మత్స్య మహా పురాణము

Table of Contents

289 - కల్పనామాను కీర్తనము.

మనువు మత్స్యరూప జనార్ధనుని ఇట్లడిగేను: భగవన్! అచ్యుతా! నీవు నాకు యుగములయు మన్వంతరములయు పరిమాణమును వానితో ఏర్పడు కల్ప పరిమాణమును ప్రవచించితివి; ఇపుడిక సమాస నం జేపరూపమున కల్పముల నామములను చెప్పుము; అనగా శ్రీమత్స్యు డిట్లు చెప్పెను: సరి; నీ వడిగినట్లు కల్ప నామములను అనుకీర్తించినంత మాత్రముననే వేదముల నధ్యయనము చేయుటచే కలుగు పుణ్యమును మానవుడు పొందును.

మొదటిది శ్వేతకల్పము. రెండవది నీలలోహితకల్పము.మూడవది వాసుదేవము నాల్గవది రథంతరము ఐదవది గౌరవము ఆరవది దేవము ఏడవది బృహత్-ఎనిమిదవది కందర్పము తొమ్మిదవది సద్యము పదియవది ఈశానము పదునొకండవది తమము పండ్రెండవది సారస్వతము పదుమూడవది ఉదానము పదునాలుగవది గారుడము పదునై దవది. కౌర్మము; ఇది శుక్లపక్ష పంచదశ తిథియగు పూర్ణిమ యగును; అనగా శ్వేతకల్పము మొదలుగా ఒక్కొక్క కల్పము ప్రతిపత్ మొదలుగా శుక్లపక్షమునందలి పదునై దు తిథులగునని యర్థము.

తరువాత కృష్ణ ప్రతిపత్ మొదలుగా తిథులగు కల్పములు మరి పదునైదు; ఆవి-పదునారవది నారసింహము పదునేడవది సమానము పదునెనిమిదవది ఆగ్నేయము పందొమ్మిదవది సోమము ఇరువదవది మానవము ఇరువది యొకట వది తత్పురుషము ఇరువది రెండవది వైకుంఠము ఇరువది మూడవది లక్ష్మికల్పము ఇరువది నాలుగవది సావిత్రికల్పము ఇరువది ఐదవది ఘోరము ఇరువది ఆరవది వారాహము ఇరువది ఏడవది వై రాజము ఇరువది ఎనిమిదవది గౌరీకల్పము ఇరువది తొమ్మిదవది త్రిపురాసుర సంహారము జరిగిన కాలమగు మహేశ్వరకల్పము ముప్పదవది పితృకల్పము; ఇది బ్రహ్మజీవితమందలి మాసమునందలి తిథులలో కడపటిదగు కుహూరూపమగు అమావాస్య అని బ్రహ్మయే స్వయముగా న్మృతులందు (వేద ప్రమాణములగు శాస్త్రములయందు) చెప్పెను; (చతుర్దశితో ఏ మాత్రమును స్పర్శలేనిదై చంద్రదర్శ నము ఏ మాత్రమును లేని అమావాస్యకు “కుహూ” అని నంజ్ఞ )

ఇట్లు ఈ కల్పముల రూపమున చెప్పినవి బ్రాహ్మమాసము; ఇది వినినను అధ్యయనము చేసినను మహాపాతక నాశమగును.

ఒక్కొక్క కల్పము బ్రహ్మకు ఒక్కొక్క అహోరాత్రము; కావున ఆ ఆహోరాత్రపు పగటియందలి ఆరండ కాలమున- అనగా ఉదయమున. బ్రహ్మదేవుడు లోకనృష్టికి ప్రవృత్తుడగును; అట్టి సృష్ట్యాది ప్రవృత్తియందు ఏ రూపమగు భగవత త్వపు మాహాత్మ్యము(అనగా ఏ రూపమగు భగవదంశ తత్త్వపు ప్రాధాన్యము) ఆ కల్పమునందు ప్రతిపాదింప బడునో ఆ కల్పమునకు ఆ భగవదంశ త త్వపు పేరు పూర్వమందే స్వయంభూ బ్రహ్మచే ఈయబడినది.

