మత్స్య మహా పురాణము

Table of Contents

120 - కైలాసాది పర్వత వర్ణనము 

[ఈ అధ్యాయమున హిమవత్పర్వతాంశములగు కైలాస పర్వతము మొదలగు పర్వతములును వానినుండి జనించు సకోనజీ సన్ని వేశమును మిగుల రమ్యముగను స్పష్టముగను వర్ణింపబడియున్నది. ఇది ఈనాడును ఇట్లే కనబడు చున్నది.]

 సూతుడు ఋషలకు ఇంకను ఇట్లు చెప్పెను: ఆ అత్యాశ్రమమునకు ఉత్తరమున హిమవత్ పృష్టమున త్రిపుర సంహర్తయగు పరమశివుడు అనుభవించి ఆనందించుచుండు కైలాస పర్వతము ఉన్నది. అది కల్పద్రుము విభూషితములగు నానా రత్నమయ శృంగములతో అలంకృతము దానియందే శ్రీమంతుడగు కుబేరుడు గుహ్యకులతో కూడ నివసించుచుండును. అలకాధిపతియగు రాజరాజు కు బేరుడు అప్సరసలు తన వేంటనుండగా ఆ కైలాసపర్వత పొదమునుండి ప్రభవించు శుభమును పుణ్యమును (పవిత్రమును) మందార (కల్పవృక్ష) పుష్పపరాగ పూర్తమును దేవ సమాదర పాత్రమునునగు శీతల జలమును అనుభవించి ఆనందించుచుండును. ఆ కైలాసమునుండియే శుభయగు మందాకినీ (దేవగంగా) నది ప్రభవించును. ఆ నదీతీరమునందే గొప్పదియును శుభమునునగు నందనవనమున్నది.

కైలాసమునకు ఈశాన్యమున దివ్యమగు సౌగంధిక గిరికిని సర్వ గైరిక ధాతుమయమును దివ్యమునగు సువేల పర్వతమునకును చేరువగా సముద్రజలపు కాంతిగల చంద్ర ప్రభమను గిరి కలదు. దాని సమీపమందుకల అచ్చోదమను సరస్సునుండి శుభయగు అచోదకయను దీవ్యనది ప్రవహించును. దాని తీరమున గొప్పదియే దీవ్యమును శుభమునుగు చైత్రరథవన మున్నది. దానియందు క్రూ(శూరులగు గుహ్యకులు తన పరివారముగా యక్ష సేనాపతి మణిభద్రుడు తనయనుయాయులతో కలిసి నివసించును. ఈ అచ్ఛోదకానదినే మందాకినీ యనియు (కొందరు) వ్యవహరింతురు. అది మహీమండల మధ్యమున ప్రవహించి మహోదధిని ప్రవేశించును. (మహోదధితో కలియును.)

(దీని తరువాత రావలసిన క్రమములో తూర్పు దెసయం దేమున్న దియు చెప్పలేదు.

కైలాసమునకు ఆగ్నేయమున శుభకరమగు సర్వేషధీ గిరికిని మనళ్ళిలా (మఃశీల) మయమును దివ్యమును నగు శబల పర్వతము నకును చేరువగా హేమ శిఖరములతో సూర్యునివలె తేజరిల్లు లోహిత మహాపర్వతమున్నది. దాని పాదమున మహాదివ్యమగు లోహిత మను మహాసరస్సు కలదు. దానినుండి లోహిత మహానదము ప్రభవించి లోకమున ప్రవహించును. ఆ సర సీరమున అశోక మను దేవ మహావనము కలదు. ఆగిరియందావనమున సౌమ్యులు సుధార్మికులునగు గుహ్యకులు తన పరివార ముగా జితేంద్రియుడగు మణిధరుడను యక్షుడు నివసించును.

(దీని తరువాత రావలసిన క్రమములో దక్షిణ దిశ యందు ఏమన్నదో చెప్పలేదు.)

