మత్స్య మహా పురాణము
92 - గ్రహయజ్ఞ విధానము -హోమవిధానము - ఇతరములగు వశ్యాభిచారప్రక్రియలును
(*రుద్రహస్తమితంచా స్యాత్)
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: పూర్వము శౌనకుడు ప్రశాంతుడై కూర్చుండియున్న వైశంపాయనుని సర్వకామములు పూర్ణములగుటకు ఉపక తెంచు శాంతిక పౌష్టిక కర్మముల నెట్లాచరించవలెనని యడిగెను. వైశం పాయనుడు శౌనకునకిట్లు చెప్పనారంభించెను: శ్రీ-శాంతి-వృష్టి. ఆయువు-పుష్టి -అను ఆభ్యుదయములను పొందుటకుగాని (తనకు ద్వేష్యులగు ఇతరులకు అపకారము కలిగించు తంత్రాచరణమును చేయుటకుగాని కోరువారు ఆచరించ వలసిన గ్రహ (ముల ఆరాధన విధానమును తెలి పెదను; వినుము. సర్వశాస్త్రములను పరిశీలించియు పురాణముల చేతను శ్రుతుల చేతను చెప్పబడిన వానిని గ్రహించియు క్రోడీకరించిన గ్రంథ విస్తరముతో గ్రహశాంతి విధానమును ప్రతిపాదింతును.
విజ్ఞులగు దైవజ్ఞ విప్రులు నిర్ణయించిన శుభదినమున బ్రాహ్మణుల చేత పుణ్యాహవాచనమును జరిపించవలేను. గ్రహములను వాటి *అధిదేవతలను మండపమున ప్రతిష్టించి వారినుద్దేశించి హోమము చేయవలెను. (ఇది గ్రహ శాంతి విధాన సంక్షే పము)
(ఇక మీదట దీని విస్తరణము చెప్పబడును:) పురాణములను శ్రుతులను బాగుగ ఎరిగిన మహనీయులు గ్రహ యజ్ఞము అయుత (పది వేల) హోమము -లక్షహోమము.కోటి హోమము. అని మూడు విధములని చెప్పుచున్నారు. ఇవి అన్ని యు ఆయా విషయములలో సర్వ కామ ఫలములను ఇచ్చు శ క్తి కలవి. మొదట వీనిలోని మొదటిదగు అయుత హోమ రూపమగు నవగ్రహయజ్ఞ విధానము తెలి పెదను.
యజమానుడు తన ఇంటికి ఉత్తర పూర్వదీశ ఈశాన్య దిశ )యందుకానీ శివాలయ ప్రదేశమునకాని చతు రంగస్రము ఉదక్సవము (ఉత్తరమునకు వాలుగనుండునదియు)ను పదికానీ ఎనిమిది కాని హస్తముల భుజము కలదియు నగు మండపమును విదానానుసారముగ నిర్మించవలయును. దానికి దక్షిణమున నాలుగు ద్వారములును - అదే మండపము నకు ఈశాన్యమున రెండు జేనల పొడవు-అంతే వెడలుపు.అంతే లోతు కలిగిన గుంటను హోమమునకు) దాని సమీప మున ఈశాన్యమునందే జేనేడు ఎత్తుగా నుండు వేదికను నిర్మించవలేను. ఈ వేదిక చతురస్రాకారముగ నుండవలెను. (దీని భుజముల కొలత ఈయబడలేదు). ఇది గ్రహములయు.వాటి అధిదేవతా ప్రత్యధి దేవతలయు ఆవాహనము కొరకు; ఈ వేదికకు చుట్టును నాలుగు వైపుల రెండు ప్రాకారములు (కొలది ఎత్తు కల గోడలవంటి కట్టలు) ఉండవలెను. ఇదీయు ఉత్తరమునకు పౌలు గా ఉండవలయును.
ఈ చేప్పిన గుంటయందు (హోమకుండమునందు అగ్ని ప్రణయనము (అగ్ని ని ప్రతిష్ఠించుటకు ముందు చేయవలసిన పరి స్తరణాది పూర్వకముగ అగ్ని ప్రతిష్టాపనము ప్రజ్వాలనము మొదలగునవి) చేసిన పిదప ముప్పది ఇద్దరు దేవతలకు ఆ వేదికయందు ఆవాహన ప్రతిష్టాపనములు జరుపవలెను. గ్రహములు 9+అధి దేవతలు 9+ప్రత్యధి దేవతలు 9+వినాయక దుర్గా వాయ్వాకాశాశ్వినులు అను 5=32; ఇచట అశ్వి దేవతలు జంట దేవతలు కావున ఇద్దరను ఒకటిగానే గణించవలెను.)
