మత్స్య మహా పురాణము

Table of Contents

117 -  హిమవత్పర్వత వృక్షాది వర్ణనము 

 (ఈ అధ్యాయమున వృషాది వర్ణనమున కొంత పరస్పర సమ్మిశ్రణము ఉన్న ను చాలభాగము ఆయా వర్గములకు చెందిన వృక్షలతాదికమును మహాముని క్రమముగా వర్ణించుట జరిగినది.)

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చేప్పెను: ఈ హిమవత్పర్వతమునందే అతి మనోహరమగు ప్రదేశము ఒకటి కలదు. అది సామాన్య మానవులకు చేరనల ఏకానిదేదైనను అదృష్టవశమున మద్రరాజగు పురూరవుడు చేరెను. అచటి నుండియే నదీ  శేషయగు ఇరావతి ప్రభవించి బయలు వెడలును. అనేక ములగు వృక్షముల గుబురులతో ఆ ప్రదేశము మేఘములవలె నల్లనే కానవచచుండును.

            (అచటి వృక్షములలో కొన్ని కలపను లక్క మొదలగు పదార్థ ములను అగురు మొదలగు సుగంధ ధూప ద్రవ్యములను అలంకరణ సామగ్రిని ఓషధులను ఉత్పన్నము చేయు మహావృక్షములు. అవి ఏవన): సాలతాల , (తాటి) తమాలకర్ణికార -శాల్మల (బూరుగు) న్యగ్రోధా (మర్రి) శ్వత్థ (రావి) శిరీష (దిరి నేన శింశుపా (అగురు) శ్లేష్మాతకామలక ఉసిరిక) హరీతక (కరక) విభీతక (తాడి) భూర్జముంజక బాణ ( ఈ రెండును ఏళ్ళయొడ్డున మొలచు ముంజగడ్డి తెల్లు) స పచ్చద (ప్రతి రెమ్మయందును ఎప్పుడును ఏడాకులే ఉండెడి ఆరణ్య వృక్షము) మహానింబ ( పెద్ద వేప) నింబ నిర్గుండి హరిద్రమ దేవదారు కాలేయక పద్మక చందన బిల్వ కపిత్త (వెలగ) రక్తచందన వాతామరిష్టకా-క్షీరాశ్వకర్ణార్జున (మద్ది హస్తికర్ల-సుమనసకోవిదార ప్రాచీనామలక మధూక ఇప్ప వరాటక ఖర్జూర నాళి కేరప్రియా శ్వామాతక తంతు మాలధవ భవ్య కాశ్మీర-పజాతీఫల (జాజికాయ) పూగఫల పోక) కట్పల సల్లకీఫల మందార కింశుక కుసుమాంశుక పలాశ (మరియొక విధమగు మోదుగు) శాల్మలీ భేద (మరొక విధమగు బూరుగు) వేతస (మెట్ట ప్రబ్బలి) జలవేతన (నీటి ప్రబలి) రక్తాంగ సారంగహింగు ఇంగువ ప్రియంగు రక్తాశోకాశోక కురుక భువి రూడకముచుకుంద కుంద కోట రూషక-రూషక కింక రాత కిరాత కేతక (నీటి మొగలి) వన కేతక అడవి మొగలి) శోభాంజనాంజన శుక లింగ నిచోళక పర్లాక శయనాసన వృక్షములును.

 (మరికొన్ని అందమగు పూలను ఔషధములుగా పనికివచ్చు ఫలములను ఇచ్చునవి. అవి ఏవన): అసన మన్మథ శ రాకార మనోరమ సహకార రసాలమను మామిడి) పీయూథికావల్మీక - శ్వేతయూఫ్రికా జాతీ (జాజి) చంపక తీగ (సం పేగ) తుంబక మోచచ్చలికుచ తిల - బిల్వ-కుసుంభక (నూనెనిచ్చు కుసుమపంట) శుష్మచరణ వరుణ కామ వల్లభ పుష్పాంకుశ వకుళపారి భద్రహరిద్రక ధారా కదంబ (ఒక కడిమి) కుటజ (కోడి నె) కదంబ (నాటుక డిమి) గిరి కుటజ సమా! కొంత దీంత కమనీయ కకుభ మది) కర్కంధుబదరీ మదగజ సమాన నీపర క ఎర్రని పాలీవన దాడిమదుమ చంపక చెట్టు సంపెంగ) బంధూక సబంధూక కుంజక జాతి భేద (వేరువేరు జాతుల కుంజక వృక్షములు) పాటల కర వీర (ఎర్ర గన్నేరు - అదేవిధమగు తెల్లని పూలచెట్టును) కురువక (పచ్చనిములు గోరింట) హిమ వంజీరము లును.

