మత్స్య మహా పురాణము

Table of Contents

268 - ప్రాసాద (దేవాలయ) విధి కీర్తనము.

[ఈ అధ్యాయములో ప్రతిపాదింపబడిన ప్రాసాద నిర్మాణ ప్రణాళి భారతీయ దేవాలయ నిర్మాణ విధానములో అతి ప్రాచీనదశ యని విమర్శకుల యభిప్రాయము. 'మానసారము' నమరాంగణ సూత్రధారము మొదలగు గ్రంథముల యందును శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణమునందును కూడ ఈ ప్రాసాదరూప నిర్మాణ ప్రతిపాదనములో ఈ శ్రీమత్స్య మహా పురాణమున ప్రతిపాదించిన తీరుకంటే విభిన్నత కనబడును.

నాగర (ఔత్తరాహ) సంప్రదాయము-ద్రావిడ సంప్రదాయము అను రెండు విధములగు ప్రాసాద (దేవాలయ) నిర్మాణ సంప్రదాయములలో ఈ శ్రీమత్స్య మహాపురాణమున ప్రతిపాదించిన రీతి నాగర సంప్రదాయమునకు చెందినది యని విమర్శకుల తలపు.

ఇందు ప్రతిపాదించిన రూపములో ఆలయ నిర్మాణము దక్షిణ భారతమున మహబూబ్ నగర్ జిల్లా - అలంపురము నందలి ఆలయములయందును కర్నూలు జిల్లా-ఆదోని సమీపమునందలి పెద్ద తుంబళము అను గ్రామమునందలి ఒక శిథిల ప్రాచీనాలయమునందును. ఇట్లే అచ్చటచ్చట అరుదుగా కనబడుచున్నది.]

నాగర సంప్రదాయపు ప్రొసాద (దేవాలయ) ముల ఆకృతి విషయక భావన.

 అనగా ప్రాణుల దేహమే దేవాలయము అనియు .ఆ దేహమునందలి జీవచైతన్య మే సనాతను(శాశ్వతుడగు భగ వానుడు (పరమాత్ముడు) అనియు ఈ పారంపరిక వచనమునకు ప్రసిద్దముగా చెప్పుకొను ఆర్థము.

మరియొక విధముగా - దేవాలయము భగవానుని దేహము; ఆలయమునందు ప్రతిష్టితమయియున్న భగవ న్మూర్తియే ఆ దేహమునందలి జీవ చైతన్యము అనగా సనాతనుడగు (శాశ్వతుడగు) భగవానుని ప్రతినిధిగా ఆ ఆలయము నందు ఉంచిన దేవతామూర్తి- సాక్షాత్ ఆ పరమాత్మ చైతన్యమే; అనగా సాక్షాత్ భగవానుడే-ఆనియు అర్థము.

ఈ యర్థమును అనుసరించి మన ప్రాచీనులు దేవాలయమును నిలువబడియో కూర్చుండియా యున్న మానవుని దేహమువలె కనబడునట్లు నిర్మించిరి. అందును నాగర సంప్రదాయపు శివాలయమును వారు నిలువబడియున్న మానవా కృతితో సరిపోల్చి భావనచేసి అది చాల ఎత్తుగా ఉండునట్లు నిర్మింప జూచిరి; అని తోచును. శ్రీమత్స్య మహాపురాణములో ‘లింగమానతః’ చెప్పిన దేవాలయపు ఎత్తు 'గర్భమానతః' చెప్పిన ఆలయపు ఎత్తుకంటె చాల ఎక్కువగా నున్నది.

ఈ అధ్యాయమున నిరూపించిన దేవాలయ (ప్రాసాద) మాన భేదములు నాలుగు విధములుగా నున్నవి.

1. సామాన్య (సర్వ సాధారణ) ప్రాసాదము: ఇది మొదట ప్రధానాలయ నిర్మాణమున కై ఉద్దేశించిన ప్రదేశపు కొలతలు నిర్ణయించుకొని ఆ కొలతల భాగములను అనుసరించి మిగిలిన ఆలయ భాగముల కొలతలను గ్రహించు పద్ధతి.

2. లింగపు (విగ్రహపు) కొలతలను మొదట నిర్ణయించుకొని దాని కొలతలను అనుసరించి ఆలయ భాగముల కొలతలను నిర్ణయించుకొను పద్దతి.

3. గర్బాలయపు కొలతలను మొదట నిర్ణయించుకొని దాని ననుసరించి ఆలయపు మిగిలిన భాగముల కొలత లను నిర్ణయించుకొను విధము.

4. ఇదియు గర్భాలయపు కొలతలను అనుసరించి ఆలయపు మిగిలిన భాగముల కొలతలను నిర్ణయించు పద్దతియే.