(*గ్రహములు ఆకాశమున-అంతరిక్ష లోకమున మనకు కనబడు జ్యోతిర్గోళ రూపములు; వీనికి సరిగా ద్యులోకమున నున్న దేవతా తత్త్వములే ఈ గ్రహముల అధిదేవతలును వారి అంగ దేవతలు ప్రత్యధిదేవతలును; వారి అనుగ్రహము సంపాదించనిదే ఈ గ్రహశాంతి కర్మము ఫలప్రదము కాదు. కావున గ్రహములతోపాటు వాని అధిదేవతా తత్త్వములను ప్రతిష్ఠ చేసి ఆరాధించవలయును)
నవగ్రహా వాహనాదిః
ఎట్లనగా.1. సూర్యుడు 2. చంద్రుడు 3. అంగారకుడు 4. బుధుడు 5. గురుడు_6. శుక్రుడు 7. శని 8. రాహువు 9. కేతువు అను లోక హిత సంపాదకులగు గ్రహములు తొమ్మిది. (వీరి స్థానములు): 1. నడుమ. 2. ఆగ్నే యము 3. దక్షిణము 4. ఈశాన్యము 8. ఉత్తరము 6. తూర్పు 7. పశ్చిమము 8. నైరృతము 9. వాయవ్యము. వీరినందరను తెల్లని బియ్యముతో ప్రతిష్ఠించవలెను. వీరి అధిదేవతలు: 1. రుద్రుడు 2. ఉమ 3. స్కందుడు 4. విష్ణువు 5. బ్రహ్మ 6. ఇంద్రుడు 7. యముడు 8. కాలుడు 9. చిత్రగుప్తుడు. ఇక ప్రత్యధిదేవతలు: 1. అగ్ని 2. జలము 3. పృథివి 4. విష్ణువు 5. ఇంద్రుడు 6. ఐంద్రీ (ఇంద్రాణి _శ చి) 7. ప్రజాపతి 8. సరములు 9. బ్రహ్మ. వీరినే కాక వ్యాహృతిత్రయముతో ప్రత్యేక ముగా వినాయక దుర్గా వాయ్వాకాశాశ్వినుల కై దుగురకు ఆవాహన ప్రతిష్టాపనములు జరుపవలేను. నవగ్రహ వర్ణములు: 1. రక్తవర్ణ ము 2. శ్వేతము 3. రక్తము 4. పింగళ (ఎరుపు పసుపుల మిశ్రణము) 5. పింగళము 6. శ్వేతము 7. కృష్ణము 8. కృష్ణము 9. ధూమము పొగ రంగు) వీరి పూజయందు వస్త్రములును పుష్పములును వారి వారి రంగులు కలవి. ధూపము మాత్రము నిర్మలము సుగంధము కలది ఏదై నను సరియే. పూవు లతో పాటు ఫలముల గూడ అర్పించవలెను. వీరి నైవేద్యమునకు-1. బెల్లపు అన్నము 2. నేతిపాయసము 3. సంయా వము (గోధుమ రవ్వను పాలతో వండినది.) 4. పాలతో ఉడికించి పిండి 6. పెరుగన్న ము_6. నేతి అన్నము 7. పులగము 8. మినుప వంట 9. చిత్రాన్ని ము పులి యోగిర ము); ఈ తొమ్మిది గ్రహములకును ఇతర దేవతా ప్రత్యధి దేవతలకును వినాయకాదులకును భక్యములేవే నను నివేదించవచ్చును.
కలశస్థాపనాదిః
(కలశ స్థాపనము) : ఈ గ్రహావాహన వేదికకు ఈ శాన్యమున పెరుగు అక్షతలు పంచరత్నములు పంచ పూగములు (పోక కాయలు) వేసి మామిడి చిగురాకులతో పండ్లతో నూతన వస్త్రద్వయముతో కప్పిన ఆరంధ్ర కలశమును ప్రతిష్టించి దానియందు వరుణు నావాహితునిగా జేయవలెను. దానియందు గంగాది నదులనుండి సముద్రములనుండి తెచ్చిన నీటిని పోయవలెను. ఆ నీటియందు గజాశ్వరథములుండు తావులనుండి గోవులు నిలుచుచోటి నుండి పుట్టనుండి నదీసంగమ ములనుండి ప్రదములనుండి (మడుగుల నుండి) సేకరించి తెచ్చిన మట్టిని కూడ వేయవలెను. ఈ నీరు యజమానుని స్నా నార్దము వినియుక్తమగును. అన్ని సముద్రములును నదులును తీర్థ ములును మేఘములును నదములును యజమానుని దురితములను క్షయింపజేయుట కే దీనియందు సన్నిహితములగుగాక! అను అర్థ మిచ్చు మంత్రముతో వీటినన్ని టినం దావాహనము చేయవలెను.
పిమ్మట నేయి యవలు వడు తిలలు మొదలగు వానితో హోమమారంభించవలెను. ఆ యాగ్రహములకు విహితము లగు సమిధలు. 1. (తెల్ల జిల్లేడు 2. మోదుగు 3. చండ్ర 4. ఉమ్మెత్త 5. రావి 6. మేడి 7. జమ్మి 8. గరిక 9. దర్భలు. ఈ సమిధలు ప్రాదేశ మాత్ర దైర్యము (ప్రాదేశము -లుడితి అని తెలుగులో వాడుక కుడిచేతి బొటన వేలు చూపుడు వేలు వీటిని రెండు వైపులకును చాచగా ఏర్పడు పొడవు) కలిగి కొసలుగాని కొమ్మలు (చిల్లలు) గాని ఆకులు గాని లేక సూటిగా ఉండవలెను. ప్రతియొక ఆవాహిత దేవతకును ఈ సమిధలను తేనెతో. నేతితో. పెరుగుతో వేరువేరుగా తడిపి వేరు వేరుగా నూట ఎనిమిది మారులుగాని నూట ఇరువది ఎనిమిది మారులుగాని వేల్చవలయును. (కనుక ఈ సంఖ్యకు సరిపోవునన్ని సమిధలు ఉండవలయును.)
కొసలు కొమ్మలు (చిల్లలు) ఆకులు లేకుండు సమిధలు సేకరించుట ఈ గ్రహయజ్ఞమునందే కాదు-ప్రతి హవన కార్యమునఁడును ఇంతే.
(హవన విధానము) : ప్రతి దేవతకును ప్రతి ఆహుతియందును ఋత్విక్కులు మంత్ర- దేవతా తత్త్వముల పర మార్థము తాత్వికారము) నేరిగి దానికి దానికి విహితమయిన వేరువేరు మంత్రములను ఉపాంశువుగా దగ్గర నున్న వారికి సూత్రము వినబడునట్లును. ఐనను స్పష్టముగా) ఉచ్చరించుచు సమిధలను వేల్చవలయును. ప్రతి ఆహుతితోను నేతిని చరుద్రవ్యమును భక్షములు మొదలగు వానినికూడ చేర్చవలయును. ఆయా గ్రహములకును దేవతలకును విహితము లగు మంత్రములతో పది ఆహుతులను - వ్యాహృతులతో మిగిలిన ఆహుతులను వేల్చవలెను. హోమము జరుపువిప్రులు పొజ్ముఖులుగానో ఉదజ్ముఖులు గానో కూర్చుండవలెను. మొదట ప్రతి దేవతకును సిద్దపరచిన చరుద్రవ్యమును ఆయా గ్రహములకును దేవతలకును విహితములగు మంత్రములతో ఆభిమంత్రించవలెను. పిమ్మట ఆ చరువుతో వేరు వేరు దేవ తలకు హోమము జరిపి పిమ్మటనే హోమమునారంభించవలెను.
