మత్స్య మహా పురాణము

Table of Contents

252 - గృహాది నిర్మాణకాల నిర్ణయము - భూపరీక్ష- వాస్తుమండల దేవపూజ.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పేను: శుభమగు కాలమును తెలిసికొని ఆట్టి సమయమందే భవన నిర్మాణ మారంభించవలెను. గృహారంభమునకు - చేత్రము వ్యాధి ప్రదము - వైశాఖము ధన రత్న ప్రదము - జ్యేష్ఠము మృత్యు కరము - ఆషాఢము - భృత్యరత్న పశువృద్ది కరము - శ్రావణము భృత్యలాభదము - భాద్రపదము హానికరము - ఆశ్వ యుజము పత్నీ నాశకరము - కార్తిక ము ధనధాన్య వృద్ధికరము - మార్గశిరము అన్న వృద్ధికరము.పుష్యము చోరభయ ప్రదము - మాఘము బహులాభదాయకము - ఫాల్గునము కాంచనమును బహుపుత్త్రులను ఇచ్చును.

నక్షత్రములలో అశ్విని రోహిణి మూల ఉత్తరఫల్గుని ఉత్తరాషాఢ - ఉత్తరాభాద్ర - మృగశిరస్వాతి - హస్త - అనూరాధ - మంచివి; ఆదిత్య మంగళ వారములు కాక మిగిలినవారములు మంచివి.

యోగములు: వ్యాఘాత శూల వ్యతీపాతాతిగండములు విడువదగినవి; విష్కంభగండ పరిఘ వజ్రయోగములు ప్రశస్తములు.

ముహూర్తములు: శ్వేత-మైత్ర - మాహేంద్ర - గాంధర్వాభిజిద్ - రౌహిణ - వేరాజు - సావిత్ర ముహూర్తములు ప్రశస్తములు.

దివాకాలమునగాని రాత్రియందుగాని ప్రత్యేకముగా పదునై దేసి ముహూర్తములకును వరుసగా 1. రౌద్రము 2. శ్వేతము 3. మైత్రము 4. సార భటము 6. సావిత్రము 6. వై రాజము 7. విశ్వావసువు 8. అభిజిత్ 9. రౌహిణము 10. బలము 11. విజయము 12. నైరృతము 18. వారుణము 14. సౌమ్యము 16, భగము అని నామములు అని ఆథర్వణ జ్యోతీషము అను గ్రంథము (ముహూర్త ప్రకరణము - శ్లో.4 నుండి 11వరకు) చెప్పుచున్నది. ఈ సంప్రదాయమును దృష్టిలో ఉంచుకొనియే ఇచ్చట గృహారంభమునకు ఉచితములగు ముహూర్తములు పేర్కొనబడినవి. అని గ్రహించవలయును.

ఇచట చెప్పిన ముహూర్తములు ఎనిమిది; అవి: 1. శ్వేతము - ఇది రెండవది; 2. మైత్రము. ఇది మూడవది; 3. మాహేంద్రము - మహేంద్ర పుత్రుడు విజయుడు కావున ఇది పదునొకండవది; 4. గాంధర్వము - విశ్వావసువు ఒక గంధర్వుడు; కావున ఇది ఏడవ ముహూర్తము; 5. ఆభిజిత్ - ఇది ఎనిమిదవది; 6. రౌహిణము-ఇది తొమ్మిదవది 7. వై రాజము-ఇది ఆరవది; 8. సావిత్రము. ఇది ఐదవది. ఈ ముహూర్తములు గృహారంభమునకు మంచివి.

చంద్ర రవి బలమును శుభలగ్నమును విచారించుకొని ఆట్టి శుభసమయమందు స్తంభములు నిలువబెట్టుట మొదలగునవి: (గృహ-భవన-నిర్మాణమున) చేయవలయును; ప్రాసాద నిర్మాణము - కూపవాపీ నిర్మాణము మొదలగు వానియందును ఇవియే శుభమాన నక్షత్రాదులని తెలియవలెను. (ప్రాసాదములు = దేవతా-రాజభవనములు:)

గృహాదీ నిర్మాణార్థం భూపరీక్షా- గృహాది నిర్మాణార్థమై భూపరీక్ష

మొదట భూమిని పరీక్షించి తరువాత ఆ పరీక్షిత భూమియందు వాస్తుప్రకల్పనము (వాస్తుయజ్ఞ పూర్వక ముగా గృహభవన ప్రాసాదాది నిర్మాణారంభమును నిర్మాణమును) జరుపవలయును. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు వరుసగా శ్వేతర క్త పీత (పచ్చని) కృష్ణ (నల్లని) భూములు ప్రశస్తములు; విప్రులకు తీయని - క్షత్రియులకు వగరుగల- వైశ్యశూద్రులకు ఇరువురకును వగరు కారము కలిసిన రుచిగల భూములు మంచివి.