A black and white drawing of a tower

Description automatically generated 


 

A diagram of a building

Description automatically generated 

 

మూడవ విధమగు 'ప్రాసాదము': ద్విజులారా ముందుగా గర్భాలయపు ప్రమాణమును నిర్ణయించుకొని దాని . ననుసరించి ఆలయపు ఇతరాంశముల కొలతలను గ్రహించు విధము తెలి పెదను; వినుడు.

గర్భాలయమును (3x3 = 9) ఆగునట్లు తొమ్మిది భాగములుగా (పదములు గదులుగా విభజించవలయును. అందు నట్టనడుమనున్న ఒక పదము (ఆంకణము-గది) నందు లింగమునకు గాని ఆర్చామూర్తికిగాని నిర్దేశించిన పీఠిక (దానియందు లింగముకాని ఆర్చామూర్తి కాని) ఉండవలయును.

దీనికి పోగా దీనికి చుట్టును మిగిలిన ఎనిమిది 'పదముల'లో ఆంతర్) భిత్తులు ఉండవలయును. ఇట్టి ఐదు వదముల ప్రమాణముల ఎత్తుతో ఈ 'ఆంతర్' భిత్తులు ఉండవలయును. దీనికి రెట్టింపు (పది పదముల ప్రమాణముల) ఎత్తు శిఖరమునకు ఉండవలయును.

శిఖరపు ఎత్తును నొలుగు భాగములు చేసి అందలి రెండు భాగముల ఎత్తులో ఒక భాగపు ఎత్తుతో 'వేదీ బంధము'ను మిగిలిన నాలుగవ భాగములో శ్రీకంఠము' 'ఆమలసారము' అను అంశములను నిర్మించవలయును.

రెండు పదములయంత లేదా శిఖరమంజరీ పరిమాణములో రెండు నాలుగవవంతులంత వెడల్పుతో గర్బా లయమునకు మూడు వైపులను ఒక్కొక్కవై పున రెండేసి చొప్పున ఒకటి పెద్దది .ఇంకొకటి చిన్నదిగా) కపోలములు (భద్ర ప్రతిభద్రములు) నిర్మించవలెను.

ఆలయమునకు ఆందము ఇచ్చునట్లు ‘పత్రవల్లులు' (ఆకులు పూలు కల తీగలు) అండకములు దీనికి ఆలం కారముగా నుండవలయును;

ఈ విధముగా మూడవ విధమగు ప్రాసాదము నాచే (మత్స్య) నారాయణునిచే) నీకు (మనువునకు) తెలువ బడినది.

ద్విజులారా! అదే విధముగా సామాన్య రూపమగు మరియొక ప్రొసాద భేదపు లక్షణమును చేప్పెదను; వినుడు.

దేవతలు ఎచటనుందురో దేవతామూర్తులు ఎచట నుండునో ఆ క్షేత్ర ప్రదేశమును (గర్భాలయమును) చూడు భాగములుగ విభజించవలయును.

ఆందలి ఒక భాగపు పరిమాణమును ప్రమాణముగా తీసికొని అంత కొలతలతో గర్బాలయమునకు మూడు వైపులను దాని బాహ్యాంతర్భిక్తులనుండి వెలుపలి వైపునకు వచ్చునట్లు 'రథాంక ము' అను రథమును వాలిచినట్లు కనబడు) లక్షణ విశేషములను నిర్మించవలయును.

ఆదే తృతీయ భాగపు కొలతతో ఉండునట్లు ప్రాసాదమునకు అన్ని వైపులను నేమి (ప్రదక్షిణా) నిర్మించ వలేను.

గర్భాలయపు పరిమాణపు ప్రమాణములను రెట్టింపు చేసిన కొలతలతో భిత్తుల ఎత్తు ఉండవలయును. భిత్తుల ఎత్తునకు ద్విగుణము శిఖరపు ఎత్తు ఉండవలయును. గర్భాలయ పరిమాణములో ఐదవవంతు కొలతతో ప్రగ్రీవ 'మును నిష్కాస' (నిర్గమమును నిర్మించ వలయును.

ప్రాకారపు (భిత్తికిగల ఎత్తులో మూడవవంతు ఎత్తుతో సుషీరము (ద్వారము?) ఉండవలయును. అదే ప్రాకారపు (భిత్తుల) ఎత్తులో ఐదవవంతు పరిమాణ ప్రమాణముతోనై నను 'గ్రీవ'మును “నిష్కాన' (నిర్గమమును నిర్మించవచ్చును. ఇది విశేష ప్రకారము.

గర్భాలయపు చతురస్రాకృతిలో ఏర్పడు కర పరిమాణములో ఐదవ వంతు పరిమాణపు కొలతతోనే నను ప్రగ్రీవమును నిర్మించవచ్చును.