నవగ్రహాదీనాం హోమమంత్రాః
యజమానాభి షేకమంత్రాః
(*’అగ్నేవివస్వదషస’ఇతిసోమ)
(*నమోఆస్తునాగేభ్యాఇతినాగానామంత్ర ఉచ్యతే)
ఆయా గ్రహాదికమునకు హోమమంత్రములు : 1. సూర్యునకు-' ఆకృష్ణేన రజసా' 2. చంద్రునకు -'ఆప్యా యస' 3. అంగారకునకు 'అగ్నిర్మూర్గా' 4. బుధునకు-'ఉద్బుధ్యస్వలి. గురునకు-“బ్బహస్పతే అతియదర్యా” 6. శుక్రునకు 'శుక్రంతే అన్యత్' 7. శనికి. 'శంనోదేవీ'; 'శమగ్ని రగ్ని భిసరత్' అనునది వాడుక లో నున్న ది. 8. రాహు వునకు-‘క యానశ్చిత్ర ఆభువత్' 9. కేతువునకు- కేతుంకృణ్వన్'
అధి దేవతల హోమ మంత్రములు : 1. రుద్రునకు-' ఆవోరాజా' 2. ఉమకు.' ఆపోహిష్ణా' 8. స్కందునకు. ఓ సోనా పృథివీ' 4. విష్ణువునకు -'ఇదం విష్ణుః' 5. బ్రహ్మకు.' త్వామిచ్చా' 6. ఇంద్రునకు-- ఇంద్రమిద్దరీ' 7. యమునకు - ఆయంగౌః' 8. కాలునకు--బ్రహ్మజజ్ఞానం' 9. చిత్రగుప్తునకు 'రాజానమ్'.
ప్రత్యధి దేవతలకు హోమ మంత్రములు: 1. అగ్ని కి. 'అగ్ని దూతం వృణీమ హే.1 2. జలములకు. 'ఉదు తమగవరుణ' . భూమికి - 'పృథివ్యంతరిక్షమ్) 4. విష్ణునకు 'సహ సశీరా' 5. ఇంద్రునకు ‘ఇంద్రమరుత్వ' 6. శచికి.' ఉత్తానపర్లేసుభగే!' 1. ప్రజాపతికి – ‘ప్రజాపతే!' 8. సర్పములకు.“నమో అస్తు సర్వేభ్యః'- 9. బ్రహ్మకు “ఏష బ్రహ్మాయ ఋత్విజః'
వినాయకుడు మొదలగు ఐదుగురకు హోమ మంత్రములు: 1. వినాయకునకు. “అనూనమ్' 2. దుర్గకు ‘జాత వేదసే సునవామ' 8. వాయుపునకు ప్రాణానాం గ్రంథిరసి' 4. ఆకాశ మునకు 'ఆదిత్ ప్రత్న స్య రేతసః' 6. అశ్వినులకు - 'ఏషి ఉషా అపూర్వ్యా.'
పూర్ణాహుతికి మంత్రము. ‘మూర్ధానం దివః’
(ఈ చెప్పినవి అన్నియు ఆయా మంత్రముల ఆరంభములు)
యజమానునకు అభిషేకము (స్నానము) జరుపు ప్రక్రియ:
హోమము ముగిసిన తరువాత అంగవైకల్యము లేకుండి బంగారు ఆభరణములతో పూలమాలలతో అలంకరించబడియున్న నలుగురు బ్రాహ్మణులు తూర్పునకో ఉత్తరమునకో మొగమై అభి షేక మంత్రములు పఠించుచు మంగళ పొద్యముల మోతల నడుమ లోగడ చెప్పిన పూర్ణ కుంభమందలి జలముతో యజమానునకు స్నానము చేయింతురు. (అభి షేక మంత్రముల అర్థము:) బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జగన్నాధుడగు వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్దుడు ఇంద్రాగ్ని యమ నిరృతి వరుణ వాయు కుబేరేశ్వరులు బ్రహ్మ కీర్తి లక్ష్మీధృతి మేధాపుష్టి శ్రద్ధా క్రియా మతి బుద్ధి లజ్జా వపుః శాంతి తుష్టి కాంతులు సప్తమాతృకలు ఆదిత్య సోమాంగారక బుధగురు శుక్ర శని రాహు కేతువులు దేవదానవ గంధర్వ యక్ష రాక్షస పన్న గులు ఋషిముని గోదేవమాతలు దేవపత్నులు వృక్షనాగ దైత్యాప్సరసలు అస్త్ర ములు శస్త్రములు రాజులు వాహనములు ఔషధములు రత్నములు కాలావయవములు నదీ సాగర పుణ్యతీర్థములు మేఘములు నదములు. ఇవి యన్ని యు నిన్న ఓ షేకించి జయమును సర్వ కామార్థ సిద్దులును కలిగించుగాక!
కపిలాదిగేనుదానమంత్రాః
(*ఏవం సంపూజయేద్భక్త్యా విత్తశాఠ్యవివర్జితః)
యజమానుడు ఇట్లు సర్వ గంధ యుక్తములును సర్వాషధీ సంస్కృతములునునగు జలములతో విప్రులు తను స్నానము చేయించగా శుక్ల వస్త్రములును శుక్ల మాల్యాను లేపనములను ధరించి తన భార్యతో కూడి శ్రద్దా యుక్తుడై ఋత్విజులను ప్రయత్న పూర్వకముగాను అభిమాన రహితముగాను దక్షిణలతో గౌరవించవలెను. సూర్యునకు కపిల ధేనువును ధేనువు అనగా పాడియావు) చంద్రునకు శంఖమును కుజునకు ఎర్రని వృషభమును బుధునకు బంగారును గురునకు పసుపు పచ్చని వస్త్రములను శుక్రునకు అశ్వమును శనికి శుభ లక్షణములు కల నల్లని యావును రాహువునకు ఇనుమును కేతువునకు మంచి మేక పోతును ఈయవలెను. ఇదికాక ద్రవ్య రూపమున దక్షిణగా ఋత్విజుల కందరకు సమాన పరిమాణములో బంగారమును కొని బంగారు కొమ్ములతో అలంకరించబడిన గోవును (ఒక్కొక్కరికి ఒక్కొక్కటి) కాని ఈయవలేను. గురునకు బంగారుగాని ఆవులనుగాని అతనికి సంతోషకరమైనది మరేదై న దక్షిణ కానీ ఈయవలేను.
