మత్స్య మహా పురాణము
159 - తారకాసుర వధము॥
దేవ తావందులు (స్తోత్ర పాఠకులు) బిగ్గరగ పాడుచుండిన ఈ సురులను వినగానే తనకు బాలుని వలన మృతి కలదను బ్రహ్మ వచనములు తారకునకు స్మృతికి వచ్చేను॥ పొడును పుణ్యపాప నియంతయగు) ధర్మదేవుని స్మరించి ( భారమంతయు అతనిదేయను భావముతో) కవచమును ధరించక యే పదాతియై పదాతులనే తన వెంట తీసికొని శోక వ్యా ప చిత్తము తో తన మందిర మునుండి శీఘ్రముగా వెలికివచ్చేను॥ అతని సేనానులగు కాలనేమి మొదలగు దై త్వ యోధులు భావావేశమున భ్రాంత చిత్తులై అటునిటు పరుగులెత్తుచుండిరి॥ దేవతలను పట్టుకొనుచుండిరి॥ తమ సేనను కూర్చుకొనుచుండిరి॥ ఇట్లు పలువురు పలువిధములుగా అదే పనిగా చేయుచుండిరి॥
తార కాసురుడు భయంక రాకారుడై పోయి కుమారుని చూచి ఇట్లనెను: బాలుడా! బంతితో ఆడుకొనునట్లే యుద్ద ము కూడ చేయుదమనుకొనుచున్నా వా ఏమి? యుద్ధ భయంకరులగు దానవులను నీవు ఎవుడును చూడనట్లున్నా వు; లేదా పిల్లవాడవు కావున ఎక్కువగా లోక విషయములను చూడనందున ఇట్లు మాటాడుచున్నావేమో! అనగా కుమారుడును తనముందున్న తారకాసురునితో దేవతలకు హర్ష కారణముగా ఇట్లు పలికెను: తారకా! నీవు శాస్త్ర విషయములు మాట లాడుచున్నావు కావున) నీకు శాస్త్రమునందు చెప్పిన విషయమే ని పింతును వినుము; సమర మనిన భయమెరుగని వీర భటులెన్నడును శాస్త్రములచే చెప్పబడిన విషయములను నీవలె) చూచుచు విచారించుచు) ఉండరు॥ నా శిశుత్వమును నీవలక్ష్యముగా చూడ కుము॥ కాల భుజంగము శిశువే; భాస్కరుడు బాలుడయ్యు చూడ శక్యుడు కాడు! అట్లే నేను శిశువనయినను దుర్జయుడనని ఎరుగుము; దైత్యుడా! మంత్రము తక్కువ అక్షరములు కలదేయైనను అధిక ప్రకాశము కలదై యుండుట కనబడుచునేయున్న ది కదా? అని ఇట్లు కు సూరుడు పలు కుచుండగనే తారక దైత్యుడు ముద్దరమును విస రెను॥ దానితడు అమోను తేజముగల వజ్రముతో వెనుకకు త్రిప్పివేసెను॥ దేవేంద్రుడు అయోమయమగు (ఇనుప)॥ భీండి వాలము విసరగా దేవశ త్రు హంతయగు కార్తికేయుడది చేతితో పట్టివేసి ఆ షణ్ముఖుడు దైత్యుని పై పరుషధ్వని కల గదను వదలెను॥ ఆ దెబ్బతిని వాడు పర్వతరాజమువలె నుండియు కంపించెను॥
దానితో దైత్యుడీ షడ్వదనుడు రణ దుర్జయుడనియు తనకు కాలము సమీపించినట్లున్న దనియు తలచెను॥ కాలనేమ్యాది దైత్యేశ్వరులందరును తార కుడు కంపితుడగుట గమనించి రణ దారుణు భయంకరుడగు కుమారుని సొట్టిరి॥ మహాతేజస్కుడగు ఆ కుమారుడును వారి క్లేశము వ్యర్థముకాగా ఆ దేబ్బలేమియు చలింపరానివియు దివ్యశ క్తి భావిత ములుగుసగు అవయవములుకల తనకు తాకక పోగా దానవులనందరను ఎదిరించి ॥ యుద్ధము చేయసాగెను॥ యుద్ధ నిపుణులు బలశాలురు దేవ కంటకులునగు ఆ దైత్యేంద్రులు దేవతలను కుమారుని కూడ ప్రాసములతో భాణము లతో కొట్టిరి॥ దై త్యాగ్ర నిహతుడయ్యు కుమారుడేమియు వ్యథ నందలేదు॥ కాని దానవులతోడి యుద్దము దేవతలకు మాత్రము ప్రాణాంతకమయ్యేను॥ దేవతలు పీడితులగుట చూచి కుమారుడు శోపొవిష్ణుడయి దానవ సేనను అప్రములతో చీల్చి చెండాడసాగేను॥ సురకంటకులగు కాలనేమి ప్రముఖ దానవులందరును ప్రతీకారము చేయనలవికాని కుమా రాస్త్రముల దెబ్బలుతిని యుద్ధమునకు పేడ మొగము పెట్టిరి॥ దైత్యులందరును పారిపోవుట మర ణించుటయే కాగా కిన్నరులు బిగ్గరగా పాడుపాటలతో వినబడు నవ్వునకు మహాదైత్యుడు అసుర నాయకుడా తార కుడు తెలివి తప్పినంతగా క్రుద్ధుడయ్యెను॥ బంగరు పరికరములతో అలంకృతమయిన దివ్య గదను చేబూని ఒరపిడి చేసి పరీక్షించబడిన మేలిమి బంగారపు భుజకీర్తులతో అలంకృతుడగు ఆదే త్యుడు దానిని ఆ గదతో కొట్టెను॥ ఆశ్చర్యకర శరములతో నేమిలిని రణ విముఖముగా చేసెను॥
షణ్ముఖుడగు ఆ కుమార దేవుడు తన వాహనము ర క ము కక్కుచు రణమునకు పెడ మొగమగుట చూచి' బంగరు భుజకీర్తులతో రుచిరమగు భుజముతో కనక భూషణములుగల విమలమగు శక్తిని పూనెను; ఆంతట మహా సేనుడు “మహాదుర్బుద్ధిః నీలునిలుము; ఒక సారి ఈ జీవలోకమును చూచుకొనుము; ఇపుడు ఒక క్షణములో) నాచేతి శ క్తితో చావనున్నావు! దైత్యుడా! నీవు నేర్చిన అస్త్రమును స్మరించుము; అది నిన్ను కాపాడునే మో చూతము॥) అనుచు పోనిమీదకు ఆ శక్తిని వదలేను॥ కుమారుని భుజములనుండి విడువబడిన ఆ శక్తి అతని భుజకీర్తుల ధ్వని తనతోపాటు వచ్చుచుండగా పోయి వజ శైల రాజమువలే కఠినమగు దైత్య హృదయము చీల్చెను॥ వాడును చెదరిన కిరీటముతో తలపాగ తో జారిపడిన ముంగురులతో భూషణములతో ప్రళయకాలమున పర్వతమువలే నేల పై పడెను॥
ఆ దైత్యుడు వినిహతుడు కాగా అది దేవతలకు పెద్ద పండుగ అయ్యెను॥ నరకమందున్న పాపకరుడు కూడ ఆ సమయమున ఎవడును దుఃఖవంతుడు కాకుండెను॥ దేవతలు షణ్ముఖ దేవుని స్తుతించుచు తమ తమ స్త్రీలతో కూడి ఆడుచు మహాధామ తేజోవంతులయి, క్రొత్త కుతూహలము(వేడుక )లతో తమ తమ భవనముల కెగిరి॥ తమ తమ కోరిక లన్నియు ఈ డేరుటతో తుష్టులయి దేవతలందరును 'స్కందముఖము (కుమారోపాఖ్యానము ) విషయమున సిద్దులతో తపో ధనులతో కూడి ఈ విధముగ ఫలశ్రుతిరూపములగు వరములను లోకములకు ప్రసాధించిరి:
కుమారోపాఖ్యాన శ్రవణఫలము
స్కందునితో సంబద్ధమగు ఈ కథను ఏమర్త్యుడు పఠించునో వినునో వినిపించునో అట్టి నరుడు మహాతేజో వంతుడు కీర్తిమంతుడును బహ్వాయుష్మంతుడు సుభగుడు పత్ని కి ప్రీతిపాత్రుడు) శ్రీమంతుడు కాంతిమంతుడు శుభదర్శనుడు శుభకరమగు-ఇంపగు॥ ఆకృతి కల వాడు) ఏప్రాణుల భూతములనుండియు నిర్భయుడు ఏ దుఃఖములును లేని వాడు నగును॥ స్కందునికి నివేదనము చేయుచు స్కందు నుద్దేశించి బ్రాహ్మణులను అన్నా తురులను భుజింపజేయుచు ఈ స్కంద చరితమును పారాయణము చేయుచో మహాధనపతి యగును॥ వ్యాధిగ్రస్తులగు బాలురకును రాజద్వారమును (రాజ సేవారూపములగు పదవులను) ఆశ్రయించియుండు వారికిని ఇది పర మదివ్యమగు సాధనము; సర్వదా సర్వకామ ప్రదము; అట్టి నరుడు దేహము నశించిన తరువాత స్కందునితో సాయుజ్యము పొందును॥
ఇది శ్రీమత్స్య మహా పురాణము న దేవాసుర సంగ్రామమున తారకాసుర వధమను నూట ఏబది తొమ్మిదవ యధ్యాయము॥
తారకాసుర వధ కథ ముగిసినది॥
