతర హేతువులతోనో న్యాయాధికృత సభాసభ్యులు వివాదములందు సరిగ వ్యవహ రించనిచో వారికి ద్విగుణదండము; ఈ పోర బాటు రాజే చేసినచో ద్విగుణదండమును రాజు చెల్లించుటయేకాక దానిలో ముప్పదవ వంతు అధికముగాతీసి దానిని వరుణార్పణమని నీటిలో వేయవలెను; సభ్యులు సరిగ వ్యవహరించక అల్పదండ స్థానమున ఆధికదండమును గాని అధికదండ స్థానమున అల్పదండమునుగాని విధించినచో అధికాంశమును సభ్యుడు తన ఇంటి నుండి చెల్లించవలయును; అవధ్యుని వధించుటయు వధ్యుని రక్షించుటయు విడిపించుటయు జరిగిన సందర్భములలో ఆ దోషము రాజు పొందును. సర్వ పాపకర్తయైనను బ్రాహ్మణునెప్పటికిని చంపరాదు; వాని సర్వ ధనములతో వానిని రాష్ట్రమునుండి వెడలగొట్టవలయును; ఇట్లు పాపమధికముగ చేసినను బ్రాహ్మణుని చంపరాదని నందున ప్రయత్నపూర్వకముగా రాజు బ్రహ్మ హత్యను విడువవలెను; (అనగా బ్రాహ్మణుడు వధర్హమగు పాపములు చేయకుండునట్లు రాజులు ముందుజాగ్రత్త పడవలయును.) రాజు అదండ్యులను దండించినను దండ్యులను దండించక విడిచినను అధికమగు ఆకీర్తిని పొందును; పరలోకమున నరక మును పొందును.
కావున రాజు ఆయా పురుషులు (జనులు) చేసిన అపరాధమును గురుతించి దేశ కాలస్థితుల నాలోచించి ద్విజుల అనుమతినికూడ గ్రహించి దండ్యులకు దండమును విధించవలయును; దీని చే నతనికి పాపశాంతియగును.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున రాజధర్మమున రాజ కర్తవ్యదండ విధియను రెండు వందల ఇరువది ఆరవ అధ్యాయము.
