మత్స్య మహా పురాణము
127 - త్రిపురాసురోపాఖ్యానము-మయాదులకు బ్రహ్మవర ప్రాప్తి
[విశేషము: దేవాసుర యుద్ధములు మొత్తము పండ్రెండు అని లోగడ నలువది ఏడవ అధ్యాయమున చెప్ప బడినది. వానిలో ఈ త్రిపుర యుద్దము ఏడవది. మిగిలిన వానిలో వృత్రవధము మాత్రము (పురాణములలో) భాగవతమునందును భారతము నందును (ఇతిహాసమున) వర్ణింపబడినది. మిగిలిన దానిలో పండ్రెండవది లోగడ నలువది ఏడవ అధ్యాయములో చెప్పబడినది. నారసింహ వామనవరాహామృతమంథన తారకామ యాడీవధాంధకారములును ఈ మత్స్య పురాణము నందేయున్నవి. ఈ దేవాసుర సంగ్రామములన్నియు శాస్త్రీయాశాస్త్రీయ చిత్తవృత్తులకును జ్ఞానా జ్ఞానములకును వివేకా వివేకములకును నడుమ జరిగిన పోరాటములు. వీనిలో చివరకు శాస్త్రీయ చిత్తవృత్తికే గెలుపు కలిగి భగవదుపాసనముతో ప్రాణులు తరించు మార్గమే పైచేయిగా మిగులుట ఈ దేవాసుర యుద్ధముల పరమ తాత్పర్యము. వీనియందు వేదిక సంప్రదాయ తత్వములు రహస్యాత్మక ములుగ అంతర్ని హితములై యున్నవి. వానిని సంప్రదాయజ్ఞులవలన తెలిసికొనదగును. ప్రకృత మీ శ్రీ పురవధమను దేవాసుర సంగ్రామమున ఉపాసన విధానముల సంకేతము గూఢముగను శాస్త్రీయా శాస్త్రీయ చిత్తవృత్తులపోరు బాహ్యముగను ప్రతిపాదింపబడినది.]
ఋషులు సూతునిట్లడిగిరి: భగవానుడగు మహేశ్వరుడు పురారి ఎట్లయ్యెను? (పుర + అరి = పురములకు శత్రువు.). ఆదేవుడు పురములనెట్లు దహించెను? మాకది విస్తరించి చెప్పుము. ఆ కథయందును అది చెప్పగల వాడవని నీయందును గల ఆదరముతో మేము నిన్ను మరల మరల (బ్రతిమాలి) అడుగుచున్నాము. మయమాయా వినిర్మితమగు శ్రీ పుర దుర్గమును మహాదేవుడొకే బాణముతో నెట్లు దహించెను? ఆ విధము ఆదరణీయుడవగు సూతా! మాకు తెలుపుము. అనగా సూతుడు ఇట్లు చెప్పనారంభించెను: దేవుడగు భవుడు తై పుర దుర్గములనేట్లు దహించెనో తెలి పెద; వినుడు. మహామాయాశాలియు మాయలకు జనకుడునగు మయుడను అసురుడుండెను. వాడు దేవతలతో సంగ్రామమున ఓడి పరమ తపమాచరించెను. అతడు తపమాచరించుచుండగా ఆ మయ తేజస్సునకు లోబడిన వారు బలవంతుడగు విద్యున్మొలి వీర్యశాలియగు తార కాక్షుడునను అసురులును మయుని యందలి అనుగ్రహబుద్ధితో ఆతని సంకల్పమునే తామును ఉద్దేశించి మయుని సమీపముననే ఉండి పరమతప చూచరించిరి. రూపొందిన లోకత్రయము వలె (బ్రహ్మ విష్ణు రుద్రులను) దేవత్రయమువలే అగ్నిత్రయమువలె కనబడుచు లోకత్రయమును సంతాపింపజేయుచు ఆ దానవులుతపమాచరించుచుండిరి. వారు తపః ప్రియులై హేమంతమున జలశయ్యల పైనుండీ గ్రీష్మమున పంచాగ్ని మధ్యమందుండి వర్షర్తువుసం:కు నిరవరణమగు ఆకాశము క్రింద నిలిచి గడ పుచుండిరి. వారు క్రమముగా వనమునుండి సంపాదించుకొనిన రుచ్యములు మృదువులునగు ఫలములు మూలములు పిమ్మట మరియొక విధమగు కఠినమగు) ఆహా రములు తీసికొనుచుండిరి. సమలములును అమలములును సగు జలములందు నాచు తోళ్ళయందు నిలిచియు తమ వల్కలములు బురదతో కప్పుపడియు ఉండుచు శరీరములు చిక్కిపోయి ధమనులతో వ్యాపము కాగా మాంసమే రేక తపమాచరించసాగిరి. వారి తపోగ్ని ప్రభావమున పగడ మేదియో గుర్తింపరాక పోయెను. సర్వజగత్తును కాంతిహీన మయ్యెను. అగ్ని సూర్యులు మంద తేజస్కులయిరి. దానవులనెడు ఆమూడు అగ్ను లచే ఇట్లు లోకములు దహింప బడుచుండ జగద్బంధుడగు బ్రహ్మ వారి నడుమ సాక్షాత్కరించెను. అంతట ఆకస్మికముగ స్వయముగ వచ్చిన లోక కర్తయగు పితామహుని చూచి దైత్యులు సమస్కరించి స్తుతించిరి. తపస్సుచే రవివలే వెలుగుచు తనుగాంచి హర పూర్ణముఖ నేత్రులగు ఆ దానవులతో హర పూర్ణముఖ నేత్రుడగుచు బ్రహ్మ ఇట్లు పలికెను: నాయనలారా! నేను మీ తపమునకు తుష్టుడనై వర మీయవచ్చితిని. మీకోరిక ఏమి యా సంకోచిపక తెలుపుడు.