ఏ దక్షీణనై నను వాటికి వేరువేరుగా విహితమయిన మంత్రముతో ఈయవలెను. 1. కపిల గోవునకు: కపిల గోవా! నీవు సర్వధేనువులలో పూజనీయవు; రోహిణివి (ఎర్రని వన్నె గల దానవు;) సర్వ తీర్థమయు రాలవు; ఇట్టి నీవు మాకు శాంతి నిమ్ము; 2. శంఖమునకు: శంఖమా! పుణ్యకరములైన వానిలో పుణ్యకరమయిన దానవు; శుభకరమయిన వానిలో శుభకరమయినదానవు; నిరతమును విష్ణునిచే ధరించబడుదానవు; ఇట్టి నీవు నాకు శాంతినిమ్ము. 3. వృషభము నకు: వృషభ రూపముననుండి జగదానంద కారకుడవగు ధర్మదేవా! నీవు అష్టమూర్తి యగు శివునకు ఆధిష్టాన (వాహన) మవు; ఇట్టి నీవు మాకు శాంతి కలిగింపుము. 4. స్వర్ణమునకు: సువర్ణము బ్రహ్మదేవుని గర్భము నందుండునది; అగ్ని కి బీజరూపమయినది; అనంతమగు పుణ్యఫలమునిచ్చునది; ఇట్టి నీవు నాకు శాంతినిమ్ము. 5. పీతాంబరములకు: పీతాం బరముల జత వాసుదేవునకు ప్రియమైనదీ; విష్ణుదేవుని దానవగు నిన్ను ఇచ్చుటవలన నీవు నాకు శాంతినిమ్ము. 6. అశ్వము నకు: అమృతముతోపాటు జన్మించిన అశ్వరూపమగు విష్ణ! నీవు సదా ఇంద్రునకును రవికిని వాహనమవు; ఇట్టి నీవు మాకు శాస్త్రినిమ్ము. 7. శనికి దానము చేయు కృష్ణ గోవునకు: నీవే భూమి యంతయు సయియున్నా వు; ధేను రూపమవు; విష్ణు సమానురాలవు; సర్వపాపహరవు; ఇట్టి నీవు మాకు శాంతిసమ్ము; చతుర్దశ భువనములును గోవుల అవయవముల యందే ఉండును. నీవలననే శుభము కలుగును; ఇట్టి నీవు మాకు శాంతినిమ్ము. 8. ఇనుమునకు ఆయసమా! అన్ని పనులును నాగళ్ళు ఆయుధములు మొదలగునవన్ని యును నీయధీనములై యున్నవి. ఇట్టి నీవు మాకు శాంతినిమ్ము; 9. ఛాగమునకు: నీవు అన్ని యజ్ఞములకును ఆంగమయి యున్నావు; అగ్నికి వాహనమవు; ఇట్టి నీవు మాకు శాంతి నిమ్ము; 10. శయ్యాదానమునకు: శివ కేశవుల శయనము ఎన్నడును ఆశూన్యమై యుండును. కావున వారి దయచే అట్లే జన్మజన్మముల నా శయనము కూడ అశూన్యమయి యుండుగాక! 11. రత్న దానమునకు: సర్వ రత్నములయందును సర్వదేవతలును సన్నిహితులై యుందురు; కావున వారందరును నేచేయు రత్న దానముచే నాకు శాంతినిత్తురుగాక ! 12. భూదానమునకు: ఇతర దానము లేవియు భూదానములోని పదునారవవంతునకు సరిపోలవు; కావున భూదానము చే నాకు శాంతి లభించుగాక !
యజమానుడు మాత్సర్యము (పోటీభావము) లేక భక్తితో విప్రులను వస్త్రాలంకార రత్న గంధ మాల్యాను లేపనములతో సంపూజించవలయును.
ఈ విధానమున గ్రహ యజ్ఞము నాచరించువాడు ఇహమున సర్వకామములను పూర్ణములనొనరించుకొని పర మున స్వర్గమున పూజితుడై సుఖించును. ఎంత అల్పధనుడై నను తను ఎడతెగక పీడించుచుండు గ్రహమును యథాశక్తిగ పూజించి ఇతర గ్రహము లను కూడ అర్చించవలయును.
గ్రహములును గోవులును ప్రభువులును విశ్లేషించి బ్రాహ్మణులును పూజితులయినచో తమ్ము పూజించినవారిని తామును పూజింతురు. (ప్రీతితో చూచెదరు.) అవమానింపబడినపుడు తమ్మవమానించిన వానిని తామును అవమానింతురు. (సుఖింప జేయవలెనని తలచరు.) కావున (ఏ కర్మమునగాని) క్షేమము కలుగవలేననుకొనినవాడెవ్వడు దక్షిణా హీనముగ కార్యము నాచరించరాదు. ఏలయన సంపూర్ణమగు దక్షిణ తో ఒక్కడే నను తృప్తినొందినను దానిచే యజమానునకు క్షేమము కలుగును.
నవగ్రహ మఖమను పేరుతో ప్రసిద్దమయియున్న ఈ *అయుత హోమము వివాహములు. ఉత్సవములు యజ్ఞములు ప్రతిష్టలు విఘ్నములు ఉద్వేగము అద్భుత దర్శనములు మొదలగు సందర్భములందు క్షేమమును శుభమును కలిగించును.