తరువాత భూపరీక్ష కై పిడిమూర అంత లోతు ఆంతపొడవు అంతే వెడలుపు గల చిన్న గుంతను తవ్వి దానియందు అంతట బాగుగ అలుకవలెను;  దానిలో పచ్చిమూకుడుఉంచి దానిలో నేయిపోసి నాలుగు దిక్కులందును నాలుగు వచ్చునట్లు వత్తులు ఆమూకుటిలో ఉంచి దానిని వెలిగించి ఆ గోతియందు నడుమనుంచవలెను. అపుడు ఏదిక్కునందలి దీపములు ఎక్కువ కాంతితో వెలుగుచుండునో చూడవలేను; పొగుగ వేలుగుటలో తూర్పుది విప్రులకు.దక్ష్మిణపుది క్షత్రియులకు.పడమ టిది వైశ్యులకు ఉ తరపు శూదులకు మంచిది. అన్ని దిక్కులందలి దీపములును బాగుగ ప్రకాశము నిచ్చుచున్న చో దానిని సామూహిక వాస్తుప్రదేశమందురు; ఇట్టి భూమి అన్ని వర్ణములవారికిని ప్రాసాదగృహ నిర్మాణములకు మంచిది; తరువాత ఆ తవ్విన మట్టితోనే ఆ గోతిని పూడ్చవలేను; ఆ గోయి పూడుటకు ఆ మన్ను ఎక్కువయినచో చాల మంచిది; సరి పోయినచో సమము; తక్కువయినచో మంచిదికాదు; (ఆ భూమియందు గృహ నిర్మాణము తగదు;) తరువాత ఆ భూమిని నాగటితో దున్ని అన్ని విధములగు విత్తనములను చల్లవలయును; అవి అందు మూడునాళ్ళకు మొలకెత్తినచో చాల మంచిది; ఐదునోళ్ళు పట్టినచో మధ్యమము; ఏడుదినములు పట్టినచో అధమము;  ఇట్టి ప్రదేశము గృహ నిర్మాణమునకు పనికిరాదు.

ఏకాతిపద(స్థాన) దేవతాపూజ-వాస్తు పురుష దేహ పరిలేఖనము.

[చతుశ్శాలాది గృహములకు స్థలనిర్దేశ ము చేసికొన్న తరువాత దానియందు ఆచతుశ్మాలా నిర్మాణమునకు అనుగుణముగా స్తంభములను నిలుపవలసిన ముఖ్యస్థాన నిర్దేశము శాస్త్రకర్తల తలంపులో నున్నట్లు కనబడును. ఇందులకై ఈ చతుశ్శాలాగృహ నిర్మాణ ప్రదేశమును వాస్తుపురుషుని దేహముగా భావన చేసినచో అతని ఏయే అవయవము లేచ్చ టెచ్చటకు వచ్చునో ఇందు తెలుపబడినది. ఇది గృహనిర్మాణ విషయమున తీసికొనవలసిన మరి ఎన్నో జాగ్రత్త లకు అనుకూలించు విషయము. అనువాదకుడు.]

వాస్తుకర్మణ్యే కాశీతిపదే దేవపూజా.

ఏకాశీతి పద వాస్తు మండలము [81 పదములు(గదులు)]

 వాస్తు పురుష దేహవిషయక భావన ; వాస్తు పురుషునీ బోరగిల పడద్రోసి దేవతలు ఆతనిపై ఆతని ఆయా దేహావయవ స్థానములకు సరిగా కూరుచుండిరి. అనగా ఏకాశీతి- చతుష్టష్టి-పదవాస్తు మండలములందు మనకు కనబడునది వాస్తు పురుషునీ వేనుకవై పు; అంతేకాని అతని ముందు వైపు కాదు. అనగా మనము తూర్పుగా తిరిగి కూర్చుండ గా మనకు ఏది కుడివైపో పోస్తు పురుషునకును అదియే కుడి వైపు. వాస్తు పురుషుని శిరము ఈశాన్యమునకును పాదములు నైరృతమునకు నున్నవి.

సూచనలు : (1) ............. ఈ గుర్తులు కలవి వంశ రేఖలు; వాస్తు పూజల కై లిఖించు వాస్తు మండల యంత్రమున దీనిని గీయ నక్కర లేదు.

 (2) ఈ వంశ రేఖలు పరస్పరము ఖండించుకొనినట్లు తాకుచున్న స్థానములు ‘మర్మములు’ అనబడును.

(3) ఏ సంఖ్యగల దేవతకు ఆ సంఖ్యగల అన్ని గదులమీదను ఆధిపత్యము ఉండును.

ఉదా : జయంతునకు 3 సంఖ్యగల రెండు గదులపై అధికారము.

A black and white drawing of a square with numbers

Description automatically generated

చతుఃషష్టి పదవాస్తు మండలము-శ్రీమత్స్య-అ. 252.

64 పదములు [గదులు]

సూచన : ఏ దేవతకు ఏ సంఖ్యగల గది పై ఆధిపత్యము ఇందు చూపబడినదో ఆ దేవతకు ఆ సంఖ్యగల అన్నీ గదులమీదను ఆధిపత్యము ఉండును. వాస్తు పురుషుని శిరము ఈశాన్యమునకును పాదములు నైరృతమునకును ఉన్నవి.

