మత్స్య మహా పురాణము
115 - ఐరావతీనది(రావీనది)వర్ణనము
సూతుడు ఋషులకు ఇంక ను ఇట్లు చెప్పెను: ఆ మద్ర దేశాధిపతియగు పురూరవసుడు చూచిన ఇరావతీ నది చూచుటకు మనోరమముగ సుండునది మాత్రమే కాక పుణ్యదము కూడ ఐయుండెను. హైమవతి.హిమవంతము నుండి పుట్టింది పార్వతి. కావున శుభ స్వరూప. జలక్రీడాది విహారముల కై చేరిన గంధర్వులు అందెల్లపుడు నిండి యుందురు. ఇంద్రుడందు విహరించుచు ఆనందించుచు ఆనదిని ని షేవించుచుండును. దేవరాజ గజమగు ఐరావతమందు క్రీడించుచుండుటచే నీట కలిసిన మదముతో పదనే నవాసనలు కలిగియుండుటయే కాక ఆమదము నీట కలిసి ప్రవహించు ఆనదీప్రవాహ మధ్యము ఇంద్ర ధనుర్వర్ణము లీనుచుండును. దాని తీర పరిసరములందు తపసులు ఆశ్రమములు న్మించు కొని తపమాచరించుచుందురు. మహా బ్రాహ్మణులు తమ స్నా నానుష్టానాదికమున కై ఆనదిని సేవించుచుందురు. ఇట్టి ఆనది బంగారు కాస్తులు వెదజల్లుచుండును. మహారాజా పురూరవుడానదీనిట్లు దూరమునుండి చూచుచు సమీపించిన కొలది ఆనది నీరు మిగుల తేటయే కానవచ్చెను. ఆతడానదిని చేరెను. తెల్లని హంసావళులు అను శ్వేతచ్చ తము పట్టుచు తన తీరములందలి రెలు అనేది వింజామరలు కదలుచుండుటచే ఆ నది తస్వయంగా రాజును రాజ దలతో స్నానమాడింపగోరుచున్న దో యనునట్లుండుట చూచి యాతడు మిగుల ప్రీతిననుభవించెను. ఏలయన ఆది తన రాజ్లివలె పుణ్యమును సంపాదించి ఇచ్చునది . సుశీలవతి-హృదయమునకు హాయి గొల్పునది.మనస్సునకు ప్రీతి: వర్ధిల్ల జేయునది. రెండవ చంద్రసురా క్రియా యనునట్లు ఆయా ఋతువులందు క్షయవృద్దులు కలది యేనను సౌమ్య రూప స్వబావములతో నొప్పారుచుండును. మిగుల చల్లనే వేగమున ప్రవహించు ఆనది నీటిని దిగ్గజ (పక్షి - బ్రాహ్మణాది తె వర్ణికుల) సంఘములు నీ షేవించు (వినియోగించుకొని ఆనందించు)చుండును. ఆమె హిమవంతుని మేలయిన బిడ్డ; చక్కగా ఒప్పారు అలలతోను ఆమృతముపలే రుచిగల నీటితోను బెగ్గురు (లనెడు జలపక్షు)లతోను ఆనది ఉపశోభిల్లుచు సర్వకల్మష నాశ నియే స్వర్గము నా రోహించువారికి నిచ్చెనయో యనదగియుండెను. ఆమె సముద్రుని భార్యలలో అగ్ర గణ్య; ఆమెను ఎల్లప్పుడును మహర్షి గణమాశ్రయించి యుండును. మిగుల మనోహర యగుటచే ఆనదిని సమీపించి సేవించి యుపయోగించుకోని ఇహపర సుఖానందముల నేపుడందుదుమాయని ఎల్లజనులు ఉతుకులగుచుందురు. రమ్యమగు ఆ నదిలో నాచు ఉండదు. ఆనది తీరమున గోవులమందలు తరచై యుండును. ఆమెయందేపుడును హంస సారసములు ధ్వని చేయుచుండును; ప్రవాహము జలజములతో ఉపశోభిల్లుచుండును. సుడులే గంభీర నాభియు ద్వీపములే విశాలజఘనస్థలియు నీలోత్పలములును పద్మములును సుందర నేత్రములును వికసిత కమలములే మొగమును మంచువలే మెరయు నురుగే సూక్ష్మవస్త్రమును శోభిల్లు చక్రవాకపకులే స్తనములును కొంగల బారులు దంతపంక్తులును చలన్మత్స్యావళులే కనుబొమలును స్వజలమున క్రీడించి లేచుచుండు గజముల రమ్య కుంభస్థలములే స్తనములును హంసలే కాలియందేలును తామర కాడ లే కరకంకణములును కాగా ఆ ఇరావతీ (రావీ) నది సుంద రియగు యువతిగా తోచుచుండెను.