కైలాసమునకు నైరృత దిశ యందు కకుద్మత్పర్వతము గలదు. త్రిక కుద్మంతము (మూడు శిఖరములు కలది) ఆగు ఆ త్రిక కుద్మత్పర్వతపు శ్రే కకుదాంజనమను శిఖరమున రుద్రుని ఉత్పత్తి జరిగెను. ఆ పర్వతపు పాదము నందు మహాదివ్యము సిద్ధ సేవిత మునగు మానసమను సరస్సు కలదు. దానినుండి పుణ్యయు లోకపావనియునగు సర యూ నది (ఇది హరయూ అని ఆవెస్తాలో పేర్కొనబడింది. ఇపుడిది పడమటి ఆప్షన్స్తానలో హీరట్ కు దగ్గరగా హరి-రుద్ అను పేరుతోనున్నది.) దాని తీరమునందు వై భాజమను ప్రసిద్ధవనము కలదు. దానియందు కుబేరానుచరుడు జితేంద్రియుడు ప్ర హేతి అను వాని కుమారుడు అనంత విక్రముడు నగు బ్రహ్మయోని (బ్రహ్మధానుడు) అను రాక్షసు డుండును.

 కైలాసమునకు పశ్చిమమున సర్వోషధియను దివ్యగిరి కలదు. అచటనే స్వర్ణమయ గే రిక ధాతువులతో విభూషితము. అందుచేతనే బంగారువలే కనబడునది శివుని పీతికి పాతమయినది దివ్య సువర్ణ శీలా సమూహములతో వ్యా ప్రము వందలకొలది బంగారు (వలే ప్రకాశించు శిఖరములతో ఆకాశమును ఒరయుచున్న దో అనునట్లు తోచు అరుణమను పర్వత శ్రేష్టము కలదు. దాని దాపుననే సుమహాదివ్యమగు ముంజవత్పర్వతమును మహోన్నతమగు దుర్గ శైలము కూడ కలవు. ఈ అరుణ పర్వతమందు ధూమలోహిత రూపుడగు శివుడు సన్నిధానము చేసియుండును. ఈ ఆరుణ పర్వత పాదమునుండి శ్రీ లోదమను సరస్సును దానినుండియే శై రోదయనునదియు ప్రభవించును. ఆనది [ఇదియే నేటి ఆక్సస్-(ఇం) చతుష్-వము (సం) ఆదూదరియా (పార్శీ) నది] దక్ష -శీత-పర్వతముల నడుమగా పశ్చిమ సముద్రమున కలియును.

(ఈ వరుసలో రావలసిన వాయవ్య దిశ యందు ఏమున్నదియు చెప్పలేదు.)

కైలాసమునకు ఉత్తరమున ఉన్న సర్వోషధి గిరికిని హరి . సాలమను వనమునకును చేరువగా దివ్యౌషధి. మయమై గౌర వర్ణముగల హిరణ్య శృంగమను పర్వత శ్రేష్టము కలదు. దాని పాదమునందు మహాదివ్యమును కాంచన వాలుకము (బంగరు ఇసుకగలది) రమ్యము ఆగు బిందుసరమను సరస్సు గలదు. అచ్చటనే భగీరథుడను రాజర్షి తన పూర్వులు గంగా జలముతో తమ ఆస్థ్యాదికము తడిసినచో స్వర్గమున కేగుదురను ఆశ తో అనేక వత్సరములు తప మాచరించుచుండెను.

 త్రిపథగ (మూడు మార్గముల పోవునది) ఐన గంగ మొదట అక్కడనే ఉం డెడిది. ఆమె సోముని (శివ శిరఃస్థిత చంద్రుని) పాదమునుండి వెలువడెను. తరువాత ఆమె ఏడుగ విభాగమందేను. అక్కడ ఇప్పటికిని మణి నిర్మితములగు యూప యజ్ఞ పశువును బంధించు) స్తంభములును హిరణ్మయచితులు (చితి యజ్ఞ వేదికా విశేషమును కలవు. అచ్చట ఇం దుడు సురగణములతో కూడి క్రతువులతో యజనము దేవతారాధనము) చేసి కామితఫల సిద్దిపొందెను. ఈ విషయమునందే సంప్రదాయము ఇట్లున్న ది. నక్షత్రమండలమును - ఆశ్రయించి దీవ్యచ్చాయా మార్గము కలదు. (దీనికే స్వాతీపథమని పేరని శ్రీమద్రామాయణమున కలదు.) ఈ త్రిపథగ రాత్రు లందు అంతరిక్షమున కనబడుచునే యున్నది. ఆమె (తన ప్రకాశమసుజలముతో) అంతరిక్ష ద్యులోకములను ప్లావనము (ముంచెత్తి తడుపుట) చేసి భూలోకమునకు వచ్చెను. (ఇందుచేతనే ఆమెకు త్రిపథగ = భూపథాంతరిక్ష పథ ద్యుపథములందు మూడిటియందును నడచునది.) అని వ్యవహారము. అని సంప్రదాయ వచనము.

