మత్స్య మహా పురాణము
152 - తారకాసుర విజయము॥
సూతుడు ఋషులకు ఇంకను ఇటు చెప్పెను: ధ్వజమును ధనువును లేకుండగా పారిపోవుచున్న నారాయణ దేవునిచూచి ఇంద్రుడు రణమున దేవతలు ఓడిరని గ్రహించెను॥ దైత్యులు ముదితులయి ॥ యుండుట చూచి అతనికి ఏమి చేయుటకును తోచలేదు॥ పాకాసురుని అణచినవాడగు సురేంద్రుడు నారాయణునికడకు వచ్చి మిగుల ప్రోత్సా హకము మధురమగు వచనమునిట్లు పలికెను॥ దేవా దుష్టమానసులగు ఈ దానవులతో ఆడుకొనేదవేల? దుర్జనులు తెలిసికొనిన లోపము కలవానికి కార్యాచరణ మెక్కడిది? ( అట్టివాడు ఏమియు చేయజాలడు॥) శక్తుడగు వాడు నీచుని ఈ పేక్షించినచో వాడది తన బలమే యనుకొనును॥ కావున మతిమంతుడగువాడు పట్టుబడిన నీచుని విడువరాదు॥ తమకు అగ్రేసరులగు వారి సహాయ సంపత్తిచేతనే వీరులు జయమందుదురందువ-ప్రభూ మీరు హిరణ్యాక్షుని వధించి నపుడు మీ కెవరు సహాయులుగా నుండిరి? హిరణ్యకశిపుడును వీర్యవంతుడును మదముచే పొగరెక్కి చెల రేగినవాడును కదా? ఆ భయంకరాకారుడును నీదగ్గరకు రాగానే ఏమియు లేకుండ రూపుమాసిపోయెనుక దా దేవశత్రుపులయి నీకు ప్రతిబలులుగా నిలిచిన దైత్యేంద్రులు ఎల్లరును నీదగ్గరకు రాగానే మంటలను చేరవచ్చిన మిడుతలవలే నయిరిక ద హరీ యుద్ధమున అసురులకును దైత్యులకును నీవే నాశ కరుడవు॥ ఇప్పుడును నీవు ఆట్టే వారికి అంతకుడవయి దేవత లకు ఆశ్రయమవగుము॥ ఇంద్రుడిట్లు ప్రబోధించగా మహాభుజుడును సర్వభూతములకు ఆశ్రయుడునునగు హరి బలమున తేజమున శ క్తి సమృద్ధియందును మిగుల వృద్ధిపొందెను॥ అంతట ఆధోక్షజుడు హరి ఆ కాలమునకు తగిన వాక్యమునిట్లు ఇంద్రునితో పలికెను॥ దై త్యేంద్రులను ఆయా వధోపొయములతోనే కాని మరియొక విధముగా చంపుట మనకు శక్యము కాదు॥ తారకుడు ఏడు దినముల శిశువు చేతిలో తప్ప జయింప అలవికాడు॥ ఒక డు స్త్రీ చేతిలో చావ వలసినవాడు; ఇంకోకడు కుమారి చేతిలో చావవలయును॥ భయంకర ఏకముడగు జంభదానవుడు మాత్రము చంప సాధ్యుడు; ఆ దానవుడు కూడ నీచేతిలో తప్ప చచ్చువాడు కాడు; కావున లోకహరుడగు జంభుని నీవు దివ్యధే ర్యమవ లంబించి చంపుము॥ నారక్షణలో నీవు జగత్కంటకుడగు జంభ దానవుని నిర్మూలించుము॥
వైకుంఠుడు పలికిన ఆ మాటవిని దేవశత్రు హంతయగు సహస్రాక్షు డింద్రుడు దేవతలనందరను సైన్యరచన చేయుడని యాజ్ఞాపించెను॥ సర్వలోకములయందలి తపోవీర్యములకు సారరూపులగు ఏకాదశ రుద్రులను ఇంద్రుడు అగ్రేసరులను ( సేనాపతులను)గా చేసెను॥ వారందరును సర్పముల పడగలు భుజకీర్తులుగా బిగించి కట్టుకొనినవారు; బలవంతులు; నీలకంఠులు; చంద్ర రేఖా సమూహముతో ఆలంకృతములగు పెద్ద కేశపాశములు గలవారు; శూలముల కాంతుల జ్వాలలతో పూయబడిన దేహములు గలవారు; భుజమండలములతో భయంకరులు; పచ్చనై ఎత్తయిన జటా జూటములు గలవారు; సింహచర్మములు శరీరములకు చుట్టుకొన్న వారు; మహాసురుల తరిమీనవారు; 1॥ కపొలి; 2॥ పింగళుడు 3॥ భీముడు 4॥ విరూపాక్షుడు 6॥ లోహితుడు 6॥ ఆజేశుడు 7॥ శాసనుడు 8॥ శాస్త్ర 9॥ శంభుడు 10॥ చండుడు 11॥ కుశుడు అని వారి నామములు; అనంతబలులు ప్రభావశాలురునగు ఈ ఏకాదశ రుద్రులును దేవ సేనాగ్ర భాగమును పాలించుచు దానవులను చీల్చి చెండాడుచు దేవతలకు తృప్తి కలిగించుచు మేఘములవలె గర్జించు చుండిరి॥ హిమాచలము వంటిది గొప్పది బంగారు తామరల మాలలతో అలంకృతము కదలు చామరములు కలది బంగారు దండములతో రత్న రాసులతో అలంకృతము నాలుగు దంతములు కలది మత్తతతో నిలిచినది మహామదజలము స్రవించునది కామరూపధారియగు ఐరావత గజము పై దేవేంద్రుడు హిమాలయ శృంగమునందు తేజోవంతుడగు రవివలె కూర్చుండెను॥ అమిత విక్రముడగు వాయుదేవత ఇంద్రుని ఎడమవై పును॥తన జ్వాలలతో దిజ్ముఖములను నింపుచు అగ్ని కుడివైపును కాపాడుచుండిరి॥ ఇంద్రుని అతని సేనను వెనుక నుండి శ్రీమహావిష్ణువు రక్ష సేయుచుండెను॥ ఆదిత్యులు వస్తువులు విశ్వదేవులు మరుత్తులు అశ్వినులు గంధర్వులు రాక్షసులు యక్షులు కిన్నరులు నాగులు అలంకరించు కొని శస్త్రములనే ధనముగా ఉంచుకొని బంగారు సొమ్ములు దాల్చి కోటికోటి ఒక్కొక్క బృందము బృందముగా తమ తమ బిరుదులు దాల్చియుండిరి॥ తమముందు నిలిచి స్తోత్ర పాఠకులు తమకీర్తులను వినిపించుచుండ ఇంద్రునితో కూడి ఈదేవ జాతుల వారెల్లరును గర్పవంతులయి దైత్యవధ కై ముందునకు వచ్చిరి॥
సురై స్సహ గజాసురయుద్ధమ్॥
దేవతా సమూహము రక్షించుచుండ ఏనుగుల రథముల గుర్రముల ధ్వనులతో కూడి ఎల్ల సమయములందును ధ్వజ వస్త్ర కోటులతో అలంకృతమయి ఒప్పు ఆ ఇంద్ర సేన దైత్యుల శోకము నధికము చేసెను॥ వచ్చుచున్న ఆ దేవ సేనను చూచి గజాసురుడు గజరూపుడును మహామేఘములతో కూడిన మహా సముద్రమువలే భయంకరుడును పరశువు ఆయుధముగా ధరించినవాడును విశాలదంతములతో వికటుడును నయి దేవతలను పాదములతో నలచేను॥ చేతులతో విన రెను॥గండ్రగొడ్డటితో తెగగొటైను॥ ఆ రౌద్ర విక్రముడిట్లు తమ సేనను పడగొట్టుచుండ వేరు వేరు విధములగు శస్త్రాస్త్రములతో సన్న దులయి యక్ష గంధర్వ కిన్నరులు అందరును కూడి పాశములను పరశువులను భుశుండులను కుంతములను తీక్షములగు ప్రాసములను అతి దుఃసహములగు ముద్దరములను ప్రయోగించిరి॥ ఆ దైత్యుడు వానీ నన్నిటిని గజరాజు కమలములనువలే మీంగెను॥ కోపముతో తన దీర్ఘభుజమును చరచిన చప్పుడుతోనే దేవతలను పడగొట్టుచు ఆ గజదై త్యుడు తేరి చూడనైన నలవికాక సంచరించెను॥ వాడు వచ్చిపడిన దేవతా బృందమునందెల్ల మహా హాహాకారము రేగుచుండెను॥ తమ సేన అన్ని దిక్కులకు పారిపోవుచుండుట చూచి అహంకారముతో రేగిన జ్వాలలతో వెలుగుచు రుద్రులు పరస్పరము ఇట్లు పలికిరి: ఏమయ్యా! ఈ దై త్యేంద్రుని పట్టుకొనుడు; ఈ మహాసురుని చీల్చుడు॥ పదును పెట్టిన నిశిత శూలములతో దీనిని మర్మములందు విరుగగొట్టుడు॥ ఈ వాక్యమును విని కపాలియను రుద్రుడు వాడి మొన కలిగిన శూలమును చక్కగా తుడిచి ఎడమ చేతితో పట్టుకొనెను॥ చక్రములవలె కనుబొమలు ముడి వేసి దృఢమగు పిడికిటి పట్టుతో నిర్మలమగు శూలము పట్టుకొని గజ దానవుని కుంభ దేశమున కొట్టెను॥ తరు వేగముగ పోవుచున్న ఆతని రథ కాంతి ఉదయపర్వతమున ఉదయించుచున్న సహ సాదిత్య కాంతివలె నుండెను॥ పతాక ములతో చిరుగంటల గుంపులతో శ్వేతచ్చ తముతో ఒప్పు రథముతో వాడు దేవ సేనల హృదయముల నలుగ గొట్టుచుండెను॥