(*ఈ యాగ ప్రక్రియయందు ఆవాహన ప్రతిష్టాపన పూజనములందుకొను గ్రహ దేవతాదికము ముప్పది రెండు మంది. వీరికి దధి.మధు. సర్పి సు వేరువేరుగ ముంచిన సమిధలతో నూట ఎనిమిది కాని నూట ఇరువది ఎనిమిది కాని ఆహుతులను వేల్చవలెను. 32x3x108=10868; లేదా 32x3x128=12288 అగును; ఇది కొంచెమేక్కువగా అయుతము =10000 అగుచున్నది. కనుక ఈ హోమమునకు అయుత హోమమని వ్యవహారము ఏర్పడినది.)
లక్షహోమవిధిః - లక్షహోమమను గ్రహయజ్ఞము
ఇంతవరకును అయుత హోమ గ్రహయజ్ఞ విధానము తెలిపితిని. ఇక మీదట లక్ష హోమ విధానమును తేలి పెదను. ఇది సర్వ కామముల నెరవేర్చునది. పితృదేవతలకు ప్రీతికరమయినది. సాక్షాత్ గా మరియొక కర్మ సాధనముతో పని లేక) భుక్తిము క్రిఫలము నిచ్చునది.
శుభ దినమున తారాబల గ్రహబలములు కల శుభ సమయమున బ్రాహ్మణులచేత పుణ్యాహవాచనము జరిపించి ఈ కార్యమారంభించవలయును. యజమానుడు తన ఇంటికి ఈశాన్యమున గాని శివాలయ ప్రదేశమున గాని చతురస్రముగ ఉద జ్ముఖముగా (ఉదక్షవముగా ఉత్తరపు వైపునకు వాలుగా) ఉండు మండపమును నిర్మించవలయును. ఆ మండపపు భుజము పది హ స్తములుగానీ ఎనిమిది హ సములు - కాని ఉండవలయును. వీలునుబట్టి మండపపు నేల ఉత్తరమునకో తూర్పునకో పోలుగా ఉండునట్లు చూడవలయును. ఈ మండపమునకు ఈశాన్యమున లక్షణ యుక్తమును హస్త మాత్రము పొడుగు వెడల్పు ఆతులుకల కుండమును యోని రూపమగు ముఖముతో యోని = త్రిభుజము.) తో నిర్మించ వలయును. ఈ కుండమునకు నాలుగు వైపులను మేఖల (అంచుకట్ట) నాలుగు భారతీయాంగుళముల వెడల్పు ఎత్తులతో ఏర్పరచవలయును. (1 భార తీయాంగుళము = 8 యవోదరములు.యవలు అడ్డముగా ఒక దాని ప్రక్కను మరియొకటి ఉంచగా ఏర్పడు దూరము.) ఈ మేఖలయును ఉత్తరమునకుగాని తూర్పునకు గాని పొలుగాను అంతట ఒకే కొలత తో ఉండవలయును. (అనగా ఆ మేఖల వెంట వెలుపలకు గాని లోపలికి గాని నడుమ నడుమ పెంపుదల దిబ్బలవంటివి ఉండరాదు.) ఇంత చెప్పుట ఏలయన నవగ్రహ మఖము సర్వలోక శాంతికై చేయునది కావున ఆది కొలతలలో ఎక్కువగానీ తక్కువగాని యున్న చో శాంతి కలిగించకపోగా భయము కలిగించును. కనుక శాంతి ప్రక్రియ కై నిర్మించు కుండము మిక్కిలి సంపూర్ణముగను శాస్త్రీయముగను నుండవలయును. (దీనియందలి కొలతలు మాత్రము ఆయుత హోమ విధానమునకు సంబంధించినవి.)
ఆయుతహోమగ్రహయజ్ఞమునందలి ఆహుతులకు పది రెట్ల ఆహుతులు కలది లక్ష హోమ గ్రహయజ్ఞము. ఋత్విక్సంఖ్య కూడ పదింతలు ఉండును కావున యథాశ క్తిగ దక్షిణలును అయుతహోమమునందుకంటే పదింతలుగా ఉండవలయును. ఈ లక్ష హోమ గ్రహ యజ్ఞమునకై మండపమునకు ఈశాన్యమున రెండు హస్తముల వెడలుపు నాలుగు హస్తముల పొడవుగల దీర్ఘ చతురస్రాకారపు కుండము (లోతు చెప్పబడ లేదు.) త్రవ్వవలెను. దానికి ముందు యోని రూపమయిన ముఖమును కు డము చుట్టు పైని చెప్పినట్లు మేఖలయు ఉండవలయును. ఈ కుండమునకు ఈశాన్య మున మూడు జేనల కొలతతో చతురస్రాకారపు అరుగును ఉత్తరమునకుగాని తూర్పునకుగాని వాలుగా దేవతావాహన ప్రతిష్టాపనముల కై ఏర్పరచవలయును. దీనికి చుట్టును మూడు ప్రాకారములుండవలెను. అన్నిటిలో మొదటిది సండిలమునకు వెలుపల రెండు అంగుళములు దానికి వెలుపలిది (నడుమది)యు . దానికి వెలుపలిది (అన్నిటిలో బయ టిది)యు ఒక్కొక్క అంగుళము ఎత్తున ఉండవలెను. స్థండిలము పై దాని బయటి అంచుమీద పది అంగుళముల ఎత్తున ప్రాకారము ఉండవలెను. వెడల్పు మాత్రము అన్నిటికిని మూడంగుళములే.