A black and white drawing of a square with numbers and lines

Description automatically generated

ఇట్లు స్థలమును పరీక్షించి ఆది గృహనిర్మాణమునకు పనికివచ్చునని నిర్ణయించిన ప్రదేశమును పంచగవ్యము లతోను ఓషధులతోను నంమిళితమయిన జలముతో కలయంపి చల్లి తడుపవలెను; తరువాత ఆ ప్రదేశమున ఎనుబదియొక గడులు (అంకణములు) వచ్చునట్లు బంగారు నరకుతో రేఖలు గీచికొనవలెను. తరువాత దానిపై పిండితో పూయ వలెను; దాని పై మరల అంతటను దారముతో ఆలోడనము చేయవలెను; తరువాత ఆ త్రాటితో తూర్పు పడమరలుగా పదియు ఉత్తర దక్షిణములుగా పదియు రేఖలు గీయవలేను. ఇది సర్వ వాస్తు విభాగములందును చేయవలసినవని; ఇట్లు గీయుటచే తొమ్మిది తొమ్మిదులు ఎనుబది యొకటి గదులు ఏర్పడును; వాస్తు శాస్త్రవేత్త సర్వవాస్తు నిర్మాణ కర్మము లందును ఇట్లే చేయవలెను; ఈ గదులయందు వెలుపలగా ముప్పది రెండు మందిని లోపలగా పదుముగ్గురను - మొత్తము నలువది యెదు మందిని ఆయా దేవతలను యజమానుడు ఈశాన్య కోణాదిగా ఆయా స్థానములందు నిలిపి హవిస్సుతో పూజించవలయును; వారివారి స్థానములను వారివారి నామములను తెలి పేదను. వినుము; వారు వరుసగా అగ్ని-వర్షన్యుడు- జయస్తుడు- ఇంద్రుడు-సూర్యుడు నత్యుడు-భృశుడు- ఆకాశుడు- వాయువు-పూషన్ - వితథుడు-గృహక్షతుడు - యముడు-గంధర్వుడు – భృంగరాజుడు-మృగుడు-పితృగణము-దౌవారికుడు- సుగ్రీవుడు-పుష్పదంతుడు-జలాధిపుడు(వరుణుడు)- ఆసురుడు – శోషుడు- పాపుడు రోగుడు – అహి- ముఖ్యుడు- భల్లాటుడు- సోముడు - సర్పుడు అదితి-దితి- ఈముప్పది రెండుమందియు బయటి గదులయందు ఉండువారు; ఇందులకు లోగా ఈశానాది చతుష్కోణములందును. ఆపుడు.సావిత్రుడు. జయుడు.రుద్రుడు. అనువారిని నిలుపవలేను; నట్టనడుమ గదియందు బ్రహ్మయుండును; అతనికి దగ్గరలో ఒక గది విడిచీ మరియొక గది యందు ఎనిమిదిమంది సాధ్యులను నిలుపవలయును; వారు వరుసగా - అర్యముడు.నవిత - వివస్వాన్ - ఇంద్రుడు (విలు ధాధిపుడు). మిత్రుడు. రాజయమ్ముడు -పృథ్వీధరుడు - ఆపవత్సుడు - ఆనువారు; వీరిని ప్రాగాదిగా నిలుపవలయును; ఇపుడు ఆయా మూలలందు పదికులను తెలిసికొందము: పదము = అంకణము (గది); పదికులు = ఒక్కొక్క అంకణమునకు అధిపతులు.

ఎట్లు అనీన-ఈశాన్య కోణమునందలి దితి-పర్జన్యుడు-అగ్ని - ఆపుడు - ఆపవత్సుడు -ఆగ్నేయమునందలి ఆకాశ - పూష-వాయు-సావిత్ర-నవితృలు-నైరృతమునందలి.మృగ-దౌవారిక.పితృగణ - జయ - విబుధాధిపులు.వాయవ్యమునందలి పాపాహీరోగ రుద్రరాజయక్ష్ములు. ఈ ఇరువది మందియు ఒక్కొక్క గది(డి)కీ ఆధిపతులు; తూర్పున- జయంతుడు. ఇంద్రుడు. సూర్యుడు సత్యుడు భృతుడును-దక్షిణమున-వితథ గృహక్షత యమగంధర్వ భృంగ రాజులును-పడమట - సుగ్రీవ పుష్పదంత వరుణాసుర శోషులును-ఉత్తరమున ముఖ్య భల్లాట సోమ సర్పాదితులును. అను ఈ ఇరువది మందియు రెండేసి గదు(డు)లకు ఆధిపతులు. లోపలి వరుసలోని – ఆర్యముడు-వివస్వంతుడు - మిత్రుడు –పృథ్వీధరుడు- అను నలుగురును మూడేసి గదుడు ,లకు అధిపతులు.నడుమ ఉన్న బ్రహ్మ తొమ్మిది గద్యు(డు)లకు అధిపతి. ఇట్లు