(*పుశింద్ధైర్మృగనజ్ఘైశ్చవ్యాఘ్రభృంద్ధై)
అప్సరసలు ధరించి జలక్రీడా కాలమున విడిచిన పూలమాలలును రాసులును నదియందు నీటివెంట కొట్టుకొని పోవుచుండును. తన యొడ్డున మొలచిన వృక్షముల సుగంధములతో ఆనది గుబాళించుచుండును. నూరుల కొలది అలల యందు ప్రతిఫలనముచే సంక్రమించిన రవి బింబములు-కన్నుల నుపహత మొనర్చు చుండ ఆనది తేరిపార చూడరా కుండును. దేవగజములు తమ దంతములతో ఒడ్డులయందు దెబ్బలు వేసిన గుర్తు లలంకారములయి యుండెను. దేవేం ద్రుడా నది నీటిని ననుభవించుచుండును; రూపమదోన్మత్తలగు అప్సరసలు గుంపులే రూపమదోన్మత్తులగు గంధర్వులు తమ్మ నుసరింప మధ్యాహ్న సమయములందా నదియందు జలవిహారము లొనర్చు చుందురు. ఇట్టి జలక్రీడాసక్తలగు దేవస్త్రీల హృదయములందలి చందనములతో మీ శితములగు ఆ ఏటి నీటిని తేటులు ఉప సేవించుచుండును. సుగంధి కుసుమాన్వితములగు త తీర సంజాత వృక్షములు ఆ పుష్పముల మకరందపు ఆకర్షణమునకు వశవర్తులై సంబరమున గుమియై తిరుగు తుమ్మెదల రొదలతో నిండియుండును. తపోధనులే కాదు-మునులే కాదు-దేవతలే కాదు-అచ్చరలే కాదు ఎల్లవారును ఆనది యొడ్డున శృంగార భావవరులై ఆనందమందుచుందురు. స్వర్గవాసులగు దేవతలు మొదలగువారితో దట్టమైయుండి పద్మములను చంద్రుని పోలు మోములుకల దేవస్త్రీలు తన్న దీజలమున తడిసిన శరీరములు కలవాడును దేవతల (తోడి క్రీడల వలన ప్రీతినొందిన మానసములు కలవారునై ఆనందమనుభవించుచుందురు. ఆ నదీజలమును సదా దేవతలనుభవింతురు; మృగబృందములందు వ్యాధ సంఘముల పీడలనుండి తప్పించుకొనవచ్చి మునుకలతో దాగియుండును. తామరలతో నొప్పారు ఆ ఏటి నీరు తారలతోడి అమలాకాశ మువలె అందగించుచుండును. ఆనది. తన తీరమున పూచి వెలయు చంద్రకిరణములపోలు తేల్లు పూలతోను గగనమునే తమ శాఖా గ్రములతో నిలిపి పట్టుకొను మహాద్రుమములతోను రాజిల్లుచుండును. వివిధ దేవ భూదేవు లా నది నెల్లవేళల ని షేవించుచుందురు. భక్త జనుల కచిర కాలముననే సకల కలుష నాశము సేయునది యానది. ఎన్ని యో ఏళ్ళును హిమజలములును ఆ ఏట కలిసిపోవు చుండును. మంచుతో చల్లనై న ఆనది మానవులను మృగ సంఘములను సురాసుర సిద్ద మహర్షి సంఘములను కూడ ఆయా ప్రకారముల రక్షించుచుండును.
ఆ రావీనది సింహగణ యు కము. అయియును కరి బృందయాన (ఏనుగుల మందలచే అనుసరింపబడునది ఏనుగువలె ఠీవిగా నడచునది;) ఆనది నీరు సంతాన సహితము అయియు సువర్ణ ప్రకాశము కలది. (ఎడతెగని ప్రవాహముతో కూడినది యనియు పచ్చని కల్పవృక్షములతో కూడినది యనియు రెండర్థములు) సూర్యకిరణ తాపము చే మిగుల వృద్ధి నొందుచుండియు ఆనది నీరు చంద్రునివలె చల్లనిది. ఇట్టి ఇరావతీ నదిని ఆ మద్ర దేశాధిపతి పురూరవసుడు కాంచెను.
[ఈ చివరి శ్లోకమున విరోధాభాసాలంకారము: ఎట్లన ఒకేచోట సింహములు గజములు ఉండుట విరుద్దము. సింహములు జలము త్రాగుటకు వచ్చును-నది నడక ఏనుగునడకవలె నుండును. అని విరోధ పరిహారము. పచ్చని ఆకులు కల చెట్ల కాంతితో కూడియు బంగారు కాంతితో నుండుట విరుద్దము. బంగారు కాంతిగల నిరంతర ప్రపోహముం డెననుటతో విరోధ పరిహారము. సూర్యకిరణములతో కాగిన నీరు చంద్రునివలె చల్లగా నుండుట విరుద్ధము-సూర్యుని వేడిమికి కరగినను మంచునీరు నదియందు చంద్రునివలె చల్లనై ప్రవహించుననుటతో విరోధ పరిహారము.]
ఇది శ్రీమత్స్యమహాపురాణమున సప్త ద్వీపాంతర్గత జంబూ ద్వీపాంతర్గత భరత వర్షాంతర్గత భరతఖండ వర్ణనమున బుధపుత్త్ర పురూరవశ్చరితమున మద్రరాజు పురూరవుడు ఇరావతిని చూచుటయను నూట పదునైదవ అధ్యాయము.