 (భగీరథుని తపః ప్రభావమున) ఆమె మొదట భవుని ఉత్తమాంగమున పడెను. శివుడు తన యోగమాయా శక్తిచే ఆమేనట సంభోధిం (ఆటంకపర)చెను. అందుల కై క్రోధము చెందిన ఆమెనుండి కొన్ని బిందువులు క్రిందకు జారి భూమి పై పడెను. వానితో ఏర్పడినందున ఆ సరస్సునకు బిందు సరస్సని నామము.

శివుడు గంగను తన శిరమున నిరోధించగా ఆమే రోషించి కూర భావమునంది 'నేనీ నిరోధమును ఛేదించి ప్రవాహవేగమున శివునిగూడ తీసికొని పాతాళమున ప్రవేశింతును.' అని తలచెను. ఆమే అభిప్రాయము నెరిగి శంకరు డానదిని తన శరీరమునందే మరుగు పరచదలచెను. అంతలోనే శివునకు తన ఎదుటనున్న భగీరధుడు కనబడెను. అతడు చిక్కి ఒడలంతయు ధమనులు మా తము వ్యాపించి కనబడు చుండెను. అతని ఇంద్రియములు ఆకటితో వ్యాకులములై యుండెను. ఈనది విషయమున ఇతడు తపముచే నన్ని దివర కే మెప్పించేను. నేనతనికి వరమిచ్చితిని. అని స్మరించి ఆ దేవుడు తన కోపమును నిగ్రహించుకొని బ్రహ్మవచనమును కూడ జ్ఞప్తికి తెచ్చుకొని నదిని అట్లే నిలిపి పట్టి తన తేజముచే సంరోధింపబడియున్న గంగను వదలివేసెను. ఆమె నదివరకే భగీరధుడు ఉగ్రతప ము చే మెప్పించియుండెను. కావున అట్టి ఆమెను గంగ అను పేరనే సప్తస్రోతస్సులు (ఏడు ప్రవాహములు)గా శివుడు వదలెను.

 నళిందినిహ్లాదిని-ప్లావని అను ఈ మూడు స్రోతస్సులు తూర్పునకును సీత -చక్షుస్-సింధు-అను మూడును పడమరకును మరియొకటి భగీరథు ననుసరించి దక్షిణమునకును ప్రవహించేను. తః హేతువుననే దక్షిణ సముద్రమున కలిసిన ఈ సప్తమ గ్రోతస్సు భాగీరథియైనది. మిగిలిన ఆరింటితో కూడ ఈ ఏడును హైమవత వరమనునామాంతరము గల భరత వర్షమును పావితమును ప్లావితమును (పవిత్రము చేయబడినది -తడిపి ముంచెత్తబడినది)గా చేయుచున్న వి.

పడమరగా ప్రవహించు సీత-చకుస్ – (ఇదియే నేటి పక్షు-oxus-ఆమూద రియా - అను పేరుగల నదిలోగడ శైలోదానదియే ‘పక్షు’ అని చెప్పబడినది. అనగా ఇవి ప్రవహించిన ప్రదేశ స్థితిని బట్టి అవి రెండును ఒకటిగా కలిసి పోవుటయో ఒకటి అంతర్వాహినిగా నగుటయో జరిగియుండును.) సింధు-అను మూడు గంగా ప్రోతస్సులు ను మేచ్చ ప్రాయములును పర్వత బహుళములునునగు కుకురాన్జబర్బర యవనాంతిక పులసకులు త్థాంగలో క్యాధరా ప్లాక్ష మరుకాలక శూలిక ఖరావర్తక శఖ పల్లవదరదశక జనపదములను పవిత్ర మొనరించుచు ప్రవహించి తుదకు హిమ వంతమున రెండుగా చీలి పోయిపోయి పశ్చిమ సముద్రములో కలియుచున్నవి. ఈమూడు ప్రవాహములును మిగిలినవి కూడ మొ త్తము మీద దరద కుక్కుట గాంధారౌరస కురు శివపౌరేంద్ర మరుశాలీయ సైంధవారట్టక కాం భోజుకుపథ భీమ గౌరిక శునోముఖోష్ట్రముఖ సింధు రేత గంధర్వ కింనర యక్ష విద్యాధర కలాప గ్రామక కింపురుషార్హప కిరాత పుళింద భారత కురు పాంచాల కౌశిక మత్స్య మగధాంగ బ్రహ్మోత్తరవంగ తాత్రలిప్త జనపదములను పవిత్ర మొనర్చు చున్నవి.

