మత్స్య మహా పురాణము
174 - దేవాసురయుద్ధమ్॥
దేవాసుర యుద్ధము – ఔర్వోత్బత్తి॥
పరస్పర జయ కాంతులగు దేవతలకును దానవులకును ఆ సేనలతో తుపులమగు యుద్దము (ఎవరు ఎవరితో పోరుచున్నారనునదే తెలియని దొమ్మి యుద్దము) జరిగేను॥ దానవులు నానాయుధ సన్నద్దులయి యుద్దము చేయుచు పర్వతములు పర్వతములతో వలె దేవతలతో తలపడిరి॥ సురాసురుల పరస్పర సంయోగముతోడి ఆ యుద్ధము ధర్మా ధర్మములకును దర్ప వినయములకును జరిగిన యుద్ధమువలె కనబడెను॥ ఆ ప్రసంగములో విశేషముగా పేరించబడి ఎగిరి దుముకుచున్న రథములతో మిగుల చోదింపబడిన గజములతో అన్ని వైపులనుండియు ఆకసమునకు ఎగిరి దుముకు చున్న ఖడ్గ హస్తులగు పదాతులతో విసరి వేయబడుచున్న ముసలములతో మీదికి వచ్చి పడుచున్న బాణములతో సారించ బడి ధ్వని చేయుచున్న ధనువులతో పడవేయబడుచున్న ముద్దరములతో దేవదానవులకు పరస్పరము జరుగుచుండిన ఆ సంకుల యుద్దము యుగాంత (ప్రళయమువలె లోక భయంకరమయ్యెను॥ దానవులు తమ చేతులతో పరిఘలను పర్వతములను విసరివేయుచు ఇంద్రాది దేవతలను చావగొట్టుచుండిరి॥ జయమందుచు ప్రకాశించు బలశాలురగు దాన వులచే దెబ్బలు తినుచు ఆర్తులయి దేవతలా యుద్ధమున ఏడుపు మొగములు పెట్టిరి॥ రాక్షసులు తమ్ము అస్త్రములతో శూలములతో మిగుల మథించుచుండ పరిఘలతో తలలు పగులగొట్టుచుండ వక్షఃస్థలములు చీల్చుచుండ - ఆ గాయముల నుండి మిక్కిలిగా రక్తము స్రవించుచుండెను॥ అసురులు బాణపు వలలతో చుట్టగా ఆ దానవుల మాయలో చిక్కుకొని దేవతలు ప్రతీకార యత్నము చేయలేక పోగా కదలనై నకదలలేకుండిరి॥ ఇట్లు దేవతాబలమును దానవులు ఆయుధములతో యత్నమైన చేయనీయకపోవుటచే అస్తమించినదో యనునట్లును నిద్రించినదో యనునట్లును అయ్యెను॥ బహునేత్రుడగు ఇంద్రుడు దైత్య ధనువులనుండి వదలబడిన వాడి యమ్ములను వజ్రముతో ఖండించి దైత్య సేనయందు ప్రవేశించెను॥ ఆతడంతట దైత్యులలో ప్రముఖులను చంపి ఆ మహాదానవ సేనను తామసమగు ఆస్త్రజాలముతో ఆగధకారమయ మొనర్చెను॥ ॥ పురుహూతుని తేజముతో నృష్టింపబడిన ఘోరమగు తమస్సు ( మోహముతో ఆవిష్ణులే దానవులు తమ వారిని పరస్పరము కాని తమ వాహనములను గానీ గుర్తింప జాలకుండిరి॥ అంతలో దేవతలు యత్నము చేసి దానవ మాయాపాశములను వదలించుకొని తమస్సుతో వ్యా ప్రమయిన దానవ దేహములను పడగొట్టసాగిరి॥
