మత్స్య మహా పురాణము

Table of Contents

102 - ప్రయగ మాహాత్మ్య వర్ణనము

యుధిష్ఠిరుడు మార్కండేయునితో ఇట్లు పలికేను: భగవన్: ప్రయాగ యాత్ర ఎట్లు చేయవలెను? ఆచట మరణించినచో కలుగు ఫలము ఏమి? స్నానము చే కలుగు ఫల మెట్టిది? అచట నివసించు వారికి కలుగు పుణ్యమేమి? ఈ విషయమున దేవ ముఖ్యుడగు బ్రహ్మ ఏమని చెప్పెనని పురా కల్పమునందు చెప్పబడినది? తెలుపుము.

 మార్కండేయుడు: నాయనా! ప్రయాగ క్షేత్రమువలన కలుగు ఫలమేమో దాని  శ్రేష్టత ఏమో ఆదంతయు పూర్వము బ్రాహ్మణులు చెప్పుకొనుచుండ నేను వినిన దానిని తెలి పెద; వినుము ప్రయాగ (పురము-ప్రతిష్టాన నగరము (ఇది నేటి పైథాను మాత్రమేకాదు; నేటి ఆలహాబాదు స్థానమున నొక ప్రతిష్టాన నగరముండెడిది. అది ఒకప్పుడు-దుష్యంతాదుల కాలమున పూరు వంశీయుల రాజధానిగా నుండెను.). వాసుకిహదపురము -కంబలాశ్వతరులను నాగుల స్థానములు.బహుమూలకుడను నాగుని స్థానము. అను ఈ నాలుగు అవధుల లోపలనున్నది. ప్రజాపతి క్షేత్రము అని లోకత్రయ ప్రసిద్దము; అచట స్నానము చేసినచో స్వర్గప్రాప్తి; ఆట మరణించిన వారికి పునర్జన్మము లేదు; అందుననే బ్రహ్మాది దేవతలు అందరును కూడి దీనిని రక్షించుచుందురు. ఇంకను ఇచటగల బహుతీర్ణముల సంఖ్య ఇంతయని వందల ఏండ్లకును చెప్పనలవికాదు. ఐనను ప్రయాగ క్షేత్ర కీ ర్తనమును సం షేపమున చేయుదును. అచటి గంగను ఆరువేల ధనువులు (అందరు ధనుష్కలు) రక్షించుచుండును (దురు.) యమునను సప్తాశ్వుడగు రవి కాపాడు చుండును. ప్రయాగమును ఇంద్రుడు వి శేషించి రక్షించుచుండును. ఈ ప్రయాగ మండలమునంతటిని హరి సకల దేవసహాయు డై రక్షించుచుండును. అచటి వటవృక్షమును శూలపాణియగు మ హేశ్వరుడు రక్షించును; సర్వపాపహరమగు ఆ పుణ్య స్థానమును దేవతలు రక్షింతురు. లోకమునందలి మానవుడు అధర్మావృతుడై సంతవరకును అచటికి పోజాలడు; అల్పాల్పమగు శాపయున్న వానికి మాత్రము ప్రయాగను తలంచినంతనే ఆదియు నశించును; ఆ తీర్థ మును దర్శించినను పేర్కొన్న ను. అచటి మృత్తికను స్పృశించినను. నరుడు పాపముకుడగును.

 రాజా! అచట పంచకుండములు (తీర్థములు) కలవు. వానిలోనిదే జాహ్నవి గంగయును; ప్రయాగములో ప్రవేశించిన తత్ క్షణ మే పాపనాశమగును; యోజన సహ సములనుండియేనను ఆమెను స్మరించినంతనే ఎట్టి దుష్కృత కర్ముడును పాపముక్తుడై పరమగతినందును. దర్శించినంతనే శుభములు పొందును. స్నానమాడినను ఆ నీటిని త్రావినను ఏడు తరములవారిని పవిత్రులనొనరించిన వాడగును. ఇక సత్యవాదియు జిత కోధుడును ఆహింసకుడును ధర్మానుసారియు త త్వజుడును గో బ్రాహ్మణ హిత రతుడునునగు సజ్జనుడు గంగా యమునా మధ్యమున స్నానమాడి సంత పాపముక్తుడగును; మనసా నిరంతరము దానినే ధ్యానించుచుండువాడు సుపుష్కలమగు కామము లన్నియు నేర వేరును.

ఆందువలన సర్వదేవాభిరక్షితమగు ప్రయాగమున కేగి బ్రహ్మ చర్యముతో మాసముండి పితృ దేవతలకు దేవతలకు తర్పణ మీయవలెను. తత్పుణ్యమున అత డెచట జన్మించినను సర్వ కామపూర్తి నందును.

 రవిపుత్త్రిరిగా త్రిలోక వి శంతయగు మహాభాగ యమున అచట గంగతో కలియును. అచట సా డౌన్మహేశ్వరుడు సదా సన్నిహితుడు; ప్రయాగ క్షేత్రోపాసనమున మానవులకు దుషాపమగు పుణ్యము లభించును. ఏలయన దేవదానవ గంధర్వ సిద్దచారణులును ఋషులును ఆ క్షేత్రమున ఆ నమించినంత మాత్రముననే స్వర్గ సుఖముల నందగలుపచున్నారు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను నూట రెం వ అధ్యాయము.