ఇట్లు వచ్చు చున్న జంభుని చూచి ఇంద్రుడు దృఢమగు ధనువును తైలముతో శుద్ధి చేసిన మొనగలిగి సూటిగా పోవు అర్ధచంద్ర బాణమును తీసికొని దానితో దైత్యుని ధనుస్సును శరమును ఖండించెను॥ వాడు వెంటనే యది వదలి శరముల వెదజల్లు మరిఒక ధనువును తె లదౌతములయి సూటిగపోవు సర్పాకృతి శరములను తీసికొని వానితో పదింటితో ఇంద్రుని మోకాళ్ళను రెండింటితో హృదయమును రెండింటితో భుజ మూలములను కొట్టెను॥ ఇంద్రుడును దానవేంద్రునిపయి బాణముల గమి వదలగా వాడవి తన దగ్గరకు వచ్చులోపలనే అగ్ని జ్వాలలవంటి బాణములతో పదేసి ముక్కలుగా ఖండించెను॥ ఇంద్రుడా దానవేశ్వరుని వర్షాకాలమున తాను మేఘములతో ఆకాశమును కప్పునట్లు కప్పెను॥ ఆ దానవుడును దుర్ని పారములగు మేఘములను వాయువు దిజ్ముఖములకు ఎగురగొట్టినట్లు తన వాడియుమ్ములతో ఇంద్రుని ఆ బాణములను చెదరగొట్టెను॥ ఇంద్రుడును తన క్రోధమును ఎక్కువ సేపు నిగ్రహించుకొనలేక దానవేంద్రుని పై గంధర్వాస్త్రమును మహాద్బుతమగు దానిని ప్రయోగించెను॥ అంత దాని తేజస్సుచే అంతరిక్షము వ్యా ప్రమయ్యెను॥ గంధర్వులును కింనరులును తమకు రక్షణగా) అద్బుతాకార ములుగల నానా ప్రాకార తోరణములు నిర్మించి దానినుండి ప్రయత్నము చే ఆస్త్రవృష్టి కురియుచుండ దానితో దానవమహా సేన దేబ్బతినుచు ఆప్రమేయ పరాక్రముడగు జంభుని శరణు జొచ్చెను॥ వాడు తానును ఇంద్రుని అస్త్రములవలని పీడచే వ్యాకులుడయ్యును సాధుజనుల ప్రవర్తనమును స్మరించి భయపడినవారిని రక్షింపపూనెను॥ ఆ దైత్యుడు మౌసలోస్త్రమును విడువగా జగ తంతయు అంతటను ముసల ములతో నిండెను॥ ఆవి ఒకేవిధముగ తమ పనిచేయుచు ఎదిరించ॥అణగించ-రానివై యుండెను॥ గంధర్వాస్త్రముతో ఇంద్ర జంభాసురుల యుద్ధము నిర్మించబడిన గంధర్వ నగరములు (నగరాకార మేఘాదికము)॥ ఈ ముసలములలో లయమందెను॥ జంభుడును మరియొక గంధర్వాస్త్రమును సంధించి పర సేనలపయి ప్రయోగించి ఒక్కొక్క దెబ్బతో వందలకొలదిగా గజములను అశ్వములను ఈ దేవతలలోని మహారథులను శీఘమే నశింపజేయసాగెను॥
అంత సురాధిపు డింద్రుడు త్వాషాస్త్రమును ప్రయోగించెను॥ అతడది సంధించుచుండగనే అగ్ని జ్వాలలు చెలరేగెను॥ దానినుండి ఇంద్రుడు యంత్రమయములగు ఎదిరించ నలవికాని దివ్యాయుధములను కూడ వద లేను॥ ఆ యంత్రములతో అంతరిక్షమున పందిరి నిర్మించబడెను॥ దానితో మౌసలాస్త్రము శమించెను॥ జంభుడు ఈ యంత్ర సముదాయమును లోపింపజేయు తె లాస్త్రము ప్రయోగించ దానినుండి మహాప్రమాణముగల రాళ్ళవాన ప్రవర్తిల్లేను॥ అది యంత్రములను నూవు గింజలంతగచేసి శత్రువుల తలల పై పడెను॥ ఆ వేగముతో భూమికూడ బ్రద్దలయ్యెను॥ సహస్రాక్షుడగు వురందరు (ఇంద్రు) డంతట వజ్రాస్త్రము ప్రయోగించ శై శాస్త్రపు రాలవాన అన్ని వైపులను శిథిల మయ్యేను॥ ఆది చూచి శైలము వంటివాడగు జంభుడు త్వరితముగా మహాపరాక్రమముతో ఐడీ కాస్త్రమును ప్రయోగించి ఇంద్రునికి ప్రియమగు వజ్రాస్త్రమును శమింపజేనేను॥ దుర్ధరమగు ఐషీ కాస్త్రమును పాడు సంధించుచుండగనే దేవ సేనలు రథములతో గజములతో కూడ మండిపోయేను॥ ఐషీ కాస్త తేజముతో తమ సేన మండుచుండ సురస త్తముడును పాకా సురుని శాసించినవాడును బలాసురుని చంపినవాడునగు (ఇంద్రు)డు ఆగ్నేయాస్త్రము ప్రయోగించగా ఐషీకాస్త్రమణగి పోయెను॥ ఆగ్నేయాస్త్ర విజృంభణముతో జంభుని శరీరము కాలిపోయెను॥ వాని రథమును సారథియు కాలేను॥ తన యస్త్రము ఇట్లు ప్రతిహతము కాగా బుద్ధిస్పూర్తి కల ఆ దైత్యేంద్రుడు ఆగ్ని జ్వాలల నణచగల వారుణాస్త్రము ప్రయోగించేను॥ అంతట క్షణములో ఆక నము మేఘములతోను తళ తళ మెరయు మెరపుతీగలలోను ఆకులమయ్యెను॥ గంభీరమగు మద్దెల మోతల (వంటి ఉరుము)లతో దిక్కులంతట నిండిపోయి ఆకసమునుండి పడు ఏనుగు తొండపు లావు జలధారలతో భూమియంతయు దికు లన్నియు నిండిపోయెను॥ ఆగ్నేయాస్త్రము శమించుటచూచి ఇంద్రుడు మేఘ సముదాయమును నశింపజేయగల వాయవ్యాస్త్రమును ప్రయోగించెను॥