ఈ స్థండిలమునందు వెనుక టివలే పూవులతో తండులములతో గ్రహతదధిదేవతా ప్రత్యధి దేవతలు ఆవాహితులై వీరెల్లరును ఆదిత్యునకు అభిముఖులై యుండవలయును. అంతేకాని రవికి వీరిలో నేవరును పెడ మొగమయి యుండ రాదు. ఈ లక్ష హోమ విధానమునందు గరుత్మంతు నధికముగా నావాహనము చేయుటవలన అధిక తేమము కలుగును. గరుడ వాహన ముత్రార్థము:) “నీవు సామవేద శ రీరుడవు; పరమేష్ఠి (విష్ణునకు) వాహనమవు; సదా విషహరుడవు; పాపహరుడవు: కావున ఇట్టి నీవు మాకు శాంతిని కలిగింపుము.” వెనుక టివలేనే యజమానుని స్నానము నకై జలకుంభమును సిద్దపరచి ఆమంత్రించవలెను. పిమ్మట హోమమాచరించవలెను. లక్ష్య సమిధలను లెక్కించి ఆహుతులవేల్చి ఘృత కుంభమును వసు ధారను (ఆయా నాణెములు కాని వెండి బంగారు రత్నములు కాని ధారగా) అగ్ని పై పడవేయవలెను. వంకర లేనిదియు తొర్రలు లేనిదియు భుజ మాత్రము పొడవు కలదియునగు పచ్చి మేడి కర్రను స్రుక్ గా చేసి (మండపపు) రెండు స్తంభముల మీదకు వచ్చునట్లు ఉంచవలెను. అట్లే హోమ సమయమునందు చక్కగా నేతిధారను కూడ అగ్ని పై వదలవలేను. అగ్ని విష్ణు రుద్ర సూక్తములను మహా వైశ్వానర సామ జ్యేష్ట సామములను పఠించవలయును. వెనుక టివలెనే యజమానున : భి షేకమును స్వస్తి వాచనమును జరుపవలేను. వెనుకటి వలెనే యజమానుడు కామక్రోధ రహితమగు శాంత చిత్తముతో ఋత్విక్కులకు వేరువేరుగా దక్షిణల నీయవలెను.
అయుత హోమము అనేడు నవగ్రహ మఖ (యజ్ఞ) మునందు వేద వాదులు శాంతులగు నలుగురుగాని ఇద్దరే కాని ఋత్విక్కులు చాలును. ఆంతకం ఔ ఏ స్తరము పనికిరాదు. అట్లే లక్ష హోమ విధానమునందు పండ్రెండు మందికాని ఎనిమిది మంది కాని నలుగురేకాని చాలును.
మిగిలిన అంశములన్నియు లక్ష హోమ విధానమునందు అయుత హోమ విధానమునందుకంటే పది రెట్లుండ వలయును. భ క్తితో మంచి వస్త్రములను బంగారు సొమ్ములను కడియములను చెవి పోగులను ఉంగరములను కంఠసూత్ర ములను కూడ శ క్తియున్న చో ఈయవలయును. శక్తి ఉండియు కొం టేతనముతోను లోభముతోను దక్ష్మి ణల విషయమున కొరత చేయరాదు. లోభ మోహములచే సరిగా దక్షిణలనీయనిచో కులక్షయమగును.
తనకు క్షేమము కలుగవలెనని కోరువాడు యథాశక్తిగా అన్న దానమును చేయవలెను. ఏలయన అన్న దాన హీనముగా చేసిన కార్యము వలన దుర్భిక్షము కలుగును. అన్న హీనముగా జరిపిన యజ్ఞము రాష్ట్రమును మంత్ర హీన యజము ఋత్విక్కులను దక్షిణలు కొరతగా జరిగిన యజ్ఞము యజమానుని దహించును. కొరతలతో జరిగిన యజ్ఞము వంటి శత్రువు (అపకారకము) మరియొకటిలేదు.
(అశక్తుని విషయము ఈ కారణములచేత తగినంత ధనము లేనివాడు ఎప్పుడు ఎట్టి స్థితియందును లక్ష హోమగ్రహ యజ్ఞము చేయరాదు. తనకు పీడాకరములుగా నున్న ఒకటి రెండు మూడు గ్రహములను మాత్రమే (తనకు గల శక్తిని బట్టి యథావిధిగ పూజించవలెను. వేద పారంగతుడగు ఒకే బ్రాహ్మణునైస (ఎక్కువమందికి మారుగా) దక్షిణలతో అర్చించవలెను.
లక్ష హోమ గ్రహ యజ్ఞపు విశిష్టత: యజమానుడు తనకు ఇంటియందుగల ధనావకాశమును బట్టి లక్షహోమ గ్రహ యజ్ఞమును యథావిధిగా చేయవలెను. దీనిని సరిగా నాచరించినచో ఇహమున సర్వకామ పూర్తి యగును. పరము నను ఎనిమిది వందల కల్పముల కాలము వస్వాదిత్య మరుద్గణములచే పూజింపబడుచు శివలోకమున సుఖించును. పిమ్మట ముక్తిని పొందును. సకామముగా (అనగా-కోరికలు తీరవలేనని సంకల్పించి) ఈ లక్ష హోమ గ్రహయజ్ఞమును యథావిధిగా జరిపించుకొనినచో సర్వ కామములును నెర వేరి అనంతమగు (మోక్ష) స్థానమును పొందును. పుత్తార్థి పుత్తు లను ధనార్థి ధనమును భార్యార్థి శోభనయగు భార్యను కుమారి శోభనుడగు పతిని భ్రష్టరాజ్యుడు మరల రాజ్యమును శ్రీ రాముడు (కీర్తి.ఆయువు-ఆరోగ్యము మొదలగు వానిచే ప్రకాశము కోరువాడు) అట్టి శ్రీని పొందును. ఇట్లు ఏఏ కోరిక కోరినచో అది ఎల్ల పుష్కలముగ నెరవేరును. నిష్కాముడై ఆచరించువాడు పరబ్రహ్మ సాయుజ్యమును పొందును.
కోటి హోమవిధిః - కోటి హోమగ్రహ యజ్ఞము
ఈ చేప్పిన లక్ష హోమగ్రహ యజ్ఞమునకు నూరింతలగునది కోటి హోమగ్రహ యజమని స్వయంభూ బ్రహ్మ చేప్పేను. ఆహుతులు-దక్షిణలు కలుగు ఫలము. అన్ని విషయములందును ఇది దానికి నూరింతలుగానుండును.
