మత్స్య మహా పురాణము
195 - అంగిరోగోత్ర ప్రవరాను కీర్తనము॥
[ఈ శ్రీమత్స్యమహాపురాణమున ఆంగిరో గోత్ర ప్రవర్తక ఋషులు పదునేడు గణములుగనున్నారు॥]
మత్స్య జనార్ధనుడు వైవస్వతునకు ఇట్లు వచించెను: రాజా! మరీచి ప్రజాపతి పుత్రి సురూప అను నామే అంగిరోమునికి పత్ని యయ్యెను॥ ఈ దంపతులకు పదిమంది దేవతలు కుమారులయిరి॥ వారు: ఆత్మ- ఆయువు-దమనుడు దక్షుడు సదుడు ద్రోణుడు హవిష్మాన్ గవిష్ణుడు ఋతుడు సత్యుడు॥ అంగిరసులను ప్రసిద్ధ నామముగల ఈ దేవతలు యజ్ఞములందు సోమపానము చేయువారు; ఈ సురూపయందే (ఈశ్వరులను వారు ఋషులలో ఉత్తమ శ్రేణికి చెందిన వారనీ లోగడ చెప్పబడినది॥) ఆందరును ఈశ్వరులను శ్రేణికి చెందిన ఈ ఋషులు కలిగిరి॥ 1॥ బృహస్పతి 2॥ గౌత ముడు 3॥ సంవర్తుడు 4॥ ఉతథ్యుడు 5॥ వామ దేవుడు 6॥ ఆజస్యుడు 7॥ ఋషిజుడు॥ ఈ - ఋషులందరును గోత ప్రతిష్టాపకులు; వీరి గోత్రములందుత్పన్ను లైన గోత్రకారుల వర్గములు ఇవి:
మొదటి వర్గము: ఉచడ్యుడు గౌతముడు తొలేయుడు ఆభిజితుడు సార్ధనేమి లౌగాక్షి క్షీరుడు కౌష్టికి రాహుకర్ణి సౌపురి కే రాతి సామలోమకి పౌషజిత్ భార్గవతుడు (ఋషి) ఐరీడవుడు కారోటకుడు సజీవి ఊపబిందువు సురేషిన్ వాహినీ పతి వైశాలి క్రోష్టా ఆరు సోముడు అత్రాయని కాసోరువు కౌ సేరువు కౌశల్యుడు పార్థివుడు గౌహిణ్యాయని అగ్ని మూలపుడు పాండుడు క్షపా విశ్వక రుడు ఆరి పారి కారారీ అను ఋషుల గోత్రము వారలకు ఆంగిరసుడు ఉచథ్యుడు గౌతముడు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వార లకు పరస్పర వివాహ సంబంధములు పనికిరావు॥
రెండవ వర్గము: ఆత్రేయాయని సౌవేష్టుడు ఆగ్ని వేశ్యుడు శిలాస్థలి బాలిశాయని ఏవేషీ వారాహి బాషలి సౌటీ తృణకర్తి ప్రొఫహి ఆశ్వలాయని వారాహీ బర్షి సాది శిఖా గ్రీవి కారకి మహాకా(క)పి ఉడుపతి కౌచకి ధూ మీతుడు పుష్పా న్వేషి సోమతన్వి బ్రహ్మతన్వి సాలడి బాలడి దేవరాతి దేవస్థాని హారికర్ణి సరిద్బవి ప్రావేపి సాద్యసుగ్రీవి గోమేదగంధి కుడు మత్స్యాచ్ఛాదుడు మూలహ(లాహారి ఫలాహారి గాంగోదధి నౌరుపతి కౌరు క్షేత్రి నాయకి జై ద్రౌణి జైహ్మలాయని ఆప స్తంబి మౌంజవృష్టి మార్పుడు పింగళి పైలుడు శాలంకాయని ద్వ్యా ఖ్యేయుడు మారుతుడు॥ అను ఈ ఋషుల (గోత్రముల వార)లకు ఆంగిరసుడు బృహస్పతి భరద్వాజుడు ప్రవర ఋషులు; వీరికి పరస్పర వివాహ సంబంధములు తగవు॥
మూడవ వర్గమువారు: కాణ్వాయనులు కోపచయులు వాత్స్యతరాయణులు భ్రాష్ట్రకృత్ రాష్ట్రపిండి లైద్రోణి సాయకాయనీ క్రోష్టాక్షి బహువీతిన్ తాలకృత్ మధురావహుడు లావకృత్ గాలవిత్ గాథ-మార్కటి పౌలికాయని స్కంద నుడు చక్రిన్ గాధ్యుడు - శ్యామాయని బలాకి హరి॥ ఈ ఋషుల (గోత్రముల వార)లకు ఆంగిరసుడు బృహస్పతి భర ద్వాజుడు గర్గుడు శై న్యుడు అను ఐదుగురు ప్రవర ఋషులు॥ ఈ ఋషుల గోత్రముల వారికి పరస్పర వివాహ సంబం ధములు పనికిరావు॥
నాలుగవ వర్గమువారు: కపివరుడు స్వ స్థితరుడు దాక్షి శక్తి పతంజలి భూయసి జలసంధి బిందుడు మాది కుసీదకి ఊర్వుడు రాజ కేశిన్ పౌషటి శంసపి శాలి కలశీకంఠుడు కారీరయుడు కాట్యుడు ధాన్యాయని భావాస్యాయని భార ద్వాజుడు సౌబుద్ది లఘ్విన్ దేవమతీ - ఈ ఋషుల (గోత్రములవార)లకు ఆంగిరసుడు దమ బాహ్యుడు ఉరుక్షయుడు అనుమువ్వురు ప్రవర ఋషులు; ఈ ఋషుల గోత్రముల వారలకు పరస్పర వివాహసంబంధములు పనికిరావు॥
ఐదవ వర్గము వారు: సంకృతి - త్రిమార్షి మనువు (సంబంధి) తండి ॥ నాతకి॥తై లకుడు దకుడు పరస్పరాయణి అపర్ణితాక్షి గార్గ్యహరి గోలవీ అను ఋషుల (గ్రోత్రముల వారల) కు అంగిరసుడు సంకృతి గౌరవీతి అను మువ్వురును ప్రవర ఋషులు; వీరికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు॥