కాటుకవలె మెరయుచున్న తమముతో చీకాకుపడియు తెలివి కోలుపోయియు ఆ దానవులు రెక్కలు తెగిన కొండలవలే పడిపోయిరి॥ ఇంద్రుడు సృష్టించిన ఆ తమస్సు (ఆంధ కారము -ఏమియు తెలియనీయని మోహము॥ ఈ రెండును ఇచట తమము అని చెప్పబడినవి) మహా సముద్రమున (రాత్రులందు) వ్యాపించిన ఆంధకారమువలెనే దానవు లందరు ఒకే గడ్డ (ముద్దగా కనబడునట్లు చేసెను॥ ఇట్లు దేవతలచే జరుపబడిన దానవ నాశ ము అంధకారమయమేమో యనునట్లుండెను॥ అంతట మయుడు ఇంద్రుని ఆ తామనమాయను దహించు మహామాయను సము దాంతఃస్థమగు) ఔర్వాగ్ని (బడబాగ్ని)తో నిర్మించి సృష్టించెను॥ ఆది ప్రళయాగ్ని తేజస్సులవంటి తేజస్సులను జనింపజేసెను॥ మయుడట్లు విశేషముగ సృష్టించిన మయ మాయ దేవతలనందరను కాల్చసాగేను॥ దైత్యులు వెంటనే రవి తేజస్కులయి
లేచి రణరంగమున నిలిచిరి॥ ఔర్వాగ్ని ప్రయుక్తమయిన మయమాయ తమ్ము చేరి దహించుచుండ దేవతలు చల్లని కిరణములు కలదియు జలమునిచ్చునదియు నగు చంద్రుడున్న ప్రదేశమును చేరిరి॥ వారట్లు ఔర్వాగ్నిచే దహింపబడుచు సంతాపమునకు తాళ చేక తెలువులు తప్పి ఇంద్రునకు తమ ఆవస్థను తెలిపి ఆతనిని శరణు వేడిరి॥ తమ సేన ఆట్లు మయ మాయతో దగ్ధమగుచు సంత ప్తమగుచుండ చూచి ప్రశ్నించిన దేవరాజుతో వరుణుడిట్లు పలికెను:
ఔర్వవృత్తాంతము
ఇంద్రా! ఊర్వుడు బ్రహ్మ రివంశ జుడు; అపూర్వతేజశాలి; గుణములలో బ్రహ్మతో సమానుడు; అతడు॥ మహాదారుణ (తీవ్రనియమపూర్ణమయి భయంకరమగు) తపమాచరించసాగేను॥ తన తపము చే ఆదిత్యుడువలే జగత్తును తపింప జేయుచున్న అవ్యయుడగు (ఏ వికార ములులేని ఆతని సన్నిధికి మునులును దేవతలును దివ్య దేవరులును వచ్చిరి॥ దానవ జాతీయుడు దానవేశ్వరుడు మునగు హిరణ్యకశిపుడును వచ్చెను॥ అతడును ఈశ్వర సమతేజస్కుడగు ఆ ఋషితో (శాంతించుమని విజ్ఞప్తి చేసాను॥ బ్రహ్మరులు ధర్మసహితమగు వచనము నిట్లుపలికిరి: భగవన్! ఊర్వా! ఋషివంశముల యందు ఈ {మీతరపు) స్థానము మూలచ్చేదనునంద బోవుచున్నది; (ఏలయన) మీ వంశమునందిక నెవ్వరును గోత వృద్ధి చేయు వారు లేరు; ఉన్న నీవొక్కడవును సంతతిలేనివాడవు; నీవో: కౌమార బ్రహ్మచర్య వ్రతమవలంబించి క్లేశమును తపఃకారితమగు శ్రమను) అనువ రించుచున్నావు॥ భావితమగు (ఉ త్తమ సంస్కారములచే సంస్కరింపబడిన) ఆత్మలుగల మునులకు సంబంధించిన విపగోత్రములు అనేక ములు (లవారు) తమకు సంతానము లేక ఏక దేహులయి (తమనుండి మరి యొక దేహము పుట్టక) యున్నారు॥ ఇట్లు ఎక్కడనెక్కడనో మాకు కానరాక పుత్తులు లేక ఊచ్చిన్న మూలు లయి (వేరు తెగిన చెట్లవంటి వారయి యున్న వారితో మాకు పనిలేదు॥ (కావున వారికి మీరేల చెప్పరని నీవు మమ్మనవలదు;) (నీవు వారివంటి వాడవుకాదు:) తపస్సుచే శ్రేష్టుడవు; (ప్రజాపతి సమతే జుడవు; నీవంటివాని వంశము లోకమున ప్రవ రిల్లజేయ ప్రవృత్తినందుము; నిన్ను నీ చేతనే వృద్ధినందింపుము; నీ ఆత్మను ‘ఆత్మా వై పుత్రనామాసి' యనుశ్రుతి ననుసరించి పుత్త రూపమున విస్తరింప జేయుము; } నీవెంతయో ధర్మమార్జించి యున్నావు: దానితో నీ రెండవ దేహ మును నృజించుము, అనిరి॥