(మరికొన్ని ఓషధులుగానే విశేషముగా పనికివచ్చు చెట్లు. అవి ఏవన): జంబూ (నేరేడు) మృదు జంబూ బీజపూర కర్పూరాగురు బింబ (దొండ) సంతానక వితానక పందిళ్ళు)ములును-ఔషధజాతి (మరికొన్ని పండ్ల చెట్లు: అవి ఏవన): హింతాల ధన్విక తృణశూన్య క రీషశాక (చాగ ! మదన (ఉమ్మెత) పీలు ధాత కీ (ఆరె) చిరిబిల్వ వాలుక తింత్రిణీ (చింత) లోధ్ర విడంగ క్షీరికాశ్మాత కంకోల ఊడుగ) మధుక భల్లాత కేంద్రవన వల్మీక సింధువార సు కేసర (మనోరమ) నాగ కేసర కర మర్ధ కామర్ధారిష్టక వరిష్టక రుద్రాక్ష దాక్ష నింబ పుత్త జీవక (గార కాయ) తక్కోలలావకత్వక్ ద్రుమ ఏరివేతసములును

మరికొన్ని వివిధోప యోగములుకల తీగల గుబురు పొదల జాతులు. అవి ఏవన): పిప్పలీ నాగవల్లి (తమల పాకు) మరీచ (మిరియపు పద్మ వనమాలికా మృద్వీకా (ద్రాక్ష) ఒతిముక్తక వకుల (పొగడ) సఫల పండ్లుగల) వక్ర కూశ్మాండ (బూడిద గుమ్మడి) పటో పొట్ల లాలాబు సొర) చిరంట కార వేల్ల (కాకర) కార్కోటక వార్తాక పందిలి వంగ) బృహతీ ఫల రాజమాషాత సీ (బొబ్బర- అవిసే) త్యాది వివిధ శాక లతా ప్రతానములును రుచిమంతములును కంద విదారీ క రోట బిడారీ విష్ణుసారాజతువత్ త్వగ్వివర్ధిత నిష్సావక గవివక వాస్తుక సువర్చలా స్వపములును (ఆవాలు) కాకోలీక్షీర కా కోలీకాసమర్ధ సాల కట్ఫల చక్రక వృక్షములును మీరిక శాక కాలశాకములును శింబి ధాన్య ప్రభృతి సర్వ ధాన్యములను విచిత్రములును ప్రకాశించునవియు దీర్ఘాయువు కలవియు సస్యయుతములును నగు వన్యములగు ఓష ధులును జరామృత్యు ముద్భయ నాశకములును సౌభాగ్య వర్ణనములునుగు అనేక లతలును తీగ వెదుళ్ళు, బొంగు వెదుళ్ళును చంద్రునివలే మెరయు పూలుగల రెల్లు పొదలును రమ్యములగు దర్భల చెర కుల గుబురులును దుర్లభములును శుభకరములునగు తెగకు చెందిన ప్రత్తిచెట్లును మనోహర ములును నుత్తమములునగు అరటి గుబురులును పచ్చిక బయళ్ళతో నిండిన గరుడ పచ్చమణుల నెత్తములును పచ్చని పూవులతో వేలయు కుంకుమ పొదలును భృంగరాజ జటామాంసీ గ్రంథిక తుమురా ఒంగదములను ఓషధి వృక్షకము (మొక్క)లును భూమి బంగారు పూవులు దాల్చేనేమో యని తోపజేయు మరి ఇతరములగు పూవులును సర సములగు జంబీరితో భూతృణక కకుభ వృక్షములును శృంగి బేరాజు మోదా (వాము) కుహక ప్రియాళుక వృక్షలతాదికమును ఏ వన్నెయు లేనివి పలువన్నెలు కలదియగు సుగంధవంతములు. నగు తామరలును ఉదయ సూర్యునివలే పూర్ణచంద్రునివలె కాచిన బంగారువలె అవి నే పూలవలే చిలుక జేక్కలవలె మెరయు మేట్టయందు పూచు పూలును ఐదు వన్నెలు ఇంకను ఎక్కువ వన్నెలు కలిగి చూపణ కంటికింపు కలిగించు మరి ఇతర పుష్పములును చంద్రునివలె వహ్ని జ్వాలలవలె మెరయు శుభములగు గజవక్త్రోత్పలములును (కలువ) నీలోత్పలములును కర్పూర పుష్పములును గుంజాతకములును క శేరుకములును శృంగాటకములును సృ భరటములును స్థలోత్పలములును (మెట్ట కలువలు) మరికొన్ని నీటియందు మేట్టయందు మొలచి పెరుగు కందమూలఫల పుష్ప విశేషములును మునుల కాహారములగు వివిధ నీవార ధాన్యములును ఆ ప్రదేశమునందు ఆ రాజునకు కనవచ్చెను.