గర్భాలయపు అంతమున ద్వారమూల ప్రదేశమున కలశ (రూపమగు శిల్పనిర్మాణమును నిలువవలయును.

ఈ విధముగా ఆలయ నిర్మాణమును జ్యేష.మధ్యమక నిష్ణ. పరిమాణములలోను లింగపు పరిమాణమునో ఆర్చామూర్తి పరిమాణమునో ఆధారముగా అవలంబించియు రూప భేదకల్పనను ఆవలంబముగా చేసికొనియు జరువ వలయును.

ఇట్లు నమాన (నంక్షేవ) చేపముగా ప్రాసాద సామాన్యముల లక్షణములు చెప్పబడినవి. ఇక ద్వి జులారా!-ప్రాసాద విభాగ విశేషములను-వాని లక్షణములను చెప్పేదను; వినుడు.

1. మేరువు 2. మందరము 8, కైలాసము 4. కుంభము 5. సింహము 6. గజము 1. విమానచ్చందకము 8. చతురస్రము (రుచక ము-శ్రీవత్సకము -శ్రీవృక్షకము) 9. అష్టానము (వజ్రము) 10. షోడశాస్రము (ద్వివజ్రము) 11. వర్తులము (మండలము) 12. నర్వ భద్రక ము నర్వతోభద్రము) 18. సింహాన్యము 14. నందనము 16. నంది వర్దనకము 16. హంసము 17. వృషము 18. సువర్ణము 19. పద్మకము 20. నముద్గకము.

ఇట్లు ద్విజులారా! ప్రాసాద విశేషములు నామగ్రహణముతో చెప్పబడినవి; వీని విభాగ లక్షణములను చెప్పే దను; వీనుడు.

మేరు ప్రాసాదము: ఇది నూరు నానావిచిత్ర శిఖరములు నాలుగు ద్వారములు పదునారు భూమికల (అంత సుల) ఎత్తుకలది. భూమిక అనగా ఎంత ఎత్తు ఉండవలయును? అనునది వాస్తు ప్రకరణమున చెప్పబడినది.) మందర ప్రాసాదము: ఇది ద్వాదశ భూమికలు కలది; కైలాగ ప్రాసాదము: ఇది నవభూమికలు కలది; విమానచ్చందక ము: ఇది ఎనిమిది భూమికలు కలది. నందివర్గ నము: ఇది సప్త భూమికలు కలది; నందనము: ఇది ఒకే శిఖరము కలది; బహుశః దీనికి షడ్ భూమికలు; నర్వతోభద్రము; ఇది షోడశాస్రపు ఆకృతియు నానారూప విశేషములును అనేక శిఖరములును కలది.

వ్యభీచ్చందకము: ఇది చిత్రశాలలును.మూడు శుక నానలును ఐదు భూమికలును కలది; మండలము వర్తులము): ఇది ఎత్తు విషయమున (ముందు చెప్పబోవు వృషప్రాసాదముతో సమానము; అశ్రులు (కోణములు) లేనిది; (ఆగ్రి = కోణము); సింహ ప్రాసాదము: ఇది సింహముతో సమానమయిన(ఆకృతి కలది; గజప్రాసాదము: ఇది గజముతో సమాన మైన( ఆకృతి కలది; కుంభప్రాసాదము: ఇది కుంభాకృతి కలది; తొమ్మిది భూమికల ఎత్తు అంగుళీపుటయక)మువంటి అమరికయు పంచాండకములును కలది; సముద్ధకము: ఇది షోడశాస్రములు (1f కోణములును భుజములును) కలది; రెండు పార్శ్వములందును రెండు చంద్రశాలలును రెండు భూమికల ఎత్తును కలది; పద్మకము: ఇది పై దానివలెనే యుండి మూడు భూమికల ఎత్తు కలది; మృగరాజ (సింహ)ప్రాసాదము: ఇది షోడశాస్రములును విచిత్ర శిఖరములును కలది; శుభమనోహర మైనది; చంద్రశాలలు కలది; గజప్రాసాదము: " ఇది విశాలము అగు ప్రగ్రీవము ఆరు భూమిక ల ఎత్తు అనేక చంద్రశాలలు కలది; గరుడప్రాసాద ము: ఇది. ఏడు భూమికల ఎత్తు మూడు చంద్రశాలలు తనకు రెండు, వైపులను మృగరాజ ప్రాసాదరూపములు కలది; ఇంకొక విధమగు గరుడప్రాసాదము: ఇది ఆరు భూమికల ఎత్తు కలది; ఇది వెలుపలి వైపున అన్ని వైపులను కలిసి అశీతి (ఎనుబది) హస్తములు (చుట్టు కొలత) కలది; మరియొక గరుడ ప్రాసాదము: ఇది పది భూమికల ఎత్తు కలది; పద్మకము: ఇది షోడశాస్రమయి పండ్రెండు భూమికల ఎత్తు కలది; శ్రీవృక్షకము (చతురస్రము): ఇది ప్రమాణమునందు (కొలతలో) వద్మకముతో సమానమయి చతురస్రాకృతి కలది; వృషప్రాసాదము: ఇది వంచిండకములు రెండు భూమికల ఎత్తు నాలుగు హస్తముల భుజముగల గర్భాలయము కలది; ఇది సార్వకామికము (అన్ని కోరికలను ఆవశ్యకతలను తీర్చునది: సింహాస్యము: నా చేత చెప్పబడినవానిలో సప్త భూమి కలవంచభూమిక ల ఎత్తు కలవి.అట్టివానికి చెప్పిన ఆయా ప్రమాణములు కలవి.చంద్రశాలలు ప్రగ్రీవములు కలవి.వవి కలవో అవి అన్ని యు “సింహాస్యములు' అనబడును. (భూమిక = అంతస్తు)