వాయవ్యాస్త్రముతో మేఘమండలము చెదరిపోగా ఆకాశము నల్లకలువ పూ రేకులవలె నిర్మలమయ్యేను॥ అతి రూక్షమగు వాయువుచే దాసవులు కంపితులైరి॥ వారిలో బలశాలురుకూడ రణమున నిలువజాలక పోయిరి॥ అంతట జంభుడు ఆ వాయువును ప్రతిహతము చేయుటకై దశ యోజన విస్తారము గల పర్వతమయ్యెను॥ దేవతలకు భయము గొల్పుచువాడు భయంకరమగు నాసాయుధములను ఖడ్లలతలను వృక్షములను దేవతల పై వదలు చుండెను॥ అంతట శత క్రతుడు (నూరు యజ్ఞములు చేసిన ఇంద్రుడు పర్వతాకారుడగు జంభునిచే వాయువణచబడగా వాని పై వజమయాస్త్రముతో మహావజ్రమును ప్రయోగించెను॥ ఆ వజ్రము పడగానే ఆచలరూపుడగు ఆ దైత్యేంద్రుని కందరములు (గుహలు) నిర్గరములు ఆంతటను చిలిపోయెను॥ అంతట ఆ దానవేంద్రుని శైలరూపమయ నివర్తించేను॥ అంతట మహా తీవ్రుడగు ఆ జంభుడు మహాపర్వత సమానాకార గజముగా మారెను॥ దేవ సేన నది నలుగతొక్కెను॥ దంతములతో దేవతలను చావగొటెను॥ కొందరినీ వీపుతో మరికొందరను తొండముతో చుట్టి విరుగగొ పైను॥ ఇటు॥ వాడు దేవ సేనను నశింపజేయుచుండ వృ తదానవుని చంపిన ఆ ఇంద్రుడు త్రిలోక ముల వారికిని ఎదిరించనలవికాని॥ నారసింహాస్త్రమును వద లేను॥ దాని తేజస్సులో నుండి వేలకొలది నారసింహమూర్తులు బయటికి వచ్చెను॥ ఆ మూర్తులు కోరల మొనలువిచ్చి నవ్వుచు కర్కశములగు గోళ్ళు కలవై యుండెను॥ వానినా గోళ్ళతో చీల్చి ఆమూర్తులు వాని గజ సబంధీ మాయను నశింపజేసేను॥
అంతట వాడు వందలకొలది పడగలతో ఆకులమయి తన విష శ్వాసలతో దేవ సేనలోని మహారథులను కాల్చి వేయు మహా ఘోర సర్పమయ్యేను॥ అంతట మనోహర భుజశ క్తి గల ఇంద్రుడు గరుడాస్త్రమును ప్రయోగించగా దానినుండి వేలకొలది గరుడులు వెలువడిరి॥ వారు సర్పాకృతియగు జంభుని ఖండములు చేయగా దానితో వాని మాయ నశించెను॥ తన మాయ నశించగా జంభ మహాసురుడు చంద్ర సూర్యగమన మార్గ వ్యాపియగు ఆతుల రూపము ధరించి నోరు తెరచి సురపుంగవులను మ్రింగ సంకల్పించెను॥ అంతట మహారథములును మహారథులును గజములును వానినోటిలోనికి పోయెను॥ దేవ సేనయు పాతాలమువలే తాళ్ళ ప్రమాణముగల దౌడలుగల వాని భయంకరమగు నోటిలో ప్రవేశించెను॥ బలీయుడగు దానవుడు తన సేనను మింగుచుండ ఇంద్రుడును తన వాహనమును అలసిపోగా దీనుడయ్యెను॥ ఏమి చేయవలయునో తోచక విష్ణునితో నతడిట్లు పలి కెను॥ ఏక ర్తవ్యమాశ్రయించి మనము దానవునితో యుద్దము చేయదలచితిమో దానిలో ఇంకేమి మిగిలియున్నది? ఆనగా వజ్రాయుధునితో బుద్ధిశాలియగు విష్ణు విట్లు పలికెను॥ చేతకాని పిరికివాడువలె నీవు ఇపుడు యుద్ధము మానుట సముచితముకాదు॥ పురందరా నీవు శీఘముగా నీ శత్రు మాయను నశింపచేయవలయును॥ నాకు ఈ దైత్యుడు తన ఆధిక పౌరుషమాశ్రయించి స్థిరత్వము నొందినవాడుగా కనబడు చున్నాడు॥ నీవు మోహము నందకుము॥ శక్రా ప్రభూ శీఘ్రముగా నో అస్త్రమును స్మరింవుము॥ అనగా దేవరాజు ప్రకుపితుడై శుచియై దానవుని వక్షమున నారాయణాస్త్రమును ప్రయోగిం చేను॥ ఇంతకు లోపలనే ఆదే త్యుడు నోరు తెరచి క్షణములో గంధర్వ కిన్నర నాగరక్ష జాతులవారిని మూడు లక్షలమందిని మింగేను॥ అంతతో నారాయ స్త్రమా అసురుని వక్షమున పడగా భేదిల్లిన ఆ హృదయమునుండి బహు రక్తము స్రవించెను॥ ఆ దైత్యానంద కరుడు మహాగాఢమగు ॥ రణరంగమును విడిచిపోయేను॥ ఆ నారాయణాస్త్ర తేజముతో ఆదే త్యుని ఆ రూపము నశించగా పాడాకాశమున నేచటనో ఎవరికి కానరాకుండ అంతర్హితుడయ్యెను॥
