మత్స్య మహా పురాణము
167 - నారాయణ నాభి పద్మావిర్భావము
విభుడు (సర్వవ్యాపి-సర్వశక్తి సంపన్నుడు) ఆగు నారాయణుడు (యాదస్॥జలజంతువులు) జలజంతువుల జాతికి జన్మస్థానము అగు జలరూపమున తానుండి తన వా స్తవరూపమును మరుగుపరచి ‘ర సోవై నః' అను శ్రుతి వచనాను సారము రసాత్మక ద్రవాత్మక ) జల రూపుడై ఉండి 'యస్య జ్ఞానమయం తపః' అను వచనానుసారము జ్ఞానాత్మక మగు తపమాచరించెను॥ (జలములు కర్మను తెలుపును॥ ఈ విధముగ జ్ఞానకర్మములే సృష్టికి హేతువులను ఉపనిషద్వచనము ఇచట నిరూపింపబడినది॥) ఇట్లు కొంత కాలము తపమాచరించిన తరువాత మహాత్ముడు అతిబలుడు (తానన్నింటియందు ప్రవేశించియుండును॥తనయందు ఆన్నీ యు ప్రవేశించియుండును కావున) విశ్వుడునగు నారాయణుడు లోకసృష్టి విష యమునను పంచమహాభూత సృష్టి విషయమునను ప్రతియొక యంశమును సంకల్పించేను॥ (ఇది పరమేశుని ఇచ్చో శక్తి ప్రవృత్తి) అతని జ్ఞానమయ తపస్సుచే సృష్టి సంబంధీ ప్రక్రియ ఆంతయు అతనికి తెలిసి జ్ఞానశక్తి రూపమున ఉన్నది కావున) తరువాత అతడు ఆట్టాలోచించుచుండగనే గాలియేలేక సముద్రము - నిశ్చలమయి యుండగా తరువాత సృజింపబడనున్న జగమంత యు జలమయ రూపమయి సూక్ష్మరూపమున (ఆవ్యక్త-వ్యక్తముకాని రూపమున) ఉండగా ఆకాశము కూడ లేని గహ్వరమున లో తగు ఉనికియందు॥ ఈ ఉనికియే భగవంతుని సద్ రూపము) సలిలమును (జల మును) ఆశ్రయించియున్న పరమాత్ముడు ఆ ఆర్ణవమును కొంచెముగ సంక్షోభింపజేసెను॥ ఇదియే ప్రథమ స్పంద రూపమగు క్రియాశ కి ప్రవృత్తి; ఈ స్పందమువలన ఏమాత్రమును ఎడము లేకున్న నీటి అలలలో , నుండి సూక్ష్మమగు రంధ్రము ఏర్పడెను॥ ఇది అన్నిటికంటె పూర్వము (మొట్ట మొదట ఏర్పడిన ఆకాశ మను స్మూధూతము; శబ్ద గుణమున కాశ్రయమగు ఆ ఆకాశ చ్చిద్రమునందుండి అంతట శబ్దముతో పాటు వాయువను సూక్ష్మ భూతముత్పన్న మయ్యెను॥ అది అవకాశమునంది వృద్ధినొందగా అది ఎంత ఆక్షోభ్యమయినను దానియందును భగవదిచ్చచే స్పందము॥ కలిగి దానిచే సముద్రము కూడ క్షోభిల్లి ఆ ఘర్షణముచే అగ్ని ఉత్పన్న మయ్యెను॥ అతడే నల్లని పొగతో తన త్రోవను సూచించుటచే కృష్ణవర్తా (నల్లని త్రోవ కలవాడు) సర్వ నరుల జఠరములందుండి ఆహారమును జీర్ణ మొనరించుటచే వైశ్వానరుడు (విశ్వ॥నర్వ॥ నర) అనబడనున్న సూక్ష్మ మహాభూతమయ్యెను॥ అగ్ని అంతట ఆధిక జలమును సంతో షింపజేసెను॥ ఆ నీరు శోషిల్లి ఏర్పడిన రంధ్రమున విశాలమగు ఆకాశము ఏర్పడెను॥ కాని ఆచట అగ్ని స్వతేజము నుండి అమృతముతో సాటియగు రుచి రసము కల జలములేర్పడెను॥ ఇట్లు ప్రథమ స్పందము వలన జలములందు కలిగిన ఛిద్రమునుండి ఆకాశమును దానినుండి వాయువును దానినుండి అగ్నియు దానినుండి జలములును ఏర్పడెను॥ సూక్ష్మ మహాభూత నిర్మాతయగు మహాదేవుడి భూతములను చూచి ప్రీతుడయ్యెను॥ ఈ - సూక్ష్మభూతములతో లోక సృష్టి చేయుటకై భగవానుడును బహురూపుడునగు నారాయణుడు బ్రహ్మ జనించవలయునని తానే బ్రహ్మరూపము॥ ధరించవలయునని) సంకల్పించేను॥ సృష్టికర్తయగు బ్రహ్మ సామాన్యుడు కాడు; అతని మహా వ్యక్తిత్వము ఎట్టిది అనిన) లోగడ చెప్పిన పండ్రెండువేల దివ్య వర్ష ముల పరిమాణముకల మహాయుగములు వేయి అయినచో బ్రహ్మకు ఒక పగలు అగును॥ (ఇంత దీర్ఘ కాల పరిమాణముతో ఏర్పడు॥ నూరు సంవత్సరములు జీవించగల బ్రహ్మ అతః పూర్వము బహు జన్మములందు తనుదాను విడుద్ద ముగా ఒనర్చుకొనిన జీవాత్మ చైతన్యరూపుడు; ఎట్లనిన-భూలోకమునందు తమ తపముచే భావితమయిన (చక గ సంస్కరింపబడి) ఆత్మకల ద్విజులలో శ్రేష్టులగు యోగులరుదుగా ఎవరుందురో॥ వారిలో కూడ విశ్వ క ల్యాణమున కై ఉపయోగించు జ్ఞానమును దర్శించుట ఆ ఆత్మకు ముఖ్య ( శ్రేష్ఠత్వమును ఇచ్చును; ఇట్టి జ్ఞానమును దర్శించినవాడయి సంపూర్ణమగు ఈశ్వరత్వమును (ఉత్తమ క్రియా సామర్థ్యమును) కూడ సంపాదించిన యోగిని గుర్తించి వి శ్వేశుడగు నారాయణుడు అట్టివానీని లోకనృషి చేయు బ్రహ్మ పదము స్థానము నందు నియోగించును॥ (ఇట్టి బ్రహ్మను సృష్టించుటకు అనువుగా) యోగతత్వ వేత్తయు అచ్యుతుడు తన్నాశ్రయించిన వారిని నాశమునందనీయక రక్షించువాడు) హరి (స్మరించిన వారి దోషముల హరించువాడు) లో కేశుడు లోకక ర్తయగు నారాయణుడు ఆ మహాతో య మందు యథావిధిగా (యథా పూర్వము గా-ప్రతిసృష్టికి ఆరంభమునందు జరుగునట్లే) జలక్రీడ చేయుచు తన నాభినుండి (నాభి॥అనగా నభమే॥ ఆకాశ మే; ఆకాశ మునకును మూలభూతము విష్ణుని ఆశ్రయముగానున్న జలమే అని చెప్పబడినది; ఆది నారాయణ స్వరూపమే కావున-తననుండి యే) పద్మమును ఉత్పన్న మొనర్చెను॥ దానికి వేయి దళములుం డెను; రజస్సు (రజోగుణము॥ధూళి) లేదు; అది రవివలె ప్రకాశించుచుండెను; న్వర్ణమయము; అంతేకాదు; ప్రజ్వలించు అగ్ని శిఖలవలే మిగుల వెలుగొందు కాంతులుగలది; శరత్కాలమందు నిర్మలుడగుఆర్కు నీ తేజమువంటి తేజము కలది; ఇట్లా కమలము మహాత్ముడగు నారాయణుని తనువు శరీరము॥ అది నారాయణుని నిర్మల చైతన్యమే॥) నుండి ఉత్పన్న మయి మనోహర రూపము కలిగి ఉదార (చాల గొప్ప) వర్చస్సు కలిగి జనించి ప్రకాశించుచుండెను॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున నారాయణనాభి పద్మావిర్భావమను నూట అరువది ఏడవ అధ్యాయము॥