ఇవి అన్ని యు ఇటుకలతోనో శిలలతోనో దారువుతోనో నిర్మింపబడి తోరణముల( పెద్ద ద్వార ముల)తో కూడి యుండును.

ఆయా ప్రాసాదములకు కల ప్రదేశమునకు తీసికొనవలసిన భుజముల (విష్కంభముల) ప్రమాణములు: మేరువు-50; మందరము.45; కైలాసము.40; విమానచ్ఛందక ము84; నందివర్ధనకము.32; నందనము - సర్వతోభద్రము. 80; వర్తులము (మండలము) పద్మకము-20:

 సింహముగజము. కుంభము వలబీచ్ఛందకము -16; ఇవి దేవతలకు ప్రీతికరమయినవి; విహితామహాత్ములగు ఈ దేవతలకు ప్రీతికరములగు కైలాసము. సింహము..విమానచ్ఛందకము -12; గరుడము -8; హంసము.10; ఇట్టి హస్త ప్రమాణక విష్కంభములతో శుభలక్షణములతో ప్రాసాదములను నిర్మించవలయును.

యక్ష రాక్షస-నాగులకుగాను నిర్మించు ప్రాసాదములు మాతృస ప్రహస్తముల ప్రమాణములతో నుండునవి ప్రళ స్తములు.

 (ఈ చెప్పిన ఇరువది విధములగు ప్రాసాదములలో చతురస్ర ము నందివర్తనము - విమానచ్చందకము.గజము సర్వతోభద్రము అనునవి చతురస్రపు (Square) ఆకృతి కలవి; (భృంగ గృహ) మృగరాజము (సింహము) ఆయతపు (Rectangle) ఆకృతి గలది; సింహాన్యము వృత్తాయతము (దీర్ఘవృత్తము.Ellipse); వజ్రము.( అష్టాగ్రము)-నందనము హంనము. ఇవి వజ్రాకృతి కలవి; ( అష్టభుజి-Octagon). ఆని శ్రీభోజ మహారాజ విరచితమగు “సమరాంగణ సూత్ర ధారము" వలన తెలియుచున్నది. చూ. 298 పు. )

ఈ చెప్పినవానీలో మేరువు మొదలగు ఏడు ప్రాసాదములును జ్యేష్టపరిమాణక లింగమును (అర్చామూ ర్తిని) ప్రతిష్టించుటకు-శ్రీవృక్షకము (రుచకము.చతురస్రము మొదలగు ఎనిమిదియు మధ్యమలింగమును (ఆర్చామూర్తిని ప్రతి ష్ఠించుటకు హంసము మొదలగు ఐదును కనిష్ట లింగమును (ఆర్చామూర్తిని ప్రతిష్ఠించుటకు శుభావహములు.

వలభ్చ్చందక ప్రాసాదమున-గౌరిని.జటా ముకుటములను ధరించి వరదాభయ ముద్రలు ఆక్షమాల-కమండ లుపు నాలుగు హస్తములందును ధరించిన తపోవనస్థ మూర్తితో గాని-ర క్రముకుటము కలిగి ఉత్పలము అంకుశము వరదా భయ ముద్రలు కల నాలుగు హస్తములతో భర్తతో వినాయకునితో కూడి గృహస్థిత స్ఫూర్తితోగాని-యున్న రూపముతో ఆర్చించవలయును.

ఇట్లు ఈ రెండు రూపములలో ఏ రూపముతోనే నను వలబీచ్ఛందక ప్రాసాదమున గౌరిని అర్చించవచ్చును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ప్రాసాద విధి కీర్తనము ఆను రెండు వందల అరువది ఎనిమిదవ అధ్యాయము.