దీనియందును గ్రహములు.తదధిదేవతా ప్రత్యధిదేవతలు-వీరి ఆవాహన విసర్జనములందు హోమమునందు స్నాన దానములందు వినియోగించవలసిన మంత్రములును జరుపవలసిన ప్రక్రియయు లక్ష హోమమునందువలేనే యుండును. కుండము మండపము-వేదికలు-వీని విషయమున మాత్రము భేదము కలదు; అది తెలి పెదను.
కోటీహోమమునందు కుండము చతురస్రముగా నాలుగు హస్తములు పొడవు వెడలుపు లోతులు కలిగి ఉండ వలెను. దానికి అంగములుగా యోని చక్రములు రెండుండవలెను. కుండమునకు చుట్టును మేఖలలు (వప్రములు.కుండ మునకు నలువై పులనుండు అంచు కట్టలవంటి చిరుగోడలు) మూడుండవలెను. వీనిలో (లోపలినుండి) మొదటిది రెండంగు శములు రెండవది మూడంగుళములు చూడవది నాలుగంగుళములు ఎత్తు కలిగియుండవలెను. వెడల్పు వరుసగా రెండు - రెండు నాలుగు అంగుళములుండవలెను. యోని లక్షణము: ఏనుగు ముఖమువలే త్రిభుజాకారము కలిగి తాబేటి వీపు వలే నడుమ ఎత్తుగను రెండు ప్రక్కలందును తక్కువ ఎత్తుతో నుండవలెను. దీని ఎత్తు (నడుమ భాగమున)_విత స్త్రీ (జేనెడు పం డెండంగుళములు) ఒక్కొక్క భుజపు కొలత ఆరు కాని ఏడు కాని అంగుళములుండవలెను. రంధ్రములు నుండవలెను. ఇది అన్ని కుండముల విషయమునను కుండమునకు ముందుండవలసిన యోనుల లక్షణము. ప్రతియొక మేఖలమీదను అచటనచట రావి ఆకు ఆకృతిని ఏర్పరచవలెను. కోటి హోమగ్రహ యజ్ఞమునందు వేది నాలుగు వితస్తుల (వితస్తి = 12 భారతీయాంగుళములు) కొలతకల భుజములతో చతురస్రముగా ఉండవలెను. వప్రముల (మేఖలల) ఎత్తును వేదికల ఎత్తును లోగడ నే చెప్పబడినది. మండపము పదునారు హస్తముల భుజములతో చతురస్రముగా ఉండవలెను.
(ఋత్విక్కుల స్థానములు): ఈ మండపమున ఋగ్వేద పారంగతుని తూర్పు ద్వారమునను యజుర్వేదిని దక్షిణ ద్వారమునను సామవేదిని పశ్చిమ ద్వారమునను అథర్వవేదిని ఉత్తర ద్వారమునను నిలుపవలెను. హోమమునకు ఎనిమిది మంది వేద వేదాంగ వేత్తలగు విప్రులను నియమించవలెను. ఈ పండ్రెండు మందిని వస్త్రమాల్యగం ధాను లేపనములతో సర్వాభరణములతో పూజించవలెను. (మండపమునందలి ఋత్విక్కులలో) ఋగ్వేది. తూర్పు ద్వారమునందు ఉత్తరపు మొగమై ఉండి రాత్రి సూక్త-రుద్రసూక్త-పవమానసూక్తములను శుభకరములగు శాంతి సూక్తములను పఠించు చుండును. దక్షిణ ద్వారమునందలి యజుర్వేది శ క్తి సూక్త రుద్ర సూక్త సౌమ్య సూక్తములను శాంతి సూక్తములను పఠించుచుండును. పశ్చిమ ద్వారమునందలి సామవేది సౌపర్ణ వై రాజాగ్నేయ రౌద్ర జ్యేష్ఠ సామములను శాంతి మంత్రము లను పఠించుచుండును. ఉత్తర ద్వారమునందు అథర్వ వేది శాంతి. సౌర-సంవరణ పౌష్టిక-మహారాజ-సూక్తములను పఠించుచుండును. వెనుకటివలెనే ఏడు మంది కాని ఐదుమంది కాని హోమము జరుపుదురు. స్నాన దాన మంత్రములును (పూర్ణాహుతియందు) ఘృత కుంభ వసు ధారా వీధనములును లక్ష హోమమునందు వలెనే యుండును.
ఈ విధానమున కోటి హోమము నాచరించినవాడు ఇహమున సర్వకామపూ ర్తినొంది పరమున ముక్తి నొందును. ఈ చేప్పిన మూడు విధములగు గ్రహ యజ్ఞముల విషయమును పఠించిసను వినినను సర్వపాప విముక్తుడు శుద్దాత్ముడు నే ఇంద్ర పదమునందును. పదునెనిమిది వేల అశ్వ మేధములను చేసినందువలన పొందునంత ఫలములను ఈ కోటి హోమము నాచరించుటవలననే పొందును. వేల కొలది బ్రహ్మ హత్యలును అర్బుదముల భ్రూణ (సొంగ ముగ వేదాధ్యయనము చేసిన విప్రుని) హత్యలును చేసినందున కలిగిన పాపములును ఈ కోటి హోమగ్రహ యజ్ఞమునాచరించుటచే నశించునని శివుడే చెప్పెను.
