మత్స్య మహా పురాణము

Table of Contents

228 - రాజధర్మాః-అద్భుతానాం ఫలం తచ్ఛాంతిశ్చ

దేవా! అద్భుతములు కనబడినచో వాని వలన కలుగు ఫలమును వానికి జరుపవలసిన శాంతిని నాకు బాగుగా తెలియునట్లు లెస్సగా ప్రవచింపుము. ఏలయన.నీవు ఆయా విషయములను బాగుగ చేప్పగలవారిలో ఉత్తముడవు; అనిన మనువునకు మత్స్యరూపుడగు జనార్దనుడిట్లు చెప్పెను: ఈ విషయమున సర్వధర్మ తత్వవేత్తలలో ఉత్తముడగు మహాతపస్వి వృద్ధగర్గుడు అత్రికి చెప్పిన దానినే నీకు తెలి పెదను; మనురాజా! పూర్వము సరస్వతీనదీ ప్రవాహ (తీర) మున లేన్సగా కూర్చుండిన ముని జనప్రియుడగు గర్గుని మహాతేజస్వియగు ఆత్రి ఇట్లడిగేను: సర్వజోత్తముడవగు గర్గా! జనులోనగరములో రాజులో నశించుటకు పూర్వ రూపములు (నాశము సూచించు నిమి త్తములు) ఏవియే నాకు చెప్పము; ఆన గర్గుడిట్లనెను: జనుల అపచారము చే దేవత లాగ్రహింతురు; దానిచే ఉపద్రవములు జరుగును; నిమి త్తములు దివ్యములు ఆంతరిక్షములు భౌమములునని మూడు విధములు; గ్రహ నక్షత్రములయందు కనబడు వికృతి దివ్యము; ద్యులోక సంబంధి; ఉల్కలు పడుట దిక్కులు మండునట్లు కనబడుట గంధర్వ నగరములు పట్టణములవంటివి మేఘమండలమున కనబడుట) వికృతములగు వానలు ఈ మొదలగునవి ఆంతరిక్షములు; భూమి పై నుండు చరస్థిర, ప్రాణి పదార్థ జాత మందు కనబడు వికారములు భౌమములు; భూకంపములు జలాశయముల వికారము కూడ భౌమమే; భౌమాద్భుతముల వలన కలుగు ఫలమల్పము; అదీయు త్వరగ కలుగదు; అభజ(ఆంతరిక్ష) నిమి త్తములు మధ్యమ (కొంచెమేక్కువగా) ఫలమిచ్చును; ఆదియు శాంతులచే శమించును; ఇదికాక దివ్యాద్భుతములు కనబడిన ఏడు దినములకు లోగా శుభకరమగు (వికృతులు లేని) వాన కురిసినచో ఆ అద్భుతము దుష్పలితము నీయజాలదు; దివ్యాద్బుతములకు శాంతి జరుపనిదే దాని దుషల్ళము శమించదు; దానిచే ఆది కనబడిన మూడు సంవత్సరములకులోగా రాజుకో ప్రజలకో పురద్వారమందో రాజ పురోహితునకో రాజపుత్రులకో కోశమునకో వాహనములకో హాని సంభవించును.

(*కృష్ణ శ్వేతంతథాపీతం ధూసర ధ్వాంతలోహితమ్.)

ఋతు స్వభావముననుసరించి కనబడు అద్భుతములు కొన్ని కలవు; అందు శుభములయినవి తెలి పెదను; వినుము; వసంత ఋతువున పిడుగులు పడుట భూకంపములు సంధ్యలయందలి ఉరుములు పరివేషములు ధూళి ధూమ వ్యాప్తి అరోదయా సమయములు ఎర్రగ నుండుట చెట్లనుండి నూనెలు జిగురులు కారుట చెట్లు అధికముగ కాయుట పండ్లు పండుట.గోపక్షి మధు (తేనె)వృద్ధి. ఇవి శుభావహములు; గ్రీష్మ రువున ఉల్కాపాతములు రవి చంద్ర మండలములు కపిల వర్ణములగుట అగ్ని లేక మంటలు. భూమి బద్దలగుట (చీలుట)-గాలి ధూళి దుమారము సంధ్యాకాంతులు తారలు పూ రేకుల కాంతితో కనబడుట ఆకాశము కల్లోలిత సముదమువలె కనబడుట జలాశయములయందలినీరు ఎండుట. ఇవి శుభావహములు; వర్షర్తువునందు ఇంద్ర ధనుస్సులు పరివేషములు మెరపులు ఉల్కలు అధికమగుట కొమ్ములుగల ప్రాణు లును పందులును వణకుటయు ఒడలు పొరలించుకొనుటయు ఉత్సాహముతో ధ్వనులు చేయుటయు భూమి ఉబ్బుట పెల్లలు విరిగిపడుట సదులందును బావులందును చెలమలందును చెరువులందును సరస్సులందును నీరు అధికముగా కదలి యాడుటయు వస్తువులు నీటి పై తేలియాడుటయు కొట్టుకొనిపోవుచుండుటయు శుభములు; హేమంతర్తువునందు చల్లని గాలులు మంచు అధికమగుట మృగములు పక్షులు గట్టిగ ధ్వనిచేయుట రక్షభూత పిశాచములు కనబడుట. ఆమానుష వాక్కు వినబడుట దిక్కులును ఆకాశ వన పర్వతములును దూమాంధకార వ్యా ప్తములగుట వన పర్వత ములాకాశముతో కలిసినట్లు కనబడుట సూర్యోదయాస్తమయములు ఎక్కువ భేదముతో వ్యత్యాసముతో కనబడుట - ఇవి శుభావహములు; శరదృతువునందు దేవశ్రీ గంధర్వ రూపములును విమానములును మొదలగు అద్బుతములాకాశమున కనబడుట గ్రహ నక్షత్ర తార అధికముగా కనబడుట అమానుష వాక్కు వినబడుట వనములందును పర్వత సానువులందును గీతవాదిత్ర ధ్వనులు వినబడుట సస్య వృద్ధి రసోత్ప త్తి. ఇవి శుభకరములు; శిశిర ఋతువునందు హిమపాతముతో పెనుగాలులు వికృత రూపములు కనబడుట ఆకాశము కాటుక వలె నల్లనె కనబడుట పింజర వర్ణముతో ఉల్కలు తారలు రాలుట మానవ స్త్రీలయందును గోవులు మేకలు అశ్వములు జింకలు పక్షులు.వీనియందును విచిత్ర గర్భోత్పత్తి పత్రాంకుర లతలయందు వింత మార్పులు శుభకరములు; ఇట్టి ఋతు స్వభావమునకు విరుద్ధములగు ఆద్భుతములు కనబడినచో వెంటనే శీఘ్రముగా రాజు వీని ఆశుభ ఫలమును శమింపజేయు శాంతిని జరిపించవలయును.

 ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున శుభాద్భుత దర్శన కథనమును అద్భుత ఫల తచ్ఛాంతియునను రెండు వందల ఇరువది ఎనిమిదవ అధ్యాయము.