మునులు ఇట్లు పలుకగా ఊర్వుడు తనమర్మ(దేహమునందు కఠినావయవములును మృదువులగు ఆవయవములును కలవు; కఠినావయవాంశములను మృదు వగు అవయవాంశముతో కలుపు భాగమును మర్మస్థాన మందురు॥ అర చేతి చర్మమును గోళ్లను కలుపు సంధి స్థానము ఇట్టిదిగా ఉదాహరింప వచ్చును॥ కఠినావయవమునగాని మృద్వవయవమునగాని తగులు నొప్పికంటే ఈ మర్మస్థానములందు తగిలిన నొప్పి ఎక్కువ బాధాకరము॥) స్థానము లందు దెబ్బకొట్టినట్లయి (బాధనంది) ఆ ఋషులను ఛీ! మీవంటి తెలిసిన వారును ఇట్లు పలుకుటయా? ఆని) నిందించుచు వారితో ఇట్లు పలికెను॥ ఋషులారా! నేను చెప్పు నదే మియనిన నేను ఆచరించు ఈ ధర్మము పూర్వమందేమునులకు శాశ్వతమయినదిగా (దేశ కాలానుసారము మారవలసిన పనిలేనిదిగా) ప్రజాపతిచే నిర్మించబడినది॥ ఋషి సంప్రదాయ సిద్దమగు కర్మమును అవలంబంచి అనుష్ఠించుచు వన్యము లగు పండ్లనుదుంపలను వేళ్లను తినుచు బ్రహ్మవంశ పరంపర యందు పవిత్రజన్మమంది ఆర్ష ధర్మముననువర్తించు బ్రాహ్మ ణుడు చక్కగా అనుష్ఠించి ఆర్జించిన బ్రహ్మచర్య వ్రతలబ్దశ కి బ్రహ్మనుకూడ కదలించి వేయును॥ గృహ సాశ్రమవాసులకు జీవన ప్రవృత్తికి ఉపక రించు వృత్తులు మూడు: 1॥ యాజనము॥యజ్ఞములు జరిపించి దక్షిణగాలభించిన దానితో జీవిం చుట; 2॥ ఆధ్యాపనము-వేదాది విద్యలను బోధించుచు విద్యార్థుల తండ్రులుగాని ధనవంతులును ప్రభువులునుగానీ తమంత తామిచ్చిన దానితో జీవించుట॥ ఇంత ఇచ్చినచో చదువు చెప్పెదననుట మాత్రము దోషము; 8॥ ప్రతి గ్రహము-సాత్విక దానములను గ్రహించుట; కాని వనాశ్రమమందు నివసించు మావంటి వారికి విహితమగు మేలగు వృత్తి * ఇంకొకటిగలదు; దానిననుసరించువారు వాయుభక్షణ మో జల భక్షణమో చేయు వారు॥దంతములనే (కొయ్య) రోలుగా చేసికొని పచ్చిధాన్యా దిక మునేనమలితిని) జీవించువారు- రాతి పై ధాన్యమో దుంపలో అరగదీసి యోనలుగ గొట్టియో ఆ చూర్ణము తీని జీవించు వారు ఆహారము ఏదియు తినని వారు ఐదగ్నుల వేడిమిని సహించుచునుండు వారును నై యుందురు॥ (నాలుగు వైపులను అగ్నులును తల పై సూర్యుడును తపించుచుండ ఈ ఐదింటి నడుమ నిలుచుట పంచాగ్ని మధ్యస్థితి); ఇట్టి వానప్రస్థులు ఇవియేకాక ఇంకను మరికొన్ని మిగుల దుష్కరములగు వ్రతములనుకూడ ఆవలంబించి అనుష్టించుచు తపమాచరించు చుందురు॥ వీరు బ్రహ్మ చర్యమును పురస్కరించుకొని ప్రధాన తపః సాధనముగా గ్రహించి) పరమ గతిని పొంద గోరుచుందురు; బ్రహ్మచర్యముచేతనే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడనిపించుకొనునని బ్రహ్మచర్య తత్వ వేత్తలగు పెద్దలు లోక మందు చెప్పుచున్నారు॥ బ్రహ్మచర్యమునందే ధైర్యము ధీరత్వము-విచారణా శీలత్వము) నిలిచియున్నది; బ్రహ్మ చర్యమునందే తపము నిలిచి యున్నది; ఇహ లోక మందెవ్వరు బ్రహ్మచర్యమున స్థిరులైయుందురో వారే పరమున స్వర్గ మందుందురు॥