వశ్యాభిచారాదిహోమః - వశ్యాభిచారాది హోమములు
[వశ్యకర్మ-ఇత రులను లోబరుచుకొనుట; ఆభిచారము. ద్వేష్యులగువారికి అపకారము చేయుట; ఉచ్చాటనము - పిశాచములు మొదలగువానినుండి విడిపించుట] వశ్య కర్మము ఆభిచార కర్మము ఉచ్చాటన కర్మము నవగ్రహమఖము మొదట జరిపిన తరువాతనే కామ్య కర్మముల నాచరించవలెను. లేనిదే కామ్య కర్మముల నాచరించినను ఫలితము నీయవు. కనుక కామ్యములగు లక్షహోమ కోటిహోమ గ్రహయజ్ఞముల నాచరించుటకు ముందు వెనుక చెప్పినట్లు అయుత హోమమును ఆవశ్యకతను బట్టి వశ్యమునకు అభిచారమునకు ఉచ్చాటనమునకు జరుపవలేను. ఉచ్చాట నాభిచార వశ్య కర్మములయందు ఒకే ముఖమును మూడు పీడి మూరల వ్యాసమును మూడు మేఖలలును కల కుండమును నిర్మించవలేను. ఈ కర్మములకై సమిధలు పలాశ మోదుగు సమిధలు తేనె గోరోచనము చందనము అగురు కుంకుమము-వీనితో తడిపినవియును తేనెతోను నేతితోను తడిపిన బిల్వ ఫలములును కమలములును ప్రశస్తములు. ఇట్టివి పది వేల సమిధలు వేల్చవలయును. వశ్య కర్మాదీకమునందు దాని సంప్రదాయము నేరిగి బిల్వ ఫలములను పద్మములను సుమిత్రియా న ఆప ఓషధయః' అను మంత్ర ముతో హోమము చేయవలయును. వశ్యాది కర్మత్రయమునందును గ్రహ ప్రతిష్ట చేయు యజమానుడు కుంభ జలముతో స్నానముచేసి శుక్ల పుష్పములను శుక్ల వస్త్రములను ధరించవలయును. ఋత్విక్కులకు బ్రాహ్మణులకు బంగారుతో చేసిన కంఠసూత్రములు కడియములు మురుగులు ఉంగర ములు పవిత్రములు సన్నని నూతన వస్త్రములు బంగారుతో అలంక రించిన తెల్లని యావులు దానమీయవలెను.
ఇట్లాచరించుట చే వతులు కాని వారిని వశుల చేసికొనవచ్చును. సర్వశత్రు బలములును లొంగిపోవును: అమిత్రులును మిత్రులగుదురు. విద్వేషముతోచేయు ఆభి చారిక కర్మములందు ఆన్ని యు (మూడును) హ మాత్ర భు జములుక లిగి ద్రోణము ( ఒక విధమగు జలపాత్రము) వంటి ముఖము కలిగి రెండు మేఖలలు కలిగిన త్రిభుజాకృతి కుండము కావలయును. విపులు ఎర్రని వస్త్రములు మాల్యములు గంధానులేపనములు తలపాగలు ధరించి జపాపుష్పములవలె వెలుగుచు. నరవాహనులే హోమము చేయవలయును. వారు యజ్ఞోపవీతము నీవీతముగా ధరించి జుట్టు విరియబోసికొని 'దురిత్యా సస్మెసను' ఇత్యాది మంత్రములను ‘హుం ఫట్’ ఇత్యాది శబ్దములతో ముగియునట్లు ఉచ్చరించుచు యజమానుని శత్రువునకు అశు భము కలుగవలెనని తలంపుకలిగి డేగ ఎముక ముక్కలతో జతపరచిన సమిధలను ఎడమచేతిలో పట్టుకొని వేల్చవల యును, యజమాన శత్రు ప్రతి రూపము (బొమ్మను చేసి యుంచుకొని శ్యేనాభిచార' మంత్రముతో ఏడుమారులు మంత్రించిన క్షురము (చురక తితో ఆ ప్రతిరూపమును కత్తిరించి ఆ ముక్కలనుకూడ ఆభిచారిక మంత్రములతో వేల్చ వలయును. కానీ ఈ విధమగు ఆభిచారిక గ్రహ హోమమును శాంతీక పౌషి కొది కామనలతో చేయు గ్రహ యజముతో సమన కాలమున చేయరాదు. దానికి ముందుగా వేరుగా చేయవలయును.) ఒక వేళ దానినట్లు వేరుగానే చేసినను ఇవి శత్రు నాశము మొదలగు దుష్టము క్రూర మునైన ఐహిక ఫలములనిచ్చు నేకాని పార లౌకికముగ శుభము కలిగించక పోగా అశుభమును కలిగించును. కావున ఇహమునను సరమునను వాస్తవమగు శుభమును కోరువారు శాని యజ్ఞమునే ఆచరించవలయును.
ధనము విషయములో శాఠ్యము (ఉండియు లోభము చే లేనట్లు నటించి వ్యయము తగినట్లు చేయక కొరత చేయుట) చూపక యథా శ క్తిగా అయుత హోమ.లక్షహోమ.కోటి హోమములనెడు మూడు విధములగు గ్రహ యజ్ఞములను చేయవలయును. అట్లాచరించినవాడు పునరావృత్తి రహితమును దుర్లభమునునగు విష్ణు స్థానమును పొదును. సమాహితుడై దీనిని వినినను ఇతరులకు వినిపించినను అట్టి వారికి గ్రహపీడ కాని బంధు జనులకు అరిష్టముకాని కలుగదు. ఈ గ్రహ యజ్ఞ తయ విధానమును లిఖించి ఇంటిలో ఉంచుకొనినచో అట్టి వారికి బాలుర కనారోగ్యము కాని పీడ కాని ఆ కుటుంబము వారికి రోగముకాని బంధనముకాని కలు గదు. ఆందునను కోటిహోమ యజ్ఞము భుక్తి ముక్తి ఫలదము: లక్ష హోమ గ్రహ యజ్ఞము ఆశ్వమేధయాగ ఫలదము. ఆయుత హోమ నవగ్రహ మఖము ద్వాదశాహమను గౌతయజ్ఞమునంత ఫలము నిచ్చును.
ఈ చేప్పిన గ్రహయజ్ఞ విధానమంతయు ఉత్సవము చేసిన ఆనందమును కలిగించును; సకల కలుషముల హరించును; ప్రాసంగికముగ దీనిని చదివిన వారును వినిన వారును ఆయురారోగ్య యుక్తులగుదురు; శత్రువులనణగ ద్రోక్కుదురు.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున అయుత హోమాది గ్రహయజ్ఞ త్రయకథనమను తొంబది రెండవ అధ్యాయము.