మూలలందలి 20 మందియు - 20x1= 20 గదులకు అధిపతులు

దిక్కులందలి 20 మందియు   -20x2= 40 గదులకు    ,,

లోపలి 4 మందియు              -  4x8 = 12 గదులకు   ,,

నడుమ 1 (బ్రహ్మ)                    - 1x9- 9 గదులకు       ,,

మొత్తము 45 మందియు                          81 గదులకు అధిపతులు

 ఇపుడు పైని చెప్పిన వానిలో వంశములు ఏర్పడు విధానము చెప్పెదను; వాయువునుండి రోగునివరకు ఒక రేఖను పితరులనుండి అగ్ని వరకు ఒక రేఖను గీయవలెను; ఇవి రెండును బ్రహ్మస్థాన మధ్యబిందువునొద్ద పరస్పరము ఖండించుకొనును; తరువాత ముఖ్యునినుండి భృకునివరకు ఒక రేఖను శేషునినుండి వితథునీ వరకు ఒక రేఖను సుగ్రీవుని నుండి అదితివరకు ఒక రేఖను మృగునినుండి పర్జన్యుని వరకు ఒక రేఖను గీయవలయును; ఈ నాలుగవ దానిని జయుని వరకు గీయుటయు కొందర మతమున గలదు; ఆయా పదముల నడుమ ఏర్పడు ఈ రేఖల సంపాత (పరస్పర ఖండన) స్థానములకు మర్మములు అని పేరు; కోణ స్థానములకు త్రిశూలమని వ్యవహారము; ఈ సం పాత ప్రదేశములందుగాని త్రిశూల స్థానములందు గాని స్తంభములు నిలుపరాదు; దూలము(తుల)ల అదుకులుగా కీలములు బంధించుట. ఒక దూలముతో మరియొక దూలమును ప్రక్కప్రక్కగా కలుపుట - ఒక దూలముతో మరియొక దూలమును ఒక దాని చివరి భాగమును కొంత మరియొక దాని పైకి వచ్చునట్లు కలుపుట, మొదలగునవి చేయకుండవలెను; [కీలము -ఉచ్చిష్టము-ఉపఘాతము అను నవి ఈ చెప్పిన అర్థము లలో శాస్త్రీయ పారిభాషిక పదములుగ మూలమందు వాడబడినవి.]

ఈ విధమగు సర్వభాగ సంనివేశ ములతో కూడిన ఈ చతుశ్శాలాత్మకమగు గృహనిర్మాణమునకుగాను వ్యవస్థ చేసిన ఈ ప్రదేశమును వాస్తుపురుషుని దేహముగా భావనచేయవలయును; పైన చెప్పినట్లు లిఖించిన వంశ రేఖలలో అగ్ని స్థానమునుండి పితృస్థానమునగల కోణాగ్రమువరకుగల పొడవు వాస్తుపురుష దేహదైర్ఘ్యము; శిరఃస్థానమున ఆగ్ని యు - ముఖమునందు ఆపుడును ఎడమ - కుడి - స్తనములందు పృథ్వీధరుడును - ఆర్యముడును - వక్షఃస్థలమునందు ఆపవత్సు డును - ఎడమ-కుడి నేత్రములయందు దితియు పర్జన్యుడును - ఎడమ. కుడి తొత్రములయందు ఆదితియు జయంతుడును ఎడమ కుడి అంస(భుజమూల) సంధులయందు నర్పుడును ఇంద్రుడును-దక్షిణ భుజమందు సూర్యభృశాకాశ వాయువులును. సోమభల్లాట ముఖ్యాహీరోగులు వామభుజమునందును రుద్రరాజయమ్ములు వామహ సమందును- సావిత్ర సవితృలు దక్షిణ హ స్తమునందునువివస్వంతుడును మి తుడును కుడి ఎడమ జఠర (ఉదర) భాగములందును పూషుడును పాపయత్ముడును కుడి ఎడమ హస్తముల మణిబంధములందును - అసురశోషులు వామపార్శ్వమందును - వితథగృహక్షతులు దక్షిణపార్శ్వ మునందును - యమవరుణులు కుడి- ఎడమ - ఊరువులయందును గంధర్వ పుష్పకులు కుడి ఎడమ - జానువుల యందును భృంగసుగ్రీవులు కుడి - ఎడమ జంఘల (పిక్కల) యందును - దౌవారికమృగులు ఎడమ-కుడి స్పీక్ (పిరుదు)లయందును- ఇంద్రజయులు మేడ్రము (మర్మావయవము)నందును - హృదయమందు బ్రహ్మయు నున్నట్లు భావనచేయబడి పూజింప బడుదురు.

 (ఇంతవరకును చెప్పిన ఏకాశీతి సద నిర్ణయము ఈశ్వర సద్మములకు (ధనవంతుల గృహములకు) సంబంధించి నది; రోజులకును దేవతలకును సంబంధించు గృహవి శేషములను ప్రాసాదములు అందురు; ప్రాసాదములయందు వాస్తు రూపము చతుః షష్టి పదములతో (ఆరువది నాలుగు అంకణములతో) ఏర్పడును; అనగా నిర్మాణమునకుద్దేశించిన ప్రదేశ మును తొమ్మిది నిలువు రేఖలతో తొమ్మిది అడ్డు రేఖలతో విభజించగా (8x8 = 64) అరువదినాలుగు గదులుగా ఏర్పడును; బహిః కోణముల యందు నాలుగు గదులందును ఆయా దేవతలు ఎనిమిది మందియు అర్థపదములకు అధిపతులు; అట్లే ఆంతఃకోణములయందును; బ్రహ్మస్థానము దీనినడుమ నాలుగు పదములతో - అంకణములతో ఏర్పడును. ఇరువది మంది రెండేసిపదములకు ఆధిపతులు; రెండు పార్శ్వములందును ఉండు దేవతలు ఒక్కొక్కరు ఒకటిన్నర ఏసిపదము లకు ఆధిపతులు. (ఈ విషయమున వివరణము ఇచట ఈయబడుచున్నది.)

(*ఇచట మూలములో ‘యమౌ ఉభౌ’ అని ఉన్నది; అనగా యముడును దిక్పాలకులలో తూర్పుదక్షిణము పడమర ఉత్తరము ఆనుక్రమమున యమునినుండి రెండవ వాడగు వరుణుడును అని అర్థము చేప్పికొనవలయును.)


 

శాంతి కమలాకరమునందు ‘ఏకాశీతిపదమండలము’న - ఆరాధ్యదేవతా విన్యాసక్రమము.

