మత్స్య మహా పురాణము

Table of Contents

97 - సంక్రాంత్యుద్యాపన వ్రతము

ఇక ఇప్పుడు సంక్రాంత్యుద్యాపన వ్రతమును తెలి పెదను. ఆది మేలయినది. ఇహమున సర్వకామ ఫలప్రదము; సర లోకమున అక్షయ ఫలదము. విషువము (రాత్రింబగళ్ళు సమముగనుండు దినము) నందుకాని అయన పుణ్య కాలము లందుగాని దీని నాచరించవలేను. ముందటి దినమున ఏక భుక్తముచేసి గడపి వ్రత దినమున దంత ధావనమయిన పిమ్మట తిలలతో తిలలపిండి నూనెలతో స్నానమాడ వలెను. తదుపరి (గోమయముతో ఆలికిన) భూమి పె.చందనముతో అష్ట దళ పద్మమును కర్ణిక తోకూడ లిఖించి దానియందు రవినావాహనము చేయవలెను. కర్ణికయందు 'సూర్యాయ నమః' తూర్పున ‘ఆదిత్యాయ నమః' ఆగ్నేయమున ‘సప్తార్చి షే నమః' దక్షిణమున 'ఆర్య ప్లే నమః' నైరృతమున “ఋజ్మండ లాయ నమః' పడమర 'సవిత్రే నమః' వాయవ్యమున “తపనాయ నమః' ఉత్తరమున 'మార్తాండాయ నమః' ఈ శాన్య మున విష్ణవే నమః' అని వ్రాయవలెను. తరువాత ఆ స్థండిలమునందు గంధమాల్యఫలభక్ష్యములతో రవినర్చించవలెను బ్రాహ్మణునకు ఉద కుంభమును ఘృత పా తమును సువర్ణకమలమును యథాశ క్తిగ దానమీయవలేను. చందనోదక కుసుమములతో నేల పై రవి కర్ఘ్యము విడువవలెను. (అర్ఘ్య మంత్రార్థము); "విశ్వుడు విశ్వరూపుడు విశ్వధాముడు స్వయం భువు అనంతుడు ధాత యజుస్సులకు అధిపతి అగు రవికి నమస్కారము." సర్వము తా నైనవాడును ఆన్ని టియందును తాను ప్రవేశించి యున్న వాడును విశ్వుడు; ప్రతియొక దాని రూపమును ప్రపంచ రూపమును తా నెయున్న వాడు విశ్వ రూపుడు; ప్రతియొక తేజోరూప తత్వమును తా నైయున్న వాడు విశ్వధాముడు; తనకుతా నే జనించినవాడును తనకుతానై మరియొక రితో పనిలేకయే నీలిచియున్న వాడు స్వయంభువు; అంతము లేనివాడు అనంతుడు; సర్వమును నిర్మించువాడు ధాత; యజ్ఞములను ఆచరించుటకుపయోగించు మంత్రములు యజుస్సులు; యజ్ఞములనాచరించుటవలని ఫలితము హిరణ్య గర్భోపాసనా ఫలితము , అగు సూర్యలోకప్రాప్తియే; కావున రవి యజుస్సులకు ఆధిపతి.).

ఈ విధానమున ప్రతి మాసమునందును ప్రత్యంశమును ఆచరించవలయును. సంవత్సరాంతమున నేతి పాయ సముతో (హోమముతో) అగ్ని ని భోజనము లతో ద్విజపుంగవులను సంతృప్తుల జేయవలెను. పండ్రెండు కడవలను పండెండు రత్న (ఖండ )ములతో కూడ పండ్రెండు బంగారు పద్మములను బంగరు కొమ్ముల కొనలు వెండి గిట్టలు పాలు పిదుకుటకు కంచు పాత్రలు మంచి శీలము కలిగి పూలతో వస్త్రములతో అలంకరించియున్న పండ్రెండు పాడి ఆవులను శ క్తి లేనిచో నాలుగు కాని ఒకటికాని ఇట్టి ఆవులను బ్రాహ్మణులకు వేరు వేరుగా దానమీయవలేను. శక్తి ననుసరించి బంగారు తోనో వెండితోనో రాగితోనో నూవుల పిండితోనో చేసిన భూ ప్రతిమను కూడ బంగారు రవి ప్రతిమతో పాటు ఈయవలెను. ధనము విషయమున శాఠ్యము (కొంటే తనము) చేయరాదు; చేసినచో అధోగతి చెందును.

ఇది ఇట్లు చేసినవాడు నారదా! మ హేం ద్రాది పర్వతములును సప్తద్వీప సప్త సముద్రాన్విత పృథివియు ఉన్నంతవరకు స్వర్గమున ఆ శేష గంధర్వ గణముల పూజలనందుకొనుచు సుఖించును. పిమ్మట పుణ్యక్షయము కాగా భూమి పై కులశీలయుక్తుడగు సప్తద్వీపాధిపతిగా జన్మించును. మరల సృష్టికి ఆదియందును ఆవికలాంగుడు యోగ్యులగు దారపుత్తులు మంచి వంశము కలిగి జన్మించి ఎల్లరు తన పాదములకు నమస్కరించుచుండ సుఖించును.

ఈ పుణ్యక రమగు రవి సంక్రాంత్యుద్యాపన వ్రతమును చదివినను వినినను ఇతరులకు వినిపించి తెలిపినను అట్టి వారును ఇంద్ర భవనమున దేవతల పూజలనందుకొనుచు ఆనందింతురు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున సంక్రాంత్యుద్యాపన వ్రత మాహాత్మ్య కథనమను తొంబది ఏడవ అధ్యాయము.