వృత్తి శబ్దార్థము॥
*(వృత్తి ఆనగా జీవన నిర్వహణమును॥జీవన నిర్వహణోపాయములును॥ ఈ మాట ఆయా పురాణములలో సద్ బ్రాహ్మణులును ఉపాసకులును పాటించదగిన జీవన నిర్వహణోపాయములను తెలుపు తావులందు చాల విశిష్టమగు ఆర్థ మున వాడబడినది॥ ఇవి నాలుగు విధములు : 1॥ అయాచిత వృత్తి; 2॥ ఉంఛ వృత్తి; 8॥ శుక్ల వృత్తి 4॥ భిక్షా వృత్తి॥
ఈ నాలుగు విధములగు వృత్తులును హింసా రహితములును మిగుల పవితములును॥ ఇందు మొదటిది మాత్రమే వాన ప్రస్తులకు గ్రాహ్యమని ఔర్వుని వచనము॥
1॥ అయాచిత వృత్తి: తాను కోరకయే ఇతరులు ఎవరయిన తమంత తామయి తెచ్చి ఇచ్చినది కాని॥వృక్షములు మొదలయిన వానినుండి స్వయముగా రాలిన పండ్లును-ఎవరికిని నియతమగు ఆర్థము (ఆ స్త్రీగా కాక పెరిగి లభించు శాక కంద మూల నీపోరాదికము కొని ఉపయోగించి జీవించుట॥
2॥ సిలోంఛ వృత్తులు: 1॥ వడ్లుదంచు రోళ్లు మొదలగువాని దగ్గరనో ధాన్యపు సంచులు ఎత్తిన చోటనో కళ్ల ములందో పొలములందో రాలిపడిన ధాన్యపు గింజలను ఏరితెచ్చుకొనుటయును 2॥ పొలములలో కృషాణులు (కిసాన్) పంట పైరులుకోసి ధాన్యపు స్తంబములను తీసికొని పోయిన తరువాత మిగిలిపోయిన ధాన్యపు కంకులను ఏరి తెచ్చు కొనుటయును॥ ఇందు మొదటి దానిని ఉంఛము అనియు రెండవ దానిని సిలమనియు అందురు॥ కణాదానము ఉంఛము॥ కణిశా దానము సిలము॥ కణము = గింజలు॥ మెదుకులు; కణిశ ము-ధాన్యవు ఎన్నులు: ఆదానము = తీసికొనుట )
8॥ శుక్ల వృత్తి: బ్రాహ్మణుడు తనపాటి బ్రాహ్మణులనుండి యాచించి తెచ్చికొనిన పక్వా పక్వాహారములును తత్సాధనములును॥ ఇట్లే క్షత్రియాదులును తమసాటి వర్ణములవారి నుండి కాని అంతకంటే మేలి వర్ణముల వారినుండికాని యాచించుకొని తెచ్చికొనిన పక్వా పక్వాహారములును తత్సాధనములును॥
4॥ భిక్ష: శాస్త్రముచే నిషిద్ధులుకాని ఆయా జనులనుండి శాస్త్ర నిషిద్ధములుకానీ ఆయా ఆహారములనో ఆహార సాధనములనో వాటిని కొనుటకుపయోగించు ధనాదిక మునో యాచించి తెచ్చుకొనుట॥)
యోగము లేనిదే సిద్ధిలేదు; సిద్ధిలేనిదే యశము కలుగదు; బ్రహ్మచర్యమును మించిన తపస్సు యక స్సునకు మూలమగునది లోకమందు మరియేదియు లేదు॥ (ఇచట యశమనగా కీర్తి అని అర్థముకాదు; నిః శ్రేయసమనబడు ముక్తి) ఎవడు ఇంద్రియములను పదింటిని గ్రహించుకోని పంచభూతములను స్వాధీన మొనర్చుకొని బ్రహ్మచర్యమవలంబించునో అట్టివాని ఇట్టి తపమును మించిన తపము మరి ఏదియులేదు॥ యోగాభ్యాసము లేక యే యోగివలె) జుట్టు పెంచుకొనుట ఏ సంకల్పమును లేక యే ఏవేవో వ్రత నియమములాచరించుట బ్రహ్మచర్యమును (చిత్తశుద్ధితో) పాటించక యే బ్రహ్మ చారి చర్యలు మాత్రమాచరించుట॥ ఈ మూడును దాంభికుని లక్షణములు; ఎక్కడి భార్య! ఎక్కడి భార్యా సంయోగము! ఎక్కడి భావ విపర్యయము: (మనోవికారము?) ఇది యంతయు చాల క్షుద్రమయినది; బ్రహ్మ సృష్టించిన మానస ప్రజా సృష్టియనగా ఇదియే సుమా! ఆత్మ తత్వ మెరిగిన వారమనుకొనుచున్న మీకు తపశ్శక్తి యున్న చో ప్రాజాపత్య కర్మాను ప్లానముతో (దార సంబంధము లేక యే సంతానమునుత్పాదించు విధానముతో) మానస మనస్సంకల్పానుసారము కలుగు) పుత్తులను ఉత్పాదించుడు; యథార్థముగ తపస్వులయిన వారు తమ మనః సంకల్పముచే సృజించిన యోనియందు తమ తపస్సుచే సిద్ధించిన వీర్యమును నిలిపి సంతానమును జనింపజేయవలయును; అంతేకాని భార్యతోడి నంపర్కము కాని వీర్యరూప బీజమును స్త్రీతోడి సంపర్కముతో స్త్రీ యోనియందు నిలుపుట కాని తపస్వులాచరించవలసినది కాదు, మీగుల సజ్జనులగు మీరు నిర్భయులై పలికిన॥ ధర్మతత్త్వము ఏమియు లేని ॥ ఈ పలుకులు నాకు ఆసజ్జనులు పలికినవి గానే తోచుచున్నవి॥ తపస్సుతో) దీపించు ఆంతరాత్మ కలిగిన నా దేహమును మనోమయమునుగా పరివర్తనమందించి భార్యా సంబంధము లేకయే నా శరీర జుడగు కుమారునుత్పాదింతును; ఇట్లు నొ ఆత్మ వానప్రస్థులగు తపస్వులకు విహిత మగు ఈ ప్రాజాపత్య విధానముతోనే ప్రజలను దహింప గోరువాడేమో యనునట్లు దహింపగలవాడై) ఉన్న నా రెండవ ఆత్మను స్పజించును; అని పలికెను॥
అంతట ఊర్వుడు తపోబలమును తన యందోవేశింపజేసికొని తన ఊరువును తొడను)॥ ఆగ్ని పై నిలిపి దానిని పూర్వారణిగాను ఒక దర్భను ఉత్తరారణిగాను చేసి ఆదర్బతో ఊరువును మథించెను॥ అదీయే తననుండి పుత్తడు జనించు రణి కావలెనని యాతని సంకల్పము; శీఘ్రముగా ఆకస్మిక ముగా అతని ఆ ఊరువును భేదించుకొని జ్వాలలు మాలలుగా కలవాడు ఇంధనములతో పనిలేక వెలుగువాడు జగముల దహింపగోరువాడు ఆగు ఆగ్ని ఊర్వ పుత్రుడుగా జనించెను॥ ఇట్లు ఊర్వుని ఊరువులనుండి జనించుట చే ఆతడు ఔర్వుడను పేరునందెను॥ ('ఊర్వ' పుత్తడు కావున ఔర్వుడు; 'ఊరు' నుండి జనించినందునను ఓ ఔర్వుడు') ఇతడు అంతకుడు (భూతములను అంతమందించువాడు) అనలుడు - అన-ల-ప్రాణ తత్వమును॥ తనయందు లయమందించువాడు-ప్రాణత త్వ రూపమగు వాయువు ఉష్ణమునలయ॥ మందుటయే॥ ఉష్ణశ క్తిగా మారుటయే 'దహనమనబడునని ఆధునిక వైజ్ఞానికులమనుకొనువారు చెప్పుచున్నారు గదా! ఈ మాటను ఆనాడు ఋషులు చెప్పియైయున్నారని గమనింతురుగాక!) ఈ అగ్ని త్రిలోకములను దహింపగోరుచున్నాడో యనునట్లుండెను; ఇతడు పరమకోపనుడు (అతి తీవ్రకోప స్వభావుడు) కూడనై యుండెను,
