మత్స్య మహా పురాణము

Table of Contents

261 - పిండికా లక్షణము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను. సంప్రదాయమందును శాస్త్రమునందును ఉన్న ది యున్నట్లు పిండికా లక్షణమును దానియందలి యందముల క్రమపు ఆనువ్వూని అనుసరించి వరుసగా చెప్పెదను.

దేవాలయ ద్వారపు ఎత్తును దృష్టియందుంచుకొని పీఠ పుఎత్తును నిర్ణయించు కొనవలయునని లోగడ చెప్పబడినది. కదా? దానిననుసరించి నిర్ణయించుకొనిన పీఠపు మొత్తము నిలువు యెత్తును పదునారు భాగములుగా చేసియుంచుకొనవలయును; Sixteen one sixteenth parts = 1/16x16 = 1)వీనియందలి (1) ఒక భాగము =1/16 భూమియందు ప్రవేశిం చును: (2.) భూమికి పైగానుండు 'జగతీ' ఆనుభాగము నాలుగు షోదశాంశములు =4/16: (3) దానికి పైగా 'కంఠము' అనుభాగము మూడుషోడశాంశములు/16: (4) దానికి పైగా 'పృత్తపటలము' అనునది ఒక షోడశాంశము =1/16: (5) దానికి పైగా 'కంఠపట్టము' అనునది మూడు షోడశాంశములు =8/16: (6) దానికి పైగా ‘ఊర్ధ్వపట్టము' అనునది రెండు షోడశాంశములు=2/1h: ఇట్లు పదునాలుగు షోడశాంశములు =14/16 పోగా మిగిలిన రెండు షోడశాంశముల = 2/16తో 'పిండికా' ('పట్టికా' అనియు కొందరందురు) అనుభాగము చేయవలయును: నీరు బయటకు పోవుటకుగాను ఈ భాగమునందు 'ప్రణాళికా' (కాలువవంటి 'గాడి') చేయవలయును; ఇది పిండికల యన్నిటియందును ఉండవలసిన సామాన్య లక్షణము.

ద్విజోత్తములారా! ఆయా దేవతా భేదములకు తగినట్లుగా వేరువేరు రూపములను వేరువేరు అమరికలతో నుం చేడు పిండికా విశేషములను తెలిపేదను వినుడు: ఇవి 1. స్థండిలా 2. వాపీ 3. య క్షి 4. వేదీ 5. మండలా 6. పూర్ణ చంద్రా 7. వక్షా 8. పద్మా 9. అర్ధచంద్రా 10. త్రికోణా ఆని వది విధములుగానున్న ని. వీని ఉనికి వరుసగా-1. మేఖల మొదలగు అమరికలులేని చతురస్రాకృతిగా నుండును: 2. రెండు మేఖలలు కలదీ: 8. మూడు మేఖలలు కలది: 4. ఇది ఆయతము (దీర్ఘచతురస్రాకృతి – Reetangular). ఇది లింగప్రతిష్ఠకు వినియోగించరాదు. 5. ఇది వర్తుల ముగా నుండును; దీనియందు మూడు మేఖలలుండును; ఇది ప్రమథగణములు మొదలగు వారికి ప్రియమయినది; 6. దీని యందు క్రింద నొకటియు పేనొకటియు మేఖలలుండును; ఒక మేఖలాస్థానము కోదగిన నడుమభాగము శూన్యముగా వదలివేయబడును; 7. ఇది మూడు. మేఖలలు కలిగిషడ (అష్టా సాకారముతో నుండును; 8. ఇది షోడశాస్త్రా కృతితో (with sixteensides) నుండును; ఇది మూలభాగమున కొంచెము పొట్టిగాను లావు తక్కువగాను నున్నట్లు కనబడునదిగా నిర్మించబడును;9. ఇది ధనురాకారముతో నుండును; 10. ఇది త్రికోణాకృతితో (Triangular) నుండును; లింగపు ఎత్తులో దాదాపు సగము ఎత్తువరకు నిలువుగా తానును ఉండి త్రిశూలాకృతితో కనబడవలయును.

ఈ పీఠికయందు (పై భాగమున) ఈశాన్యమునకు కొంచెము వంపుగాను వాలుగను నుండునట్లు ప్రశస్తమును లక్షణాన్వితమునునై చూడముచ్చటగానుండు జలనిర్గ మన మార్గమును (చిరుకాలువను) ఏర్పరచవలయును; ఇది లింగము నకు లేదా దేవతా ప్రతిమకు చుట్టునుండు పరివేషపు వ్యాసపు పరిమాణములో (1/3) మూడవవంతు వెడల్పుగల శిలా భాగమునందుండవలయును; ఈ జల నిర్గమ మార్గపు కోలతలు మూలమందు (ఆడుగువే పున) కాని నడుమకొని పైభాగము నందుకాని పరివేషపు కొలతలకు అనుగుణముగా అనులోమానుపాతము. (Direct Proportion)లో నుండవలయును; ఇదియు కొక లింగపు ఎత్తులో సగము ఎత్తు మందముగా మేఖలయుండవలయును; ఈ మేఖలకు గల మందములో మూడవవంతు తక్కువగా =(2/3 పాలు) ఈ జలనిర్గమ మార్గపు కాలువ వెడల్పుండవలయును; లేదా ఈ మందములో 1/4 నైన తగ్గించవచ్చును; (అనగా ఈ కాలువ వెడల్పు మేఖలమందములో 3/4 వంతు ఉండును;) ఈ నీరు బయటకు పోవుటకై ఈ పీఠపు ఉత్తరదిశ గా బయటకు ఏర్పరచిన కాలువ దీనికంటే కొంచెము ఎక్కువ వెడల్పుతో ఉన్నను ఉండవచ్చును.

ఈ చేప్పిన పీఠికాభేదముల ఫలములు: 1. స్థండిల ఆరోగ్యమును 2. వాపి పుష్కల ధనమును 3. యక్ష్మి గోవృద్దిని 4. మండలకీ ర్తిని 5. యక్ష సంపదను 6. పూర్ణచంద్ర వరములను 7. వజ్ర ఆయువును 8. పద్మ సౌభాగ్యమును. 9, ఆర్ధచంద్ర పుత్తులను 10. త్రికోణ శత్రునాశ మును కలుగజేయును; ఇట్లు దేవాలయములందు దేవతామూర్తులను పూజించుటకై వారిని ప్రతిష్టించుటకు నిర్మించవలసిన దశ పీఠముల లక్షణములను చెప్పుటయైనది; దేవతాప్రతిమ (కానీ. లింగము కొన్ని శిలతోనో మృ త్తిక తోనో దారువుతోనో మిశ్ర లోహములతోనో-దేనితో చేయుదు పీఠముకూడ దానితోనే చేయవలయును; ఆర్చామూర్తి - పీఠములు రెండును భిన్న పదార్థములతో చేయరాదు; ఆర్చామూర్తి ఆయామము పొడవు) ఎంతయుండునో పీఠపు ఎత్తు అంత యుండవలయుమ; ఏ దేవుని పత్ని ఎవరో ఆదేవిరూపము ఆ దేవుని పీఠము. నందు రూపొందించవలేను.

ఇట్లు ఈ చెప్పినది ఇదియంతయు దేవాలయమందలి దేవతా పీఠ లక్షణ సంక్షేపము.

 ఇది శ్రీమత్స్యమహాపురాణమున పీఠికాలక్షణమను రెండు వందల అరువది యొకటవ అధ్యాయము.