 తతో వేద్యుపరి నూతనవస్తే కుంకుమాదీనా సువర్ణరజతాదిశలాకయా ‘శాంతాం యశోవతీం కాంతాం విశాలాం ప్రాణవాహినీం ! సతీంచ సుమతీం నందాం సుభధాం సురథాందశ.’ ఇత్యోంకారాదిన మోంతై ర్నా మభిః పశ్చాదరఖాః ప్రాగంతాః ఉదక్ సంస్థాః సమాః అంగుళద్వయాంతరా దశ రేఖాః కృత్వా-పునః ‘హిరణ్యాం సువ్రతాం లక్ష్మీం విభూతిం విమలాం ప్రియాం ! జయాం బలాం విశోకాంచ ఈడామితిదశ క్రమాత్.’ ఇతినామభి స్తథైవ దడారంభాః ఉదగంతాః ప్రాక్సంస్థాః ప్రాగ్వద్దశ రేఖాః కృత్వా కుండే స్థండిలే వాస్తుంసంస్మృత్యాగ్ని ప్రతిష్టాప్యదక్షిణ వేద్యాంవస్తే నవగ్రహ మండలంవిలిఖ్యతత్ర గ్రహాదీక్ సంస్థాప్యషోడశోపచారై  సంపూజ్యతదై శాన్యాంకలశం సంస్థావ్య వాస్తు మండ లంగ త్వాతత్ర ఈశానకోణ పదమారభ్య ప్రతిమాసు అక్షతపుంజేషు పో శిఖ్యాదిదేవతాః ప్రణవాదీనమోంతై ర్నామ మంత్రే రావాహయేత్ ; తత్ర ఈశానకోణపదే వాస్తోః శిరసి శిఖినే నమః; శిఖినమావాహయామీతిస్థాపయేత్. ఏవమగ్రేపి; తద్దడిజైకపదే దక్షిణనేత్రపర్జన్యం; తద్దక్షిణపదే తతోపి పశ్చిమదేశ ఇతిద్విపదేదక్షిణశ్రో తేజయంతం; తద్దక్షిణపదద్వయేదక్షిణాం సేకులిశాయుధం; తద్దక్షిణపదద్వయే దక్షిణబాహౌసూర్యం; తద్దక్షిణపదద్వయే దక్షిణబాహావేవసత్యం; తద్దక్షిణపదద్వయే దక్షిణకూర్పరేభృశం; తద్దక్షిణే పరిస్థితే కపదేదక్షిణప్రబాహావాకాశం; తద్దక్షిణ మణిబంధేపూషణం తత్పశ్చిమపదేతదుత్తరపదేచ దక్షిణపార్శ్వేవితథం; తత్పశ్చిమపదద్వయేదక్షిణ పార్శ్వఏవగృహక్షతం; తత్పశ్చిమపదద్వయే దక్షిణోరాయమం; తత్పశ్చిమతదద్వయేదక్షిణజానౌ గంధర్వం; తత్పశ్చిమపదద్వయే దక్షిణ జంఘాయాం భృంగరాజం; తత్పశ్చి మోపరిస్థితైకపదేద కణస్ఫిచిమృగం; తత్పశ్చిమ నైరృత్య కోణపదే పాదయోః పితృక; తదుత్తరైకపదేవామస్ఫిచిదౌవారికం; తదుత్తరపదేతత్రాక్పదేచ వామజంఘాయాం సుగ్రీవం; తదుత్తరపదద్వయేవామజానౌ పుష్పదంతం; తదుత్తరపదద్వయే వామోరెవరుణం తదుత్తరపదద్వయేవామపార్శ్వేఅసురం; తదుత్తరపదద్వయేవామపార్శ్వేశోషం తదుత్తరోపరిస్థితైకపదేవామమణిబంధపాపం; తదుత్తరవాయవ్య కోణవదే వామప్రబాహౌరోగం; తత్రాగేకపదేవామప్రబాహో అహిం; తత్రాక్పదేద క్షిణ పదేచనామకూపక్రేముఖ్యం; తత్రాక్పదద్వయే వామబాహ భల్లాటం; తత్రాక్పదద్వయేవామబాహావేవసోమం; తలౌక్పదద్వయేవామాం సేసర్పం; తత్రాక్పదద్వయే వామ శ్రోత్రే అదితిం; తత్రాక్పద సైక పదేవామనేత్రేదితిం; తద్దక్మిణీశిఖిపదాదధః కోణపదేముఖే ఆపం; ఆగ్నే యేవాయుపదాదధః కోణపదేద క్షిణహస్తేసావిత్రం; నైరృతేః పితృపదాదధః కోణపదేమే ధేజయం; వాయవ్యేరోగపదాదధః కోణపదే వామహస్తేరుద్రం; మధ్యపదేష్వీశానకోణ పదా దక్షిణపదత్రయేదక్షిణ స్తనేర్యమ్లం; తద్దక్షిణకోణపదే దక్షిణహ స్తేసవితారం; తత్పశ్చిమపదతయే జఠరే దక్షిణభాగే వివస్వంతం; తత్పశ్చిమనైరృత్యకోణ పదే వృషణయోర్విబుధాధిపం; తదుత్తర పదత్రయే జఠ రేవామభాగే మీత్రం; తదుత్తర వాయవ్య కోణవ దేవామహస్తే రాజయశ్మాణం; తత్రా క్పదత్రయేవామహస్తే పృథ్వీధరం; తత్రాగీశానకోణపదే ఉరసి ఆపవత్సం 13మధ్యేనవపదే హృన్ని భ్యాం బ్రహ్మాణం; తదుత్తరే వృషవాస్తుం. (ఏవంచ 32+18= 45 దేవతాః సంపద్యంతే.)