ఆరవ వర్గమువారు : కాత్యాయనుడు హరితకుడు కౌత్సుడు పింగుడు హండి దాసుడు వాత్స్యాయని మాది మౌళి కుబేరణి భీమవేగుడు శార్వదర్భి - ఈ ఋషుల గోత్రముల వారలకు అంగీరసుడు బృహదశ్వుడు జీవనాశ్వుడు ప్రవర ఋషులు; వీరికి పరస్పర వివాహములు పనికిరావు॥
ఏడవ వర్గమువారు: బృహదుక్తుడు - వామ దేవుడు - అను ఈ ఋషుల (గోత్రముల వారల)కు ఆంగిరసుడు బృహదుక్తుడు వామదేవుడు అను మువ్వురు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారలకు వరస్పర వివాహ సంబంధములు తగవు॥
ఎనిమిదవ వర్గమువారు: కుత్సగోత్రము వారికి ఆంగిరసుడు సదస్యుడు పురుకుత్సుడు ఆనువారు ప్రవరఋషులు; ఈ కుత్సగోత్రమువారు తమలో తాము ఇచ్చిపుచ్చుకొనరాదు॥
తొమ్మిదవ వర్గమువారు: రథతర గోత్రము వారికి అంగిరసుడు విరూపుడు రథీత రుడు ఆనువారు ప్రవర ఋషులు; రథతర గోత్రమువారు తమలో తాము వివాహ సంబంధములు చేసికొనరాదు॥
పదియవ వర్గమువారు: విష్ణువృద్ది శివమతి జతృణుడు కరృణుడు పుత్తవుడు (మహాతేజసుడు) వై రపరాయణుడు - ఈ ఋషుల గోత్రముల వారలకు అంగిరసుడు వీరూపుడు వృషపర్వుడు అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారికి పరస్పర వివాహ సంబంధములు తగవు॥
పదునొకండవ వర్గము వారు: సాత్యముగ్రి - హిరణ్య స్తంబుడు- ముద్గలుడు॥ ఈ ఋషుల గోత్రముల వారలకు అంగీరసుడు మత్స్యదగ్గుడు ముద్గలుడు అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు॥
పండ్రెండవ వర్గము వారు: హంస జిహ్వుడు దేవజిహ్వుడు అగ్ని జిహ్వుడు విరాట్ ॥ అ ఆపుడు అగ్నేయుడు ఆశ్వయుడు పర ణ్యుడు తావి మౌద్గలుడు - ఈ ఋషుల గోత్రముల వారలకు ఆంగిరసుడు తాండి మౌద్గల్యుడు అను వారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారికి పరస్పరము వివాహ సంబంధములు పనికిరావు॥
పదునాలుగవ వర్గము వారు: ఆపాండువు గురువు శాక టాయనుడు ప్రగాథుడు మానాం మార్కండుడు శరణుడు శివుడు కటువు మర్కటపుడు నాడాయనుడు శ్యామాయనుడు అను ఈ ఋషుల గోత్రముల వారలకు ఆంగిరసుడు అజమీడుడు కాట్యుడు అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారికి పర స్పర వివాహ సంబంధములు పనితీగావు॥
పదునైదవ వర్గము వారు: తిత్తిరి - కపిభూ - గార్ధ్యుడు ఆను ఋషుల (గోత్రముల వారల)కు అంగీరసుడు తిత్తిరి కవీభూ అను వారు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు॥
పదునారవ వర్గము వారు: ఋక్షుడు భరద్వాజుడు మానవుడు మైత్రవరుడు - అను ఈ ఋషుల గోత్రముల వారలకు అంగిరసుడు భరద్వాజుడు బృహస్పతి మీ తవరుడు మానవుడు అను ఐదుగురు ప్రవర ఋషులు; ఈ గోత్ర ముల వారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు॥
పదునేడవ వర్గ ము వారు: భారద్వాజుడు హుతుడు శొంగుడు శే శిరేయుడు - అనువారు ద్వ్యాముషాయణగోత్ర ములయందు జన్మించిన ఋషులు; ఈ ఋషుల గోత్రముల వారలకు ఆంగిరసుడు భరద్వాజుడు బృహస్పతి మౌద్గల్యుడు శై శిరి ఆనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు॥
ద్వ్యాముషాయణులు తన కన్న తండ్రికిని పెంపుడు తండ్రికిని తారకులై రెండు వంశముల వారికి చెందిన గోత్రముల వారుగా గణింపబడువారు॥
ఈ అంగిరో వంశ గోత్ర కారుల నామములను కీర్తించినను నరుడు సర్వపాపముక్తుడగును॥
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున గోత్ర ప్రవరాను కీర్తనమున అంగిరోగోత్ర ప్రవరాను కీర్తనమను నూట తొంబది యైదవ అధ్యాయము॥