ఆ ఔర్వుడు పుట్టిన వెంటనే దీన వచనమున తన తండ్రితో “నాయనా! నన్నా కలి బాధించుచున్నది; లోకమును భక్షింతును; నన్ను వదలుము॥” అనెను; స్వర్గము వర కారోహించు జ్వాలలతో ఆ ఆంతకాగ్ని పది దిక్కులకును వ్యాపించుచు వృద్ధినందుచు సర్వభూతములను నిర్దహించుచు పెరుగసాగేను॥ ఇంత లో బ్రహ్మ ఊర్వునికడకు వచ్చి “పుత్తా: కుమా రుని వారింపుము; జగత్తు పై దయచూపుము; వీర్రా! ఈనీ కుమారునకు నేను త్తమ స్థానమేర్పరతును; ఇది నిజము; పురు షోత్తమా! నామాట వినుము॥” అనెను॥ అది విని ఊర్వుడు “నేను ధన్యుడనే నాను; అనుగ్రహింపబడినాను; ఏలయన భగవానులగు తాము పసివాడ నగు నాయందలి పరమానుగ్రహముతో ఈ ఉపదేశము నిచ్చు చున్నారు: ప్రభాత కాలము కాగానే మా ఇరుపురకు సమాగమము (ఒక చోట కలియుట) కాంక్షించదగినదేక దా! (తండ్రి కొడుకును వాత్సల్యముతో దగ్గరకు తీసికొనుటయు పసివాడు తండ్రి నాహారమడుగుటకై అతని కడకు వచ్చుటయు లోక సహజమే కదా! ఆదియు గాక ఈ కుమారుడు అరణులతో మథించగా పుట్టిన అగ్ని రూపుడు; ఊర్వుడు తాను ఋషియగుటచే అన్ని అగ్నులతోపాటు ఈ అగ్ని ని కూడ దగ్గరకు తీసికొనుటయు సహజమే॥) కనుక అపుడు-భగవన్: ఈ పుత్తుని నేను ఏ హవిస్సులతో తృప్తి పరచినచో అతనికి సుఖము కలుగును? ఇతనికి నివాసమేక్కడ? మహౌజసుడగు ఇతనికి వీర్యమునకు తగిన ఎటువంటి భోజనము తాము ఏర్పాటు చేయుదురు?" ఆనేను॥ బ్రహ్మ ఇట్లనెను: విప్రాః ఇతనికి సముద్రమునందలి ఆడు గుర్రపు నోటియందు ఆ ఆకృతిగల ప్రదేశ విశేషమందు) నివాసమేర్పరతును॥ నాకు జన్మ హేతువగు జలమితని కాహారమయి తృప్తి ప్రదమగును॥ నేను ఎచట నివసించుచు అచటి జలమయమగు హవిస్సును త్రోవుచు - ఊంటినో ఆ జలమునే ఇతనికి నివాసముగాను హవీరూపాహారముగను వదలుచున్నాను॥ (దానియందు ఇతనికి భాగము వంచు చున్నాను॥ అందుచే భూత ప్రళయ కాలమందు నాయనా! మేము ఇరువురమును కలిసి సంచరింతుము॥ ఇతడు పుత్తూలు లేనివారికి పుత్రుడయి పుత్త ఋణమును తీర్చుకొనును॥ ఈతడు నా ఏర్పాటుచే అంతకాలమందు నీటి నంతటినీ త్రోవునట్లును దేవాసుర రాక్షసాది ప్రాణులను దహించునట్లును నేనేర్పాటు చేయుచున్నాను॥" అని పలి కెను॥ ఆ ఆగ్ని యు సరే అని తన జ్వాలా సమూహమును మరుగుపరచుకొని తన కాంతి తేజస్సులను తన తండ్రియగు ఊర్వుని యందు ఉంచి సముద్రపు నోటియందు ప్రవేశించెను॥
తరువాత బ్రహ్మ తిరిగి వెడలిపోయెను॥ ఇతరులగు మహర్షులును ఊర్వుని కుమారుడగు అగ్ని కిగల ప్రభను (తేజో విశేషమును) ప్రత్యక్షముగా చూచి తెలిసికొని తమతమ వచ్చిన చోటికి వెడలిపోయిరి॥ (ఆ ఋషులతో పాటు అచటికి వచ్చి ఉండిన) హిరణ్యకశిపుడు ఆ మహాద్భుతమును చూచి సర్వాంగములతో ఊర్వుని నమస్కరించి ఇట్లు పలి కేను: భగవన్! లోకమంతయు చూచుచుండగా ఇట్టి ఈ అద్భుతము జరిగినది; ముని శేషా! నీ తపస్సుచే పితామహుడును పరితుష్టి చెందినాడు; *మహావతా! (ఉత్తమ కర్మానుష్టాన పరాయణా!) ఇచట నీవు చేసి చూపిన ఏ పని కలదో దానీ చేత నేను నీకును నీకుమారునకును భృత్యుడను అని భావింప వేడు చున్నా ను॥ కావున నన్ను నిన్నే శరణు జొచ్చిన వానినిగాను నీయరాధనమునందే ఆనక్షునిగాను చూడుము॥ ముని శేష్ఠా! ఇక మీదట నా కేదై న క్లేశము కలిగినచో నీ పరాజు యమే యగును (ఆని ఎంచుము॥) అనేను॥ అది విని ఊర్వుడిట్లనెను: నేను నీయంతటివానికి గురువుగానై తిననిన నేను ధన్యుడనై తిని; భగవంతునిచే అనుగ్రహింపబడితిని॥ సువ్రతాః (మంచి కర్మల నాచరించువాడా!) ఈ నా తపస్సు ఉన్నంతవరకు ఇక మీదట నీ కే భయమునులేదు॥ నా పుత్తునిచే నిర్మింపబడినదియు ఇంధనములతో పనిలేని ఆగ్ని రూపముననున్నదియు (నీరింధనములగు) పావకాగ్నులకును పొంద రానిదియు (చూ॥ 61 అధ్యా॥) ఆగు ఆ ఔర్వమాయనే నీకిచ్చుకున్నాను॥ గ్రహించుము; ఇది శత్రు నిగ్రహము జరుపు విషయములో నీవంశమువారికి అధీనమయియుండును॥ ఇది శత్రుపక్షమును ఎదిరించును: స్వపక్షమును రక్షించును॥ అనగా సరేయని దానిని గ్రహించి ఆ ముని పుంగవుని నమస్కరించి హర్షయుక్తుడై దానవేశ్వరుడు స్వర్గమునుద్దేశించి వెడలిపోయెను॥ (దానవులు ఉండునది భూమిమీద నే; కాని ఇపుడు హిరణ్యకశిపుడు త్రిలోకాధిపతియై యున్నాడు॥)
*(174 ఆ; శ్లో॥ 66॥
ఇచట॥“యత్ = ఏ; కర్మ - కృత్యము; త్వయా కృతం = నీచేత చేయబడినదో; (అధ్యాహారము)] (తేన కర్మణా== ఆ కృత్యముచేత; (ఆ॥ఆను తృతీయా ప్రత్యయమే ఇంతటి అధ్యాహారమును చేయించును)॥ ఆహం-సాధ్యః = నేను సిద్ధి పొందింపబడిన పొడను ఆయినాను॥ అని అర్థము॥)
ఈ మాయ ఎంత శ్రమతోనై నను సహింపనై న నలవికానిది; దేవతలకు కూడ దగ్గరకు చేర నై నరానిది; ఎది రించుటకును జయించుటకును శక్యమేకాదు॥ ఊర్వుని ఊరువులనుండి జన్మించిన పావకాగ్ని (అనింధ నాగ్నిచే నిర్మించ బడి నదిది; దీనినెవడు ప్రయోగించేనో ఆ దైత్యుని వ్యథ పరచినచో ఈ మాయ నిర్వీర్యమగును; అందు సంశయము లేదు॥ ఇది ఆ ముని తేజస్సుతో నిర్మించబడినను ఆతనిచేతనే ఈ శాపము కూడ ఈయబడెను॥ ఈ మాయను ప్రతీకార ముచే ఆణచవలయుననినచో-భగవానుడవగు నీన్ను సుఖవంతునిగా చేయవలయునన్న చో శ! కో! నా సఖుడును జలముల నుండి జనించినవాడును (జలములకు జన్మ హేతు భూతుడును) ఆగు చంద్రుని నాకు తోడుగా ఇమ్ము, నేను ఆతనితో కూడియును నాయందలి జలజంతువులు నా పరివారముగా తోడు చేసికొనియు నీ యనుగ్రహమువలన ఈ మాయను నశింప జేయుదును; సందేహింపకుము; అని వరుణుడు ఇంద్రునితో ననెను॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవదానవ సంగ్రామమున వరుణు డిందునకు ఔర్వాగ్ని మాయాతచ్చమనోపాయములను తెలుపుటయను నూట డెబ్బదినాలుగవ అధ్యాయము॥