కేచి త్వేతాశీతి పద ఏవ మండల స్థాపన పూజనహోమ బలిదానేషు బ్రహ్మాది పూర్వత్వ మిచ్ఛంతి; తథా మధ్యే నవపదేషువాన్తః హృన్నా భౌ బ్రహ్మా; తత్పాక్ సంలగ్న పదత్రయే దక్షిణహస్తే అర్యమా; బ్రహ్మవద సంలగ్న దక్షిణ పద తయే జఠరే దక్షిణ భాగేవివ స్వాన్; బ్రహ్మ వద పశ్చిమ సంలగ్న పద త్రయే జఠ రేవామ భాగే మిత్రః; తస్యైవోదక్సంలగ్న పదత్రయేవామ స్తనే పృథ్వీధరః; బ్రహ్మపద సంలగ్న ఈశానపదే ఉర స్యాపవత్సః; ఆగ్నేయపదేదక్షిణ హస్తే సవితా; నైరృత్యపదే వృషణయో రిబుధాధిపః; వాయవ్య పదేవామహస్తే రాజయక్ష్మా ; ఆపవత్ససలంగే ఈశాన పదేముఖే ఆపః; స వితృపద సంలగ్నా గ్నేయపదే దక్షిణ హస్తే సావిత్రః; విబుధాధిప సంలగ్న నైరృత్యపదే మేఢీ జయః; రాజయక్ష్మపద సంలగ్న వాయవ్యపదే వామహస్తే రుద్రః; మండలే శానకోణపదాత్ శిఖ్యా దీన్ దిత్యం తాన్ ప్రాగ్వత్ సంస్థా పయేత్; చర క్యాదీన్ ప్రాగ్వ దావాహయేత్.

చతుఃషష్టి పదవాస్తు విషయము.

‘శాంతికమలాకరము’ అను నీబంధమును రచించిన కమలాకర భట్టు రచించిన ‘శాంతిరత్నము’ అను నిబంధము నందు చతుషష్టి పదవాస్తుయంత్ర పరి లేఖన క్రమమును ఆందలి దేవతలకు వాస్తుపురుషుని దేహమునందు ఉనికియు ఈకి విధముగ చెప్పబడినది:

యంత్రపరి లేఖన ప్రకారము.

ఇతి ఉదగాయతాశ్చ నవ రేఖాః కృత్వాల మధ్యకోష్టచతుష్టయ మేకీకృత్య -కోణేషు రేఖాః దత్వా దేవతాః ఆవాహయేత్.

తా. వేదిక పై (నూతన) వస్త్రముమీద కుంకుమము వెడల్పుగాపోసి దానియందు బంగారుకడ్డితో పడమటినుండి తూర్పునకు 1. శాంత 2. యశోవతి 3. కాంత 4. విశాల 4. ప్రాణవాహిని 6. సతి 7. సుమతి 8. నంద 9. సుభద్ర ఆను తొమ్మిది రేఖలను - దక్మిణమునుండి ఉత్తరమునకు 1. హిరణ్య 2. సువత 8. లక్ష్మి 4. విభూతి 5. విమల 6. క్రియ 7. జయ 8. కాల 9. విశోక అను తొమ్మిది రేఖలను -గీయవలెను దీనిచే 8x864 కోష్ణములు (గడులు) ఏర్పడును. నట్టనడుమ ఏర్పడిన నాలుగు గడులును ఒకటిగా అగునట్లు గుర్తింపు రేఖ గీయవలెను. ఈ నడిమి చతు. రస్రపు నాలుగు మూలల నుండియు అన్నిటికంటే బయటి ఆయామూలల రేఖా సంధులవరకు వరుసగా నాలుగు ఏటవాలు. రేఖలను గీయవలెను: దీనిచే ఈ రేఖలు తాకిన చోట్లనున్న గడులు రెండు రెండుగా విభజింపబడును.

ఇపుడు ఆయాస్థానములందు చెప్పబోవువిధమున దేవతలను ఆవాహనము చేయవలెను. (ఇందు నిర్దేశించినట్లు వాస్తుపురుషుని ఆయా అవయవములందు ఆయా దేవతలున్నట్లు భావన చేయబడును.)