స్వర్గమందో నరలోకమందో జలప్రాయ ప్రదేశములందు గాని మెట్ట పైగాని వనములందుగానీ లభించు ఆయా జాతులలో అచట లేని ధాన్యము కాని పుష్పముకాని శాక ము కాని ఫలము కాని కందముకాని మూలము కాని ఏదియు. నుండదు, అవి అన్నియు ఎల్లప్పుడు ఫల పుష్పములను కందమూలాదికమును ఇచ్చునదే కాని ఋతు లక్షణ వశమును నశించునవి కావు. తపశ్చర్యకివి యన్నియు ఉపయుక్తములును అనుకూలములును అగుననుకొనుచు రాజవి యన్ని యు. చూచుచుండెను. 

ఇవికాక యారాజు చూడ ఇంపుగొలుపు వివిధ పనులను పలువన్నెల వెలయు టెక్కలీకలుకల నెమళ్ళు కాక కంక కోకిల బక కాదంబక హంసకోయష్టి ఖంజరీట కుక్కుట కాష్ఠకూట ఖట్వాంగ లుబ్దకి గౌ క్షేడక కుంభ ధార్త రాష్ట్ర శుక ధాతుక చక్రవాక కటుక టిట్టిభ పుత్రప్రియలోహపృష్ఠ గోచర్మ గిరివర్తక పారావత కమల శారికా జీవంజీవక లావ-వర్తక-వర్త రక్తవత్స ప్రభద్రక ఆమ్రచూడ కుక్కుట స్వర్ణ చూడకుక్కుట కాష్ఠకుబ్జక కపింజల కల వింక కుంకుమ చూడక భృంగరాజ సారపొద భుల్లింగ పిండమాసవ మంజుశీతక . దాత్యూహ వ్యాధసపక్ష క యాత భారద్వాజచాష సువర్ణాంజలీయక భౌమ పుత్ర సదాజ్వాల భాజనాంతికములు అనెడి వానిని చూచెను. మనోహరములగు వేరువేరు పక్షులమందలును ఆ మద్రరాజ పురూరవసునకు ఆట కననయ్యెను.

మరియు వివిధ కారములగు వన్య క్రూర మృగములు మహామృగములు వ్యాఘ్రములు కేసరయుత సింహములు ద్వీపి శరభ వృక ఋక్షతర ము మృగగోలాంగూల వానర శతకమకక దంశ (వాయువేగి) మార్జాల మూషిక నకుల శివనోడవకాలక మత్తగజ గోమహిష్యశన వృక చమర సృమర గౌరముఖోరథమేష మేష సారంగ కుక్కుట  (ఇది ఒక మృగము-కోడి కాదు) తరకు ఋక్షక ఋశ క్షపక్వకుకురమృగ మర్కటక (చిరుకోతులు) మహానీలరావకశ్వ దంష్ట రామశరభ కోర కారక సంచర కరాళకృతమాలకొలపుచ్ఛతోరణాష్ట్ర ఖడ్గవరాహ తురగ గర్దభములును ఆ రాజున కచట కాననయ్యెను.

మద్రరాజునకు కనబడిన ఈ మృగములలో పరస్పర సహజ విరోధము కలవియు కలవు. ఐనను నవి విరోధము లేక మెలగుట చూచి ఆతడు మిగుల ఆనందము చెందెను. ఈ ఆశ్రమము మిగుల పుణ్యకరము. ఆది ఎవరిదో ఆ మహ నీయుని ప్రభావమున అచటి. స్థిర (వృక్షాది) చర పక్షి మృగాది) ప్రాణులన్నియు కాంతిమంతములయి వెలుగొందు చుండెను. అచటి పక్షి మృగములలో పరస్పర హింసకములును ఆ లక్షణము లేక శాంతితో నుండెను. అచట మాంసా హారి ప్రాణులన్నియు పాలు పండ్లు త్రాగి తిని జీవించును. మహాత్ముడగు అత్రిముని దానినిఇట్టి దానినిగా నొనర్చెను. (అచటి ఈ ప్రశాంతతకు ఆ మహాత్ముని ప్రభావము హేతువు.)

