మత్స్య మహా పురాణము

Table of Contents

284 - విశ్వచక్రప్రదానికము

“విశ్వమయుడవగు నీకు నమః; విశ్వచక్రాత్ముడవగు నీకు నమస్కారము; పరమానందరూపుడవగునీవుమము సంసారసాగరము నుండి కాపాడుము; యోగులు నదా తమహృదయమందు త్రిగుణాతీతమగు ఈతేజోమయ చక్రమును  దర్శించుచుందురు; కావున ఇట్టి ఈ విశ్వ చక్రమును నేను నమస్కరించుచున్నాను; వాసుదేవునియందు చక్రమున్నది; విశ్వచక్ర మధ్యమందు మాధవుడు ఉన్నాడు; ఇందు ఇట్లు అన్యోన్యాధార రూపమున నున్న ఈ ఇరువురను నమస్కరించుచున్నాను; ఈ విశ్వచక్రము నర్వపాపహరమును పరమము(ఉత్తమము)ను; ఇది విష్ణునకు ఆయుధమును అధివాసస్థానమును ఐయున్న ది. ఇంత గొప్పదానవు కావున ఓ విశ్వ చక్రనూ! ఈ సంసారమునుండి నన్ను ద్ధరించుము.”

ఇట్లామంత్రించి విశ్వచక్రమును విమత్పురుడై (మత్సరము-ఇతరులతో పోటీ- లేనివాడై) దాన మొనగువాడు నర్వపాపవిముక్తుడై విష్ణులోకమందు పూజితుడై సుఖమందును;- ఆతడు విష్ణులోకము చేరి సనాతనుడును చతుర్బాహుడు నగు విష్ణుని రూపముతోనుండి అప్పరఃసంఘములచే సేవింపబడుచు మూడు వందల కల్పములుండును; దీనదిన మందును విశ్వచక్రమునకు పండ్రెండుమారులు నమస్కరించవలయును; అట్టి వానికి ఆయుర్వృద్ధియగును; నిత్యమును విపులయగు లక్ష్మియు కలుగును; ఇట్లు నకల జగత్తులకును సురలకును ఆధివాసమును పదునారు ఆరలుకలదియునగు ఈ స్వర్ణమయ విశ్వచక్రమును ఎవరు దానము చేయుదురో అట్టివారు హరిలోకమునుపొంది సిద్దులచేతను శిరస్సులతో నమస్కరింపబడుచు చిర కాలము సుఖమందును; అతడు కనక సుదర్శనదానము చేత దగ్గపాపుడై సుదర్శన చక్రముతోను కేశవునితోను అనురూపుడు(వారిని పోలినవాడు) ఆయి తన శత్రువులకును శుభదర్శనుడు (వారికి శత్రువుగా కాక మిత్రుడుగా కనబడువాడు) అగును; స్త్రీలకు మన్మథునివలె అందముగా కనబడువాడు అగును.

 *ఇట్లు దానము ఈయబడు ఈ షోడశోర విశ్వచక్రమునందలి మురారి యు త్తమ రూపము మానవులచే చేయబడిన మహా పాపములను సంసారమువలన జనిం చెడు అత్యంత భయమును భువనమునందు సంభవించేడు. ఆయా భయములను మిక్కిలిగా అణగదొక్కి వేయును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున షోడశమహాదానామ కీర్తనమున విశ్వచక్రప్రదానికమను రెండు వందల ఎనుబది నాలుగవ అధ్యాయము.

(*మత్స్య-284 అ;24 శ్లో

షోడశార ప్రవితరణే-ప్రవితీర్యమాణే- షోడశారే-వర్తమానే మురారేః ప్రవరాకృతి కృత గురుదురి తాని భవోద్భవాతి భీతిం-భవం అభితః(వర్తమానాని)భువనే భయాని భూయః అభిభవతి.

తా. షోడశార పద్మపు దానమునందు (దానముగా ఈయబడుచున్న ఈ షోడశారము నందు) ఉన్న మురారి రూపము నేను చేసిన మహ పాపములను సంసారము వలన భయమును సంసారమునకు చుట్టును లోకమున మాకు కనబడు భయములను కూడ నశింపజేయుగాకః)