హ్లదినియను గంగా ప్రవాహము తూర్పుగ ప్రవహించి యవక నిషాద నీవర మూషిక నీలముఖ కళింగ దాతిక కుశిక స్వర్గ భూమిక సముద్ర పొద సంజాత జనపదముల వారిని పవిత్ర మొనర్చుచున్నది.

నందినియు తూర్పుగనే ప్రవహించి ఇంద్రద్యుమ్న సర పరిసరములందలి కుపథములను (ఇరుకు తోవలుగల ప్రాంతములను) చేత శంకుపద ఋక్ష కఠోష్ఠ ప్రావరణ దేశముల నడుమగా ప్రవహించిపోయి ఇంద్ర ద్వీప (ఖండ) సమీపమున (ఇంద్ర ద్వీప-ఆండమాన్ నికోబారు దీవులు కావచ్చును.) సముద్రమున కలియుచున్నది.

ప్లావనియను గంగాళాఖ వేగముతో తూర్పుదేసగా ప్రవహించుచు తో మర-హంసర్గ-సమూహక ములను పవిత్ర మొనర్చుచు ఇంకను కొన్ని ప్రాధేశములను సేవించుచు పలు తావుల పర్వతమును భేదించుచు పోయి కర్ణ ప్రావరణ (అశ్వముఖ జనుల జనపదములను తడుపుచు పర్వతమరు -ప్రదేశముల మీదుగా విద్యాధర ప్రదేశములచే శ మీమండల గోష్ఠము అను మహా సరస్సున కలియుచున్నది. ఇంద్రుడు పర్షించు దేశ ములందుతున్న ములగు నదు లుపనదులెన్ని యో త్రోవలో ఈ గంగా శాఖలయందు కలియును.

వస్వోకసార (అమరావతీ?) సమీపమున సురభియను వనము కలదు. హిరణ్యశృంగుడు అను పేరుగల విద్వాంసుడు జితేంద్రియుడు నగు హిరణ్య శృంగుడను కౌబేరకుడు (బేతాళుడు) యజ్ఞా పేతుడు సుమహాన్. అమితౌజస్ సువిక్రమ నామములుగల కుబేరానుచరులగు విద్వద్ర్బహ్మ రాక్షసులు నలుగురును ఇట్టివారు మరికొందరును తన పరి వారముగా వసించును.

పర్వత వాసులగు జనులు ఇట్టివారితోనే తమ పురుషార్థముల సిద్ధింపజేసికొందురు. ధర్మార్థ కామ ప్రవృత్తులలో వారందరు పరస్పరము రెట్టింపై యుందురు.

హేమకూట పర్వత పృష్ఠమున సర్పముల సరస్సు ఒకటి కలదు. ఆహదమునుండి సరస్వతీ-జ్యోతిష్మతీ అను రెండునదులు ప్రభవిల్లి వరుసగా తూర్పు-పడమటి సముద్రములందు కలియుచున్నవి.

నిషధమను పర్వతోత్తమమున విష్ణుపదమను సరస్సు కలదు. దానినుండి గాంధారీ.కులా అను రెండు నదులు ప్రభవించును.

మేరు పార్శ్వమునుండి చంద్రప్రథమను సరస్సును పుణ్యయగు జంబూనదియు ప్రభవించును. జంబూ నదినుండి లభించునది కావుననే బంగారునకు జోంబూనదమని వ్యవహారము. పయోదమను నీలప్రదమును అతి శుభకరమగు పుండరీకహదమును ఆ మేరు పార్శ్వమునందే ప్రభవించును. వానినుండి వరుసగా పుండరీకా.పయోదా అను నదులును ప్రభవించును. హిమవంతమునకు ఆవలివైపున ఉత్తర మానసమను సర సొకటి మేరు పార్శ్వమునుండి ప్రభవించును. దానినుండి జ్యోత్స్నా అమృత కొంతా అనునదులు రెండు ప్రభవించుచున్న వి.