ఈ ముప్పది కల్పములును తామసములును రాజసములును సాత్విక ములును సంకీర్ణములును (గుణత్రయమునకో గుణద్వయమునకో సాంకర్యము పరస్పర సం మిశ్రణము-కలవియు) అని పలువిధములుగ నున్న వి; వీనిలో గుణత్రయ నంమిశ్రణముగల పురాణములయందు సరస్వతీ మహత్వమో పితరుల మహత్వమో ప్రతిపాదింపబడును; త మోరూప (తమోగుణప్రధాన)ములగు వానియందు అగ్ని శివుల మహత్వమును రజోగుణమయ కల్పములందు బ్రహ్మ మహత్వమును సాత్విక కల్పములందు విష్ణు మాహాత్మ్యమును ప్రధానముగా వర్ణింపబడును. పూర్వము బ్రహ్మ ఏ కల్పమునందు ఏ పురాణమును ప్రవచించెనో ఆ కల్పానుసారమా గుణతత్త్వము ప్రధానముగాగల ఆ దేవుని మాహాత్మ్యమా పురాణమునందు వర్ణింపబడును.

ఆయా కల్పములందు ఉపాసకులు ఆ దేవతల నుపాసించి యోగనంసిద్ధి నంది వరమగతి నందుదురు; బ్రహ్మ ప్రోక్త మగు పొద్మకల్ప వృత్తాంతమును ప్రతిపాదించు ఈ మత్స్య పురాణమును ఎవరు పర్వదినములయందు పఠింతురో వారికి ధర్మమందు స్థిర చిత్తమును విపుల శ్రీని బ్రహ్మ కలిగించును.

 ఈ కల్చ ప్రతిమలను- బంగారుతో చేయించి ఆయా పర్వదినములందు. దానము చేయువాడు బ్రహ్మపుర విష్ణు - పురములందు కల్పకాల ముండి అందును ద్యులోకమునందు ముని పూజితుడగును; విషయ వివేకముకల మానవులు ఈ  కల్పములను ముని రూపముతో ప్రతిమలుగా రూపొందించి దానమీయ వలెను.

అని పలికి మత్యుడు మనువుతో పురాణోపసంహారవచనము నిట్లు పలికెను. మను రాజా! నీకు నేను చెప్పిన ఈ పురాణ సంహిత సంహిత – మహా రచన- వేదము.) సర్వ పాపహరమును నిరంతరమగు ఆరోగ్యమును శ్రీని ఇచ్చునదియును.

(కల్ప పరిమాణ వరిణామమును వినుము: ) ఇట్టి ముప్పది కల్పములతో ఏర్పడు మాసములు పండేండు ఒక సంవత్సర ముఠాగా ఆట్టి బ్రహ్మ సంవత్సర శతము శివునకొక దినము; శివుని నూరు సంవత్సరములు విష్ణునకొక రెప్ప పాటు; విష్ణుడు మెలకువతో నున్నప్పుడు (కను తెరచినప్పుడు) ఈ జగత్తు ప్రవర్తిల్లును; ఆవిశ్వాత్ముడు శాంతాత్ము డై నిద్రించునపుడు (కను మూయగా) ఇదీయంతయు ప్రలీనమగును; (అని మత్యుడు మనువునకు చెప్పి పురాణమును ముగిం చేను.)

అనుచు సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను.

ఇట్లు పలికి మత్స్య రూపుడును దేవేశుడునగు జనార్ధనుడు. సర్వ భూతములును చూచుచుండగా (సర్వ భూతములును సాక్షులుగా- నర్వ భూతముల అనుభూతియే ప్రమాణముగా) ఆ దేశ మునందే ఆ కాలమునందే అంతర్షితుడయ్యెను.

తరువాత భగవానుడగు వైవస్వతుడను ఈ మనువు వివిధ ప్రజలను సృజించెను; ఆ రవి కులానంద కరుడు తన అక్షరమును తన కాలావధి యందలి విశ్వ ప్రవృత్తిని పాలించేను; ఇపుడు ఆనువర్తితమగుచున్న మన్వంతరము ఆత నీదే; ఋషులారా! మీకు నే జెప్పిన ఈ మత్స్య రూప జనార్ధన భాషితమగు ఈ పురాణ సంహితను వింటిరి కదా? ఇది సర్వ శాస్త్రములకు మూర్ధ (శిరః) స్థానమునందున్నది. (‘సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్.’ అను న్యాయముననునరించి ఇది సర్వపురాణ ప్రధానము.)  

ఇది శ్రీమత్స్య మహా పురాణమున కల్పనామాను కీర్తనమను రెండు వందల ఎనుబది తొమ్మిదవ అధ్యాయము.