దైత్యేంద్రుడగు జంభుడు ఎవరికిని ఇంద్రియములకు గోచరము కాకుండ ఆకసమునందుండి గొప్ప శస్త్రము లను సుర సేనా సంహారక ముగా ప్రయోగించేను॥ వ్యర్థములు కానివియు ఆక్షయము లునగు ప్రాసములను గండ్ర గొడ్డం ముద్గరములను గొడ్డండ్రను హులనములను భిండి వాలములను ఇనువగదలను రౌద్రుడగు దానవుడు ప్రయోగించెను॥ దేవ సేనలందు దానవునిచే ప్రయోగించబడిన భయంకరములగు బహు సంఖ్యగల అస్త్ర ములతోను కుండలములతో కూడిన శిరస్సులతోను ఏనుగు తొండములవంటి తొడలతోను కొండలవంటి ఏనుగులతోను విరిగిన కొడులు చక్రములు ఇరుసులు రథములు సారథులు అనువానితోను భూమీ నిండినదై, రక్తమాంసముల అడుసుతో రక్తపు భయంకర హ్రదములందలి సుడులతో శవరాశులనెడి కొండలతో కూడినదై సంచరించుట కే సాధ్యము కానీ దయ్యెను॥ రణరంగమున కబంధములు గందరగోళ ముగా నృత్యము చేయుదుం డేను॥ వసయు రక్తమును కారుచు అడుసుగా ఏర్పడెను॥ ఈస్థితి సమస్త ప్రాణులకును జగత్తయ ప్రళయముతో సమమైతోచుచుండెను॥ ఈ రణ ములో నక్కలు గ్రద్దలు కాకులు చాల సంతోషమునందేను॥ రణరంగములో ఒక చోట కాకి యొక టి శవపు కన్ను పీకుచు కాపు కావనుచుండెను॥ ఒక చోట నక్కలు బలిసిన పేవులు ఈడ్చి కొనిపోవుచుండెను॥ ఒక చోట కొంగ ఒకటి తన ముక్కుతో ఏదియో నమలుచు చూచువారికి భీతిగొలుచు కూర్చుండెను॥ వేరువేరు జాతుల కుక్కలొక చోట మృతుని మాంసమును తినుచుండెను॥ ఒక చోట తోడేలు ఏనుగు నెత్తురు తావి దాని పేవులలో దాగి కూర్చుండెను॥ ఒక చోట కుక్కలు గుర్రముల శవములను ఈడ్చి కొనిపోవుచుండెను॥ ఒక చోట పిశాచ జాతీయులు రకాసవము తెగ తావి తమ ప్రియురాండ్రతో కూడి వేగముగా పరుగిడుచు ప్రమోదముతో మతిల్లి సంబరపడుచుండిరి॥ ఈ శవపు మొగము నాకు తెచ్చి ఇమ్ము; ఈ గుర్రపు) గిట్ట నాకు చాల ఇష్టము; ఈ చేయి పద్మమువలె నున్నది; నాకిది కర్ణ పూరము (చెవి సొమ్ముగా అగును; అనుచు కొందరు స్త్రీలనుచుండ మరియొక పిశాచి రోషముతో కూడి దయ ఇం దుకయు లేక (తాను కోరిన మాంసాదికము తెచ్చి ఈయలేదని) తన ప్రియుని చూచుచుండెను॥ మరియొక (ప్రియుని) ప్రియు రాలు తన ప్రియుడు ఉష్ణర క్రమను ఆసవము తనకు తెచ్చి ఈయగా ఒక శవపు చర్మము ఒలిచి దానిని చిక్కని చిగురాకు (దొన్నె)గా చేసికొనెను॥ (దానిలో రక్షాసవము త్రాగుచుండెను॥) ఒక యక్షశ్రీ గొడ్డలితో చెట్టునొక టిని నరకి (దానిని ఊయలకట్టు స్తంభముగా చేసికొనెను॥) ఏనుగు దంతమును శిశువుగా చేసికొనెను॥ ఏనుగు కుంభపు డిప్పను ఇంద్రాదులు జంభాసురునితో పోరుట - అ (ఊయెల తొట్టిగా) తీసికొనెను॥ కుంభమునుండి లభించిన ము తెము కూడ తీసికొనిపోయి అవి తన ప్రియునకిచ్చి ఆతని అనుగ్రహమును కోరెను॥ యక్షులును రాక్షసులును (అచ్చటచ్చట) రక్తసవమును త్రోవుచుండిరి॥