ఇవి కాక మేరు పార్శ్వమునుండియే ప్రభవించినవి సముద్రమువలె విశాలములై నపి పండ్రెండు ప్రాదములు వైజయములను నామము కలవి క లవు. అవి ఉత్తరకురు వరమునందు ప్రసిద్ధములు. అవి ఎప్పుడును పద్మములతో మీది జలచరములతో ఆకులములయి యుండును. వీటినుండి శాంతి-సంధ్యా-అను రెండునదులు ప్రభవించును.

ఈ భరతవర్షము కాక మిగిలిన కింపురుషాది వర్షములయందేనిమిదింటను ఇంద్రుడు వర్షించడు. అచట ఉద్భిజ్జమగు. నేలను చీల్చుకొని పైకి వచ్చు నీటి(underground water)తోనే నదులు ప్రభవించి ఆవి ఆయా దిక్కు లందలి సముద్రములందు కలియును.

ఆయా వర్షములందు-

 ఋషభ-బాలక-వజ- మైనాక చంద్రకాంత-ద్రోణ-పర్వతములు దక్షిణమునుండి ఉత్తరమునకు వ్యాపించి ఉత్తర దిగంతమున ఉత్తర సముద్రములోనికి చొచ్చుకొనియున్న వి. చక్ర రుధికర-నారద పర్వతములు. పడమటగా సాగి పశ్చిమ సముద్రములోనికి ప్రవేశించినవి. జీమూత ద్రావణ మైనాక పర్వతములు దక్షిణ సముద్రము వైపునకు సాగియున్నవి. వజము మైనాకము అను రెండు పర్వతముల నడిమికి తిన్న గా అగు విదిక్కు (మూల) నందు దక్షిణా పథ పరిసరములలో సంవర్తకుడను సముద్రజాసియగు అగ్ని సముద్రపు నీటిని త్రాగుచుండును. అతని కే ఔర్వుడు -బడ బాముఖుడు అనియు వ్యవహారములు,

 పూర్వము ఇంద్రుడు తమ రెక్కలు భేదించరాగా ఆభయము వలన ఈ పర్వతములు (పర్వతములలో) నాలుగు లవణోదధియందు ప్రవేశించెను. ఈ పర్వత ప్రదేశములందు చంద్రుడు మాసపు శుక్ల కృష్ణపక్షముల రెంను సమాకృతియె కనబడును. ఈ పర్వతములు నాలుగును భారత వర్షమునకు సహాయకములని (ఉపకారకములని) పెద్దలు చెప్పుచున్నారు. అది ఎట్లో సంప్రదాయజ్ఞులవలన తెలియదగినది.) వేరు ప్రదేశములందు అతడు ఉద యించక పోయినప్పటికిని ఇచ్చట చంద్రుని అన్ని కాంతులును (ఎల్లప్పుడు) కనబడుచుండును.

ఈ ఎనిమిది వరములందును జనులు ఆరోగ్యము ఆయుఃప్రమాణము ధర్మార్థ కామ ప్రవృత్తులు తత్సిద్దులు. ఈ విషయములందు ఒక దానికంటేను మరియొకటి రెట్టింపు చొప్పున ఆధిక్యము కలిగియుందురు. ఆ వరములన్ని టి యందును ప్రాణులు ధర్మము విషయమున ఆయా సందర్బము లలో మేలు తరములయి యుండును. ఆయా వరములందు నానాజాతుల భూతములు నివసించుచున్న వి. నానా జాతుల జనులు నివసించుచున్నారు.

ఈ విధమగు ఈ విశ్వమును తనయందు ధరించుచు ఈ భూమి ఇట్టి వర్షాది విభాగములతో ఉన్నది.

(గమనిక: ఈ అధ్యాయము చివర చంద్రుని విషయమును చెప్పెడి శ్లోకములలో కొన్ని ప్రతులయందు పాఠములు అర్థమును పూర్ణముగా భేదింపజేయుచున్నవి. అనువాద కుడు తాననుసరించిన ప్రతియందలి పాఠముననుసరించి అనువదించుటయైనది- అనువాదకుడు.).

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళ వర్ణనమున జంబూ ద్వీపాంతర్గత భరత వర్షాంతర్గత భరత ఖండ వర్ణనమున కైలాసాది పర్వత సంస్థాన వర్ణనము కింపురుషాది వర్షస్థ విశేషవర్ణనమునను నూట ఇరువదవ యధ్యాయము.