మూ. మధ్యమపదచతుష్కే హృదయే బ్రహ్మా; పూర్వపదద్వయే దక్షిణ స్తనే అర్యమా; దక్షిణపదద్వయే జఠరదక్షిణే వివస్వాన్; పశ్చిమపదద్వయే జఠరవామే మిత్రః; ఉదక్పదద్వయే వామ స్తనే పృథ్వీధరః; ఆగ్నేయపదార్ధయోర్ధక్షిణహస్తే సావిత్ర సవితారో; నైరృతపదార్ధయో ర్వృషణ మేడ్రయో ర్విబుధాధిప జయా; వాయవ్య పదార్ధయో రురోముఖయో రాపాపవతౌ; ఐశానపద దక్షిణార్దే శిరసి శిఖీ; తద్ద క్షీణసార్ధపదే దక్షిణనేత్ర పర్జన్యః; తద్దక్షిణపదద్వయే దక్షిణాం సే కులి శాయుధః; తద్దక్షిణపదద్వయే దక్షిణబాహో సూర్యః; తద్దక్షిణపదద్వయే దక్షిణ బాహావేవ సత్యః; తద్దక్షిణసార్ధపదే దక్షిణకూర్పరే భృశ ; తద్దక్షిణాగ్నేయపదార్దే దక్షిణ ప్రవాహా వాకాశ ; తత్పశ్చి మార్దే దక్షిణప్రదాహావేవ వాయుః; తత్పశ్చిమసార్ధపదే దక్షిణమణిబంధ్ పూషా; తత్పశ్చిమపదద్వయే దక్షిణపార్శ్వే ఏవ గృహక్షతః; తత్పశ్చిమపదద్వయే దక్షిజోరా యమః; తత్పశ్చిమపదద్వయే దక్షిణజానౌ గంధర్వః; తత్పశ్చిమసార్ధపదే దక్షిణజంఘాయాం భృంగరాజః; తత్పశ్చిమనై రృతపదార్థ దక్షిణస్పీచి మృగః; తదుత్తరార్దే పాదయోః పితరః; తదుత్తర సార్ధపదే వామస్ఫిచి దౌవారిక; తదుత్తరపద ద్వయే వామజంఘాయాం సుగ్రీవః; తదుత్తరపద ద్వయే వామోరో వరుణః; తదుత్తర పదద్వయే నామపార్శ్వే అసుర ; తదుత్తరసార్ధపదే వామపార్శ్వే ఏవ శోషః; తదుత్తర వాయవ్యపదార్దే వామమణి బందే పావః; తత్రాక్పదార్దే వామబాహో రోగః; తత్పార్ధపదే వామబాహా వేవ అహిః; తత్రాక్పద ద్వయే వామకూర్పడే ముఖ్యః; తత్పాక్పదద్వయే వామబాహో భల్లాట; తత్రాక్పదద్వయే వామబాహా వేవ సోమః; తత్రాక్పదద్వయే వామాం సే సర్పః; తత్ర్పాకార్ధపదే వామశ్రోత్రే ఆదితిః; త్ప ర్ధపదే వామనేత్రే దితిః.

దీని వివరణము :

 పైన తెలిపిన విధమున పగిలిఖించిన చతుఃషష్టిపద (అరువది నాలుగు చదరపుగదులుగల చతురస్రాకారపు) వాస్తుయంత్రమునందు నట్టనడుమ నుండు 4 గదులలో బ్రహ్మ-ఆతనికి తూర్పున 2 గదులలో దక్షిణ సనమున ఆర్యమన్ - దక్షిణపు 2 గదులలో జఠరదక్షిణ భాగమున వివస్వాన్ - పడమటి 2 గదులలో జఠరపు ఎడమ భాగమున మిత్రుడు; ఉత్తరపు 2 గదులలో వామ స్తనమున పృథ్వీధరుడు ఉందురు. ఇది దిక్కుల విషయము.

ఇక విదిక్కులలో (మూలలలో) బ్రహ్మకు సన్నిహితముగా ఉండు వరుసలోని ఆగ్నేయమున దక్షిణ (కుడి) హస్తమున 1/2+1/2 గదులలో సావిత్రుడును సవితయు-నైరృతమున వృషణ - మేడ్రములందు 1/2+1/2 గదులలో విబుధాధిపు డును జయుడున – వాయవ్యమున వామహస్తమున 1/2+1/2 గదులలో రాజయక్ష్ముడును రుద్రుడును . ఈశాన్యమునలో వక్ష మున ఆపుడుసులో ముఖమున ఆపవత్సుడును ఉందురు.

ఇంతటీతో బ్రహ్మకు సన్నిహితముగానుండు నాలుగుదిక్కులందలి 4X2=8 గదులలోను 4మూలగదులలోను (మొత్తము 12 గదులలో) ఆవాహనము చేయవలసిన 12మందియు నడుమ గదులలో బ్రహ్మయు మొత్తము 16 గదులలో 13 గురుదేవతలు అయినారు.

ఇక ఇంతకంటే బయటనుండు కక్ష్యలలో నడిమి 20 గదులలోను అంతకంటే వేలుపలి కక్ష్యలో 28 గదుల లోను ఆవాహనము చేయబడవలసిన 32మంది దేవతల విషయము:

వెలుపలి ఈశాన్యపు గదిలోని దక్షిణపు 1/2 గదిలో శిరమున అగ్ని; అంతకు దక్ష్మిపు 1 1/2 గదులలో కుడికంట వర్జన్యుడు; దోనికి దక్షిణపు 2 గదులలో కుడి చెవియందు జయంతుడు; దానికి దక్షిణపు 2 గదులలో కుడి భుజమూలము నందు కులిశాయుధుడు; దానికీ దక్షిణపు 4 గదులలో కుడి భుజమునందు సూర్యుడు; ఆంతకు దక్షిణపు 2 గదులలో కుడి భుజమునందే నత్యుడు; దాని దక్షిణపు 1 1/2  గదులలో కుడి మోచేతియందు భృశుడు; దానికి దక్షిణముగా నుండు ఆగ్నేయ మందలి ! గదిలో దక్షిణ ప్రబాహువు (కుడి మోచేతి క్రింది బాగము) నందు ఆకాశుడు; దానికి పడమటగానుండు (ఈ ఆగ్నేయ పదములో మిగిలిన)  1/2  గదిలో దక్షిణ ప్రబాహువునందే వాయువు; దానికి పడమటి 1 1/2  గదులలో కుడి మణి కట్టునందు పూషన్; అంతకు పడమటి 2 గదులలో కుడి పార్శ్వము (డొక్క)లో వితథుడు; అంతకు పడమటి 2 గదులలో కుడి పార్శ్వమందే గృహక్షతుడు; దానికి పడమటి 2 గదులలో కుడి తొడయందు యముడు; దానికి పడమటి 2 గడులలో కుడి మోకాటియందు గంధర్వుడు; దానికి పడమటి 1 1/2  గడులలో కుడి పిక్కయందు భృంగరాజు; దానికి పడమట నైరృతమందలి 1/2  గదిలో కుడి పిర్రయందు మృగుడు.