ఒక పిశాచము తన అనుచర పిశాచమును పిలిచి ఇట్లనుచుండెను॥ శ్మశానమునందు కనబడుచు లభించు ప్రాచిపీనుగు రక్తము నాకు రుచించుటలేదు॥ తన ప్రియురాలి ఎదుట ప్రాణ త్యాగము చేసిన ఆ కిన్న రుని రక్తాసవము నాకు తెచ్చి ఇమ్ము: అదీ అశ్వశవపు వెంట్రుకల వాసన పట్టించి ఉండవలయును; ఆని కీన్న రుని ముఖము నెత్తురు మెచ్చుచు ఆ పిశాచము మనుష్యశవమును (మేచ్చక) వదలివే నేను॥ ఆచచ్చిన ఏనుగును చూచుచున్న ను నా కేమియు భయము లేదు॥” ఆ దానవుని శవమును నేనొక్కదాననే తినలేను॥ (ఇద్దరము కలిసి తిందము॥)” అని ఇట్లు పలువిధ ములుగా యక్షస్త్రీలు (యక్షిణులు) తమ ప్రియులతో పలుకుచుండిరి॥ మరికొందరు యక్ష రాక్షసులు కపాలపాణులయి ఉండిరి॥ తెగ తిండి పోతునై న నాకు ఇంకను ఇండు॥ ఇండు; అని కొందరనుచుండిరి॥ మరికొందరు రక్త నదులలో దిగి స్నానము చేయుచుండిరి॥ మరికొందరు రక్తముతో పితరులకు తర్పణము చేయుచు మాంసములను పితరులకు అర్పించుచుండిరి॥ మరికొందరు యక్షరాక్షస పిశాచాదులు ఏనుగుల పీనుగులు తెప్పలుగా నెత్తుటి మడుగులను దాటుచుండిరి॥
ఇట్లు మిగుల సంకటమగు దేవాసుర యుద్దములో వీర భటులు దుర్జయులై నిర్భయులై ప్రకాశించుచుండిరి॥
ఆంతలో మహాబలులగు ఇంద్రుడును గుబేరుడును వరుణుడును వాయువును అగ్ని యు యముడును నిరృతియు ఈ ఆందరును దానవుల వైపునకు ఆకాశములోనికి దివ్యాస్త్రములను వదలిరి॥
దానవుని విషయములో దేవతల అస్త్రములు వ్యర్థములయ్యెను॥ ఆ యుద్ధము మహాతుములమయి కోపా వేశ మునకు హేతువయ్యెను॥ దైత్యునితో(డి యుద్ధములో) అలసిన దేవతలకు ఏమి చేయుటకును తోచలేదు॥ వారి సర్వావయవములును దైత్యాస్త్రములతో గాయములయి వారేమియు చేయజాలకుండిరి॥ చలికి బాధనొందు గోవులవలె వారొకరిలో మరియొకరు ముడుచుకొనిరి॥
ఇట్టి స్థితిలో నున్న వారిని చూచి విష్ణువు ఇంద్రునితో దేవేంద్రా బంధర హితమగునది కావున బ్రహ్మాస్త్రమును స్మరింపుమనెను॥ విష్ణు పేరణచే నాతడు ధనువుననొక బాణమును సంధించేను॥ అది మహాతేజోయుతము - సంపూ జితము॥దీవ్యము శత్రునాశకము సంధానము చేసినంతనే శత్రువులను చంపునది; ఎదిరించనలవికాని యట్టి బాణమును ధనువునందమర్చి యతడు బుద్ధిమంతుడు కావున సమాహిత చిత్తుడయి అస్త్రమంత్రమును స్మరించెను॥ నియమిత మనస్కుడయి యామంత్రముచ్చరించెను॥ అతడు మొగము ఎత్తి ఆకాశమువై పు చూచుచు- దైత్యవధనుద్దేశించి ఆధీ సంధించినదియు వ్యర్థము కాని తేజము కలదియు నగు ఆబాణమును ఆకర్ణాంతము లాగిన ధనువునుండి వదలెను॥
ఆంతట ఆ జంభాసురుడును ఈ మహాస్త్ర సంధానము జరుగుట చూచుచునే తన మాయను విడిచి నేలపై నీలిచెను॥ వాని నోరెండసాగెను॥ శరీరము వణక సాగేను॥ బలము తగ్గినందున వాడు తడబడుచు కలతనొంద సాగేను॥ ఆంతట ఇంద్రుడు అస్త్ర శ్రేష్టముతో అభిమంత్రించిన ఆ ఆర్గ చంద్రశరము ఆ మహారణమునందు మహా బలముతో వేడలి ఇంద్రుడు చేయు శస్త్రాస్త్ర ప్రయోగమున ఆతనికి దగ్గర చుట్టమయి నూతన రవి బింబమును పోలిన రూపముతో శత్రువు పైపడెను॥ దానితో కిరీటపు కొనయందలి విస్పుటకాంతులతో నిండినది సుగంధయుత నానా పుష్పముల వాసనలలో మునిగినది ధూమావృతమగు ఆగ్ని వలే ఒప్పు వెంట్రుకలు కలది కుండల సహితము అగు జంభా సుర శిరము పడిపోయేను॥