ప్రసన్నుడయి ఇట్లు పలికిన బ్రహ్మతో విశ్వకర్మయగు మయుడు ప్రహర్షమున కనులు విప్పార ఇట్లనెను. దేవా! పూర్వము తారక యుద్ధమున దైత్యులు దేవతల చేతిలో ఓడిరి. ఖడ్గములతో ఆయుధములతో కొట్టి చంపబడిగి. ఎడ తెగక మావారి దేహములు దెబ్బతినేను. వారు బాధితులు భయకంపితులు నేరి. వారు శరణార్థులేరికాని తమకు శరణమేదియో వారెరుగరైరి. ఇట్టి స్థితిలో నేను తపఃప్రభావము చేతను నీ సేవకు ఫలము గాను దేవతలకును చొరరాని దుర్గము నిర్మింపదలచు చున్నాను. నిర్మాతలలో శ్రేష్టుడవగు ప్రజాపతీ! నేను నిర్మించు ఆ త్రిపుర మను దివ్యదుర్గము ఎట్టి కృత్యములకును కృత్య అనేడు ఆభిచారిక శక్తులకును జలదోషములకును అగ్ని తేజస్సులకును దేవతల ఆయుధముల కును దేవతలకును కూడ చేర రానిది కావలయును.
ఈ మాట విని విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మ నవ్వుచు విశ్వకర్మయగు మయునితో ఇట్లు పలికెను: దైత్యగణా ధిపా! మయా! సద్వర్తనము లేని నీ కెవ్వనికిని సర్వామరత్వము లభింపదు. కనుక (అమరత్వము కోరక) క్షణ కాల ములో దుర్గ నిర్మాణమే చేసికొనుము. బ్రహ్మ మాట విని మయుడు ప్రాంజలియై పద్మసంభవుడగు బ్రహ్మతో మరల ఇట్లనెను: “ఒ కేసారి విడిచిన ఒకే బాణముతో మాత్రమే నేను నిర్మించు దుర్గమును కాలవలయును; మేమును చావవల యును. మరియొక విధమున మాకు వధ్యత్వ ముండరాదు.
'అట్లే యగుగాక!' అని మయునితో పలికి బ్రహ్మదేవుడు స్వప్న మందు లభించిన ధనమువలె అదృశ్యు డయ్యెను. పితామహుడు ఏగిన తరువాత ఆగ్ని భాస్కర తేజులగు ఆ రాక్షసులును అటనుండి వెడలిరి. నాటినుండి వారు తపముచే మహాబలులగుటతోపాటు వరముచే మదించిరి. విస్తారైర నరై
ఋషి సత్తములారా! పిమ్మట మహాబుద్ధిశాలియగు ఆ మయుడు దుర్గము నిర్మింప సంకల్పించి ఇటు లాలోచించ సాగెను: నేను తప్ప మరి ఎవరును నివసింప అలవి కాని త్రిపుర దుర్గమును నేను ఎట్లు నిర్మింతును! నేను నా మతి విచా రణశ క్తి నుపయోగించి దేవతలు ఏక బాణపాతముతో దానిని విహతము చేయజాలకుండునట్లు ఆ దుర్గ మును నిర్మింపవల యును. ప్రతియొక పురమునకు పొడవు వెడల్పులు ఏక శత యోజనము లుండునట్లు నిర్మించును. పుష్యయోగమునందు ఆ పురముల నిర్మించి పుష్యయోగముననే అవి పరస్పరము కలియునట్లు చేయుదును. పుష్యయోగమున వానిని సమీపించి చేరినవాడు మాత్రమే వానిని ఏక శర ప్రహారముతో కొట్టివేయగలుగును. వానిలో అయోదుర్గము క్షితితలమున రజత దుర్గ మంతరిక్షమున సౌవర్ణ దుర్గ మంతకును మీద ఉండునట్లు ఆ త్రిపుర దుర్గ ము నిర్మితమగును. శతయోజన విస్తరము గల ఆంతరములతో ఆట్టాలకములతో యంత శతఘ్నులతో శకులు శూలములు ఉపలకంపనములు (డాలను కదలించు యంత్రములు) మహాద్వారములతో మేరు మందర సదృశ మహాప్రాకారములతో విరాజమానమగుచు ఏరికీని చేర రానిదయి తారకాక్ష మయ విద్యున్మాలులు కాపాడుచుండు ఆ త్రిపుర దుర్గమును భగవానుడగు త్రిణేత్రుడు కాక ఆన్యు డెవ్వడు నశింప జేయగలుగును ?
ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున మయాదులకు బ్రహ్మపరప్రా ప్తియను సూట ఇరువది ఏడవ అధ్యాయము.
