మత్స్య మహా పురాణము

Table of Contents

233 - నద్యాది వైకృతశాంతి .

గరుడు అతితో ఇట్లు చెప్పెను: నదులును హదములును ప్రస్రవణములు (సెలయేళ్ళు నీటి ఊటలు బుగ్గలు మొదలగునవి) నగరమునకు దగ్గరగా నున్న వి దూరముపోవుట దూరమున నున్నప్ దగ్గరకు వచ్చుట వీటి నీరు రుచి తప్పుట వివర్ణమగుట కలుషమగుట కాగుట నురుగులు సుడులు ఏర్పడుట కలతపడుట కాలువల నీటియందు నూనె పొలు విషము ప్రవహించుట జరిగినచో ఆరు మాసములకు లోగా ఆదేశ మందు పరచక భయమేర్పడును; జలాశయములు మోగుట మండుట మంటలనో పొగ నో ధూళులనో వేలిక క్కుట త్రవ్వకయే నీరు పైకి వచ్చుట జలాశయములందు జల జంతువులధీక మగుట నీటినుండి సంగీతధ్వనులు వినబడుట జరిగినచో జనమరణ భయము కలుగును;

దీని శాంతికై దివ్యములగు జలములును తేనెయు నూనెలును జలాశయములందు వేయుచు పొరుణ మంత్రము లతో హోమము జరుపవలెను; వారుణమంత్ర జపము జరిపించవలయును.

బ్రాహ్మణులను తేనెతో నూనేతో కూడిన పరమాన్నము భుజింపజేయవలయును. గోవులను తెల్లని వస్త్రము లను ఉదకుంభములను బ్రాహ్మణులకు దానమీయవలయును; దోష శాంతియగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున నద్యాది వైకృత శాంతియను రెండు వందల ముప్పది మూడవ అధ్యాయము.