ఆ జంభాసురుడు హతుడు కాగా దానవేంద్రులు యుద్ధమునకు పెడ మొగమయి భగ్న సంకల్పులై తారకా సురునికడకు పోయిరి॥ వాడును భయపడిన ఆ దైత్యులను చూచెను॥ జంభునితో కూడ నలుగురు దానవేంద్రులు రణరంగమున దేవతల చేతిలో మరణించిరని వినెను॥ తారకుడంతట ఆభిమానముతో దర్పముతో గర్వముతో పరా క్రమముతో ఆహఙ్కారముతో తన సైన్యమునకు రోషమెక్కించెను॥ పిమ్మట తారకుడు విజయశీలమగు రథమారో హించెను॥ అది వేయి గరుత్మంతులను పూన్చినది; సర్వాయుధములును అమర్చినది; సర్వాస్త్రముల రక్షణము కలది; త్రైలోక్యమందుండు సర్వ సమృద్దులతో కూడినది; విశాలమగు పెద్ద ఆసనము కలది; వాడట్లు మహా సేనతో కూడి శీఘ్రముగా యుద్ధమునకు వెడలెను॥ అంతకులోగా ఇంద్రుడును జంభుని అస్త్రశస్త్రముల దేబ్బలతో గాయపడిన సర్వావ యవములునుకల ఐరావతమును విడిచి మాతలిచే రక్షితమును జయశీలమునగు రథము నధిష్టించియుండెను॥ ఆది కాచిన బంగారపు అలంకారములు కలది; మహారత్నములు తాపటము చేసినది; చతుర్యోజన విస్తీర్ణము; దానిని సిద్ధ సంఘములు చుట్టియుండెను॥ దాని చుట్టును గంధర్వులు కిన్నరులు పాడుచుండిరి॥ ఆప్సరసలు నృత్య మొనర్చు చుండిరి॥ ఆ రథము సర్వాయుధములతో దట్టమయి విచిత్రములు నాశ్చర్యకరములునగు కూర్పులతో ప్రకాశించు చుండెను॥
సురై స్సహతారకాసురయుద్దమ్॥
ఆ దేవరాజ రథమునకు చుట్టును అన్ని వైపులను దేవతలు హరితో కూడి కవచములు ధరించియుండిరి॥ భూమి కంపించెను॥ రూక్షమగు వాయువు వీచెను॥ సముద్రములు ఉవ్వెత్తున లేచి కలతపడెను॥ రవి తేజము తను॥ ఆస్త్రములు మండెను॥ బాహువులు కంపించేను॥ ఇట్లు సమ సముద్ర్భాంతమగునంతలో తారకుడట కనబడెను॥ ఒకవైపు తారకాసురుడు; మరొక వైపు దేవసంఘములు; ఒక వై పు లోకనాశము; మరొక వైపు లోకోద్ధరణము; జగత్సంక్షయమొక వై పు; జగత్పాలనము మరియొక వైపు; ఇట్లు దేవాసుర భేదముతో ఆ సేనాసముదాయము రెండు ఆయియున్న ను ఒక్కటియే అయియున్నట్లు కనబడుచుండుట సర్వభూతములును ప్రేక్షకులయి చూచుచుండెను॥ త్రిలోకము లందును సత్తా (ఉనికి) రూపములోనున్న ప్రతియొక వస్తువును ఆ సమయములో తమతమ విభూతులు కోల్పోయి కన బడుచుండెను॥ అస్త్రములు తేజస్సులు ధనములు దైర్యము శోభ బలము వీర్యము పరాక్రమము-అన్ని యు తమ విభూతులను కోల్పోయేను॥ ఆ సన్ని వేశము సురాసురుల సర్వతేజస్సులకును వారి తపోబలమునకును ఒరపిడి రాయి యయ్యెను॥
అంతట ఆదేవతలును తమవై పునకు వచ్చు చున్న ఆతారకుని హృదయమును అగ్ని సమానాగములు కల తొమ్మీ దేసి బాణములతో కొట్టిరి॥ వాడట్లు హృదయమున , దెబ్బదినియు ఆ బాణములు లేక్క చేయక దేవతల నొక్కొక్కరిని తొమ్మిదేసి బాణములతో నొప్పించేను॥ తారకుడు ప్రయోగించు బాణములు లోక నాశ మున కే పుట్టిన వేమోయన్నట్లు ముందునకు పరుగిడుచుండెను॥ తరువాత కాలమున తమ భార్యలకన్ను లనుండి నిరంతరము కార నున్న కన్నీ రువలే ఎడతెగని బాణరాశిని దేవతలు దానవుల పై ప్రయోగించిరి॥ ఆ బాణరాశి ఇంకను తనకడకు చేరకమును పే ఇంక ను ఆకాశ మందుండగనే తారకుడు వానిని కుపుత్రుడు మహా ప్రఖ్యాతిని పొందినదియు మీగుల నిర్మలమై క్రమమున కీర్తి వహించుచు వచ్చుచున్నదియునగు తన మహావంశమును తన చేడు నడువడులతో నాశ మొందించినట్లు నాశమందించెను॥