ఆరోజు తానచట ఒక పల్లమున శిల పై కూర్చుండెను. అచటి గ్రామ్య (ఆరణ్యములు కాని) గేదెలును ఆవులు అమృతమువంటి రుచికల పాలు స్రవించుచుండెను. ఆచటి తావులన్నియు ఆలపాలతో పెరుగుతో మిక్కిలిగ నిండి ఉండుటచూచి యారాజు మిగుల ఆనందమందెను. అచటి సరస్సులు దివ్యములు.నదులు నిర్మలోదకములు. ఊటలన్నియు ఎండనివి చల్లనివి; అడుగడుగున గుహలు తమ్ము చేరిన వారి కానందప్రదములు. ఆ చుట్టుపట్టుల ఐదు యోజనముల మేర పర్వత సమీప భూములందుకాని పర్వత శిఖరములందు కాని హిమపాతము లేదు.

అచట మంచును త్రావి ఘనీభవించి తెల్లనై వెలుగొందు మేఘములతో నిండి ప్రకాశించు హిమాలయపు శిఖరము ఒకటి కలదు. అచటి ఫరిసరములందే ఎల్లవేళల సజలములగు జలదములతో నిండి కనులపండువు సేయు శిఖరమింకొకటి కలదు. ఆ మేఘములా శిఖరమును తమ వాన నీటితో నెల్లవేళల తడుపుచుండును. కామహరుడగు హరుడే కోరి సదా అట నివసించునన ఆ ప్రదేశము మీగుల మనోహరమని మరి చెప్పవలెనా?

 దేవ ముఖ్యులు అచట నేల్లవేళల సుఖము లనుభవించుచు ఆనందించుచుందురు. అందులకు అనుకూలముగానే ఆ శిఖరమందలి ఫల వృక్షములన్నియు నిరంతరము సఫలములు; అచటి పూల పండ్ల సుగంధములచే నాకర్షింపబడు తుమ్మెదలు సదా రోద సేయుచుండును. అచట తమ అంగనల సేవలందుకొనుచు దేవత లానంద విహారములు సేయు చుందురు. ఆ పర్వత శిఖరము ఇట్లు సుమనోహరమగుటతోపాటు సర్వపాప క్షయకరమయి యుండెను. ఆయా ప్ర దేశము లందు క్రీడించుచుండు వానర ములు చూపణకు కుతూహల వినోదములు కలిగించుచుండును. అచటనచట కనవచ్చు హిమ రాశి ఘనములు పూర్ణ చంద్ర బింబమువలె ప్రకాశించుచుండును.

ఇట్టి ఆ ఆశ్రమమునకు అన్ని వైపులను మంచుతో కూతవడిన గుహలును చిరుకొండల వరుసలును ఉండి మనుజులకు ఎన్నడును అగమ్యములయి యుండెను. అయినను పూర్వ పుణ్య కర్మానుష్టానమున ఆదృష్టమును సంపాదించినవాడగుట చేతను దేవదేవుడగు శివుని యనుగ్రహమునను మద్రమహారాజా పురూరవుడు అటకు చేరి ఆ ఆ మున్యాశ్రమమును చేరగలిగెను. అత్రి మహాముని తనకై ఏర్పరచుకొనినదియు ఆ మహనీయుని తపోబలముచే వర్ధితమహిమమును శ్రమ హరమును సుగంధయుతమును మనోహరమును చక్కగా పూచి వికసించిన నూరులకొలది పూలతో అలంకృతమును యోగసిద్ధి ప్రదమగుటచే ముని శేష్టులకును ఆశ్రయమును శుభావహమును అగు ఆ ఆశ్రమమును మద్ర భూపాలుడు సంతసముతో కాంచెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళ వర్ణనమున జంబూ ద్వీపాంతర్గత భరతవర్షస్థ భరతఖండ వర్ణనమున పురూరవశ్చరితమున హిమవత్పర్వత వృక్షాది వర్ణనమున ఆత్రిమున్యాశ్రమ వర్ణనమను నూట పదునేడవ అధ్యాయము.