దానికి ఉత్తరమున 1/2 గదిలో పాదములయందు పితరులు; ఆంతకు ఉత్తర మున 1 1/2  గదులలో ఎడమ పిర్ర యందు దౌవారికుడు; అంతకంటే ఉత్తరమున 2 గదులలో ఎడమ పిక్కయందు సుగ్రీవుడు; అంతకు ఉత్తరమున 2 గదులలో ఎడమ మోకాటియందు పుష్పదంతుడు; దానికి ఉత్తరమున 2 గదులలో ఎడమ తొడయందు వరుణుడు; అంతకు ఉత్తరమున 2 గదులలో ఎడమ డొక్కలో అసురుడు; అంతకు ఉత్తరమున 1 1/2  గదులలో ఎడమ డొక్కలోనే శోషుడు; అంతకు ఉత్తరమున వాయవ్యమందలి  1/2  గదిలో ఎడమమణికట్టులో పాపుడు.

ఆంతకు తూర్పున 1/2   గదిలో ఎడమ భుజమందు రోగుడు; అంతకు తూర్పున 11/2   గదులలో వామబాహువునందే అహి; దానికి తూర్పున 2 గదులలో ఎడమ మోచేతిలో ముఖ్యుడు; అంతకు తూర్పున 2 గదులలో ఎడమ భుజమందు భల్లాటుడు-దానికి తూర్పున 2 గదులలో ఎడమ భుజమునందే సోముడు; దానికి తూర్పున 2 గదులలో ఎడమ భుజమూల మందు నర్పుడు; దానికి తూర్పున 1 1/2 గదులతో ఎడమ చెవిలో ఆదితి; దానికి తూర్పున 1/2   గదిలో ఎడమకంటిలో దితి.

చతుష్టష్టి పదవాస్తు విషయమున శ్రీమత్స్య మహాపురాణమున ఇట్లున్నది:

బ్రహ్మకు గదులు –                          4                   

బయటి నాల్గు కోణము లలో- 8x12 =4

లోపలి నాల్గుకోణములలో-8x12 =    4

ఇరువదిమందికి              20x2=    40

బయటి కోణములకు

రెండు ప్రక్కలందును 8X1 ½=           12

మొత్తము గదులు               =           64

పై వానీలో నంఖ్యలననుసరించి –

1 నుండి 9 వరకు దేవతలు 13 గదులు 16

10 ,, 17 ,,            ,,  8 ,,                    12          

18 ,, 25 ,,           ,,   8 ,,                   12

26 ,, 33 ,,           ,,   8 ,,                  12

2,, 41     ,,           ,,   8 ,,                   12

మొత్త ము దేవతలు = 45=గదులు;     64

వీరుకాక ఏకాతిపద - చతుష్టష్టిపద-వాస్తుల రెంటియందును . ఉత్తరమున వాస్తోష్పతి . ఈశాన్యాది విదిక్కు లందు వరుసగా చరకి - విదారీ - పూతనా - పాపరాక్షసీ అనునలుగురను తూర్పు మొదలుగ నాలుగు దిక్కులయందును వరుసగా స్కందుడు ఆర్యముడు జృంభకుడు పిలిపిచ్చుడు అను దేవతలను ఆ వాహనము చేయవలెను. వాస్తుపూజ యందు వీరికందరకును వేరువేరుగ అన్నములు బలివేయవలెను. ఇది ముందు ఆలయప్రకరణమున చెప్పబడును. (ఈ యంత్రవిన్యాసక్రమమును దేవతల స్థానములును పటములలో స్పష్టమగును.)

గృహారంభకాలమున గృహస్వామికి శరీరమందు ఏయవయవమునందు బాగుగ దురద కలుగునో ఈ ఏకాశీతిపద విభజనానుసారము వాస్తుపురుషుని ఆకృతిలో అతని ఆ ఆవయవము వచ్చు ప్రదేశమున ఆ స్థలమునందు శల్యములుండునని గురుతించి వానిని త్రవ్వి తీసివేయవలెను; గృహనిర్మాణ స్థానమందు శల్యములుండుట హానికరము; లేక పోవుట శుభ దాయక ము; కావున వానిని తొలగించవలయును; ఇది ప్రాసాదములయందును భవనముల యందును తప్పక చేయవలసినదే; వాస్తుపురుషుడు హీనాంగుడో అధికంగుడో అగు స్థలము నిర్మాణయోగ్యముకాదు; నగర ములందుగాని గ్రామములందు కాని ఈ విధానము గృహనిర్మాణ విషయమున తప్పక పాటించవలయును.

గృహములు చతుశ్శాలములు త్రిశాలములు ద్విశాలములు ఏక శాలములునన్ని నాలుగు విధములు: వీనినామ క్రమానుసారముగా వాని స్వరూపమును కూడ తెలిపెదను; ద్విజ శ్రేష్ఠులారా! వినుడు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున వాస్తుశాస్త్రమున ఏకాశీతిపద నిర్ణయమను రెండు వందల ఏబది మూడవ యధ్యాయము.