పిమ్మట వాడు దేవతలు తమ భుజములతో ప్రయోగించిన బాణజాలమును నివారించి పిమ్మట బాణములతో భూమ్యాకాశములను దిక్కులను కూడ నిం పెను॥ తన బాణజాలములతో దేవబాణములను పుంఖ (పింజ) ప్రదేశము లందు విరిగిపోవునట్లు ఖండించేను ఆ తారకుని బాణజాలములు మిగుల వాడియగు మొనలు కలవి; గ్రద్దల॥నెమళ్ళ ఈకలు రేకలు పింజలందు కట్టియున్నవీ; చెవి వరకు ధనువు లాగి వదలినవి; విమలములయినవి; బంగారముతో వెండితో ప్రకాశించుచున్న వి; శాస్త్రార్థము చేయునప్పుడు సంకయ విషయములగు ఆయా యర్థములను వికల్పనములతో విడమరచి ఖండించినట్లు వాడు దేవ బాణములను ఖండించేను॥ పిమ్మట వాడు నూరు బాణములతో ఇంద్రుని కొట్టేను॥ డెబ్బదింటితో నారాయణుని నూరింటితో ఆగ్ని ని పదింటితో వాయుదేవుని పదింటితో యముని డెబ్బదింటితో కుబేరుని పదునెనిమిదింటితో వరుణుని ఇరువది ఎనిమిదింటితో నిరృతిని కొట్టి మరల ఒక్కొక్కరిని మర్మ స్థానముల భేదించి నొప్పించు పదేసి బాణములతో కొటి మాతలిని మూడింటితోను గరుడుని పదింటితోను ఆరుణుని పదింటితోను యముని వాహనమగు మహిషమును పదిటితోను కొటైను॥ తరువాత వాడు కణుపు వంపులుగల బాణములతో దేవతల కవచ సమూహములను ధనువులను ముక్కలు చేసెను॥ దేవతలు కవచములును ధనువులును లేక - బాణములతో గాయపడి వేరు ధనువులను బాణములను తీసికొని వాని చుట్టును మూగిరి॥ ఆ దానవేంద్రుడు సత్వరముగా దేవతలను శరములతో బాధించెను॥ అంతట దేవతలందరును కోధర క నేతులయిరి॥ అంతట దానవుడును క్రోధర క్రనేత్రుడయి ఆగ్నీ సమాన బాణములను అమరులపై వర్షించెను॥ ఆటులేవాడు బాణములను తీసికొని ఉత్తమ భుజశాలియగు ఇంద్రుని శీఘ్రముగా నుదుట కోదైను॥ మ హేంద్రుడును రథ పీఠమందే వణకిపోయెను॥ రథమందుండియు శీఘ్రముగా మోహ మంది పడిపోయేను॥ వాడు అంతరిక్షమందు వేయి రవి బింబములు కనబడగా చూచి విష్ణువని గుర్తు తెలిసి తన వీర్యము ఉద్భూతము కోగా రెండు బాణములతో నారాయణుని భుజ మూలమునందు కొ పెను॥ తరువాత వాడు పేతపతియగు యముని వస్తువులను వరుణుని అగ్ని కల్పములగు శరములతో గాయపర చేను॥ నీరృతిని అగ్ని ని రూక్షములగు శరములతో అవలీలగా కొట్టి మిగుల నొప్పించెను॥
క్షణకాలములో విష్ణువు ఇంద్రుడు అగ్ని మొదలగు వారు తెలివి తెచ్చుకొని ఒకటిగా కూడి వాడి యమ్ములతో ఆ ప్రచండుడగు తారక దైత్యునితోడ యుద్ధము చేసిరి॥ అది అనేక యుద్ధములతో సమానమై యుండెను॥ హరి హఠాత్తుగా ఆ దైత్యరాజు సారథిని వాని హృద్యమగు ధనువును వాడి యమ్ములతో కొట్టెను॥ అగ్ని వాని ధ్వజమును మహేంద్రుడు వాని కిరీటమును కుబేరుడు బంగారుతో వెనుక వైపు నలంకరించియున్న ధనువును యముడు పొని భుజ దండమును వాయువు రథాంగములను నిరృతి వాని కవచమును కొట్టిరి॥ ఆకృత్రిమమగు పరాక్రమముతో అమరులు చేయు యుద్దమును చూచి దైత్యనాథుడగు॥ తారకుడు తన రెండు బాహువులే బంధువులు॥ (సహాయులు)గా పూని భయంకర ముద్దరమును ఇంద్రుని పైకి విసరేను॥ అది ఆకాశమున వచ్చుచుండుట చూచి ఇంద్రుడు రథము నుండి దుమికిపోయేను॥ ఆ ముద్దరము పరుషధ్వనితో రథపు నడుమ పడి రథము పొడియయ్యెను॥ ॥ మాతలి మాత్రము చావలేదు॥ క్రిందపడి విష్ణుని పట్టుకొని వాడు వక్షమున గ్రుద్దెను॥ అతడు తెలివితప్పి గరుడుని మూపుపై పడిపోయెను॥ వాడు నీరృతిని వాని వాహనమును గాయపర చేను॥ భుసుండితో యముని పడగొట్టేను॥ వహ్నిని భీండి వాలముతో తలపయి కొటైను॥ వాయు దేవుని తన భుజములతో పైకెత్తి భూతలమున పడవేసెను॥ కోపవంతుడై కుబేరుని తన ధనువు కొనతో నలుగ పొడిచెను॥ తరువాత దేవతా సమూహమునుండి ఒక్కొక్కరిని అసంఖ్యాకములగు అస్త్రములతో అమిత విక్రముడగు ఆ దైత్యేంద్రుడు కొట్టెను॥
